న్యాయదేవత ఆక్రోశం

ములుగు లక్ష్మీమైథిలి
నా కళ్ళకు గంతలు కట్టారు, …..
కానీ…. నా చెవులకు కట్టలేదు…..
భారతావనిలో జరిగే అకృత్యాలను,…..
చూసి న్యాయం చెయ్యలేకపోయినా,…..
విని, విని…. నావీనులు వ్యధచెందినవి…..
అబల మానప్రాణాలు హరించిన,…..
మృగాల వికటాహాసాలు వింటున్నా,…..
కట్నం తేలేని కన్నెలను…..
మంటల్లో మసిచేస్తే, వారి హా హా కారాలు వింటున్నా…..
ప్రేమపేరుతో వంచించిన అతివల ఆర్తనాదాలు,
ప్రేమించలేదని, యాసిడ్‌లతో, కత్తులతో,
ఆకృత్యాలకు బలైన అబలల పొలికేకలు వింటున్నా,…..
విద్యాలయాల్లో కీచక ఉపాధ్యాయులు,
విద్యార్ధులకు చెప్పే కామసూత్రాలు వింటున్నా…..
అతివల ఆక్రోశాలు,
చెత్తకుండీల పాలైన పసికందుల ఆక్రందనలు,
సగటు మనుషుల ఆత్మహత్య ఘోషలు,
ఆడే వయసులో, పూటగడవలేని,
బాల కార్మికుల ఆవేదనలు,
నేరాలు, ఘోరాలు, హింసాకాండలు,
బంద్‌లతో, సమ్మెలతో రాజకీయ చట్రంలో,
నలిగిపోతున్న యువత నినాదాలు,
ఇంకా ఎన్నో మరెన్నో సంఘటనలు,
నామనసును కలిచివేస్తున్నా,…..
నా కన్నీటిపొరలు, నాకళ్ళగంతల,
మాటున నిలిచినవి,
న్యాయానికి….. న్యాయం చెయ్యలేక.

సవాల్‌

కిరణ్‌బాల
నా చిన్నతనంలో –
‘గోటీలాట’ ఆడాలని వున్నా…
గచ్చకాయలే ఆడాను !
‘గిల్లీ దండా’ ఆడాలని వున్నా…
తొక్కుడు బిళ్ళే ఆడాను !

సైకిల్‌ నేర్చుకుంటానంటే…
‘ఆడదానివి నాతో పోటీకా?’- అన్నాడు అన్నయ్య
అంటే… మగాడి కంటే ఆడది తక్కువన్నమాట!
గాలిపటం ఎగరేయబోతే…
‘మగాడ్లా బరితెగించింది’- అన్నారు నాన్న!
అంటే హద్దులేని బతుకు మగాడిదన్నమాట!

తమ్ముడి చొక్కాలేసుకుంటే…
‘సిగ్గులేదూ మగాడివా!’ అన్నాడు మామయ్య
అంటే… మగజాతి సిగ్గులేని దన్నమాట!

కాలేజీకి వెళతానని ఏడిస్తే
‘ఏడుపు ముందు పుట్టాకే, నువ్‌ పుట్టావ్‌’! అన్నాడు బాబాయ్‌
అయితే…. ఏడిపించటం మగాడివంతన్నమాట!

ఇంకా కౌమారంలోనే-
‘ఈడొచ్చింది పెళ్ళి చెయ్యా’ లన్నారు అమ్మలక్కలు!
అంగట్లో మొగుడనే మగాడ్ని కొనిచ్చారు అమ్మానాన్నలు!

తొలిచూలుగా నాకు పుట్టింది ఆడపిల్లే!
‘బాబోయ్‌, ఆడపిల్ల! బాంబు పడ్డట్లు బెదిరి పోయారందరూ!
కానీ…
పెదవి విరవనిది నేనొక్కదాన్నే!
కారణం-
పుట్టిన నా బిడ్డని…
ఈ పురుషాధిక్య ప్రపంచానికి
‘సవాల్‌’ గా పెంచాలని!
ఉద్దానం

ఆర్‌. దుర్గాప్రసన్న
మా ఊరు సముద్ర తీరంలో-
నా తొలి అడుగులు కెడలి కెరటాలతో-
తెల్లవారితే సూర్యుడు
మా తీరంలోంచే లేస్తాడు
అందరికీ నడినెత్తి కెక్కే సూర్యుడు
మా ఊళ్ళో మాత్రం
ఇసుక తిన్నెలపై తీరం వెంబడి
పరచుకున్న జీడిమామిళ్ళను ముద్దాడతాడు
ఆకాశం అందుకే దిగివస్తుంది
తీరం వెంబడి కొబ్బరి చెట్లు తోరణాలు కట్టాయి
పచ్చని పనస చెట్లు జీవిత సారాన్ని
సుగంధభరితం చేస్తాయి.
పాపంపుణ్యం తప్ప
కల్లా-కపటం తెలియని వాళ్ళు మావాళ్ళు
సముద్రంలో వేటకి వెళ్ళినా
ఒకరికొకరు తోడుంటారు
ఊసులెన్నో పంచుకుంటారు
అందమైన మా తీరం పేరే
ఉద్దానం ! అదే – ఉద్యానవనం!!
ఎవరికి కన్ను కుట్టిందో?
రాజకీయడేగల కళ్ళు పడ్డాయట
కరెంటు ఫ్యాక్టరీలు పెడతారుట
ఆ కాలుష్యంతో-
సముద్రంలోని చేపలన్నీ గిలగిల్లాడుతాయట
ఒడ్డునున్న కొంగలు, పక్షులు విలవిల్లాడతాయట
పల్లెవాసుల్ని బూడిద కుప్పల్తో
ఉక్కిరిబిక్కిరి చేస్తారుట
తీరమంతా అగ్గిబుగ్గి
ఆకాశమంతా పొగలసెగలు
ఇదేమి అన్యాయం? అడిగితే
ఖాకీలు క్రౌర్యంతో విజృంభించారుట
పచ్చని బతుకుల్లో చిచ్చు పెడతారా?
మా నీటిలో అగ్గిరాజేసి బుగ్గి చేద్దామనే!
ఉద్దానం బుగ్గి అవుతుందంటే
జనం సముద్రమై ముంచెయ్యరూ?
పిల్లా-జెల్లా, ముసలీ-ముతకా
అంతా ఏకమై కర్రా-కంపా
పట్టుకు ఎదురు తిరుగు తున్నారుట
మరోపోరాటానికి సిద్దం అవుతున్నారుట

అమ్మా! నీ వొక బొమ్మవా?
రాణి పులోమజదేవి
అన్న అమెరికా చదువు కోసం నీ ప్రతిభను పరిషత్‌ బడికి పరిమితం చేస్తే
చాకలిపద్దులు చదవనూ మహారాజరాజశ్రీ శ్రీవారి పాదపద్మములకు నమస్కరిస్తూ లేఖాంశములు వ్రాయనూ వచ్చిందిగా అంటూ
అసంతృప్తిని ఆనందపు టూర్పుగా మలచగలిగావే!
ఎందుకమ్మా! నీ వొక బొమ్మవా?

పుట్టింటికి రాబోయే లక్షల సాయం కోసం
ముందు భార్యను మర్డర్‌ చేసిన మగాడికి
రెండో భార్యగా రగిలే గుండెను వెచ్చని కన్నీళ్ళతోనే చల్లార్చి
రాగాలొలకబోస్తూ వెళ్లావే!
ఏమ్మా! నీ వొక బొమ్మవా?
నాకేం? నే మగాడిని నా కెన్ని ఇండ్లైనా ఉండొచ్చని
మీ ఆయన గర్వంగా మీసం మెలేస్తే
ఆక్రోశించే గుండెను అడకత్తెరలో వేస్తూ
ముసిముసినవ్వులు చిందావే?
ఔనామ్మా? నీ వొక బొమ్మవా?

ఆడపిల్లను కన్నావని ఛీత్కారాలు
మగబిడ్డను కన్నావని నజరానాలూ
ఆడదాని వయ్యుండీ మౌనంగా అందుకున్నావే?
చెప్పమ్మా! నీ వొక బొమ్మవా?

సంపాదించేంత వరకే సమానత్వం అంటూ
నీ నెలజీతాన్ని అకౌంటెంట్‌ టేబుల్‌ మీది నుంచే
తన జేబులో వేసుకునే నీ భర్త సంపాదనను
నీవూ అలా హాండ్‌ బాగ్‌లో వేసుకోలేక
”ఏమండీ! పాస్‌ కొనాలి డబ్బివ్వరూ”
అంటూ ప్రాధేయ పడతావే!
ఏంటమ్మా! నీ వొక బొమ్మవా?

ఆఫీస్‌లో అరవచాకిరీ చేసి అయిదింటికి నీవు
పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి
‘ఏంటా ఏడుపు మొహం’ అంటాడని అనూ
ఎమ్‌టివి చూస్తూ ఆరాంగా ఆపసోపాలు పడుతూ
కూర్చున్న ఇంటాయనకు
నవ్వులు పులుముకొని టీ టిఫిన్లు అందిస్తావే!
ఇదేంటమ్మా! నీ వొక బొమ్మవా?

”ఏం ఆడవాళ్ళయితే మాతో సమానంగా జీతాలు తీసుకోవడం లేదా?”
అనే అక్కసుబోతులను
”మీలా టీలు సిగరెట్లూ అంటూ నేను
గంటల తరబడి సీటు వదిలి సరదా చేస్తున్నానా?”
అని నిలదీయక
ప్రకృతి ధర్మంగా స్త్రీ కొచ్చే అన్ని ఇబ్బందులనూ
పావుగంటైనా పర్మిషన్‌ తీసుకోకుండా
పంటిబిగువున భరిస్తావేమ్మా! నీవొక బొమ్మవా?

రెండలైట్‌ వీధిలోనైనా, వైట్‌ హౌస్‌ పరిధిలో ఉన్నా
నిన్ను అవసరానికి వాడుకున్న మగాడు
ఆడదాని చొరవే అనార్థలకు హేతువని
ఉవాచలు విసురుతుంటే
అసహాయంగా కన్నీళ్లు కారుస్తావే తప్ప
అమ్మగా అందమైన ఆడబొమ్మగా కూడా
నేనేనోయ్‌ నీ ఆకలి(ళ్ళు) తీర్చగలిగేదానినని
చనుబాలు కక్కేలా సమాధానం ఇవ్వవేమ్మా!
నీ వొక బొమ్మవా?

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.