భారతి
వంద సంవత్సరాలు అవుతుందా? ఉమెన్స్‌డే సెలబ్రేషన్స్ మొదలుపెట్టి. అయినా ఏం సెలబ్రేషన్స్ లెండి? ఏం సాధించామని? ఏదో చదివేస్తున్నాము. ఉద్యోగాలు చేసేస్తున్నాము. మాది మేము సంపాదించుకుంటున్నాము అనుకోవడమే కాని అనవసరంగా లేని సమస్యలని తెచ్చిపెట్టుకుంటున్నామేమోననిపిస్తుందని మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న భారతి మొదలుపెట్టిన మాటల్లోనే – చిన్నప్పుడు మగపిల్లలతో సమానంగా ఎగురుతావేమిటే అనే నాన్నమ్మ అరుపులు, అవేం పట్టించుకోవద్దు మా బంగారుతల్లి చక్కగా చదువుకుంటుందని ప్రోత్సహించిన అమ్మ వల్ల నేనీ రోజు ఇంతవరకు రాగలిగాను. కాని తృప్తిలేదు. మగపిల్లలతో సమానంగా ఎదగనీయని కట్టుబాట్లు కుటుంబంలో ఇంకా ఉన్నాయి. చదవడానికి ప్రక్క ఊరికి వెళ్తామంటే ఎన్నో ఆటంకాలు. అక్కడ ఎవరైనా తెలిసినవాళ్లుండాలి. మనకు వంద జాగ్రత్తలు. ఎక్కడా తలెత్తకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. మనకిష్టమైనట్టు డ్రెస్సింగు కూడా వీల్లేదు. అలా అన్ని కండిషన్స్ మనకే. మగపిల్లలు హాయిగా వాళ్ళిష్టం వచ్చినట్టు ఉండవచ్చు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన మనకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. స్వేచ్ఛగా ఆలోచించలేకపోతాం. ఎంతసేపు ఎవరేమనుకుంటారో అనే ఆలోచన మన నరనరాన ఒంటబట్టిస్తారు. దాంతోనే ఏ నిర్ణయం తీసుకోవడానికైనా వంద సందేహాలుంటాయి మనకు. అది మళ్ళీ మన తప్పే. ఏం తెలీదు. ఏం చేయలేరు అంటూ. పరిస్థితుల్లో కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ సమానంగా అయితే లేము. ఇంతకుముందు సంఖ్యలో అయినా ఆకాశంలో సగం మేము అనగలిగే వాళ్ళం కాని ఇప్పుడు అది కూడా లేదు. మనల్ని సమానంగా లేకుండా చేయడం అనేది మన జన్మనుండి మొదలైంది కదా. పుట్టకముందే చంపేయడం, పుట్టింతరువాత చంపేయడం, సరిగ్గా ఎదగనీయకపోవడం, అదృష్టం బాగుండి బ్రతికి బట్టకట్టినా ఎవడో ఒకడు యాసిడ్ పోయటం, ఆ స్టేజి దాటి పెళ్ళి చేసుకుంటే అక్కడ వరకట్నాలు, కిరోసిన్ చావులు ఇలా ఎన్నెన్నో. రోజూ ఈ కేసులు చూస్తుంటే మండిపోతుంటుంది. ఇట్లా ఎన్నో కేసుల్తో తల పగలగొట్టుకొని ఇంటికొస్తామా మళ్ళీ రెడిగా మనకొరకు వెయిటింగు. ఏమిటి? ప్రేమతో, అయ్యో అలిసిపోయివచ్చావా? అంటూ కాదు. నాకో కప్పు టీ ఇస్తావా? అంటూ మొగుడు, మమ్మీ ఆకలి అంటూ పిల్లలు. మళ్ళీ ఇంటిపని మన బాధ్యతే. ఏదైనా మాట్లాడితే నీకెలా తెలుసని, సంపాదిస్తున్నావని అహంలాంటి మాటల ఈటెలు. అలాంటప్పుడు ఊరికే చదవకుండా ఉంటే బాగుండేది అనిపించిన సందర్భాలు ఎన్నో. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నప్పటికి అది కుటుంబానికి పరిమితం అయినంత వరకే. మనం సొంతంగా ఏదైనా ఖర్చు చేయాలనుకుంటే అదంతా వృధా ఖర్చు కింద లెక్క. తెలివితక్కువగా ఆలోచన లేకుండా ఖర్చుచేసినట్టు మాటలు. అంతేకాదు – ఇంటికి సంబంధించి ఏ నిర్ణయములోనూ మనం నిర్ణయించటానికి వీల్లేదు. సంపాదించుకున్నందుకు ఏదో చీరలు లాంటివి సొంతంగా కొనుక్కోగలుగుతున్నామేమో కాని మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మన ఆలోచనకేమాత్రం విలువలేదు. ఉద్యోగం చేస్తున్నందుకు మళ్ళీ ఇంట్లో ఏదో సరిగ్గా పట్టించుకోమనే మాట తేలిగ్గా అనేస్తారు. అదే ఆఫీసులో అయితే కొంత ప్రశంస దొరుకుతుంది. సంతృప్తినిస్తుంది. కొన్ని కేసుల్లో వెంటనే న్యాయం చేయగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి తృప్తే కొంతవరకు ముందుకు వెళ్ళాలనే ఆశ కల్పిస్తుంది. అందుకే కనీసం పిల్లలనైనా ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకునేలా చేస్తే అప్పుడైనా ఏదైనా మార్పు వస్తుందేమో. లేదంటే మాత్రం కుటుంబం అనేది స్త్రీకి సంకెళ్ళను వేస్తుంది. మనమెంత తెలివిగలవాళ్ళమైనా, ఏ పనైనా చేయగలిగే టాలెంట్ ఉన్నప్పటికి ముందుకు వెళ్ళలేము.
ఇంటర్వ్యూ : ఎన్.గీత
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags