– కొత్త పద్మావతి
నా చిట్టి తల్లీ!
నువ్వు నేను కలిసి ఒక పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
మన మాటల్లో మన పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
నీకు నేను, నాకు నీవు
ఒకరికొకరం ఒకే భాషలో ఒకే పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
మన ఆశల్నీ, ఆశయాల్నీ
భావాల్నీ, భావావేశాల్నీ
అక్షరాల్లోకి మార్చుకొని
ఆలోచనలను ఆంధీక్రరించుకొని
అచ్చమైన మన పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
నేను నేలపై నీ తోటనై నీడల్ని దాచుకొని నిలుచున్నా
నువ్వు ఆకాశమార్గాన ఖండాంతరాలకు దూసుకు వెళ్తున్నా
అక్కడెక్కడో సుదూర దేశాల్లో
నీ విజయ నికేతం ఎగిరేస్తున్నా
నువ్వు నేను ఒకే పప్రంచాన్ని నిర్మించుకొన్నాం అనుకొన్నాను
నువ్వు నేను ఒకే పప్రంచానికి వారసులం అనుకొన్నాను
నీకు నేను వేరునయితే
నాకు నీవు చిటారు కొమ్మన పండువనుకొన్నాను
ఇద్దరం ఒకే చెట్టుకు రెండు కొసలా అనుకొన్నాను
ఇదేమిటి ఇంత చితంగా మారిపోయింది
మన ఇద్దరం నేర్చుకొన్న అక్షరాలు,
భావాల్ని కలబోసుకున్న బాసలు,
ఇంత చితంగా వేరు పడిపోయాయేమిటి?
నేను నీకు నేర్పించిన అక్షరాలు
నా అక్షరాలు
మన అక్షరాలు
ఇలా అటకెక్కి కూర్చున్నాయేమిటి?
నీవు నీ సంతతికి నేర్పించే అక్షరాలు
నువ్వు మరోతరంగా నిర్మించుకొనే అక్షరాలు,
నీ చిరంజీవి భవిష్యత్తుకు
అక్షరాలుగా ఆనవాళ్ళు
నాకేం అర్ధంకానివయ్యా యెందుకు?
నా పాణ్రంలో పాణ్రంగా వికసించిన నీవు
నేడు మరో సంస్కృతికి వారసురాలిగా ఎలాగయ్యావు
నీకు నాకు మధ్య ఈ అంతరానికి కారణం ఏమిటి?
”అమ్మా! అమ్మమ్మ ఏమిటి
తన అక్షరాలు నేర్చుకోమని
నన్ను పోరుతుందేమిటి?”
నాకర్ధం కాని పశ్న్రలకు
అసలర్ధం కాని నీ చిరునవ్వు
అందించే సమాధానమేమిటో తెలియకుండా ఉంది
ఇంత పేమ్రగా మోసుకొచ్చిన నా అక్షరాలు
అటకపై నుండి వెక్కిరిస్తుంటే
అమ్మమ్మ, అమ్మ ఒకే పప్రంచాన్ని నిర్మించుకొనదేమిటి?
ఒకే పప్రాంనికి వారసులు కావడమేమిటి?
ప్చ్..