డా. రోష్ని
గత కొద్ది సంవత్సరాలుగా పిల్లలు మోసే స్కూల్ బేగ్‌లను, వాటి బరువును చూసి, మనం చాలా ఆశ్చర్యపోతున్నాం. ఏంటి మన పిల్లలు విద్యార్థులా లేక మూటలు మోసే కూలిలా అని జోక్ చేసిన పేరెంట్సు కూడా ఉన్నారు. ఇది ఇలా వుంటే…
మీరెప్పుడైనా గమనించారా, ఆడవాళ్ళు తీసుకెళ్ళే హేండ్‌బేగుల్ని. ఈ బేగుల్ని వృద్ధి చెందుతున్న నాగలికతకి, స్టైల్‌కి ప్రతీకలుగా మనం గుర్తిస్తాం. ఎన్ని ఎక్కువ అరలు, పాకెట్లు వుండి, ఎంత పెద్దగా వుంటే మనం అంత ఆనందిస్తాం. ఎందుకంటే ఏరోజుకారోజు దొరికిన ప్రతి వస్తువునీ అందులోకి తోసేయవచ్చు. అలా ఆబేగు బరువు, దాని మూలంగా మన భుజం మీది భారం పెరుగుతూ వుంటుంది.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఈ మధ్య చాలామంది భుజం నొప్పనీ, తల దువ్వుకోవడం కూడా కష్టమవుతోందనీ, చెయ్యిలేవడం లేదని, మెడనొప్పని, తొలనొప్పని ఇలా రకరకాలబాధలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ సమస్యలు స్త్రీలలోనే, ఎందుకు ఎక్కువగా వుంటున్నాయనేది మరో ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతే తెలిసింది ఓ ఆశ్చర్యకరమైన విషయం.
మనం మోసే ఈ హ్యాండ్‌బ్యాగ్ పట్టీ (స్ట్రిప్) భుజపు కీలుకీ, మెడకు మధ్యగల భాగంలో కూర్చుంటుంది. ఈ పట్టీికింద బేగ్ బరువుకి భుజం కండరాలు, వాటికింద ముఖ్యమైన నరాలు, రక్తనాళాలు, మొదటి పక్కటెముక (1వ రిబ్) వత్తిడికి గురవుతాయి. ఇదే వత్తిడి దీర్ఘకాలం కొనసాగితే భుజం నొప్పి, చెయ్యి గుంజడం, చెయ్యి మొద్దుబారడం జరుగుతుంది. రక్తప్రసరణ ఆగిపోవచ్చు. మెడనొప్పి, తలనొప్పి కూడా వస్తాయి.
అయితే ఏం చేయమంటారు? ఫోన్, మేకప్ సామాను, అద్దం, గొడుగు, టిఫిన్‌బాక్స్, నీళ్ళసీసా ఇవన్నీ బాగ్‌లో కాక ఎక్కడ పెట్టమంటారు అని మీరు అడగొచ్చు.
జి తక్కువ బరువుండే హ్యాండ్ బ్యాగుల్ని కొనండి.
జి మీ బ్యేగు పట్టీ భుజం మీది ఉంచండి. మిగతా పట్టి ఛాతీమీద ఉండాలి. బేగు ఛాతీ రెండోవైపున వుంటుంది. బొమ్మలో చూపించినట్లుగా దీనివల్ల బేగుభారం ఒకే భుజం మీద పడకుండా వుంటుంది. అంతేకాదు భుజాన్ని మారుస్తూ వుండాలి. ఒకరోజు కుడిభుజం, రెండోరోజు ఎడమభుజం.. అలా.
జి వెడల్పాటి పట్టీ వున్న బేగునే కొనండి. దానివల్ల బేగు బరువు ఒకేచోట పడకుండా వుంటుంది.
జి వారానికొకసారి బేగ్‌లో వస్తువుల్ని పరిశీలించి, అనవసరమైనవి తీసివేయండి. దీనివల్ల బేగ్ బరువు తగ్గించినవారవుతారు.
జి అన్నిటికంటే బెస్ట్ ఇప్పుడు చాలామంది కుర్రకారు వీపుమీద మోసే మోడ్రన్ బ్యాగ్‌లు. వీటివల్ల భుజాలపై భారం పడదు.
హేండ్‌బ్యాగుతో సంబంధం లేకుండా వచ్చే భుజం నొప్పి కూడా ఉండదండోయ్. భుజానికి ఏదైనా దెబ్బతాకినప్పుడో, భుజం బెణికినప్పుడో భుజపు కీలు జారినప్పుడో ఇతర వ్యాధులవల్లనో వచ్చే నొప్పిని మనం లైట్‌గా తీసుకోవద్దు. కొంచెం డాక్టర్ సలహా, ఫిజియోథెరపీ ఇంకాస్త సీరియస్ అయితే సర్జరీ కూడా అవసరం అవుతుంది.
డాక్టర్‌కి చూపించాల్సిన అవసరం ఎప్పుడుకలుగుతుంది?
జి చేత్తో మనం వస్తువుల్ని మోయలేకపోవడం వల్ల చెయ్యి కదల్లేకపోవడం
జి భుజంలో వంకర తీసుకొచ్చే దెబ్బ తగలడం
జి రాత్రిపూటగానీ, విశ్రాంతిలోకానీ భుజం నొప్పి ఎక్కువవుతుంటే
జి భుజం నొప్పి మరీ ఎక్కువరోజులు కొనసాగుతుంటే
జి చెయ్యిని పైకెత్తలేకపోతుంటే
జి ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లుండే (అంటే జ్వరం, భుజం ఏరియా ఎర్రబడి వేడిగా వుంటే)
అశ్రద్ధ చేయకండి. డాక్టర్ సలహా తీసుకోండి. అంతకంటే ముందుగా హేండ్‌బ్యాగ్ వల్ల వచ్చే భుజం నొప్పిని తగ్గించుకోవడం మీ చేతుల్లో వుంది. కాబట్టి శ్రద్ధ వహించండి. డాక్టర్ల వరకూ రాకుండా మీ భుజం మీది భారాన్ని మీరే తగ్గించుకోండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags