చాగంటి తులసి
జనవరి 17 రాష్ట్రంలో కథకుల సాహితీ వేత్తల సాహితీ ప్రియుల చాసో అభిమానుల పెద్ద పండుగ. ఈ జనవరి 17 చాసో 96వ పుట్టినరోజు . 1995 నుండి ప్రతి ఏటా సృజనాత్మక సాహిత్యానికి నిబద్ధతతో కృషి చేసిన అభ్యుదయ రచయితలలో ఒకరిని చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారంగా పదివేల రూపాయిలు, శాలువా, జ్ఞాపికలతో చాసో సూర్తి సాహిత్య ట్రస్టు సత్కరిస్తోంది. ఇది 17వ పురస్కారం. పురస్కార స్వీకర్త శశిశ్రీ. కథకుడు. సాహితీనేత్రం పత్రిక సంపాదకుడు.
విజయనగరం అంటే గురజాడ. గురజాడ అంటే ఆధునికత. గురజాడ అంటే రాబోయే తరాలు.
ఆ గురజాడను అందుకున్న రచయిత చాసో. తెలుగు నాట పుట్టిన మన రచయితలలో విశిష్టుడు చాసో. చాసో కథలు జీవిత సత్యాలకు సాక్ష్యాలు. ఒక యుగం తడుముకుంటున్న దిశల్ని పట్టుకొని ముందుకు తీసుకు వెళ్లవలసిన బాధ్యతను గురజాడ నుండి వారసత్వంగా పొందాడు.
ఒక యుగపు శేష ప్రశ్నలను వెదకడం ద్వారా చాసో ఒక పాత్ర రచయిత, ఒక సంఘటన రచయితా కాక సామాజిక చేతనను ఒడిసి పట్టుకున్న రచయిత అయ్యాడు.
అరసం వ్యవస్థాపక సభ్యుడు. భౌతిక వాది. మార్క్సిస్టు అవగాహనతో మానవ జీవిత పరిశీలకుడు. తన మరణానంతరం తన నేత్రాలను దానం చేసి శరీరాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం యిచ్చి తన విశ్వాసాలకు నిబద్ధతతో నిలిచిన రచయిత.
అని చాసో విశిష్టతలను చెప్పి చాగంటి ఆనంద్ అహుత్యులకు స్వాగం పలుకుతూ సభకు అధ్యక్షత వహించటానికి విజయవాడనుండి వచ్చిన విశాలాంధ్ర పత్రిక పూర్వ సంపాదకులు, ప్రఖ్యాత పాత్రికేయులు గౌ. శ్రీ సి. రాఘవాచారిగారిని, చాసో కథా సాహిత్య విశ్లేషకులుగా రాజమండ్రి నుండి వచ్చిన పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌గారిని 17వ చాసో స్ఫూర్తి పురస్కారాన్ని స్వీకరించడానికి కడప నుండి వచ్చిన శశిశ్రీని, శశిశ్రీ సాహిత్య కృషిని గురించి ప్రసంగించడానికి హైద్రాబాద్‌నుండి వచ్చిన కథకుడు, కవి డా. దేవరాజు మహారాజుగారిని సంక్షిప్త సుందరంగా పరిచయం చేస్తూ వేదిక పైకి ఆహ్వానించారు.
ముందుగా చాసో భార్య చాగంటి అన్నపూర్ణమ్మ, కథకులు ఎమ్. రామ్‌కోటి, భరాగో, కవి అలలకు చాసో స్ఫూర్తి అశ్రు పూరిత నివాళులు అర్పించింది. వారి స్మృతికి సంతాపసూచకంగా సభ మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. చీకటి చంద్రికారాణిగారు గురజాడ దేశభక్తి గేయం ఆలాపించారు. చాసో చిత్రపటానికి అధ్యక్షులు శ్రీ . సి. రాఘవాచారిగారు పూలమాలతో అలంకరించారు.
చాసో స్ఫూర్తి వ్యవస్థాపకురాలు ప్రముఖ రచయిత్రి డా.చాగంటి తులసి దేశం నలుమూలల నుండి ప్రముఖులు పంపిన అభినందన సందేశాలు తెలిపారు. చాసో స్ఫూర్తి చాసో కథా పఠన కార్యక్రమాన్ని ఒక సంప్రదాయంగా ప్రారంభసభ నుండి వరవడి పెట్టుకుని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం చాగంటి తులసి చాసో కథ ‘బూర్జువా కుక్క’ కథ చదివి వినిపించారు.
డా. దేవరాజు మహారాజు పురస్కార స్వీకర్త సాహిత్యం గురించి ప్రసంగిస్తూ ముందు చాసో వ్యక్తిగా, కథకుడిగా ఎవరో ఆ నేపథ్యం ఏమిటో వివరించి చాసో స్ఫూర్తి పురస్కారాన్ని శశిశ్రీ అందుకున్న కారణాన్ని విశదపరిచారు. చాసో మనిషిగా ఉన్నతుడు. శాస్త్రీయ దృక్పధం ఉన్నవాడు. మూఢనమ్మకాలను నమ్మనివాడు. సమాజాన్ని వెనక్కి నడిపించే పని చెయ్యకండి అని చెప్పినవాడు. తాను విశ్వ మానవుణ్ణిని చెప్తూ, స్థలం, జిల్లా, కులం, మతం- అన్నిటికి అన్ని ఉండొచ్చు. కాని సంకుచిత సంబంధాలకు పరిమితం అవడం, సరిహద్దులు ఏర్పరచుకోవడం తగదు. మనిషిలో మనిషి తనాన్ని నిలబెట్టడం ధ్యేయం, దృక్పథం అవ్వాలి. తను చిత్రించిన జీవితంలోనుండి తన మార్క్సిస్టు భావజాలాన్ని చెప్పాడు కాని వాజ్యం చెయ్యలేదు. శశిశ్రీ కూడా పడి కట్టు మాటలు ఉపయోగించకుండా తాను ఏది నమ్మాడో దానిని, ఆర్ధిక అసమానతలను పరాయీకరణను చెప్పాడు. హిందీ ఉర్దూ, తెలుగు, హిందు, ముస్లిం సంప్రదాయాల కలయికను, మైత్రీ సంబంధాలను నమోదు చేశాడు. ఇది స్పెషలైజేషను యుగం. ఈ యుగ ధర్మాన్ని బట్టి వారి వారి అస్థిత్వాలను మైనారిటీ వర్గాలు, స్త్రీవాదులు, ముస్లిం వాదులు ప్రతిభావంతంగా చెప్తున్నారు. అయితే సంకుచితత్వాన్ని పెంచి మనిషిని విడగొట్టే ప్రయత్నాల్ని ఖండించడం జరగాలి. శశిశ్రీ నేరుగా చాసోని అనుకరించి రాయాలని రాయలేదు. కాని అదేభావజాలాల్లో నిబద్ధతలో అంంతర్లోకపు కథలు, బహిర్లోకపు కథలు రచించాడు అన్నారు
పురస్కార స్వీకర్త శశిశ్రీ తన స్పందనను హుందాగా, గంభీరంగా అందంగా అందించారు. కడప గడపవాణ్ణి. పద్యం సేద్యం సమానంగా చేసే సీమ కథల కర్షకుణ్ణి. ప్రజలకోసం ప్రగతికోసం సర్వ కళలు పని చేయాలన్న ఆత్మనిబద్ధతతో కలం పట్టినవాణ్ణి. తొలి గురువులు సరస్వతీ పుత్ర పుట్టపర్తివారు. అరసంలో మలి గురువులు వై. సి.వి. రెడ్డిగారు. ”కోడికి ఎగురు కుదిరిందయ్యా” అంటూ లోకంలోకి వెళ్లమన్నారు. జర్నలిస్టుగా ప్రొద్దుటూరులో చాసోని ఇంటర్వ్యూ చేసినప్పుడు కథల టెక్నిక్ అంటే ఏమిటో తెలిసింది. చాసో దశదిశ నిర్ధేశం చేసిన రచయిత. కథకు తూర్పు దిక్కు. ఆయనను కలిసిన తర్వాతే నన్ను నేను తవ్వుకుంటూ దశదిశ నిర్ధేశించి కోగలిగాను. కధలను చింపేయడం నేర్చుకున్నాను. విజయనగర ప్రాంతాన్ని ఈ భాషని ఈ పలుకు బడిని ఈ సంస్కార గుణాన్ని, కలగలపు గుణాన్ని ఈ విధంగా రాస్తే కథ పండుతుందని మానవుని కలను కళారూపంగా అందించాడు చాసో.
‘మానవుని కల కళ కావాలి. ఫలపద్రం జయప్రదం.జనప్రియం అవాలి. ఈ పురస్కారాన్ని మా అమ్మకు అందజేస్తాను’ అన్నారు.
రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ మూడు రోజులైతే మా విజయనగరంలో నాలుగు రోజులు – భోగితో ప్రారంభమై, చాసో పుట్టినరోజు పండుగతో ముగుస్తుంది. ఈ రోజు ఈ
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags