ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినాన్ని, హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగుని కలిపి జలవిహారంలో నిర్వహించడం జరిగింది. రచయిత్రలు, భూమికలో స్వచ్ఛందంగా పనిచేస్తున్న న్యాయవాదులు, వాలంటీరీలు, మీడియావారు, భూమిక బోర్డు సభ్యులు, ఎన్.జి.వో మితృలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశం చాలా ఉత్సాహంగా జరిగింది. వందేళ్ళ మార్చి ఎనిమిదిని సెలబ్రెట్ చేస్తూ ప్రచురించిన భూమిక ప్రత్యేక సంచికను ఈ సమావేశంలో ఆవిష్కరించాం. భూమిక నిలదొక్కుకోడానికి అన్ని విధాలా సహకరించిన ”నిర్ణయ” సంస్థ బాధ్యురాలు ఇందిర జెన, సమస్యల్లో వున్న స్త్రీల కోసం ఒక హెల్ప్‌లైన్ స్థాపనకు (ఆక్స్‌ఫామ్‌ద్వారా) సహకరించి, తద్వారా భూమిక బలపడటానికి తన వంతు కృషి చేసిన గిరిజ గార్లు సంయుక్తంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఇందిరా జెన మాట్లాడుతూ ”భూమిక అంటే నాకు ప్రత్యేకాభిమానం. నాకు తెలుగు సరిగా రాదు అయినా భూమికను మొదటి పేజీ నుండి చివరి పేజీ మొత్తం చదివిన తరువాతే ఆఫీస్‌లో ఇస్తాను. ఇందులో ఒకొక్కక్క వ్యాసం ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. అందుకే నేను అంత ఇంట్రస్ట్‌గా చదువుతున్నా. అందరూ కూడా చదవాలి” అన్నారు.
తరువాత గిరిజ మాట్లాడుతూ ”భూమికతో అనుబంధం ఈనాటిది కాదు. మొదటి సంచిక నుండి చదువుతున్నాను. సత్యవతి గారితో కలిసి పనిచేయాలని హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టాం. మేం అనుకున్న దానికన్నా మంచి స్పందన వచ్చింది. ఎంతో మంది స్త్రీలకు సహాయం లభిస్తున్నందుకు చాలా సంతోషమేస్తుంది. ఇలాంటి హెల్ప్‌లైన్స్ అవసరం ఇంకా చాలా వుంది ” అన్నారు.
సత్యవతి మాట్లాడుతూ ”1993 నుండి భూమిక నిరంత రాయంగా వస్తూనే వుంది. అన్వేషి అండతో మొదలై, తర్వాత స్వయంసిద్ధయై తన కార్యక్రమాలను విస్తరించుకుంటూ వచ్చింది. ఒక స్థితిలో ఆర్ధికంగా చితికిపోయి పత్రిక ఆగిపోతుందేమోననే భయం నన్ను వెంటాడినపుడు సహృదయ మితృలు, పాఠకులు పెద్ద మనుసుతో ముందుకొచ్చి ఆర్ధికంగా భూమికను ఆదుకున్నారు. భూమిక ప్రస్తుతం అన్ని రకాలుగాను బలంగా నిలదొక్కుకుంది. భూమిక ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన ఇందిర జెన, గిరిజలు భూమిక నిలబడడటానికి చాలా సహకరించారు. హెల్ప్‌లైన్ మొదలు పెట్టడంలో కీలక భూమిక పోషించింది గిరిజనే. ప్రస్తుతం హెల్ప్‌లైన్‌ను నడుపుతున్న అనుభవంతోను, సివిల్ సొసైటి రిసోర్స్ సెంటర్‌గా భూమిక అవతరించిన నేపధ్యంతోటి ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు, సమావేశాలు చేసాం. ప్రభుత్వ/స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే షెల్టర్ హోమ్స్, హెల్ప్‌లైన్స్, స్వాధార్‌హోమ్స్, ఉచిత న్యాయ సహాయం మొదలైన అంశాల మీద అధ్యయనం చేసాం. ఆ అధ్యయన రిపోర్ట్‌ల ఆధారంగా ఆయా సంస్థల నిర్వాహకులని రాష్ట్రం నలుమూలల నుంచి పిలిచి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ అనురాధగారు, సోషల్ వెల్పేర్ బోర్డ్ చైర్‌పర్సన్ రమాదేవి గార్ల సమక్షంలో రాష్ట్రస్థాయి సమావేశం జరిపాం. హింసలో మగ్గుతున్న స్త్రీలకు అన్ని రకాల సపోర్ట్ సెంటర్లను అందుబాటులోకి తేవడానికి, వాటిని పనిచేయించడానికే ఈ సమావేశం ఏర్పాటు చెయ్యబడింది. అంతకు ముందు యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా రాష్ట్రస్థాయి సమావేశం జరిపి, సదస్సు తీర్మానాలకు హోమమంత్రికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం భూమిక చేపట్టిన అధ్యయనాల వెలుగులోంచి చూసినపుడు ఒక మోడల్ షార్ట్‌స్టే హోమ్ ప్రతి జిల్లాలో ఏర్పాటవ్వాలని, అలాంటి తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చెయ్యాలనేది తన కల అని, దానికోసం కృషి చేస్తానని, అందరూ కలిసి రావాలని, తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని కోరుతున్నాను” అంటూ సత్యవతి భూమిక కార్యక్రమాల గురించి సమీక్ష చేసారు.
తరువాత అమన్‌వేదిక ఆధ్వర్యంలో వీధి బాలికల కోసం నడుస్తున్న రెయిన్‌బో నుండి వచ్చిన పిల్లలు చేసిన ప్రోగ్రామ్ అందరినీ ఆనందపరిచింది. వాళ్ళు చేసిన బాలకార్మిక వ్యవస్థ మీద పిల్లలు స్కూల్‌కెళ్ళి చదవడం గురించి వేసిన నాటకం అందరినీ ఆకర్షించింది.
మధ్యాహ్న కార్యక్రమంలో గిరిజ మాట్లాడుతూ ” భూమిక బోర్డు మెంబర్స్ కూడా అందరూ వున్నారు. పని పెరుగుతున్న క్రమంలో బోర్డులో మెంబర్స్ కూడా పనిని పంచుకోవచ్చు. ఏ విధంగా కలిసిచేయగలమో అని కూడా నల్గురు కూర్చుని ఆలోచిస్తే ఇంకా అనుకున్న దానికన్నా మంచిగా చేయవచ్చు. అలాగే ఏదైనా ఒక సీరియస్ కాల్ హెల్ప్‌లైన్‌కు వచ్చినప్పుడు బోర్డు మెంబర్స్ కలిసి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. బోర్డు మెంబర్స్ కొంత క్వాలిటీ టైం పెడితే బాగుంటుందని నా అభిప్రాయం” అన్నారు.
దీనిమీద ఎవరైనా స్పందించాలని కోరితే భూమిక ప్రెసిడెంట్ అయిన శాంతసుందరి గారు మాట్లాడుతూ ”నేను 20 ఏళ్ళు చిన్నదానిని అయిపోగలిగితే ఎంతో బాగుండేది. ఇంకా ఇంకా ఇన్వాల్వ్ అయి ఆక్టివ్‌గా పనిచెయ్యాలని వుంది” అన్నారు.
గిరిజ మాట్లాడుతూ మనకు కౌన్సిలింగు సెంటర్, షార్ట్ స్టే హోం వుండాలి. అయితే ప్రభుత్వపరంగా చేయాల్సింది కూడా చాలా వుంది. ఆడవాళ్ళ కోసం కొంత బడ్జెట్ కూడా వుంటుంది. మనం ఐశిజీళిదీవీ ఉళిలీలీరిదీవీ స్త్రజీళితిచీ గా వున్నప్పుడు వేరేగా వుంటుంది. ఆఇఈఙఊ జుబీశి కింద 3 కోట్లు అవసరమైతే ఒక కోటి మాత్రమే ఇచ్చారు. అందులో ఒక లీగల్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. వీళ్ళందరికి 1 ్పుజీళిజీలి సరిపోదు. ్పురిఖీరిజి ఐళిబీరిలిశిగి బిజిజిరిబిదీబీలి గా ఏర్పడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడాలి, నిలదీయాల్సి వచ్చినప్పుడు నిలదీయాలి అందరం కలిసి ఓళిబీతిరీగా పనిచేయాలి. అలా పనిచేయడానికి ఒక పదిమందితో కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడాలి” అని అన్నారు.
