‘పత్రచిత్రకారిణి’ సుహాసినితో ముఖాముఖి

లాస్య స్పందన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ‘సుహాసిని’తో జరిపిన ముఖాముఖి
లాస్య :    చిత్రకారిణిగా మీరు వినూత్న ప్రక్రియను అనుసరించారట కదా? దాన్ని కొంచెం చెప్తారా?
సుహా :    ఔను… నేననుసరించిన ప్రక్రియను కొలాజ్‌ అంటారు. స్త్రీల జీవితాలను ఆకులు మాధ్యమంగా తీసుకుని వారి జీవితాలకొక దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో నా ప్రయోగం ఫలించి నా చిత్రాలకొక సరికొత్త రూపం ఏర్పడింది.
లాస్య :    మీ కుటుంబంలో ఇంకెవరైనా చిత్రకారిణులున్నారా?
సుహా :    మా ఇద్దరక్కలు రంగుల ఇంద్రధనుస్సులు… అంటే తైలవర్ణచిత్రాలు అద్భుతంగా చిత్రించారు.
లాస్య :    వాళ్ళ పేర్లు.
సుహా :    పెద్దక్క శ్రీపాద అన్నపూర్ణ. చిన్నక్క డి.వి. రమణి. వాళ్ళ ప్రభావం నాలో చిత్రాలు వేయాలనే కోరికని మేల్కొలిపిందేమో. ప్రతి దసరాకి పెద్దక్క మహిషాసురమర్ధిని బొమ్మ వేస్తూంటే చూసేదాన్ని… నా బాల్యంలోని ఆ జ్ఞాపకం స్త్రీల రూపురేఖలు, చేతులు వాటి కోణాలు నా అంతఃచేతనలో నిక్షిప్తమై నే వేసే స్త్రీల చిత్రాలకొక వొరవడిని కూర్చాయి.
లాస్య :    ప్రాథమికంగా కవయిత్రి అయిన మీకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎందుకు కలిగింది?
సుహా :    కవిత్వంకన్నా బొమ్మ నిరక్షరాస్యుల్ని కూడా వేగంగా జేరుతుంది కనుక. దృశ్యమాధ్యమం కూడా నా ఆశయసాధనకు ఉపకరిస్తుందనుకున్నాను.
లాస్య :    మీరు చిత్రాల ద్వారా కొత్తగా ఏమైనా చెప్పదలచుకున్నారా?
సుహా :    జీవితం పెట్టిన పరీక్షల నధిగమించే క్రమంలో పితృస్వామ్య ప్రతిఫలనాలను అర్థం చేసుకోగలిగాను. ఆ అనుభవాలను నా జాతికి పంచాలనే పట్టుదలతో ప్రారంభించాను. ఆ క్రమంలో వారి సమస్యలని, కష్టాలని, కన్నీళ్ళని చూపిస్తూనే వాటికొక పరిష్కారాన్ని సూచించే ప్రయత్నాన్ని ఈ చిత్రాలతో సరికొత్త మాధ్యమంతో చేశాను.
లాస్య :    ఈ ‘ఆకుల బొమ్మల’ ఆలోచనను ఎలా సాధించారు?
సుహా :    వ్యక్తిగత సంక్షోభాల నధిగమించే క్రమంలో సామూహిక పరిష్కారాలు వెతికే దిశలో ఆలోచించడంలోంచేననుకుంటా. చెట్టు చెట్టునీ నా కన్నీళ్ళతో తడిపి చారెడేసి ఆకులు తెచ్చుకున్నాను. సేకరించిన ఆకులనే ఆ కన్నీటికి పరిష్కారాలు వెతికే వాహకాలుగా మలచే ప్రయత్నంలో నా పట్టుదలా, కసి, సృజనాత్మకతలు ముప్పేటలై ఈ నవ్యమైన మార్గం ఏర్పడింది.
లాస్య :    మీ కళలకి ప్రేరణ?
సుహా :    నా జీవితం, నా అనుభవం, నా ప్రాపంచిక దృక్పథం. అక్కడ అక్షరమైనా, ఆకైనా నా అంతరంగ ఆవిష్కరణకు వాహకాలుగా సహకరించాయి.
లాస్య :    మీ చిత్రాల ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?
సుహా :    స్త్రీల పట్ల అనుకూల ఆలోచనా ధోరణి నేర్పరచాలని, నేనెరిగిన వివక్ష, అణచివేత, ఆధిపత్యం, ఆవేదన, పీడన అన్నీ ఆ ఆకుల్లో చూపే ప్రయత్నమేనన్న పత్ర చిత్రకారిణిగా నిలబెట్టింది.
లాస్య :    మీరొక ఇంటర్వ్యూలో మీ చిత్రాలు ‘ఆసుచిత్రా’లన్నారు. కొంచెం వివరించరూ?
సుహా :    మమూలు చిత్రాలలాగా స్కెచ్‌ చెయ్యడానికి వుండదు. కేవలం దొరికిన ఆకులని బట్టి ఆకుకి తగిన ఆకృతి, ఆకృతికి తగిన వ్యక్తీకరణ, దానికి తగిన చిత్రణ అప్పటికప్పుడు ఆకుని బట్టే నిర్ణయించుకోవాలి కదా, అందుకే అలా అన్నాను. ఫ్రీహాండ్‌ డ్రాయింగ్‌లా, స్పాంటేనియస్‌గా వేసినవే. వస్తువు అనుకుని మొదలుపెట్టడమొక్కటే నా చేతిలో వుంటుంది. ఆకులే అంతిమరూపాన్ని నిర్ణయిస్తాయి. అందుకే నా బొమ్మలు ‘చుక్కలు లేని ముగ్గులాంటివి’ అని చెప్తూ వుంటాను.
లాస్య :    ఆకులకు రంగులు వేస్తారా?
సుహా :    లేదండి – ఏ రంగులూ వాడలేదు. ఆకుల సహజవర్ణ వ్యత్యాసం ఆధారంగా రూపొందించినవే… నా చిత్రాలు… ఆకులే నా రంగులు.
లాస్య :    రావిఆకుల మీద రంగుల గ్రీటింగులొస్తాయి అలాంటివి కాదా?
సుహా :    కాదు కాదు. అవి ఆకుల మీద చిత్రాలు… నావి ఆకులతోటి చిత్రాలు.
లాస్య :    మీ తొలి చిత్రం ఏది?
సుహా :    ”ఒద్దురా నాకన్నా! చెల్లిని కొట్టకురా” అన్న నా తొలి పాటకు దృశ్యరూపంగా చేసిన చిత్రం.
లాస్య :    మీ తొలి ప్రదర్శన ఎక్కడ? ఎప్పుడు?
సుహా :    2000 సం|| మార్చి 8వ తారీకున మహిళాహక్కుల మీద వేసిన 25 చిత్రాలతో మా కాలేజీ (దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాల)లో బోటనీ డిపార్ట్‌మెంట్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశాను.
లాస్య :    ఇప్పటికెన్ని ప్రదర్శనలు నిర్వహించారు?
సుహా :    దాదాపు 70 సోలో ప్రదర్శనలు నిర్వహించాను.
లాస్య :    మీ కవిత్వం ఈ చిత్రలేఖనానికి ప్రతిబంధకం కాలేదా?
సుహా :    లేదు. ఒకదానికొకటి చేదోడు వాదోడై బలాన్ని కూర్చాయి. కొన్ని పాటలకి దృశ్యరూపా లిచ్చాను. మరికొన్ని చిత్రాలకు శీర్షికకోసం కవితో పాటో రాశాను. అందుకే నా ప్రదర్శనల అభిప్రాయాల పుస్తకాలలో ఈ సమ్మేళనాన్ని చాలా ప్రశంసించారు.
లాస్య :    ఏమని?
సుహా :    ”ఆకు ఎంతో మాట అంత; మాట ఎంతో పదునంత” అని.
లాస్య :    మచ్చుకి కొన్ని చెప్పరూ?
సుహా :    నా బంజారా చిత్రానికి కాప్షన్‌ కోసం చాలారోజులు మథనపడి ”ఓ బంజారా వస్తావ నాతోటి” అనే పాట రాశాను. అలాగే ”మంటలలో మహిళ” చిత్రం కోసం
”మన చుట్టూ మంటలాయె
మంటలో మాడె బతుకూలాయె
మంటలే మన చేతి ఆయుధాలమ్మా
చెల్లెమ్మా మంటై ఇంక నువ్వు లేవమ్మా” అనే పాట రాశాను.
లాస్య :    అదే చిత్రానికి మీకు స్టేట్‌ అవార్డ్‌ వచ్చిందని విన్నాను. ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటో వివరిస్తారా?
సుహా :    సోషల్‌ రిలవెన్సీ వున్న సందేశాత్మక చిత్రం కావడం; ఆరు రంగుల నూరు వరహాల పూలని సేకరించి ఆరువేల ఆకర్షణ పత్రాలతో మంటల రూపకల్పన చేశాను. విశేష జనాదరణ పొందిన చిత్రమిది. సింహపురీ ఫైనార్ట్స్‌ అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఆ చిత్రానికి హైలీ కమండబుల్‌ అవార్డు వచ్చింది.
లాస్య :    చిత్రకారిణిగా మీ విజయానికి కారణం?
సుహా :    ఆకులు మీడియా కావడం ప్రధాన కారణం. దీనివల్ల నవ్యత, ఆకర్షణ సమకూరాయి. నా సామాజిక స్పృహ, అవగాహన, ఆ చిత్రాలకు యవనికని కూర్చి నందువలన సామాజిక ప్రయో జనం వున్న కళారూపంగా ఎది గింది. కాలక్షేపానికో వినోదాని కోసమో కళ కాకుండా ఆలోచనాత్మ కంగా సాగిన థీమాటిక్‌ చిత్రాలు వెయ్యడమూ అను కుంటాను.
లాస్య :ఇప్పటివరకూ, ఏ ఏ థీమ్స్‌ తీసుకున్నారు?
సుహా : 1. పనిలో స్త్రీలు, 2. స్త్రీల పట్ల వివక్ష, 3. గృహహింస, 4. కుటుంబహింస – రాజ్యహింస, 5. సాంస్కృతిక రంగంలో స్త్రీలు, 6. పోరుల్లో-స్త్రీలు, 7. బాలకార్మిక వ్యవస్థ, 8. కా గుణింతం, 9. ప్రపంచీకరణ, 10. విభిన్న ప్రాంతాల స్త్రీలు – అనే అంశాల మీద వరుస చిత్రాలు వేశాను.
లాస్య :    మొత్తం స్త్రీల మీద ఎన్ని చిత్రాలు వేశారు?
సుహా :    దాదాపు 200 చిత్రాలు వేశాను.
లాస్య :    ఇంకేమేం వేశారు? ఎన్ని వేశారు? ఎన్ని ఆకులు సేకరించి వుంటారు?
సుహా :    1500 గ్రీటింగ్‌ కార్డులు, 150 వాల్‌ హాంగింగ్స్‌ ఉన్నాయి. దాదాపు 40 ఫామిలీస్‌కి చెందిన 25000 ఆకులు సేకరించి చిత్రాలు చేసి గత 10 సంవత్సరాలుగా భద్రపరిచాను.
లాస్య :    చిత్రలేఖనంలోని ఏ ఏ పద్ధతులు మీరు సాధించారు?
సుహా :    విభిన్న పరిమాణాలలో (సైజులలో) విభిన్న చిత్రలేఖన రీతులుపయోగించి బొమ్మలు నే తీసుకున్న థీమ్‌కనుగుణంగా వాడుకున్నాను. పోట్రెయిట్స్‌, రేఖాచిత్రాలు, కారికేచర్లు మొదలైన చిత్రకళారీతులని ఆకులలోకి అనువర్తించే ప్రయోగాలు చేశాను.
లాస్య :    మీ చిత్రకళకు మీడియా ఎలాంటి ప్రోత్సాహాన్నిచ్చింది?
సుహా :    ఆంధ్రజ్యోతి నవ్యలో మూడుసార్లు నా చిత్రకళ గురించిన వ్యాసాలు వెలువడ్డాయి. తరుణి, చెలిలలో నా ఇంటర్వ్యూలు వచ్చాయి. విజయవాడ, విశాఖ ఆకాశవాణి నుండి నా ఇంటర్వ్యూలు వచ్చాయి. మీడియా చాలా ప్రోత్సాహాన్నిచ్చింది.
లాస్య :    చిత్రకారిణిగా మీరు గర్వపడిన సందర్భాలు చెప్పండి.
సుహా :    2006లో విజయనగరంలోని మహారాజా లేడీస్‌ వెల్ఫేర్‌ క్లబ్‌ తరఫున లోపాముద్ర గారు నవ్యలో నా చిత్రాలను చూసి, నన్ను విజయనగరం పిలిపించి నా పత్రచిత్రప్రదర్శన ఏర్పాటు చేయించి, పత్రచిత్రకారిణిగా ఘనంగా సన్మానించడం మరపురాని మధుర స్మృతి.
2008 మార్చి భూమిక కవర్‌పేజీగా నా పనిలో స్త్రీలు అన్న థీమ్‌కు సంబంధించి గులాబీరేకులతో చేసిన చిత్రసముదాయాన్ని ఎంచుకుని ముద్రించడంతోపాటు ‘పత్రస్వప్నం’ పేర నా పత్రకళావిజయాన్ని అభినందించే ముందుమాట ప్రచురించడం చూసుకుని మహాప్రస్థానానికి చలం ముందు మాటలా నాకో యోగ్యతాపత్రం అనుకుని గర్వపడ్డాను.
అదే సంవత్సరం అరుణతార తన నాలుగు కవర్‌ పేజీలు నా పత్రచిత్రాల వర్ణచిత్రాలతో నింపి – నా కళకు కేటాయించడం నా పరిశ్రమని, నా ఆశయాన్ని, నా మాధ్యమాన్ని సముచితంగా గుర్తించడం అతిపెద్ద పురస్కారంగా భావించాను.
లాస్య :    ఇంత గొప్ప ప్రయోగాన్ని ఎవ్వరికీ నేర్పలేదా?
సుహా :    కావలి విశ్వోదయాలో ఒకసారీ, మా డిఆర్‌డబ్ల్యు కాలేజీలో ఒకసారి ఆకులతో గ్రీటింగ్‌ కార్డుల తయారీ మీద అధ్యయన తరగతులు నిర్వహించాను. ఒక్కసారి 200 మంది విద్యార్థులకు పైగా నేర్చుకున్నారు. మంచి స్పందన వచ్చింది. నేర్చుకోగలిగి ఆసక్తిగలవారొస్తే నేర్పడానికి నేనెప్పుడూ సిద్ధమే.
లాస్య :    ఏ లక్ష్యసాధన కోసం మీరీ మీడియా నెంచుకున్నారు?
సుహా :    పర్యావరణం, మహిళావరణం నా రెండు కళ్ళలా – ఆ రెండంశాల మీద అట్టడుగునున్న మహిళల దాకా అవగాహన పెంచి చలనం కలిగించడమే లక్ష్యంగా సాగుతున్నాను.
సూటిగా చెప్పాలంటే కవిత్వం, చిత్రరచన, ఆటా, పాటా నాలోని ఏ కళకైనా లక్ష్యం ఒక్కటే అన్నిరకాల అసమానతలను ప్రశ్నించడం. ఎలాంటి అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించుకునే దిశలో నాతోటి స్త్రీలనందరినీ సమీకరించి సంఘటిత పరచడం.  కలం కదిపి, కంఠం కలిపి, రాలిన ఆకాలతోనే ఆశయాల దీపాలు వెలిగించుకుంటూ చేయగలిగింది నిర్విరామంగా చేస్తున్నాను. శ్రీ శ్రీ గారి మాటల్లో చెప్పాలంటే
‘నడిచేది నడిపించేది కదిలేది కదిలించేది’ అయిన కళాసృష్టిలో  కాలాన్ని కరిగించి కాగడాగా మీ చేతికివ్వాలన్నదే సంకల్పం.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

One Response to ‘పత్రచిత్రకారిణి’ సుహాసినితో ముఖాముఖి

  1. సుహాసిని గారు, మీ ముఖాముఖి చాలా బాగుంది.. మీ మాటలకన్నా మీ చిత్రాలు చూపిస్తే ఇన్కా బాగుండెది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.