మన్యం ప్రజలకు శుభవార్త!
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం, అడ్డతీగల గ్రామంలో లయ సంస్థ ఆధ్వర్యంలో ‘మన్యవాణి’ రేడియోస్టేషన్ నెలకొల్పాం. ఒక ఎనిమిదిమంది ఆదివాసీ యువతీ యువకులం రేడియో ప్రొడ్యూసర్స్‌గా శిక్షణ పొంది దీన్ని నెలకొల్పుకున్నాము. మేమంతా రేడియోలో ప్రసారం కొరకు కథలు, నాటికలు, ఇతర కార్యక్రమాల (ప్రోగ్రాంలు) రూపకల్పనలో తగు నైపుణ్యాన్ని పొందడం కోసం శిక్షణ పొందాము. మా చుట్టూ ఉన్న ఆదివాసి ప్రజలు, తెగల ఆచార సంప్రదాయాలు, జీవన పరిస్థితులు, ప్రస్తుతం వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సమస్యలు మరియు రోజువారీ జీవనచిత్రం గురించి కార్యక్రమాలు (ప్రోగ్రాంలు) తయారుచేసి మా రేడియో ద్వారా వినిపించడం ద్వారా మనవారిని చైతన్యవంతుల్ని చేయాలనేది మా ముఖ్య ఉద్దేశ్యం. ఆదివాసి ప్రాంతంలోని సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఎదుర్కొనగలిగే శక్తియుక్తులను, ధైర్యసాహసాలను, ఇతర నైపుణ్యాలను పెంపొందించాలనే సదుద్దేశ్యంతో మా ఈ మన్యవాణి రేడియో స్టేషన్ను మేము నెలకొల్పాము.
లయ సంస్థ సహకారంతో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో, గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌కు చెందిన దృష్టి సంస్థ నుండి వచ్చిన ఒక ట్రైనర్ ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతానికి చెందిన మా ఎనిమిది మంది యువతీయువకులం ది.03-05-2010 నుండి శిక్షణ పొందుతున్నాము. ఈ శిక్షణలో భాగంగా మా నిర్వాహకుల (ప్రొడ్యూసర్స్)కు కంప్యూటర్‌పై అవగాహనతో పాటు, కమ్యూనిటీకి ఏ విధంగా దగ్గరవ్వాలి, ఆదివాసీ ప్రాంతంలోని సమస్యలపై ప్రజలకు తగు సమాచారం అందించడంలో ఏ విధంగా సహాయపడాలి అనే విషయాలపై అవగాహనను, నైపుణ్యతను నేర్పించడం జరుగుతుంది.
మన్యవాణి అవసరం :
ప్రధాన జీవన స్రవంతిలోని మాధ్యమాలు ఏవీ ఆదివాసీలకు అందుబాటులో ఉండకపోవడమే కాకుండా వేటిలోనూ ఆదివాసీలకు సంబంధించిన సమస్యలుగానీ, ఇతర జీవనఅంశాలుగానీ, అంతగా కనబడటం లేదు. కాబట్టి మన ఈ మన్యప్రాంతంలో వున్న సమస్యలను ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళడానికి, తద్వారా సామాజిక మార్పును తీసుకురావడానికి ‘మన్యవాణి’ రేడియోస్టేషన్ ఎంతో అవసరమని, అందుకు ఇది ఒక మంచి శక్తివంతమైన సాధనమని కూడా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఆదివాసీ సమస్యలను మనవైపునుండి, మన మాటల్లోనే ఈ మన్యవాణి ద్వారా వినిపించాలనేదే మా కల.
లక్ష్యాలు :
ఆదివాసీ ప్రాంతంలో సమస్యల గురించి ప్రజలకు తెలియజెప్పి ఆ సమస్యలపైన సామాజిక స్పృహ కల్పించడం. ఈ రోజులలో మనం మరిచిపోతున్న మన్యప్రాంత మంచి మంచి సాంప్రదాయ పద్ధతులను గుర్తించి తిరిగి మన ప్రజలకు ఆ వైభవాన్ని ఒకసారి గుర్తుచేయడం.
ఆదివాసి ప్రాంతవాసులకు వినోదంతోపాటు వివిధ అంశాలపై విజ్ఞానాన్ని అందించడం.
ప్రొడ్యూసర్స్‌గా మేము చేస్తున్న పని :
ముందుగా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామస్తులను, గ్రామపెద్దలను పరిచయం చేసుకుని, ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, వాటిపైన ఆ ప్రజల అభిప్రాయాలను సేకరించడం, తిరిగి ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, వారి సమాధానాలను, అభిప్రాయాలను కూడా సేకరించి, (రికార్డు చేసి) వారి వారి మాటలలోనే ప్రోగ్రాములుగా ప్రసారం చేయడం ద్వారా వాటిని ఆయా గ్రామాలకు వినిపించడం ప్రస్తుతం మేము చేస్తున్నాము.
మా మనవి :
మన్యవాణి రేడియోస్టేషన్ గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటారని ఆశిస్తూ…
మీ నిర్వాహకులు (ప్రొడ్యూసర్స్), మన్యవాణి రేడియోస్టేషన్, అడ్డతీగల
(మన్యంలోంచి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags