పి. రాజ్యలక్ష్మి
కాకరాపల్లిలో తలపెట్టిన థర్మల్‌పవర్‌ప్లాంటు నిర్మాణం వల్ల సముద్రతీర ప్రాంతంలోని మత్స్యకారులు, స్థానిక గ్రామాల ప్రజలు తమ జీవితాలు నాశనమవుతాయని పర్యావరణ విధ్వంసం జరిగి తాము అనారోగ్యం పాలవుతామని, తాము ఉపాధి కోల్పోతామని, ”మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనీయండి. మాకీ అభివృద్ధి వద్దు” అంటే నినదించిన కాకరాపల్లి ప్రజలు గొంతుకలను పోలీసులు పాశవికంగా నులిమివేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
శాంతియుతంగా తమ నిరసనను, వ్యతిరేకతను ప్రకటిస్తున్నా ప్రజలపై పాశవిక దాడిచేసి తమ అధికార అహంకారాన్ని చాటుకుంది ప్రభుత్వం. తమకున్న అధికార బలంతో అంగబలంతో ఇద్దరు వ్యక్తుల మరణానికి అనేకమంది తీవ్ర గాయాలకు కారణమయిన ఈ పోలీసుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ మహా ఉద్యమానికి అనేక ప్రజాసంఘాలు, మేధావులు తమ మద్దతును తెలియజేశాయి.
అలాగే ఈ ఘటనకు స్పందించిన ప్రజా ఉద్యమాల సంఘీభావకమిటీ ఫిబ్రవరి 28శినీ (అడ్వకేట్ హేమలలిత) మానవ హక్కుల కమీషన్‌లో కేసు దాఖల చేసింది. అంతకుముందు శ్రీజుఆఖ వారు వేసిన పిటీషన్‌కు 7శినీ కు వాయిదా వేసిన కష్ట్ర్పు, ఇలాంటివి తమ పరిధిలోకి రావని, నిస్సహాయతను వ్యక్తం చేసిన కష్ట్ర్పు కి, పరిస్థితి యొక్క తీవ్రతను గమనించాలని, ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పటంతో, బాధితులకు న్యాయం చేయాలని, శాంతియుత వాతావరణం కల్పించాలని మాత్రం పేర్కొంటు శ్రీకాకుళం పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ సంఘటన గురించి పార్లమెంటులో కలకలం రేగి తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటంతో పర్యావరణ శాఖామంత్రి జైరాం రమేష్, ప్రాజెక్టు నిర్మాణానికి తాము అనుమతులు ఇవ్వలేదని, వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించాలని ఆదేశించటం జరిగింది.
మార్చి 3వ తేదీ ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ బృందం, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంటును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన, తదితర విషయాల గురించి వాస్తవాలు తెలుసుకోగోరే నిమిత్తం నిజనిర్ధారణ కమిటీగా వెళ్ళి వడ్డెతాండ్ర, ఆకాశలక్కవరం గ్రామాలను సందర్శించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వాస్తవాంశాలను పరిశీలించటం జరిగింది. ఈ బృందంలో హేమలలిత (అడ్వకేట్), నాయుడు వెంకటేశ్వరరావు (మత్స్యకార సహకార సంఘ ప్రధాన కార్యదర్శి), కె.జె. రామారావు (ఉద్యోగ క్రాంతి ), పి. రాజ్యలక్ష్మి (సామాజిక కార్యకర్త) పాల్గొన్నారు. కాకరాపల్లిలోని వడ్డెతాండ్ర గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్థులు చెప్పిన కథనం ప్రకారం ”జగన్నాథ సెషన్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ” అధ్యక్షుడు కారుణ్య కత్రో మాట్లాడుతూ – 1948లో ఈ సొసైటీ రిజిష్టర్ అయిందని వడ్డెతాండ్రలోని మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి 99 సంవత్సరాలు ఈ మత్స్యకార సహకార సంఘానికి లీజుకి ఇవ్వటం జరిగిందని, వడ్డెతాండ్రలోను, సమీప గ్రామాలలోని సుమారు 2000 మత్స్యకారుల కుటుంబాలవారు చేపలవేటతో తమ జీవనం కొనసాగిస్తున్నారని అయితే సహకార సంఘానికి ఇచ్చిన ఆ లీజును 2009లో రద్దు చేయటం జరిగిందని చెప్పారు.
ఎక్కడయితే ప్రాజెక్టులకు వ్యతిరేకంగానో, లేదా ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించిన వారిన ప్రభుత్వం అణచివేస్తూనే ఉంటుంది. కాకరాపల్లిలో ప్లాంటు నిర్మాణం జరుగుతుందని తెలిసిన ప్రజలు ప్లాంటు నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ వడ్డెతాండ్రలోని ప్రజలు, పరిసర గ్రామస్తులు శాంతియుతంగా శిబిరాలలో నిరాహారదీక్షలు చేస్తున్నవారి గురించి దాడికి రెండు రోజులు (ఫిబ్రవరి 22) ముందుగానే ఈస్త్రఆ, ఐ| ఆయా ప్రాంతాలను సందర్శించటం జరిగింది. ఆ వెంటనే పోలీసు బలగాలను మోహరించి ప్రజలలో భయానక వాతావరణాన్ని కల్పించారు. అయినా ప్రజలు పట్టుదలతోను, ధైర్యంతోను కొనసాగిస్తున్న వారిపై పోలీసులు ఫిబ్రవరి 25వ తేదీన మూకుమ్మడిగా వచ్చి శిబిరాన్ని ధ్వంసం చేసి దొరికినవారిని దొరికినట్లుగా అరెస్టు చేసి భయంతో చెల్లాచెదురయిన ప్రజలను వెంబడించి ఇళ్ళలోకి దూరిన వారి ఇళ్ళపై పొగబాంబులు వేసి, మత్స్యకార సహకార సంఘ అధ్యక్షుడిని అరెస్టు చేసి ఆయన భార్య నాగుల దమయంతిని జుట్టు పట్టి లాగి ”ఏమే! లక్షలిస్తానంటే వళ్ళు కొవ్వెక్కిందా” అంటూ నానా దుర్భాషలాడారు. 15 వరికుప్పలు తగులబెట్టగా 10,000 రూ. ఆస్తినష్టం జరిగిందని 25 ఇళ్ళను తగులబెట్టారు. అడ్డుకున్న మాజీ జెడ్.పి.టి.సి. దువ్వాడ గ్రామము, మత్స్యకార సంఘ అధ్యక్షుడు కారుణ్య కత్రోను అరెస్టు చేశారు. మొత్తం 180 మందిని అరెస్టు చేయగా 120 మంది ఆచూకీ తెలియలేదు. ముఖ్యంగా వడ్డెతాండ్ర ప్రజలనే దాడిచేయటానికి కారణం వారు పోరాటాలలో ముందుండటమే కారణంగా తెలుస్తోంది.
దాడి జరిగిన తర్వాత పోలీసులు వివిధ ప్రాంతాలలో ప్రజల యొక్క స్పందన, కదలికలు విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనటానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఫిబ్రవరి 26వ తేదీ భయంతో ప్రజలు బయటకు రాకపోయినప్పటికి, 27వ తేదీ సమావేశమయి శిబిరాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 28వ తేదీ ఆకాశ లక్కవరం గ్రామస్థులు ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తూ రోడ్లపైకి రాగా చుట్టుముట్టిన పోలీసు బలగాలు 144వ సెక్షన్ అమలులో ఉంటే ఎలా వస్తారు! అంటూ లాఠీఛార్జీ చేసినా ప్రజలు ధైర్యంగా ఉండటంతో రెచ్చిపోయిన పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించటంతో పాటు కాకరాపల్లి ఐ| అతిదగ్గరగా (దాదాపు వంద గజాల దూరం) కాల్పులు జరపటంతో జీరు నాగేశ్వరరావు, సీరపు ఎఱ్ఱయ్యలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఆకాశ లక్కవరం గ్రామంలో ప్రాణాలు కోల్పోయిన జీరు నాగేశ్వరరావు, సీరపు ఎఱ్ఱయ్యల భార్యలు, ఇతర గ్రామస్థులను కలిసి ”ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకున్నారా! అని ప్రశ్నించగా మాకు నష్టపరిహారం అవసరం లేదు. మాకు థర్మల్ పవర్‌ప్లాంటు నిర్మాణాన్ని తక్షణమే ఆపాలి అదే ”మా డిమాండ్. అదే మా కోరిక” అంటూ ముక్తకంఠంతో చెప్పటం చూస్తుంటే సమస్యపట్ల వారికున్న నిబద్ధత అర్థం అవుతుంది.
అరెస్టయిన వారిని శ్రీకాకుళం, నర్సన్నపేట, ఇలా వివిధ జైళ్ళలో నిర్బంధించి ఉంటారు. నర్సన్నపేటలోని బాధితులను పరామర్శించినప్పుడు దువ్వాడ శ్రీనివాసుతోపాటు 32 మందిని అరెస్టు చేశారని అందులో 80 ఏళ్ళ అనంత దమయంతి అనే వృద్ధురాలిని కూడా అరెస్టు చేయటమనేది పోలీసుల క్రూరత్వానికి నిదర్శనం. ఉద్యమంతో ఎలాంటి సంబంధము లేకుండా కేవలం రోడ్లపై ఉన్నవారిని అరెస్టు చేశారని బాధితులు వాపోయారు. గాయాల పాలయిన బాధితులను శ్రీకాకుళం, విశాఖపట్టణంలోని చస్త్రక, సెవెన్‌హిల్ (కార్పొరేట్ హాస్పిటల్) జేర్చగా వారికి సరియైన వైద్యసదుపాయం అందటం లేదు. కనీసం కార్పొరేట్ హాస్పిటల్‌లో సైతం వైద్యం అందకపోవటమనేది ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలపట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. చస్త్రకలో ఉన్న గణపతిరెడ్డి అనే మరో బాధితుడు పక్కటెముకలు విరిగి సరియైన వైద్యం సహాయం కోసం అర్రులు చాచే పరిస్థితి.
కేంద్రమంత్రి ‘జైరాం రమేష్’ ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంటు నిర్మాణానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పటం, ఆ మర్నాడే ఈస్ట్ కోస్ట్ కంపెనీ అన్ని అనుమతులు పొందామని ఒక దినపత్రికలో ప్రకటనలు ఇవ్వటం చూస్తుంటే, ప్రభుత్వాలు, కంపెనీ తోడుదొంగల్లాగా వ్యవహరించే పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం యొక్క ఉదాసీనత చూస్తుంటే కంపెనీలో అధికార, ప్రతిపక్ష పార్టీల భాగస్వామ్యం చెప్పకనే తేటతెల్లమవుతోంది.
అందువల్లనే 23.4.2008 నాడు ప్రాజెక్టు నిర్మాణం గురించి ప్రజాభిప్రాయ సేకరణ, అదీ పోలీసు స్టేషన్‌లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరగటం అనేది నిజంగా మొక్కుబడి వ్యవహారమే. ఇందులో ప్రజల అభిప్రాయాలకు, అవసరాలకు విలువనీయకుండా కేవలం రాజకీయ నాయకుల ప్రయోజనాలే లక్ష్యంగా చేశారనడానికి మాజీ ఎం.పి. ఎఱ్ఱంనాయుడు ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ వ్రాయటమే ఇందుకు నిదర్శనం.
థర్మల్ పవర్ ప్లాంటు వారు నిబంధనలను అతిక్రమించిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం భారతదేశ ప్రభుత్వంవారు దేశంలోని చిత్తడినేలలను గుర్తించి అందులో ఏ రకమైన నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసినప్పటికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వటం జరిగింది. ఈ చిత్తడి నేలలను నిరుపయోగమైన (ఖిజీగి జిబిదీఖి) భూమిగా ప్రకటించి ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైనదిగా చూపించి ఆనాటి శ్రీకాకుళం జిల్లా కలెక్టరు పర్యావరణ పరిరక్షణకు తీరని అన్యాయం చేశాడు. తీరప్రాంత నియంత్రణా మండలి నిబంధనల ప్రకారం తీరప్రాంతాలలో ఉన్న ఉప్పునీటి కయ్యలు, కాలువలు, జలాశయాలు పర్యావరణ పరిరక్షణకు ఆయా ప్రాంతాలనుండి 100 మీటర్ల వరకు రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. అంతేగాకుండా భావనపాడు చిత్తడినేలల వద్దకు సైబీరియా నుండి ప్రతి సంవత్సరము వేలాది పక్షులు వలస వస్తూ ఉంటాయి. అందువల్ల చిత్తడినేలలలోని తేలినీలాపుర గ్రామాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. అందమైన ఈ వలసపక్షుల ప్రాంతాన్ని, పక్షులు రాకుండా అడ్డుకోవటానికి ప్రాజెక్టువారు కుక్కలను ఉసికొల్పటం, తుపాకులతో కాల్చటమనేది చేస్తున్నారంటే ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అవుతుంది.
ఈ చిత్తడినేలలలోనికి ఏనుగులగడ్డ, గరీబులగెడ్డ, దేశీగడ్డ, భీంపురంగడ్డ, వంశధార మొదలైన వాగుల నుండి ప్రవహించే ఈ నీరు భావనాపాడు వద్ద సముద్రంలో కలుస్తాయని, అయితే ప్రాజెక్టువారు తమ స్వాధీనంలో ఉన్న పొలంచుట్టూ అడ్డుకట్ట వేయటంవల్ల ఆ నీరు వేలాది ఎకరాలను ముంచెత్తి పంట పొలాలు మునిగిపోయి రైతులు దారుణంగా దెబ్బతింటున్నారని గ్రామస్తులు వాపోయారు.
ఈ విధంగా అన్ని రకాల నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రాజెక్టుకు అనుమతులిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలు పట్టించుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ప్రజలు ఎన్నటికి క్షమించరని, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూనే ఉంటామని ప్రజలు ఎలుగెత్తి చాటుతున్నారు. ఆ విషయాన్ని సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలు నిరూపిస్తున్నాయి.
– ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags