శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళా సాధికారత

డా. కె. మైథిలి
గత పదేళ్ళుగా అంటే 2001లో భాతర ప్రభుత్వం మహిళా సాధికారత పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుండి, విద్య, ఆరోగ్య, ఆర్ధిక,రాజకీయ రంగాలలో స్త్రీ సాధికారత గురించి చర్చిస్తూనే ఉన్నాము. ముఖ్యమైన నిర్ణయాధికారాలకు మహిళలు ఎంతగా దూరంగా ఉంటున్నారో తెలుసుకుంటూనే ఉన్నాం. తెలుసుకోవడం ఎక్కువ అయింది తప్ప, పరిష్కార మార్గాల వైపుకు ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాం. కనీసం 30-40% అయినా నిర్ణయాధికారానికి దగ్గరగా రాలేకపోతున్నాం. ఈ నేపధ్యంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్ధాం.
సాధారణంగా శాస్త్ర, సాంకేతిక విద్యను అభ్యసించిన వారు వృత్తి రీత్యా రెండు మార్గాలను ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. కళాశాల, విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసక వృత్తి ఒకటికాగా, పరిశోధనా సంస్థలలో శాస్త్రవేత్తలుగా స్థిరపడడం రెండవది. 2004-2010 మధ్యకాలంలో కీలకమైన నిర్ణయాధికార స్థానాలలో ఉండాలంటే 1974-80ల మధ్య వాళ్ళు గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, పరిశోధన పూర్తి చేసి ఉండాలి.
1970లలో సామాజిక పరిస్థితిని గమనిస్తే, అమ్మాయిలను గ్రాడ్యుయేషన్‌ చదివిస్తే చాలు అనే  దృక్పథం కన్పిస్తుంది. అంతే కాకుండా మహిళకు ఎప్పుడూ వివాహం, కుటుంబం మొదటి ప్రాధాన్యత కాగా, చదువు, ఉద్యోగం తరువాత ప్రాధాన్యత అని అందరికీ తెలుసు. గ్రాడ్యుయేషన్‌లో కూడా బి.ఎస్‌సి అయితే, మధ్యలో పెళ్ళి కుదిరితే, చదువు కొనసాగించడానికి అవకాశం ఉండదు. బిఏలో అయితే మధ్యలో పెళ్ళి అయినా ప్రవేటుగా పరీక్షలు రాయవచ్చు అనే అభిప్రాయంతో అమ్మాయిలను బిఏలో చేర్పించడం జరిగేది. దాంతో బి.ఎస్‌సి చదివే అమ్మాయిల సంఖ్య తగ్గినట్లే. బి.ఎస్‌సి పూర్తి చేసిన వారిలో 20%-30% ఎంఎస్‌సిలో ప్రవేశిస్తే చాలా గొప్ప విషయం. పోరాడి, పట్టుబడ్డి ఎం.ఎస్‌సి పూర్తి చేసినా పరిశోధనా రంగంలోకి ప్రవేశించడం అంటే కత్తి మీద సాము చేయడమే… ఆ రోజుల్లో సమాచార రంగం అభివృద్ది చెందకపోవడంతో, పరిశోధనా సంస్థల గురించి తెలియడమే గగనంగా ఉండేది. చాలామంది వాళ్ళు చదివిన విశ్వవిద్యాలయాలల్లో పి.హెచ్‌డి పూర్తి చేసుకొని, ఉపన్యాసవృత్తిని చేపట్టడం జరిగింది. అంతేకాక ఉసన్యాసక వృత్తిలో నిర్ధిష్టమైన పనిగంటలు ఉంటాయనీ, సంసార జీవితానికి ఇబ్బందులు ఉండవని ప్రాధాన్యత ఇవ్వడం జరిగేది. దాంతో పరిశోధనా సంస్థలలోకి స్త్రీల ప్రవేశం క్లిష్టమైంది. నగరాలలో ఉన్న కొంతమంది పరిశోధన కోసం పరిశోధనా సంస్థలలోకి ప్రవేశించి, పిహెచ్‌డి పూర్తి చేసుకొని శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారు. అయితే ఇక్కడ మరొక సమస్య. పిహెచ్‌డి పూర్తి అయ్యేసరికి 26-27 సంవత్సరాలు రావడంతో వివాహం.. గర్భధారణ.. పసిపిల్లల సంరక్షణ..దీంతో కనీసం 5-7 సంవత్సరాల పాటు పూర్తి సమయాన్ని వృత్తికి కేటాయించలేకపోతారు. ఒక స్త్రీ, పురుషుడు ఒకేసారి శాస్త్రవేత్తగా సంస్థలోకి చేరినా, పురుషుడు నిరంతరం పరిశోధనల సమయాన్ని కేటాయిస్తూ, పరిశోధనా పత్రాలను తయారు చేస్తూ, ప్రతిష్టాత్మకమైన జర్నల్స్‌లో ప్రచురిస్తూ ముందుకు వెళతాడు. స్త్రీ తన ప్రకృతి ధర్మ విషయాల పట్ల 60% సమయం కేటాయించడంతో పరిశోధనలో వెనకబడి పోతోంది. ప్రమోషన్‌ పోస్ట్‌కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్త్రీకి కావలసిన పరిశోధనా పత్ర ప్రచురణలు లేకపోవడంతో అర్హురాలు కాకుండా పోతుంది. ఆ పోస్ట్‌లలో పురుషులు వెళుతూ ఉంటారు. ఈ రకంగా ప్రతీ దశలో స్త్రీలు అవరోధాలను ఎదుర్కుంటూ ఉంటే , కీలకమైన నిర్ణయాధికార స్థానాన్ని ఎలా అందుకోగలరు? కుటుంబ సంకెళ్ళు స్త్రీ అభివృద్ధిని ఆటంకపరుస్తూనే ఉంటాయి.
శాస్త్ర, సాంకేతిక అధ్యయనాలలో కూడా భౌతిక, రసాయన, గణిత శాస్త్ర అధ్యయనాల కన్నా జీవశాస్త్ర అధ్యయనాలలో స్త్రీల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాంకేతిక రంగాలలో స్త్రీల సంఖ్య బహు స్వల్పం అని చెప్పక తప్పదు. ఈ విషయాలను కొన్ని గణాంకాల ఆధారంగా గమనిద్దాం.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో 28 శాస్త్ర సాంకేతిక రంగ సంస్థలలో కేవలం 280 మంది మహిళలు మాత్రమే పని చేస్తున్నారు. వాళ్ళలో 177 మంది 5-8 గం. మాత్రమే వృత్తికి కేటాయిస్తున్నారు. కేవం 13 మంది మాత్రమే 10 గం. పైన సంస్థలలో ఉండి పరిశోధనలు చేయగలుగుతన్నారు. (4.6%), 67% స్త్రీలు పరిశోధనా విద్యార్ధులకు గైడెన్స్‌ ఇవ్వడం లేదు. 51% స్త్రీలు వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళ లేదు. 84% ఉద్యోగులు నగరాలలో చదువుకొని రాగా, కేవలం1% ఉద్యోగినులు గ్రామాల నుండి వచ్చారు.
ముంబాయిలోని బాబా అటామిక్‌ రీసర్చ్‌ సెంటర్‌లో మొత్తం 14,869 మంది ఉద్యోగస్థులుకాగా, అందులో 1945 మంది మహిళా ఉద్యోగులు (13.08%) ఉన్నత స్థాయి పోస్ట్‌లు అయిన ఎ,బి,గ్రూప్‌ ఉద్యోగస్థులు 502 మంది ఉన్నారు. వీరిలో అతి ఉన్నతస్థాయి శాస్త్రవేత్త ఒక్కరు కాగా, ఆఫీసర్‌ హెచ్‌ స్థాయిలో 2, జి స్థాయిలో 24 మంది, ఎఫ్‌ స్థాయిలో 76 మంది ఉన్నారు. సి స్థాయిలో 132 మంది మహిళలు ఉన్నారు. కానీ వారి నుండి ప్రమోషన్‌ పొంది హెచ్‌ స్థాయికి చేరుకోవడం ఇద్దరికే సాధ్యమైంది.
