డా.రోష్ని
ఈ మధ్య నా స్నేహితురాలొకామె సడెన్‌గా లావయి పోయింది మేమంతా (లావు వల్ల నష్టాలు మాకు ఆల్‌రెడీ తెలుసుకాబట్టి) ఆమెని ఎక్సర్‌సైజ్ చేయడం లేదా కొంచెం తిండి తగ్గించు అని నానారకాలుగా సతాయించడం మొదలుపెట్టాం. ఆమె బిక్క మొహం వేసేది. ఒక్కోసారి కళ్ళమ్మట నీళ్లు కూడా వచ్చేవి. నాకెందుకో జాలేసింది., ఆమెను చూస్తే. ఈ మధ్యే ఆమె మెనోపాజ్ దశకు చేరింది. అదేసమయంలో భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఇన్నేళ్ళు ఆ బెంగతో అసలు బయటకెక్కడకు రాలేదామె.
పెరిగిన బరువు ఒక సమస్య అయితే చుట్టూ జనం కామెంట్లు మరింత బాధనిపించింది. ఒక్కోసారి ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా, తిండి తగ్గించినా లావవుతారు. దానికున్న కారణాలు తెలుసుకుందాం.
సరైన నిద్రలేకపోవడం :- మానసికమైన ఒత్తిడికి గురైనప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. ఈ స్థితి మన శరీరంలో కొవ్వు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనికి తోడు మన పని ఒత్తిడిలో అలిసిపోయి వుంటే మానసికమైన ఒత్తిడికి అస్సలు తట్టుకోలేం. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి చిరుతిళ్ళను ఆశ్రయిస్తాం. (ఎమోషనల్ ఈటింగ్)., సరిగా నిద్రపట్టనివాళ్ళులేట్ నైట్ స్నాక్స్ తింటే నిద్రపడుతుందేమో అనే ఆశతో ఏదో ఒకటి తింటారు. కాని అదంతా మంచి అయిడియా కాదు. నిద్రరాదు సరికదా ఇంకొన్ని కాలరీలు వంట్లో చేరతాయి. అంటే ఇంకా బరువు పెరుగుతారు.
ప్రతి మనిషికి 6 నుంచి 8 గం|| నిద్ర అవసరమని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రోజూ 15 ని|| నిద్రసమయాన్ని పెంచుకుంటూ 6 నుంచి 8 గం|| నిద్ర పోయే అలవాటును చేసుకోవాలి.
నిద్రపోయే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలుతాగితే బాగా నిద్రపడుతుంది. పాలలోనిట్రిప్టోఫోన్ నిద్రవచ్చేలా చేస్తుంది. పాలే కాకుండా అరటిపండు, తేనె, గింజలలో కూడా ట్రిప్టోఫోన్ ఉంటుంది. నిద్రపోయే ముందు చేయకూడని కొన్ని పనులున్నాయి. అతిగా తినకూడదు. కొవ్వు పదార్థాలు వేపుళ్ళు తినకూడదు. ఎక్కువమాంసం, కెఫేయిన్ ఉండే కాఫీ లాంటివి తాగకూడదు. (6 గం|| ముందునుంచి)
కొన్ని మందుల్లో (పెయిన్‌కిల్లర్, జలుబు మందులు మొ||) కెఫెయిన్ వుంటుంది. వాటిని కూడా నిద్రపోయేముందు వేసుకుంటే నిద్రపట్టడం కష్టం.
నిద్రకు 4-6 గం|| ముందు ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర చెడుతుంది.
రాత్రి 8 గం|| తర్వాత ఎక్కువ ద్రవపదార్థాలు వాడవద్దు. మాటిమాటికి టాయ్‌లెట్ కోసం మెలకువ వచ్చేస్తుంది.
ఇక సిగరెట్లు ఎక్కువగా కాల్చినా నిద్ర సరిగా రాదు.
వత్తిడి: ఆధునిక సమాజంలో ఎక్కువ పనిచెయ్యాలి, ఏదో సాధించాలి అనే వత్తిడి బాగా పెరిగిపోయింది. స్త్రీలపై మరీను. ఇంట్లో పనే కాకుండా బయట ఏదో ఒక ఉద్యోగం (గ్రామాల్లో అయితే పొలంపని. కూలిపని) వత్తిడి ఎక్కువయ్యాయి. ఈ వత్తిడి ప్రభావం మన మానసిక స్థితిపై కూడా వుంటుంది. పెరిగిన బాధ్యతలు, ఆర్థక సమస్యలు, దీనికితోడవుతాయి. దీనిని తట్టుకోవడానికి సర్‌వైవల్ మెకానిజమ్ మొదలవుతుంది. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. మెటబాలిజం రేటు తగ్గుతుంది,. (కేలరీలు ఖర్చు చేయడం) కార్టిజోల్ లెప్టిక్ అనేవి శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యి పొట్ట ప్రాంతం లావు అవుతుంది. పొట్ట పెరుగుతుంది.
వత్తిడికి లోనైనవారు రోజు పిండిపదార్థాలెక్కువగా ఉండే చిరుతిళ్ళకు, స్వీట్లకు అలవాటుపడతారు. ఎందుకంటే ఇవి సిరటోనిక్ అనే పదార్థాన్ని బ్రెయిన్‌లో ఎక్కువ చేస్తాయి. సిరటోనిక్ వత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది.
మందులు : కొన్ని రకాల మందులు – స్టిరాయిడ్స్, హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరప.ీ గర్భనిరోధక మాత్రలు,డివైషన్ కి వాడే మందులు, ఫిట్స్‌కి వాడే మందులు, రక్తపోటుకు వాడే మందులు, డయాబెటిక్ మందులు బరువు పెరిగేలా చేస్తాయి. ఈ మందుల్లో కొన్ని శరీరంలో నీరు చేరుకునేలా చేస్తాయి. (ఫ్లూయిడ్ రిటెన్షన్) మరికొన్ని ఇన్సులిన్ లెవెల్లో మార్పులను తెస్తాయి. దీనివలన బరువు పెరుగుతారు, ఒక్కోసారి ఒక్క నెలలో 5 కేజీల బరువు పెరిగే అవకాశం ఉంది.
కొన్ని రకాల వ్యాధులు:- హార్మోన్‌ల సమతుల్యం లోపించే కొన్ని రకాలవ్యాధుల్లో కూడా శరీరం బరువు విపరీతంగా పెరుగుతుంది. తిండితగ్గించడం, వ్యాయామం చేయడం అనేవి అసలు ఏమీ పనిచెయ్యవు.
ఉదా|| హైపోథైరాయిజమ్ : థైరాయిడ్ గ్రంథి పని తగ్గిపోవడం వల్ల వస్తుంది. మెటబాలిజమ్ రేటు తగ్గుతుంది. ఆకలి ఉండదు. కాని బరువు పెరుగుతుంది. ఈ జబ్బు ఉన్న వారిలో అలసట, బద్దకం, వాపు, బొంగురు గొంతు, చలిని ఏమాత్రం భరించలేకపోవడం, ఎక్కువ నిద్ర తలనొప్పి కూడా ఉంటాయి. దీనికి తప్పక డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
కుషింగ్స్ సిండ్రోమ్ కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది.
మెనోపాజ్ : ఇది అందరికీ ఒకే వయసులో రాకపోవచ్చు. మామూలుగా మధ్య వయస్కులకు (40-50 సం||) వస్తుంది. ఈ వయస్సులో స్త్రీలు సామాన్యంగా తక్కువ యాక్టివ్‌గా ఉంటారు. వయస్సుతో పాటు మెటబాలిజమ్ రేటు తగ్గుతుంది. హార్మోన్ల సమతుల్యం తగ్గి, ఆకలి, డిప్రెషన్, నిద్రలేమి లాంటివి మొదలవుతాయి. మెనోపాజ్‌లో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది. శరీరం తీరు (షేప్) మారుతుంది. పొట్టభాగంలో కొవ్వు పెరిగి, కటిభాగం, తొడల్లో తగ్గుతుంది. పెరిగిన పొట్టను మెనోపాట్ అని కూడా అంటారు.
కాబట్టి మధ్య వయస్కులైన స్త్రీలలో బరువు పెరగడం అనేది పై ఐదు కారణాల వల్ల జరుగుతుంది. బరువు పెరుగుతోంది అని వత్తిడికి లోనవడం కంటే కాలరీలను ఖర్చయ్యే విధంగా యాక్టివ్‌గా ఉండటం, వ్యాయామం చేయడం మంచిది. తినే తిండిలో కూడా కేలరీలు తగ్గించాలి. తగ్గించడం అంటే మరీ పస్తులుండమని కాదు. మనం తీసుకునే మొత్తం కేలరీల్లో 500 తగ్గిస్తే వారానికి 1/2 కేజీ, బరువు తగ్గుతుంది. రోజు మొత్తం మీద 1,050 నుండి 1200 కెలరీలకు తగ్గకూడదు. వ్యాయామాల +
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags