కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005 (చాప్టర్ -1)

1. ఈ చట్టం పేరేమిటి?
కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005.

2. దీని పరిధి ఏమిటి?
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది.

ఈ చట్టం ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?
ఈ చట్టం 2006 అక్టోబర్ 26న అమలులోకి వచ్చింది.

ఈ చట్టంలోని ముఖ్యమైన నిర్వచనాలు ఏమిటి?
ఎ) ‘బాధితురాలు’ అంటే, ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో వుండి, ప్రతివాదిచేత కుటుంబ హింసకు గురయ్యానని ఆరోపించే ఏ మహిళ అయినా.
బి) పిల్లలు అంటే 18 ఏళ్ళ లోపువారెవరైనా దత్తత ద్వారా, సవతి బిడ్డగా లేదా సంరక్షణలో ఉన్న పిల్లలు.
సి) “పరిహార ఉత్తర్వు” అంటే ఈ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం జారీచేసే ఉత్తర్వు.
డి) “ఆధీన (కస్టడీ) ఉత్తర్వు” అంటే, సెక్షన్ 21 ప్రకారం జారీ చేసే ఉత్తర్వు.
ఇ) “కుటుంబ సంఘటన నివేదిక” అంటే, కుటుంబ హింస జరిగినట్లు బాధితురాలు ఇచ్చే ఫిర్యాదుపై నిర్ణీత పత్రం (ఫాం)లో తయారు చేసే నివేదిక.
ఎఫ్) ‘కుటుంబ సంబంధం’ అంటే జన్మత: లేదా రక్త సంబంధం, వివాహం, పెళ్ళి తరహా సంబంధం, దత్తత, లేదా ఉమ్మడి కుటుంబంగా కలిసి వుండే కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ప్రస్తుతం కలసి వున్న లేదా, గతంలో కలిసి వున్న ఇద్దరి మధ్య సంబంధం.
జి) “కుటుంబ హింస”కు , ఈ చట్టంలోని సెక్షన్ 3 లో ఇచ్చిన నిర్వచనమే వర్తిస్తుంది.
హెచ్) “వరకట్నం” అంటే, వరకట్న నిషేధ చట్టం, 1961 లోని సెక్షన్ 2 లో వివరించిన ప్రకారమే వర్తిస్తుంది.
ఐ) ‘మేజిస్ట్రేట్’ అంటే, బాధితురాలు ప్రస్తుతం నివశించే ప్రదేశం, ఇతర విధంగాగాని, ప్రతివాది నివశించే ప్రదేశం లేదా కుటుంబ హింస జరిగినట్లు చెప్పే ప్రదేశపు పరిధిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 పరిధి కలిగి వున్న ఒకటవ తరగతి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా, పరిస్థితిని బట్టి, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్.
జె) ‘వైద్య సదుపాయం’ అంటే, ఈ చట్టం ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల నిమిత్తం గుర్తించే వైద్య సేవల కేంద్రం.
కె) “ఆర్థిక ఉపశమనం” అంటే, కుటుంబ హింసవల్ల బాధితురాలికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, అయిన ఖర్చులను భరించేందుకు ఈ చట్టం కింద దాఖలైన దరఖాస్తుననుసరించి, కేసు విచారణ సమయంలో ఎప్పుడైనా, బాధితురాలికి పరిహారం చెల్లించమని ప్రతివాదికి మేజిస్ట్రేట్ జారీ చేసే ఆదేశం.
ఎల్) ‘నోటిఫికేషన్’ అంటే, అధికార గెజిట్లో ప్రచురించే ఒక నోటిఫికేషన్ (ప్రకటన).
ఎమ్) ‘నిర్దేశిత’ అంటే, ఈ చట్టం కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ‘నిర్ధేశించిన’ విధంగా.
ఎన్) ‘రక్షణాధికారి’ అంటే, ఈ చట్టంలోని సెక్షన్8, సబ్-సెక్షన్ (1) కింద రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి.
ఒ) ‘రక్షణ ఉత్తర్వు’ అంటే, సెక్షన్ 18 కింద జారీచేసిన ఒక ఉత్తర్వు.
పి) ‘నివాస ఉత్తర్వు’ అంటే, సెక్షన్ 19 లోని సబ్- సెక్షన్ (1) కింద మంజూరు చేసే ఉత్తర్వు.
క్యు) ‘ప్రతివాది’ అంటే, బాధితురాలితో కుటుంబ సంబంధం కలిగి వుండి, ఏ మేజర్ పురుషునికి వ్యతిరేకంగానయితే బాధిత మహిళ ఉపశమన ఉత్తర్వులు కోరారో వారు.
ఆర్) ‘సేవలందించేవారు’ అంటే, ఈ చట్టం సెక్షన్ 10లోని సబ్ సెక్షన్ (1) కింద నమోదు చేసుకున్న ఏ సంస్థ అయినా.
ఎస్) ‘కలసి ఉన్న ఇల్లు’ అంటే, బాధితురాలు కుటుంబ సంబంధం ద్వారా ఒంటరిగాగాని, లేదా, ప్రతివాదితో కలిసిగాని జీవిస్తున్న లేదా గతంలో జీవించిన ఇద్దరి సొంత లేదా అద్దె ఇల్లు, లేదా వారిద్దరికీ లేదా, ఇద్దరిలో ఎవరికైనా దానిపై ఉమ్మడిగా లేదా ఒక్కరే హక్కులేదా, అధికారం లేదా వాటా కలిగి ఉన్న ఇల్లు – లేదా, ప్రతివాది కుటుంబపు ఉమ్మడి ఆదాయం-ప్రతివాదికి లేదా, బాధితురాల్ని ఆ ఇంటిలో హక్కు, ప్రయోజనం లేదా అధికారం వుందా, లేదా అనే దానితో సంబంధం లేకుండా.
టి) ‘షెల్టర్ హోం’ అంటే, ఈ చట్టం ప్రయోజనాలకోసం ‘షెల్టర్ హోం’ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఏ షెల్టర్ హోం అయినా.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.