ప్రతిష్టాత్మకమైన కేంద్ర విశ్వవిద్యాలయాలలో స్త్రీల స్థాయి
సంస్థ    మొత్తం ఫ్యాక్టల్టీ    ఆచార్యులు        ఇతరులు
పురుషులు    స్త్రీలు    పురుషులు    స్త్రీలు    పురుషులు    స్త్రీలు
ఐఐఎస్‌, బెంగుళూరు    51    12    26    5    25    7
జెఎన్‌యు, ఢిల్లీ    39    11    24    6    15    5
ఢిల్లీ విశ్వవిద్యాలయం    57    6    31    0    26    6
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం    24    5    16    1    8    4
సెంట్రల్‌ డ్రగ్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ,లక్నో    147    46    50    17    97    29
సిసిఎంబి, హైదరాబాద్‌    48    22    12    01    36    21
ఎన్‌సిసిఎస్‌, పూనే    20    05    04    01    16    04
ఎన్‌ఐఎన్‌, హైదరాబాద్‌     33    15    10    03    23    12
ఎన్‌ఐఐ, న్యూఢిల్లీ    29    09    18    04    11    05

ప్రతిష్టాత్మకమైన జర్నల్స్‌లో 669 పత్రాలు ప్రచురించబడగా, వాటిలో 97 మాత్రమే మహిళలచే ప్రచురించబడ్డాయి. (14.49%) ఈ సంస్థలలో పరిశోధనా సలహా కమిటీలలో  కూడా స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌ ఎన్‌ఐఎన్‌లో ముగ్గురు మహిళలుండగా, సిసిఎంబిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనించవలసిన విషయం.
అఖిల భారత వైద్య పరిశోధనా కౌన్సిల్‌ (ఐసిఎంఆర్‌) వైద్య పరిశోధనా ప్రక్రియలను నిర్వహిస్తూ ఉంటుంది. దీని ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, 38 సంస్థలు లేదా శాఖలు భారతదేశంలో వివిధ నగరాలలో ఉన్నాయి. ఇందులో శాస్త్రవేత్తలుగా వైద్యవిద్యను అభ్యసించిన వారేకాక బయాలజీ, స్టాటిస్టిక్స్‌ వంటి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అర్హత కలిగిన వారు కూడా చేరుతూ ఉంటారు. మొత్తం 38 సంస్థలలో 568 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా 121 మంది (21.3%) మాత్రమే మహిళలున్నారు. ఈ సంస్థలలో సైంటిస్ట్‌ ‘బి’ హోదాలో చేరుతారు. సి,డి,ఇ,ఎఫ్‌,జిలు ప్రమోషన్‌ పోస్ట్‌లుగా ఉంటాయి. ‘జి’ స్థాయి అత్యుత్తమమైనదే కాక సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరించబడుతుంది. 23 సంస్థలలో ఆ హోదా పోస్ట్‌ ఉండగా కేవలం ఒక పోస్ట్‌లో మహిళ ఉండగా (4.3%) మిగిలిన 22 సంస్థల డైరెక్టర్స్‌గా పురుషులున్నారు. ఎఫ్‌ స్థాయిలో 17.34%, ఇ స్థాయిలో 25%, డి స్థాయిలో 22.03%, సి స్థాయిలో 26.49%, బి స్థాయిలో 25% మంది మహిళలున్నారు. బి, సి స్థాయిలలో మహిళల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉన్నా, డి, ఇ, ఎఫ్‌లకు వచ్చేసరికి ఆ సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.
ఇంక విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలో సైన్సు విభాగాలలో స్త్రీల సంఖ్య, వారి పరిశోధనా స్థాయిలను పరిశీలిస్తే అంత ఆశాజనకంగా లేవు. విశ్వవిద్యాలయాలలో బోధనతో పాటు పరిశోధన కూడా తప్పనిసరి అంశం. నిర్ధిష్టమైన పనివేళలు ఉంటాయని ఉపన్యాసక వృత్తిని ఎన్నుకున్న మహిళలు, అందులో కూడా అధికశాతం బోధనకు పరిమితమై, పరిశోధనలో పెద్దగా కృషి చేయడం లేదు. 2009 సం. యుజిసి, న్యూఢిల్లీ వారు విడుదల చేసిన  మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు కేటాయింపులు చూస్తే బాగా అర్ధమవుతుంది. భారతేదశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో మొత్తం 540 మంది కి ఇవి కేటాయించగా, అందులో కేవలం 90 మంది మాత్రమే (16.25%) మహిళలు ఉన్నారు.
అనుబంధ కళాశాలలో పరిశోధన చాలా తక్కువగా ఉంటుంది. ఆ కళాశాలలో పరిశోధనా వసతులు లేకపోవడం, ప్రమోషన్స్‌లలో దానికి ప్రాధాన్యత లేకపోవడంవల్ల పిహెచ్‌డి చేసిన వారు కూడా తదుపరి పరిశోధన కొనసాగించరు. యుజిసి వారు 2009సం.లో అనుబంధ కళాశాలలో 271 ప్రాజెక్టులను కేటాయించగా అందులో 56 మంది (20.66%) మహిళలున్నారు. వీళ్ళలో కూడా బయాలజీ విభాగంలో ఎక్కువగా ఉంటే, భౌతిక, గణిత శాస్త్రాలలో చాలా తక్కువగా ఉన్నారు.
ఈ పరిశీలనల ఆధారంగా ఈ క్రింది విషయాలను నిర్ధారించవచ్చు.1. శాస్త్ర, సాంకేతిక రంగాలలో స్త్రీల ప్రవేశం చాలా తక్కువగా ఉంది. 2. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కెరీర్‌ను తరువాత అంశంగా మహిళలు పరిగణిస్తున్నారు. పిహెచ్‌డి డిగ్రీ కోసం తీసుకోవడం తప్పించి, నిరంతర పరిశోధనకు 90% స్త్రీలు దూరంగా ఉంటున్నారు. గర్భధారణ, పసిపిల్లల పెంపకం, పిల్లల చదువులు, వాళ్ళ స్థిరత్వం కోసం చేసే పనులు స్త్రీకి సంకెళ్ళుగా మారి, ఉద్యోగంలో ఉన్నత స్ధాయికి చేర్చలేకపోతున్నాయి.
ఈ కారణాల వల్ల నిర్ణయాధికార స్థానాలు చేపట్టడానికి మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.
ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి?
ు    స్త్రీ కూడా వృత్తికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆలోచనా పరిధిని మార్చుకోవాలి.
ు గర్భధారణ, పసిపిల్లల నిమిత్తం 5 సం. కాలం స్త్రీకి రాయితీగా ప్రకటించి, ప్రమోషన్లకు అవకాశం కల్పించాలి.
ు    ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్‌ను, పరిశోధనకు అనుబంధం చేయాలి.
ు    ప్రతీ సంస్థలో ప్రత్యేక ట్రిబ్యునల్స్‌ ఏర్పరచి వృత్తి పరమైన అన్యాయాలు జరిగినప్పుడు వెంటనే పరిశీలించి, పరిష్కరించే           అవకాశాన్ని కల్పించాలి.
ు ప్రతీ మూడు నిర్ణయాత్మక సాథనాలలో ఒకటి మహిళకే కేటాయించాలి.
ు అప్పుడే ఈ రంగాలలో స్త్రీల సాధికారత పూర్తిగా సాధించలేక పోయినప్పటికీ, ప్రాధాన్యత పెంచగలుగుతాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో