– పాతూరి అన్నపూర్ణ
గృహ హింసకు వ్యతిరేకంగా చట్టం వచ్చి
నా అస్తిత్వానికి కొత్త రెక్కలు తొడిగింది
ఇన్నేళ్ళ కన్నీళ్ళ సముదాల్రకి
ఓ కాంతి రేఖను చూపించింది
ఎప్పుడూ
సాలెపురుగు బత్రుకే నాది
పడుతున్న కొద్దీ ఎగబాక్రడం
పాకుడు మెట్లపై జారే అడుగులు
పడకూడదని పోరాటం
నా మాతృస్వామ్య వ్యవస్థ
అహంకార వర్గపు అడుగుల కింద
ఎన్నడో భూస్థాపితమైంది
బలమైన చేతులు
అధికారాలన్నీ దొరకబుచ్చుకొని
నన్ను వంటచేయడానికో
వారసుల్ని కనడానికో
యంతంలా వాడుకుంటున్నాయి
కుటుంబ దౌర్జన్యపు కొరడా
వంటి మీద వాతలుగా తేలినపుడు
సాటి ఆడదే అగ్గిపుల్ల అందిచ్చినప్పుడు
నేను మౌన శిఖనయినాను
హైటెక్ యుగంలోనూ
మనుగడకోసం ఎదరీత
రాముడేలిన రాజ్యంకదా
ఇప్పటికీ ఆడాళ్ళు
అగ్ని పవ్రేశాలు చేస్తూనే ఉన్నారు
ఇంకా ఈ హింస కొనసాగితే
ఇకపై భూమ్మీద పురుళ్ళుండవు
పుస్తెలు కట్టించుకొనే మెడలుండవు
వయసుకు వచ్చిన వసంతాలన్నీ
రహస్య మరణాలై
జీవితాలకి రాజీనామా రాసుకోకుండా
న్యాయదేవత కళ్ళు విప్పి
గృహహింస చట్టాన్ని,
కాగితపు పులికాకుండా కాపాడాలి!