డా.రోష్ని
స్త్రీలలో రక్తహీనత తగ్గించడానికి మందుల బదులు మనకు అందుబాటులో ఉన్న కూరగాయలు, ఆకుకూరల గురించి కొంచెం తెలుసుకుందాం అనిపించింది. అటువంటి కూరగాయల్లో ఒకటి బీట్‌రూట్. ఇది మనకు దాదాపు 4000 సంవత్సరాలుగా తెలుసు. చాలారకాల జబ్బులకు దీనిని వాడేవారు. దీనిని కూరగా, సలాడ్‌గా, జ్యూస్‌గా వాడొచ్చు.
బీట్‌రూట్‌లో ఏమున్నాయి?
ు విటమిన్లు : ఫోలిక్‌ఏసిడ్, విటమిన్ సి దండిగా ఉంటాయి. కొద్ది మోతాదులో బి1, బి2, బి3, బి6, బి12, ఇంకా విటమిన్ ఎ దీనిలో లభ్యమవుతాయి.
ు ఖనిజ లవణాలు : కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియంతో పాటు ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియమ్‌లు ఉంటాయి.
ు మాంసకృత్తులు : నీరు, పిండిపదార్థాలతో పాటు మాంసకృత్తులు కూడా ఉంటాయి.
ు యాంటీఆక్సిడెంట్స్, కరొటినాయిడ్స్, ఫ్లావినోయిడ్స్.
ు దీని రంగు ఎర్రగా ఉండటానికి కారణం బేటాసైనిన్ అనేదానివల్ల కలుగుతుంది.
ు సిలికా అధికంగా ఉంటుంది.
బీట్‌రూట్ వల్ల ఉపయోగాలు
ు బి12, ఫోలిక్‌యాసిడ్ కలిగి ఉండటం వల్ల, ఇంకా సులభంగా వంటబట్టే ఇనుము కూడా ఉండటం వల్ల రక్తహీనతను అరికడ్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ు శరీరంలోని జీవకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ు దీంట్లో ఉన్న బెటాయిన్ అనే పదార్థం వల్ల కాలేయం సరిగా పనిచేస్తుంది.
ు గుండె, రక్తనాళాల పనిని సక్రమంగా ఉంచుతుంది.
ు రక్తపోటు తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా చేస్తుంది.
ు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ు స్త్రీలలో నెలసరిలో సమస్యలుంటే వాటిని తగ్గిస్తుంది.
ు పేగులను శుద్ధిచేస్తుంది. కేన్సర్ రాకుండా కాపాడుతుంది.
ు అలసటను తగ్గించి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
ు దీని జ్యూస్ చర్మవ్యాధుల్ని తగ్గించడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
ు దీనిలోని సిలికా కాల్షియాన్ని ఉపయోగించుకోడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు, గోళ్ళు, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
ఇన్ని ఉపయోగాలున్న బీట్‌రూట్‌ని జ్యూస్ రూపంలో తీసుకోవాలంటే ఈ క్రింది వాటితో కలిపి చూడండి.
ు బీట్‌రూట్ + కేరట్
ు బీట్‌రూట్ + ఏపిల్
ు బీట్‌రూట్ + కీరదోసకాయ
ు బీట్‌రూట్ + అల్లం + అనాస
కేవలం బీట్‌రూట్ జ్యూస్‌నే తాగాలంటే కొంచెం కష్టం. గొంతు పడుతుంది. ఏదైనా పండు లేక కూరగాయతో కలిపి వాడండి.
కొన్ని జాగ్రత్తలు :
ు జ్యూస్ కోసం గట్టిగా ఉన్న బీట్‌రూట్‌లనే ఎంచుకోండి. మెత్తగా ఉన్నవి, కుళ్లినవి వాడొద్దు.
ు దీనివల్ల మలమూత్రాలు ఎరుపురంగు కలిగి ఉంటాయి. చూసి కంగారుపడొద్దు.
ు కొద్దికొద్దిగానే తీసుకోండి. (రోజుకొక గ్లాసు మాత్రమే). బీట్‌రూట్ జ్యూస్‌తో మీ రక్తహీనతను తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags