– బి. బాలాదేవి
సింధూరపు ఎరుపూ
నీలాకాశాన్నావరించిన నీలమూ
ఎరగ్రులాబీ ఎరుపు దనమూ
పచ్చని ఆకుల పచ్చదనమూ
నీ పెదవుల తాకిడిని గుర్తుకు తెస్తాయి నాలో!
ఇందధ్రనుస్సు రంగుల ఆచ్ఛాదనలూ
తేనెల సోనలో
వెన్నెల చల్లదనాలూ
పుష్ప మాధురులూ
సాటి రావు
నీ పెదవుల తాకిడిలోని తీయదనానికి!
నీ పెదవులు నన్ను తాకినప్పుడు
అంబరాన్ని చుంబిస్తున్న నీలి మేఘాల చప్పుడు
పశ్రాంత జలసాగరంలో అలల ఉరవడి
పైకీ కిందకీ లేచే నీటి జల్లుల పరవడి
నా అణువణువులోనూ ఏదో అలజడి
అది మళ్లీ అనుభవిస్తేగాని చెప్పలేని అనుభూతుల ఒరవడి!…