డా. రోష్ని
మనలో చాలామందికి తక్కువ నూనెతో కూరలు చేయడం అనేది అసలు వల్లకాదు.నూనె లేకపోతే రుచే లేదు అనుకుంటారు. ఇదో రకమైన అపోహ అయితే ఈ మధ్య మరో విషయం బాగా ప్రచారంలోకి వస్తోంది. అసలు నూనెలే వాడొద్దు, వట్టిగా ఉడకబెట్టుకునో లేక ఏకంగా పచ్చివో తినేయమంటున్నారు. దీనికి తోడు అడ్డమైన సలహాలని గుడ్డిగా పాటించే సంస్కృతి ఒకటి ఎక్కువయిపోయింది. అసలు విషయం ఏమిటి?- అని కాస్త సమయం, బుర్ర పెట్టి ఆలోచించడం మానేసాం. ఎవరు ఏది చెప్పినా అది ఫాలో అయిపోవడమే నేటి జీవితం.
అసలు విషయం ఏమిటంటే మనం సంపూర్ణ ఆహారం, పోషకాహారం అనే దాంట్లో కొవ్వు పదార్ధాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కొవ్వు పదార్ధాలు ఎందుకవసరమో, అవి చేసే పనులేంటో ముందుగా తెలుసుకుంటే మీరు షాకవుతారు!
ు మన చర్మం నున్నగా ఉండటానికి, నీరు చర్మం మీద పడితే లోపలికి ఇంకి పోకుండా కాపాడ్డానికి కొవ్వు పదార్థాలే కారణం (అంటే వాటర్ ఫ్రూఫ్)గా పనిచేస్తాయి.
ు మన శరీరంలోని కణాలకు చుట్టూ ఉండే పొర తయారీలో (సెల్ మెంబ్రేన్)కొవ్వు పదార్థాలకు ప్రధాన పాత్ర ఉంది.
ు కొవ్వు పదార్థాలు శక్తి నిచ్చే కాలరీ రిజర్వులు.
ు ఎ,డి,ఇ,కె. విటమిన్లు (వీటిని సోటబుల్ విటమిన్లు అంటారు) మన పేగుల్లో ఒంటబట్టాలంటే కొవ్వు పదార్ధాలు అవసరం.
ు మన శరీరంలో తయారయ్యే అనేక హార్మోన్ల తయారీకి వీటి (కొ.ప) అవసరం ఎంతైనా ఉంది.
ు కాల్షియం ఒంటబట్టడానికి కొ. ప అవసరం. దీనివల్ల మన ఎముకలు బలంగా ఉంటాయి.
ు మన వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూన్ సిస్టమ్)ని పెంపొందిస్తాయి.
ు ఊపిరితిత్తులు సరిగా పనిచేయడానికి కొ. ప అవసరం. ఇవి ఊపిరితిత్తులపై పొరగా ఉండే సర్‌ఫాక్టెట్‌లో భాగం. దీనివల్ల మన ఊపిరితిత్తుతలు కుప్పకూలకుండా పనిచేయకలుగుతాయి.
ు అన్నింటికంటే ముఖ్యం మన మెదడు సరిగా పనిచేయాలంటే కొ. ప. చాలా అవసరం. అసలు మెదడు నిర్మాణంలోనే 60 % కొ. ప ఉంటాయి. ఇకపోతే చెప్పండి. కొ. ప. అసలు లేకుండా ఉంటే బుర్ర పనిచేస్తాదా?
ు మన చర్మం కింద ఉండే కొవ్వు పొర అతి చలి, వేడి నుండి కాపాడుతుంది.
ు ముఖ్యమైన అవయవాలకు (మూత్రపిండాలు, కాలేయం మొ.) కొ. ప. కుషన్‌గా ఏర్పడి వాటిని రక్షిస్తాయి.
ు మన శరీరంలోని నరాల చుట్టూ ఉండే పొరలోని కొ. ప నరాలను రక్షించడమే కాకుండా ఎలక్ట్రికల్ ఇంపాల్స్ సరిగా ప్రయాణించేందుకు తోడ్పడతాయి.
ు మన గుండె కొట్టుకోవడానికి కావలసిన శక్తిలో 60% కొ. నుంచే వస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక కొ. ప గుండె కొట్టుకునే తీరుని కంట్రోలు చేస్తాయి.
ు కళ్లు సరిగా పనిచేయాలంటే కొ. ప అవసరం.
ు మనం తీసుకునే ఆహారంలో ఉన్న కొ.ప జీర్ణప్రక్రియను మందంగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల చాలాగంటలు అకలి కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇతర పోషక పదార్ధాలు పేగుల్లో చక్కగా వంటబట్టే అవకాశం కలుగుతుంది.
ఇంత ముఖ్యమైన కొ.ప లను మనం నిర్లక్ష్యం చేస్తూ మనం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? ఈ మధ్య జీరో సైజుల క్రేజ్ బాగా పెరిగి పోయింది. దానికి డైట్ కంట్రోలు – ముఖ్యంగా కొ. ప అసలు తినొద్దంటూన్నారు. దీనికి సాయం నాన్‌స్టిక్ ప్యాన్‌లు – కిచన్ కింగులూ, ప్రకటనలు… వాగ్దానాలు.. ఇవి చూసి విని మోసపోకండి. మనం తినే ఆహారంలో కొ.ప. అస్సలు లేకుండా చేస్తే మీకు ఆకలి తీరిన ఫీలింగే ఉండదు. దీంతో ఎక్స్‌ట్రా గా నానాగడ్డి తినడం (బన్నులూ, బిస్కట్లు లాంటివి) మొదలు పెడతారు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. 2006లో చేసిన ఒక స్టడీలో తెలిందేమటంటే ఇలా లో ఫ్యాట్ డైట్ తిన్న స్త్రీలు ఎవరూ బరువు తగ్గిన దాఖలాలు లేవు అని.
అసలు బాగా బరువు తగ్గిపోయి, పుల్లల్లా కనిపించాలనే యావ ఎందుకు? దీనికి శరీరాన్నే కాకుండా, మన మెదడును దాని పని సామర్థ్ధ్యాన్ని బలి పెట్టాలా? చక్కగా బొద్దుగా ఉండి, బుద్ధిలో చురుకుగా చక్కగా ఉంటే (ప్రపంచం తల్లకిందులౌతుందా? అవుతుందేమో కొంతమంది మగవారికి!?)
మరి మన శరీరానికి కొ.ప. అవసరం ఎంతైనా ఉంది అని తెలుసుకున్నాక ఎటువంటి కొ.ప తినాలి అని తెలిస్తే మంచింది. ఇక్కడ మరి కొన్ని ఇంగ్లీషు పదాలు వాడక తప్పదు.
కొవ్వు పదార్ధాలు రెండు రకాలు. 1. శాచురేటెడ్ 2. అన్ శాచురెటెెడ్
శాచురేటెడ్ కొ. ప. ఇవి రూం టెంపరేచర్‌లో ఘన పదార్ధంగా ఉంటాయి. ముఖ్యంగా జంతువుల నుంచి దొరుకుతుంది. వెన్న, చీజ్, (జున్ను) కొబ్బరినూనె, క్రీమ్,గుడ్లు, ఐస్‌క్రీమ్, పామ్‌ఆయిల్, కోడి చర్మం, బీఫ్ , వెన్న తీయని పాలు – వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ని పెంచుతాయి. వీటి నుంచి దూరంగా ఉండడం మంచింది.
ఆన్ శాచురేడెడ్ కొ. ప : దీనిలో మోనో ఆన్ శాచురేటేడ్, 2. పాలీ అన్‌శాచురేటేడ్ అనేవి ఉంటాయి. మొదటి రకం రూమ్ టెంపరేచర్‌లో ద్రవంగా ఉండి, ఫ్రిజ్‌లో పెడితే కొంచెం చిక్కగా కనిపిస్తాయి. ఇవి పల్లీలు, ఆలీవ్, అవకాడో (బిఖీళిబీబిఖిళి) బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పులు సమృద్ధిగా ఉంటాయి. ఈ కొ.ప గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధించడానికి తోడ్పడతాయి.
పాలీ అన్‌శాచేరేటెడ్ కొ.ప మాములు రూమ్ ఉష్టాగ్రతలోనూ ఫ్రిజ్‌లోనూ కూడా ద్రవపదార్ధంగానే ఉంటాయి.ఇవి సన్‌ప్లవర్ ఆయిల్, కార్న్‌ఆయిల్, సోయా బీన్, వాల్‌నట్, నువ్వులు, చేపలో విరివిగా దొరుకుతాయి. ఒమెగా -3, 6 కొ.ప. వీటికి చెందినవే. ఇవి, మన శరీరంలో తయారవ్వవు (ఎస్సెషల్ ఫ్యాటీ ఆసిడ్స్ ) ఇవి సాల్మన్‌్, టీనా చేపల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ కొ.ప గుండె సరిగా పనిచేయడానికి, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.
ట్రాన్స్ ఫ్యాట్స్ : వీటిని కృత్రిమంగా తయారు చేస్తారు.
ఇవి ఎల్‌డిఎల్ పెంచి హెచ్‌డిఎల్‌ని తగ్గిస్తాయి. ఈ కొ. ప వేయించిన ఆహారం, బిస్కట్లు, కుకీస్, ఫాస్ట్‌ఫుడ్‌లో సమృద్దిగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండటమే మంచింది.
కాబట్టి మిత్రులారా! మీరింకా జీరో సైజులకు చేరే ప్రయత్నంలో బుర్రలు పాడు చేసుకోలేదనుకుంటాను. మీరు తినే ఆహారంలో బొత్తిగా కొవ్వు పదార్ధాలు లేకుండా చేసుకోవద్దు. మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోడానికి పనికొచ్చే కొవ్వు పదార్ధాలు ఏమిటో తెలుసుకుని, అవి మీ ఆహారంలో తప్పనిసరిగా భాగంగా ఉండేలా శ్రద్ధ తీసుకోండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags