– జి. విజయలక్ష్మి
కుక్క గొడుగు కింద కూర్చొని చకవ్రర్తులమనుకుంటే
కుమ్మరి చక్రం చూసి భూ చకమ్రనుకుంటే ఎలా?
యుద్ధం వేరు జీవితం వేరు కాదు
జీవితం యుద్ధం చేయడానికి
యుద్ధం జీవించటానికి
మౌనం మాటలు రాక కాదు
గాంభీర్యాన్ని నింపుకోటానికి
చేపలు పట్టే వల ఆయుధం
కల్లు గీసే కత్తి ఆయుధం
కుండలు చేసే చకమ్రాయుధం
క్షవరం చేసే కత్తెర ఆయుధం
శిల్పాన్ని చెక్కే ఉలి ఆయుధం
బట్టలు బాదే బండ ఆయుధం
బంజరు నరికిన కొడవలాయుధం
చేనుని దున్నే నాగలాయుధం
చెప్పులు కుట్టే సూది ఆయుధం
చితాన్న్రి గీసే కుంచె ఆయుధం
అన్ని యుద్ధాలు స్వేచ్ఛ కోసమే
మనవృత్తులు మాయమౌతున్నాయి
అందరు నిరంతరం సాయుధులే
శతువ్రుల గుండెల్లో నిదబ్రోతున్నవాళ్లే
మన సంపదలు జారిపోతున్నాయి
మన వెనక కుటల్రు జరుగుతున్నాయి
అడుగు వేస్తే ఆంక్ష ఆకలంటే శిక్ష
మేధస్సును సాయుధం చేయండి
మేడిపండును విప్పి చూడండి
కనురెప్పలకు పదును పెట్టండి
కాళ్లకి కత్తులు కట్టుకోండి
కాలరుదుల్రు కండి
దోపిడి రాజ్యాన్ని డొక్కలో తన్నండి.