జె.సుభద్ర
10 మార్చి 2011న జరిగిన ‘మిలియన్ మార్చ్’లో టాంక్‌బండ్ మీదున్న కొన్ని బొమ్మల్ని బోర్లేసిండ్రు. కూలిన బొమ్మలన్నీ సీమాంధ్ర పాలక కులాల మగవాళ్ల బొమ్మలే. టాంకుబండ్ కిందకు నెట్టబడిన కట్టమైసమ్మ బరువు దించుకున్న సంబురమున యీరోజు తలార తానమాడి మస్తుగ పండుగ జేసుకొనుంటది. నిజానికి టాంక్‌బండ్ మీదున్నది సీమాంధ్ర పాలక కులాల దొరల బొమ్మలే ఎక్కువున్నయి.
సీమాంధ్ర ఆడవాల్లు, దళితులు, బీసీలు, ఆదివాసీలు, మైనారిటీలు ఏం ఫికరు పెట్టుకోవాల్సిన పనిలేదు. మొల్ల, పోతులూరి వీరబ్రహ్మం, జాషువా బొమ్మలకు ప్రాంతీయతల్ని మించిన సామాజిక చైతన్యాల్నే కనబరిచారు తెలంగాణ ఉద్యమకారులు. కేవలం ప్రాంతీయ చైతన్యాలే కాక ప్రాంతాల్ని అధిగమించిన సామాజిక ప్రాపంచిక దృక్పథాల్ని వెల్లడించినట్లుగా మిగిలిన ఆ విగ్రహాలే భాషిస్తున్నయి. ఇది ఓణికావేశంతోనో, ఉద్వేగంతోనో, ఉద్రేకంతోనో జరిగిన తొలగింపు కాదు. అనేక ఏండ్లనుంచి తెలంగాణ భూముల మీద, బువ్వ మీద, నీళ్ల మీద, భృతి మీద, భాష, యాస, ఆటపాట మీద, సాహిత్యాల మీద, రాజకీయాల మీద, ఆత్మగౌరవాల మీద కొనసాగుతున్న సీమాంధ్ర దొరల పెత్తనాలపై చేసిన ఒక సాంస్కృతిక ధిక్కార ప్రకటన. గాయపడ్డ గాయాల వ్యక్తీకరణ.
మార్చ్10 ‘మిలియన్ మార్చ్’ ని తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ నమునకు నాంది పలికిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోవాల్సిన దినం.
వాస్తవానికి బొమ్మలు బెట్టుడు, వాటిని ఆరాధన చేయడం, తెలంగాణ సంస్కృతిలో లేదు. తెలంగాణ సంస్కృతి కాదు. విగ్రహారాధన తెలంగాణలో లేదు. విగ్రహారాధన అనేది సీమాంధ్రనుంచి దిగుమతైన సంస్కృతి. జాతీయోద్యమకాలంలో విగ్రహారాధన మీద పెద్దఎత్తున సంస్కరణోద్యమాలు జరిగినట్లుగా చరిత్రలు మొత్తుకుంటున్నయి. తెలంగాణలో విగ్రహాల జాఢ్యాలు లేనందువల్ల అవి యిక్కడకి రాలేదు. తెలంగాణలో ప్రకృతిలో వున్నవన్నీ శక్తులేననే నమ్మకాలు, వారి పూర్వీకుల శక్తులు, గొప్పతనాల్నే తలుచుకొని అలసటలు, ఉప్పసలు తీర్చుకొని ప్రభావితులయ్యేవారు. యిక్కడ రాయి, రప్ప, చెట్టు, పుట్ట, చెరువులు. వీటికి విగ్రహమూర్తులుండవు. అయితే గియితే వుంటే మట్టి గద్దెలుంటయేమో! జాతర్లల్ల కూడా వారి పేర్లకు గద్దెలే ప్రతీకలు. బాగా ప్రసిద్ధిపొందిన సమ్మక్క, సారక్కలక్కూడా వారి మూర్తులు లేవు. సమ్మక్క గద్దె, సారక్క గద్దె అనేవి కూడా చిన్న చిన్న మట్టి గద్దెలే. యీ మధ్య యీ జాతర్లలోకి బ్రాహ్మణ మతం జొరబడి ధూపదీపనైవేద్యాలు పెట్టి కాళి, దుర్గామాత చిత్రపటాల్ని భ్రష్టుపట్టించింది. సమ్మక్క సారక్కలకు విగ్రహాలు రూపొందించే ప్రయత్నం చేస్తూంది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా. అట్లా తెలంగాణ సంస్కృతిలో, చరిత్రలో భాగంకాని విగ్రహసంస్కృతినే కాక తెలంగాణ భాషా సాహిత్యాలకు కళలకు సంబంధం లేని సీమాంధ్ర పాలక కులాల మగవాళ్లని తెచ్చి మహాపురుషులుగా బలవంతంగా ప్రతిష్టించడం అన్యాయం. ‘ఒకూరికి రాజైతే యింకో వూరికి బంటు’ అనే సామెత మర్చిపోతే ఎట్లా. వాళ్ల ప్రాంతాల వరకు వాల్లు గొప్పోల్లే కావొచ్చు. కాని తెలంగాణ నెత్తుల మీద భుజాల మీద మోపితే పడగొట్టడాలే జరుగుతయి.
పొట్టి శ్రీరాములు మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రంకోసం ప్రాణాలొదిలిండు. కాని దాన్ని మసిబూసి తెలుగువాల్లందరికి రాష్ట్రం కోరి అమరుడైనాడని తెలంగాణ మీదికి తెచ్చి ఉత్సవాలు చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు ఒక్కడే కాదు, సీమాంధ్ర పాలక కులాల బొమ్మలు పెట్టడం ఆ పేరుతో తెలంగాణ భూములని పార్కులుగా, సమాధులకు కేటాయించడం, తెలంగాణ బిడ్డలు అదీ దేశానికి ప్రధానమంత్రిగా చేసిన పీవీ నర్సింహారావు అంతటివాడికి కూడా యిక్కడ ఒక్క బొమ్మ గానీ, సమాధిస్థలం గానీ లేకపోవడం వలస వివక్షలే. తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు, సాహితీవేత్తలు, సామాజికవేత్తలు, రాజకీయనాయకులైన సిందు ఎల్లమ్మ, డక్కలి బాలయ్య, చాకలి ఐలమ్మ, కొమురం భీమ్, దైవ వేములపల్లి దేవేందర్, దున్న ఈద్దాసు, టి.ఎన్. సదాలక్ష్మిలు ఎక్కడ కనిపించకపోడానికి కారణాలేంటి?
పడగొట్టబడిన విగ్రహమూర్తుల సామాజిక దృక్పథాల్ని, చారిత్రక అంశాల్ని పరిశీలించినపుడు ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షల్ని బలపర్చినట్లుగా, కుల జెండర్ చైతన్యాల్ని కనబర్చినట్లుగా దాఖలాలు లేవు. అణగారిన సామాజిక కులాలకు, మహిళలకు వీరు చేసిన మేలు కంటే కీడే ఎక్కువగా కనిపిస్తుంది. కన్నడ పాలకుడైన శ్రీకృష్ణదేవరాయల్ని తెలుగుభాషకు, జాతికి ప్రతీకగా ప్రాణం పోశారు. కాని వందల ఏండ్లు పాలన చేసి తెలుగుభాషాసంస్కృత్ని, కళల్ని పోషించిన తెలుగువాళ్లైన కాకతీయ పాలకులు తెలుగుభాషకు, జాతికి ప్రతీకలుగా ఎందుకు కాలేకపోయారు? ఆశ్చర్యమేంటంటే సీమాంధ్రులే కాదు తెలంగాణవాల్లు కూడా కాకతీయుల్ని పక్కనబెట్టి శ్రీకృష్ణదేవరాయల ‘ఆంధ్రభాషానిలయం’ అని హైద్రాబాద్ నడిబొడ్డున నిలపాల్సిన ప్రభావాలు ఏంటియో తెలియాల్సింది. కాకతీయులు శూద్రకులాల్లో శూద్రులు. అందుకే ప్రాంతంకన్నా కులాలే కారణమైయుండొచ్చు.
ఇక కందుకూరి వీరేశలింగం పంతుల్ని గూర్చి సాహిత్యచరిత్రలు సాహిత్య ప్రక్రియలన్నింటికి ఆద్యుడిగా చూపినయి. సామాజిక చరిత్ర గొప్ప సంఘ సంస్కర్తగా చప్పట్లు కొట్టినయి. కాని వీరేశలింగం పంతులు దేవదాసీ స్త్రీల పట్ల వారి సాహిత్యం పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించినాడో, దాడులు చేశాడో బెంగుళూరు నాగరత్నం లాంటి వాల్లు చెప్తారు. వీరేశలింగం తెలుగుకవుల జీవితచరిత్రలో తెలంగాణ కవులుండరు. యీ చరిత్రలో ముద్దుపళని ‘రాధికా సాంత్వనం’ అసభ్యకరంగా వుందని అది వేశ్య అనీ, దానికి దీనికి అని చాలా అవమానకరంగా సంభోదిస్తూ రాయడం జరిగింది. ఆడవాళ్ల దురాచారాల్ని సంస్కరించాడని చెప్పుకునే రాసుకునే రాతలు అబద్దాలే అయినవి. సాటి సాహిత్యకారిణి పట్ల యింత అమానుషంగా, నీచంగా చూసిన వీరేశలింగం సంస్కర్తగా కీర్తించడం దురదృష్టకరము. యితని కుసంస్కారాన్ని, పితృస్వామ్యాన్ని నిలదీస్తూ ‘రాధికా సాంత్వనం’ కావ్యానికి ముందుమాట రాసి ప్రచురించిన దేవదాసీ బెంగుళూరు నాగరత్నంని తన అధికారాన్ని, ఆధిపత్యాన్నంత ఉపయోగించి ఆమె మీద క్రిమినల్ కేసులు పెట్టించాడు, పోలీసుదాడులు చేయించి ఆ కావ్యాన్ని నిషేధించాడు. యిలాంటి సాంఘిక చరిత్రలున్నవాల్లు యివ్వాళగాకున్నా రేపైనా కొట్కపోవాల్సినోల్లే. టాంక్‌బండ్ మీద ‘మిలియన్ మార్చ్’లో కనిపించిన సీమాంధ్ర విగ్రహాలనన్నింటిని తొలగించకుండా సామాజిక న్యాయాల్ని కనబరిచిన తెలంగాణ బిడ్డలకి జై.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధ సంచికలో మీరు పేర్కొన్న నాగరత్నం గారి గురించీ, వీరేశలింగం ప్రేరేపిత దౌర్జన్యాలగురించీ, వాటి దీర్ఘకాల పర్యవసానాల గురించీ చ”క్కగా వివరించారు.
మంచి వ్యాసం!!
సుభద్ర వ్రాసారు
>>>>>
వీరేశలింగం తెలుగుకవుల జీవితచరిత్రలో తెలంగాణ కవులుండరు.
>>>>>
వీరేశలింగం గారి కాలంలో తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉండేవా? ప్రాంతీయ ఉద్యమాలు లేని రోజుల్లో కవుల పట్ల ప్రాంతీయ వివక్ష ఉండడం ఎలా సాధ్యం?
నేను ప్రత్యేక తెలంగాణాకి అనుకూలమే కానీ చరిత్ర గురించి ఇంత పచ్చిగా అబద్దాలు వ్రాయడాన్ని జస్టిఫై చెయ్యలేను. సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహాన్ని కూడా కూల్చేశారు. ప్రతాపరెడ్డి గారు ఏ రకంగానూ సమైక్యవాది కాదు. ఆయన తెలంగాణాలో పుట్టిన మనిషే. నిజాం రాష్ట్రంలో కేవలం 10% మంది మాట్లాడిన ఉర్దూ భాషని అధికార భాషగా చేశారు. తెలుగు భాషని కూడా ఉర్దూ అక్షరాలలోనే వ్రాసేవాళ్లు. సురవరం ప్రతాపరెడ్డి గారు కర్నూలు జిల్లాలో తెలుగు చదవడం, వ్రాయడం నేర్చుకుని స్వంత జిల్లా అయిన పాలమూరుకి తిరిగి వచ్చారు. నిజాం రాష్ట్రంలో తెలుగు వ్యాప్తికి కృషి చేశారు. నిజాం నవాబులని వ్యతిరేకించిన ప్రతాపరెడ్డి గారు సమైక్యవాది ఎలా అవుతారు?
సుభద్ర గారు రాసిన వూటల్లో తెలుగు కవుల జీవిత చరిత్రలో తెలంగాణా కవుల ప్రస్తావన లేదన్నారు కానీ, ఆయునకు అభివూన కవుల్లో తెలంగాణా కవులు లేరని అనలేదు. తెలంగాణ కవులపై అభివూనం ఉండి ఉంటే వీరేశలింగం గారు ఎందుకు వారిని తన గ్రంధంలో ప్రస్తావించలేదు అన్నది ఆమె ప్రశ్న. ప్రవీణ్ గారి వాదం ప్రకారం కందుకూరి వీరేశలింగం గారి సవుయుంలో తెలంగాణ సమైక్య వాదాలు లేకపోవచ్చు ప్రాంతీయు ఉద్యవూలు లేకపోవచ్చు. అలాంటప్పుడు కవులకు వివక్ష ఆపాదించటవుూ తప్పే..కాకపోతే, వీరేశలింగం గారు‘ తెలుగు కవుల జీవిత చరిత్ర’ అని రాసినప్పుడు తెలుగు కవులు అంటే ఎక్కడి వారని భావించారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. అప్పటికి తెలంగాణలో తెలుగు కవులు లేరని ఆయున భావించారా? తెలంగాణ తెలుగువారి ప్రాంతం కాదని భావించారా? ఆయునకు ప్రాంతీయు వివక్ష లేకపోతే తెలంగాణలో ఆయునకు తెలుగు కవులే కనిపించలేదా? ఎందుకు ఆయున ప్రస్తావించలేదు.. నిజానికి ఆనాటికే అప్పటికే ఆంధ్ర తెలంగాణ వుధ్య సఖ్యత లేదన్నది గుర్తుంచుకోవాలి. ఈ రెండు ప్రాంతాలు కలిసి లేవు. నిజాం పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని వీరేశలింగం గారు పరిగణలోకి తీసుకోలేదు.. పూర్తిగా ఉపేక్షించారు…అప్పటికే తెలంగాణాకు సంబంధించిన సాంస్కృతిక విధ్వంస ప్రక్రియు ఒక పథకం ప్రకారం ప్రారంభమైంది. 1890ల నాటికే పురాణం హయుగ్రీవ శాస్ర్తి బమ్మెర పోతనను కడప జిల్లా ఒంటిమిట్టవాడన్న వివాదాన్ని రేపారు. ఏకశిలా నగరం అంటే ఒంటిమిట్టేనని వాదించారు.. కందుకూరి వారి తెలుగు కవుల జీవిత చరిత్ర తొలి ఎడిషన్‌లో సైతం పోతనను కడప జిల్లా ఒంటిమిట్టవాడన్నట్లుగానే పేర్కొన్నారు.. ఆ కారణంగానే ఆయున పేరు అందులో చోటు చేసుకుంది. ఎందుకంటే భాగవతం రాసిన వారు ఇంకొకరు లేరు కాబట్టి.. ఆయున్ని ఓన్ చేసుకునే వుహా ప్రయుత్నం జరిగింది. ఈ విషయుం సుభద్రగారు గవునించి ఉండరు. ఇదే గ్రంథం రెండవ ఎడిషన్ 1917 ఆ ప్రాంతంలో అంటే కందుకూరి వారు అస్తమించటానికి ఒకటి రెండు సంవత్సరాలకు వుుందు ప్రచురణ అరుుంది.. వాస్తవానికి పోతనపై వివాదం 1910 నాటికే సవుసిపోరుుంది.. దాంతో రెండో ఎడిషన్‌లో ఆయున పోతనను వరంగల్లు వాడిగా అంగీకరించారు. ఇది నిజం.. రికార్డులో ఉన్న వాస్తవం.
కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని విషయూలు చాలా కాలంగా వురుగునపడుతూ వస్తున్నారుు. నిజాన్ని అంగీకరించటం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే అరుునా కొన్నింటిని ప్రస్తావించక తప్పదు. గురజాడను ఆధారం చేసుకుని తెలుగు సాహిత్య యుుగం విభజన జరిగింది. ఎవరికీ ఆక్షేపణ ఉండాల్సిన అవసరం లేదు. ఆంగిలేయుుల ధర్మరాజ్యం వర్ధిల్లాలని కోరుకున్న తొలి తెలుగు సాహిత్యకారుడాయున. తన విజయునగరం రాజుల కోసం ఆయున అప్పుడే ఊపందుకుంటున్న జాతీయోద్యవుం చాయులకు కూడా వెళ్ల దలచుకోలేదు. కాగా, బ్రిటిష్ వారికోసం విజయునగరం సైన్యాన్ని సహాయుంగా పంపించేందుకు అంగీకరిస్తూ లేఖ కూడా రాశాడు.. ఇదీ వాస్తవం.. ఈయున్ను వునం తెలుగు వైతాళికుడుగా కీర్తిస్తున్నాం.. ఎందుకంటే ఆయున కవిత్వం ప్రధానం అని అనుకుంటున్నాం కాబట్టి.
శ్రీరంగం శ్రీనివాసరావు గారు నిస్సందేహంగా యుుగానికి ఒక్కడు.. వుహాపురుషుడు. తెలుగు సాహిత్య చరిత్రాన విప్లవ ఉద్యవు కారుడు..తెలంగాణాలో రైతాంగ సాయుుధ పోరాటం జరుగుతున్న సవుయుంలో శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు నిజాం కొలువులో ఉద్యోగం చేస్తున్నారు. వారు ఆ సవుయుంలో రైతాంగ సాయుుధ పోరాటాన్ని ఏ విధంగానూ సవుర్థించలేకపోయూరు.. తెలుగునాట విప్లవానికి ఊపిరులూదిన వుహాకవికి ఆనాడు ఆ ఉద్యోగం చాలా కీలకమైంది. చైనా భారత్‌పై యుుద్ధం చేస్తున్న సవుయుంలో చైనా జెండా ఎర్రకోటపై ఎగిరి తీరాలని రాసిన కవుల్లో శ్రీశ్రీ కూడా ఒకరు. ఇది దేశభక్తి అంటే ఒప్పుకోవలసిందే..
ఇక ఆరుద్ర గారు వేదంలా ఘోషించే గోదావరి అన్న పాటలో , కాకతీయుుల్ని రాజవుండ్రికి తీసుకువెళ్లి వాళ్లకు గుత్తకిచ్చేశారు.
వేవుుల వాడ భీవుకవిని ద్రాక్షారావూనికి చెందిన వాడంటూ వురో కథను సృష్టించారు. పాల్కురికి సోవునాథుడు కర్ణాటకలో ఎక్కడో హాల్కురికి అనే ఊరుందని, అక్కడి నుంచి వచ్చినవాడన్నారు.. వుల్లినాథసూరిని, అప్పకవిని.. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఓ పాటో, ఓ పద్యమో, ఓ కథో, ఓ కవితో , ఓ విప్లవమో ఏదైనా ఒక సృష్టి జరిగితే, దాన్ని సృష్టించిన వాడు తెలంగాణా ప్రాంతం వాడు కాదని నిరూపించేందుకు విపరీతమైన ప్రయుత్నాలు జరుగుతూ వచ్చారుు. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు తీవ్రస్థారుులో ప్రతిఘటించాల్సి వచ్చింది. వుల్లినాథసూరి మెదక్ జిల్లా కొలిచెలివు ప్రాంతానికి చెందిన వాడు. కాకునూరి అప్పకవి వుహబూబ్ నగర్ వాసి. ఇక్కడి మేధావులు గట్టిగా తిప్పికొట్టారు కాబట్టి ఈ జాతి సృజన జీవనం ఈకాస్తరుునా మిగిలింది. వాళ్ల ప్రాంతం వాళ్లరుుతే వాళ్లలో ప్రతిభ ఉన్నా లేకపోరుునా నెత్తిన పెట్టుకుని వురీ వాళ్లకోసం వూర్కెటింగ్ చేశారు. ఒక్క విజయునగరం ప్రాంతానికి సంబంధించిన వూండలికంలో కన్యాశుల్కం నాటకం రాసినందుకు గురజాడను వైతాళికుడని కీర్తించారు.. కానీ అదే సవుయుంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాకతీయు ప్రతాపరుద్రుని కథాంశంతో, పాత్రోచిత వ్యవహార భాషలో ప్రతాపరుద్రీయుం నాటకం వస్తే.. అది ఈ ప్రాంతానిది చెందింది కాబట్టి ‘ఇగ్నోర్’ చేసి వదిలేశారు.
తెలుగు సాహిత్యంలో నూతన ప్రక్రియు ఆవిష్కారంలో తెలంగాణాదే ప్రథవు స్థానం. ద్విపద కావ్యం, శతకం, ఉదాహరణం, దేశి పురాణం, యుక్షగానం, అచ్చ తెనుగు కావ్యం, చిత్రకవిత్వం, ప్రహరి కావ్యం.. ఇలా ఒక్కటేమిటి చాలా ప్రక్రియులు ఇక్కడే పుట్టారుు. రావూయుణం(భాస్కర రావూయుణం) తెలుగులో ఇక్కడే వెలువడింది. తొలి పురాణ అనువాదం (వూర్కండేయు పురాణం) ఇక్కడే జరిగింది. తెలుగుగడ్డపై తొలి సారి అక్షరాలను కూర్చిన గుణాఢ్యుడు బృహత్కథను రాసింది మెదక్ జిల్లా కొండాపూర్‌లో.. రావూయుణం తొలి అనువాదం భాస్కర రావూయుణం తెలంగాణాలో పుట్టింది. తొలి పురాణ అనువాదం వూర్కండేయు పురాణం తెలంగాణా ప్రాంతంలోనే పుట్టింది. ఇక భాగవతం సంగతి సరేసరి.. బమ్మెర పోతన భాగవతం తెలుగు సాహిత్యంలో అజరావురమైన ఇతిహాసం. యుక్షగానాలు వునదగ్గరే పుట్టారుు. శతకం తెలంగాణాలోనే పుట్టింది. బొవ్ముల్లో పద్యాలు రాయుటం వంటి గొప్ప ప్రక్రియు తెలంగాణ సొంతం. వీటన్నింటికీ ఆంధ్ర ప్రాంతంలో కొనసాగింపులే జరిగారుు. గురజాడ కథపై వివాదం రేగింది. కందుకూరి నవలపైనా వివాదం రేగింది. చివరకు కూచిపూడి నృత్యాన్ని తమిళులు రేపిన వివాదం నుంచి రక్షించుకోవటానికి నానా అవస్థ పడాల్సి వచ్చింది. అదే సవుయుంలో జాయుప సేనాని రచించిన నృత్తరత్నావళిని పట్టించుకున్న దిక్కే లేదు.. ఇప్పుడు ఆయున్ను తవు కులం వాడంటూ కాకతీయుులు తవు కులం వాడంటూ ఓన్ చేసుకనే ప్రయుత్నం దిగ్విజయుంగా జరుగుతోంది.
ఆర్టికల బావుంది
……
చైనా భారత్‌పై యుుద్ధం చేస్తున్న సవుయుంలో చైనా జెండా ఎర్రకోటపై ఎగిరి తీరాలని రాసిన కవుల్లో శ్రీశ్రీ కూడా ఒకరు.
/\/\/\/\/\/\/\/\/\/\/\
ఏమి మూర్ఖత్వము
వీరేశలింగం గారి కాలంలో సర్కార్, నైజాం, సీడెడ్ అనే రిఫరెన్సెస్ ఉండేవి. కోస్తా, తెలంగాణా, రాయలసీమ అనే రిఫరెన్సెస్ లేవు. నిజాం రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలు నడపడం, తెలుగు మీడియం పాఠశాలలు నడపకపోవడం వల్ల నైజాం ప్రాంతంలో తెలుగు సాహిత్యం అంతగా వృద్ధి చెందలేదు. పోతనామాత్యుడు లాంటి ప్రాచీన కవులు కాకుండా బ్రిటిష్ వాళ్ల టైమ్‌లో నైజాం ప్రాంతం నుంచి వచ్చిన కవుల సంఖ్య తక్కువే. వీరేశలింగం గారు సర్కార్ ప్రాంతంలో పుట్టారు. నిజమే కానీ సర్కార్ జిల్లాలంటే ఏమిటో తెలుసా? 1765లోఅ బ్రిటిష్ వాళ్లు నిజాం నవాబుల నుంచి స్వాధీనం చేసుకున్న శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి జిల్లాలు. 1794లో బ్రిటిష్ వాళ్లు శ్రీకాకుళం, రాజమండ్రి జిల్లాలని రద్దు చేసి గంజాం, విశాఖపట్నం జిల్లాలని ఏర్పాటు చేశారు. ఏలూరు, కొండపల్లి జిల్లాలని రద్దు చేసి మచిలీపట్నం జిల్లాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్న కోస్తా ఆంధ్రలో నెల్లూరు జిల్లా కూడా ఉంది. అది సర్కార్ ప్రాంతానికి ఏ రకంగానూ చెందినది కాదు. అది బ్రిటిష్‌వాళ్లు ఆర్కాట్ నవాబుల నుంచి స్వాదీనం చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ల టైమ్లో కోస్తా ఆంధ్ర అనే రిఫరెన్సే లేనప్పుడు వీరేశలింగం గారు కోస్తావాది అనడం ఒక జోక్. ఒంటిమిట్ట ఉన్న కడప జిల్ల సీడెడ్ ప్రాంతానికి చెందినది. బ్రిటిష్ వాళ్లు రాయలసీమ జిల్లాని నిజాం నవాబుల నుంచి స్వాధీనం చేసుకుని దాన్ని కడప & బళ్లారి జిల్లాలుగా విభజించారు. ఒకవేళ వీరేశలింగం గారు సర్కార్ ప్రాంత దురభిమాని అయితే సీడెడ్ ప్రాంతమైన కడప మీద అభిమానం చూపాల్సిన అవసరం అతనికి ఉండదు.
సంఘ సంస్కర్తలని దూషించడాన్ని “మేధావితనం” అనరు, “మేతావితనం” అంటారు.
సుభద్ర గారు మీరు మీ తెలంగాణ యాసను కేవలమ మొదటి మూడు వాక్యాలకే పరిమితమ్ ఎందుకు చేశారు? మీకు తెలంగాఅణ యాస మీద గౌరవం లేదా? నన్నయ, ఎర్రా ప్రగడ తెలంగాణ కు వ్యతిరేకమని ఎన్నడు చెప్పారు? ఎందుకండీ విషం చిమ్ముతారు?
సంతోష్ గారు, బ్రిటీష్ పాలన కోరుకున్న గురజాడ గారి గురించి రాశారు మరి నిజామ నిక్రుష్ట పాలనని నెత్తికెత్తుకుంటున్న కె సి ఆర్ గారి గురించి రాయలేదు ఎందుకు? ఒక్కసారి కందిమళ్ల ప్రతాప రెడ్డి గారు రాసిన బందూక్ చదవండి,
సుభద్రక్కా, మీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజము. నాకు ఒకటె రంది: తెగులు తల్లిని వదిలెసినము. గది గూడ ఖతం చెయనుంతటిమి.