మాడపాటి మాణిక్యమ్మ

అధ్యక్షురాలి ఉపన్యాసం
సోదరి మణులారా!
మహాసభకు నన్నధ్యక్షురాలినిగా నియమించి ఈయ పూర్వావకాశమును నాకు కలిగించినందులకు మీ యందరియెడ చాలకృతజ్ఞరాలను.
ఇదివరలో యెవరును, యెప్పుడును చెప్పనట్టి కొత్త సంగతులు యిప్పుడు నూతనంగా నేను చెప్పుటకు రాలేదు.మంచి సంగతులు యెన్ని పర్యాయములు యెక్కువగా చెప్పుకున్నను, విన్నను అంతలాభదాయకము. కాబట్టి నాకు తోచిన యంశములను మనవి చేయుచున్నాను.
ప్రతి మానవునకును విద్యయవసరమను యుగమిది. కావున మనమిప్పుడట్టి యవసరమగు స్త్రీవిద్యావిధానము మొదలగు విషయములను గురించి కొంతయాలోచించుదము.
మనరాష్ట్రంలో చదువుకొనిన స్త్రీల సంఖ్య చాలా తక్కువగనున్నది. వేయింటికి పన్నెండుగురు మాత్రమేగలరు. దస్కతు పెట్టగలవారినందరిని విద్యావంతురాండ్రుగ పరిగణించినప్పటికి తేలిన సంఖ్య ఇదియే. కావున స్త్రీలలో విద్య బాగుగవ్యాపించిననేగాని దేశముసుస్థితిబడయజాలదు!
ప్రతిగ్రామమునందును ప్రాధమికవిద్య నేర్చుటకు బాలికలకొకపాఠశాల యుండుటవసరం. వారికిగరపు విద్య వారి శారీరక, మానసిక శక్తులను అభివృద్ధిపరచునదిగా నుండవలయును.
ప్రారంభవిద్య నిర్భందంగా చేసినవేగాని దేశంలో విద్య త్వరగా వ్యాప్తిజెందదు. ప్రారంభ విద్యను నిర్భంధం చేసి ప్రజలకుచెప్పించుట ప్రభుత్వంయొక్క కర్తవ్యము. ప్రతి దేశములోను ప్రభుత్వమట్లు చేసిన తరువాతనే జనులలో విద్యనేర్చినవారిసంఖ్య దినదినాభివృద్ధికాజొచ్చెను. విద్యా ప్రచారమెక్కువైననేగాని జనులకు స్వతంత్రబుద్ధి కలుగనేరదు.
స్త్రీలకు ఉన్నతవిద్య మిక్కిలి యావశ్యకము. ప్రారంభవిద్యతోనే చదువుముగించినచో వివాహము చేసికొని గృహిణులైన తరువాత వారికి వచ్చిన విద్యయందు యభివృద్ధినొంది, విజ్ఞానవంతు రాండ్రగుటకందరికిని సామర్థ్యముకాని, యవకాశములుగానియుండవు. అట్లు తమ స్వయంకృషిచేతనే పైకి రాగలిగిన వారి సంఖ్య చాల తక్కువ. తరచుగా వారదివరకు నేర్చికొనిన విద్యగూడ నశించుచుండుట కానవచ్చుచున్నది. కనుక ఉన్నతవిద్య నేర్చుకొనిననేగాని వివిధ విషయములు నవగాహనము చేసికొనుటకనుకూలములేదు.
మన రాష్ట్రమున స్త్రీలకే భాష ద్వారా విద్యగరపవలయుననునది ముఖ్యమైన విషయం ఇండియాకంతటికిని రాజకీయ భాషయైన ఇంగ్లీషుద్వారానా లేక,, మన రాష్ట్రమునకు మాత్రమే ముఖ్యమైన ఉర్దూద్వారానా? లేక మన మాతృభాషద్వారానా? అను ప్రశ్న వచ్చును.
ఇంగ్లండు, జర్మనీ, జపాన్‌ మొదలైన అన్ని దేశములలోను మాతృభాషద్వారానే విద్యగరపెదరు. వారికక్కడ అన్యభాషద్వారా విద్యబడయవలయునను నిర్భంధమే లేదు. అందువలననందరును సులభముగా విద్యనభ్యసించి వివిభ విషయములందు, విజ్ఞానముతోనలరారుచున్నారు. మనదేశంలోనున్నచో, మాతృభాషయొకటియు, ప్రభుత్వ భాష మరియొకటియు, సామ్రాజ్యభాష మరియొకటియునై యున్నది. ఏ కొద్దిమందికో మాతృభాషయైన దానిని ప్రభుత్వ భాషగాజేసి అందరును దానినేయభ్యసించివలెనని నిర్భంధించిన చాలకష్టముగా నుండును. మాతృభాషద్వారా విద్యగరపినట్టేన, అనేక విషయములను గ్రహించి, మనభాషలో సులభంగా భావముల ప్రకటింపగలము. ఇప్పుడు భాషయను, విషయములును కూడ కొత్తవైనందున, మనకు మిక్కిలి శ్రమగా నున్నది. విషయములు మాత్రమేయైన యెడల, వానిని నేర్చుకొని త్వరగా విజ్ఞానమును బడయగలము. మన జీవితంలో చాలాభాగం అన్యభాషల నభ్యసించుట కిందనే వ్యర్థమై పోవుచున్నది. ఇట్టి వృధాశ్రమచేత మానసికముగను, శారీరకముగను బలహీనులమగుచున్నాము. కనుక స్త్రీలకు మాతృభాషద్వారానే విద్య నేర్పించుటవసరము.
ఈ యిబ్బందులను గ్రహించి పూనాలో కర్వేమహాశయుడు స్త్రీలకు మాతృభాషద్వారా విద్యనేర్చుటకై ఒక విశ్వ విద్యాలయమును స్థాపించి, పుణ్యము కట్టుకొనెను. దాని యొక్క ఫలితంగా నిప్పుడచ్చట పట్టభద్రులైన విదుషీమణెలెందరో గలరు. దాని శాఖలనేక స్థలములలో స్థాపింపబడినవి. దానినేయాదర్శముగానిడుకొని, మన హైద్రాబాదులోగూడ ” ఉన్నత బాలికా పాఠశాల”ను నెలకొల్పిరి. ఇది దినదినాభివృద్ధి నొందుచున్నది. కొద్ది శ్రమతో పరీక్షల యందుత్తీర్ణురాండ్రగుచున్నారు. ఈ పరీక్షలను మన గవర్నమెంటువారు అంగీకరించి, ఈ పాఠశాలకు ద్రవ్యసహాయమొసగి ప్రోత్సహించిన, మనకెంతో మేలు కలుగును. మ.ఘ.వ.శ్రీనిజాముప్రభువుగారు పవిత్రమైన రజతోత్సవసమయమున, మనకును మాతృభాషలో ఉన్నత విద్యాపరీక్షలకై అనుకూలమును కలిగించగలందులకు ప్రార్ధించుచున్నాను.
స్త్రీవిద్యాభిమానులగు పెద్దలు, పూనా, బొంబాయి మొదలైన నగరములందు సేవాసదనములు స్థాపించి పిన్న పెద్దలనుభేదములేక స్త్రీలందరికిని చేతిపనులను, సాంకేతిక విద్యలను నేర్పుచున్నారు. సాంకేతికచర్యలు, విద్యలు, లలితకళలు స్త్రీలకు చాలా  అవసరము. వానివలన జీవనోపాధిగూడ కలుగును. మన రాష్ట్రంలో నట్టివిద్యలకనుకూలములగు మార్గములు లేకపోవుట మన దురదృష్టము.
గృహిణులైనవారు తమవిద్యను పెంపు చేసుకొనుటకై ఊరూరనొక మహిళా సమాజమేర్పరచుకొని, వారమునకొక పర్యాయమైనను సమావేశమగుచు కొంచెముబాగుగా చదువగలిగనవారు మాసపత్రికలు, వారపత్రికలు, విజ్ఞానమును కలిగించు యితర గ్రంధములు మొదలైనవానిని తమ తోడి సోదరీమణులకు చదివి వినిపించుచు, తద్వారా స్త్రీలలో విద్యయందుత్సాహము కలిగించుచు కొంత ప్రబోధము జేయవలెను.
మనలో వివాహమనుననది యొక పవిత్రమైన సాంఘిక సంస్కారము. యుక్త వయసు రాకముందే పెండ్లిండ్లుచేయుటచేత, బాలికలీ సంస్కారము యొక్క ఔన్నత్యమును గ్రహింపజాలకున్నారు. మనమాదర్శులని తలచుచున్న సీత, సావిత్రి మొదలైన వారు విద్యాబుద్దులు నేర్చుకొని, తగినంత యీడువచ్చిన తరువాత స్వయముగా, తమకు తగిన భర్తలనువరించి వివాహమాడి పాతివ్రత్యమును నిలుపుకొనగలిగిరి. పతి అనగా నేమియో, పాతివ్రత్యమనగానెట్టిదో గ్రహించగలిగినంత విద్యాజ్ఞానము అలవడిన తరువాత వివాహమాడినచో, మన బాలికలును స్వధర్మమును కాపాడుకొనగలరు. వివాహవిషయములో తల్లిదండ్రులు తమబిడ్డలకు కొంత స్వాతంత్య్రమునిచ్చుట వారికర్తవ్యము. బాల్యవివాహములవలన బాలికలకు అవయవ వికాసముగాని, మానసిక వికాసముగాని కలుగుట లేదు. ఇది శోచనీయం!
సాధారణంగా శిశువులకు పన్నెండేండ్లవరకు శైశవసంబంధము లగు  గండములు వచ్చునందురు. అనగా ఆలోపల శిశువుల మరణముల విస్తారముగా నుండును. పన్నెండు సంవత్సరములు దాటిన తరువాత శిశువుల యొక్క ఆరోగ్యము కొంతవరకు ధృఢపడునని చెప్పుదురు. పదునాలుగు సంవత్సరములైనను నిండనిదే బాలికలకు అవయవ వికాసము  కలుగ నేరదు.అంతేకాక వారికిచిన్నతనముననే సంతానప్రాప్తి సంభవించినచో తల్లులు, పిల్లలు కూడ బలహీనులగుదురు. అట్టి సంతానమువలన దేశమునగాని, వారి తల్లిదండ్రులకుగాని, వారికి గాని, లాభము యే మాత్రమును లేదు. కనుక బిడ్డలయొక్క వివాహముల విషయములోను, ఆరోగ్యవిషయములోను తల్లులు మిగుల జాగ్రత్త తీసుకొనవలయును.
శారదాచట్టమువలన బ్రిటిష్‌ యిండియాలో బాలికలకు, పదునాలుగు సంవత్సరముల లోపల పెండ్లిండ్లు చేయుట నేరమగును. ఆ చట్టము యొక్క విలువను అచ్చటి ప్రజలింకను గ్రహించలేదు. బాల్యవివాహములను మానిపించుటకు మనకును ఇటువంటి చట్టమొకటి ఆవశ్యకమని ప్రభుత్వము వారిని ప్రార్ధించుటవసరము. హైదరాబాద్‌ నగరములోని కొందరు విదు

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.