పి. మాధవి మాట్లాడుతూ ప్రభుత్వంలో జెండర్ బడ్జెట్‌కు కోటా వుంటుంది. పోస్ట్ ఫాక్ట్ బడ్జెట్ చేస్తున్నాం. మహిళలకు కేటాయింపు ఎంత ఇచ్చాము అని కాదు. 2001లో బడ్జెట్ అంటే ఒక టూల్ మాత్రమే. ఆర్థిక కేటాయింపు మాత్రమే. 2000 కోట్లు ఇచ్చినా తరువాత అమలు అనేది జరగలేదు.వాటిని విశ్లేషించుకొని, ప్రశ్నించుకొని ఎక్కడ ఎక్కువ అవసరమో ఎక్కడ తక్కువ అవసరం విశ్లేషించుకొని దాని ప్రకారం బడ్జెట్ చేయాలి. ఏ రంగాలు అభివృద్ధి కావాలి. ఆరోగ్యం, విద్య, ఉపాధికి ఎంత కేటాయింపులు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని ప్రశ్నించగల్గాలి. కొన్ని రంగాల్లో మహిళలకు చేస్తున్న కేటాయింపులు లాప్స్ అవుతున్నాయి. పని ఎందుకు జరగలేదు. కేటాయింపులు జరిగిన తరువాత ఎందుకు బడ్జెట్ మిగిలింది. ఇవన్నీ చర్చించి ఇవన్నీ కూడా జెండర్ బడ్జెట్‌లో చేర్చాలి. జెండర్ బడ్జెట్ గురించి చాలా వివరంగా మాధవిగారు తెలిపారు.
సత్యవతి మాట్లాడుతూ ఇంతే కాక భూమిక జు.ఆ. ఇళిళీలిదీ శ్రీలిశిగీళిజీది సభ్యులకు జీలిజిబినిబిశిరిళిదీ గీళిజీదిరీనీళిచీరీ కూడా నిర్వహించింది ఇళిళీలిదీ నీలిబిఖిలిఖి శ్రీస్త్రంరీ వాళ్ళు పనిచేసే క్రమంలో చాలా ఒత్తిడికి గురవుతుంటారు. ఆ క్రమంలో నాగమణి అనే మహిళ ఒక మీటింగు కోసం వచ్చి కలిబిజీశిబిబీనీతో చనిపోయింది చాలా చిన్నవయస్సులో, అది చూసి చాలా బాధపడి ఈ వర్క్‌షాప్ కోసం ్పుఇఐ వాళ్ళకు ప్రపోజల్ పంపితే వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఇవ్వడం జరిగింది. వారికి వర్క్‌షాప్స్ పెట్టడం జరిగింది.
మీ అందరికీ తెలుసు భూమిక ప్రతి సంవత్సరం రచయిత్రులతో సాహితీయాత్ర నిర్వహిస్తోంది. అలాగే కలుసుకోవాలి, కలబోసుకోవాలి అనే క్రమంలో ప్రతి నెల భూమిక ఆఫీస్‌లో రెండవ గురువారం మీటింగు పెడుతున్నాం. అందరూ ఆహ్వానితులే. పెద్దగా ఎజెండా ఏమీ వుండదు” అన్నారు.
సమత మాట్లాడుతూ స్త్రీలకు సమస్యలుంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే ఈళిబీశిళిజీరీ ఆబిదీలిజి వుంటే బాగుంటుంది.
భూమిక అధ్యయనాల్లో భాగస్వామి, మానవహక్కుల వేదికలో పనిచేసే కె. మురళి మాట్లాడుతూ స్త్రీల కోసం ఉన్న సపోర్ట్ సిస్టమ్స్‌ని అంటే షార్ట్‌స్టే హోమ్‌లు, హెల్ప్‌లైన్‌లు ఉచిత న్యాయసహాయం లాంటి బాగా పనిచెయ్యాలంటే మనం నిరంతరం ఆయా శాఖలతో పనిచెయ్యాలి. అడ్వకసీ చాలా చాలా చెయ్యాల్సుంటుంది” అన్నారు.
సమావేశానికి హాజరైన మితృలు చాలామంది మాట్లాడారు. జానకీబాల పాటలు పాడారు.
భూమిక ఆధ్వర్యంలో మహిళాదినోత్సవ సభ అంటే సినీనటి ‘భూమిక’ అనుకుని పెద్ద సంఖ్యలో వచ్చిన మీడియా మితృలు మొదట కొంత ఆశాభంగం పొందినా, సమావేశంలోని సీరియస్ అంశాలను గమనించి అమన్ వేదిక పిల్లల ఆట, పాట చూసి చాలా బాధ్యతగా కవరేజీ ఇచ్చారు. సాయంత్రం సరదాగా మ్యూజికల్ ఛైర్స్ ఆట ఆడుతూ, నవ్వులతో జలవిహార్ ప్రతిస్పందిస్తూంటే ఆనాటి సమావేశం ముగిసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags