పారిజాత
పారిజాత రోజూ పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. పారిజాత మాటల్లోనే ఆమె జీవితాన్ని విందాం. ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వున్న కష్టజీవి పారిజాత.
మా ఊరు జనగామ దగ్గర చిన్నరామచెర్ల. నా వయస్సు ముప్పయి వుండొచ్చు. నా బిడ్డకు 16 ఏళ్ళు. పది చదువుతోంది. కొడుక్కి పన్నెండేళ్ళు. నా బిడ్డని మంచిగ చదివించాలి. మా అత్తమామ ఊర్లనే వుంటరు. వాళ్ళ కాడ్నే వుండి చదువుతుంది. పెళ్ళి చెయ్యవె అంటున్నరు గానీ, నేనే చదివిస్తనని, ఆడపిల్లకి చదువుండాలె అని నా కోర్కె. పైసలు సాల్తయా ఒద్దంటున్నరు. నా బిడ్డను మంచిగ పెద్దసద్వు చదివితేనే బాగుంటదని నా నమ్మకం. ఊర్ల మాకు ఎవసాయంముంది. నీళ్ళులేవు. బోరుకేసిన పైసల మిత్తే కట్టలేకపోయినం. యిల్లు, పొలం విడిచిపెట్టి, పట్నమొచ్చాం. రైతు బతుకు యిక్కడుంటదా? కుమ్మరోల్లం మేం. తిన్నా తినకున్న ఊర్లుండే గౌరవం పట్నంల వుండదు. నీళ్ళు, గాలి, తిండి అన్నీ కరువే. చిన్నగది అద్దెకు తీసుకున్నాం. నేనూ, మా ఆయన, కొడుకు ఈడుంటున్నం. చెరుకుబండి పెట్టిండు. కొన్నాళ్ళు మంచిగనే వున్నం. చక్రంలో కుడిచెయ్యి పడి నలిగిపోయింది. అప్పట్నించి మరింత కష్టాలు. నేను నా కుటుంబం బాధ్యత ఎత్తుకోక తప్పలేదు. ఇంటరు వరకు చదివిండు కానీ, చెయ్యిలేదు అని ఎక్కడ పని దొరకలేదు. కట్టే బిల్డింగుల దగ్గరకు పోయి – ఖాళీ సిమెంట్ బస్తాలు దొరికిన్నాడు బేరం చేసుకొని వస్తడు. మేం మంచిగనే వుంటం. శంకరయ్య మా ఆయన పేరు. ఈ పండ్ల బేరానికి ఫైనాన్స్ రోజుకి 500 తీసుకుంట. 60, 70 రూపాయల లాభమొస్తుంది. దాంట్లనే 30 రూపాయలు వడ్డీ కింద కట్టాలి. 6 గంటల నుంచి 12 గంటల వరకు తట్టనెత్తుకుని తిరుగుత. రెండువేల వరకు నెలకి జమైతవి. ఒకింట్ల బట్టలు బాసాన్లు చేస్తే ఎయ్యి రూపాయిలొస్తాయి. ఈ పైసల్లనే వూరికి అత్తమామలకి బిడ్డకీ పైసలు పంపుతం. నీకెరకలేందేమున్నది. పైసలున్ననాడు తాగుతడు. తాగిన మనిషి మనిషి కాదు కదా! మర్నాడు సర్దుకుంటడు. ఒక్క చెయ్యి పోయినందుకు నా ఒక్కరెక్కలే యింటికి ఆధారమైనయ్. కష్టపడడానికి నేను సిద్ధమే. ఏ పనైనా మనం చేసే తీర్లనే గౌరవముంటది. నా బిడ్డని చదివిచ్చుడు, నా కుటుంబం నడుపుడు నా బాధ్యత అనుకుంటున్న. ఈ తిరుగుట్ల చానమంది ఆడోళ్ళు దోస్తులయ్యిన్రు – ఫ్రూట్ మార్కెట్ కాడికి కల్సిపోతం. కష్టం సుఖం పంచుకుంటం. నేను మంచి సలహాలిస్తనని నన్ను మెచ్చుకుంటరు. గింతేనమ్మ నా బతుకు. వస్తనమ్మా యింక. నీతో యియ్యన్నీ చెప్పుకున్నంక మనస్సు అల్కయింది. తట్టెత్తుతావామ్మ.
‘నడిమిట్ల బతుకెట్లయిన ధైర్నంగ బతుకుడే బతుకు గదమ్మా’ అనే జీవసూత్రంతో పయనిస్తోంది పారిజాత. పారిజాత చెట్టుని దులిపితే జలజలా రాలే పారిజాతాల్లా, ఆమె జీవితాన్ని కదిలిస్తే రాలిపడ్డ జ్ఞాపకాలివన్నీ.
ఇంటర్వ్యూ :శిలాలోలిత
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags