అమ్మ ఒడి (సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌)

మౌనిక
అది ఓ అమ్మ ఒడి. ఆ ఒడి సేదతీరడానికే కాదు, అందులో ఎంతో మంది చిన్నారుల జీవితాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని పరిస్థితులు మారాయి అనుకున్నా ఎక్కడా ఏ మూల ఏమీ మారలేదు అనే భావన కూడా మనలో ఉంది. స్త్రీ అన్నా, ఆడపిల్ల అన్నా లోకానికి చులకనే. వారేం చేస్తారు వారి వల్ల తల్లిదండ్రులకి భారం ఎక్కువని కొంతమంది పుట్టిన ఆడపిల్లలను పుట్టినప్పుడే మట్టుపెట్టడం, కొంతమంది ఆడపిల్లలను సొమ్ము చేసుకోవడం, మరికొంతమంది ఆడపిల్లలను వదిలించుకోవడానికి ఎంతటి దుర్మార్గానికయినా పాల్పడటం మనం చాలా చోట్లలో గమనించవచ్చు. ప్రస్తుతం కాలం మారింది. కాలాన్ని బట్టి పరిస్థితులు కూడా మారాయి అనుకుంటే అది పొరపాటే. ఆ మార్పు నూటికి ముప్పై శాతం మాత్రమే.  ఆ ముప్పై శాతంలో కూడా ఎవరి పిల్లల్ని వారు చదివించి పోషించుకోవడానికి నానా కష్టాలు పడే పరిస్థితి. కాని ఆ కష్టాలేవీ లెక్క చేయకుండా ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటూ ఎంతో మంది ఆడపిల్లలను సొంత అమ్మలాగా అక్కున చేర్చుకుంటున్న ఒడి సి.ఎస్‌.ఎస్‌.సంస్థ. అనగా సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ ఆ అమ్మే విజయలక్ష్మి.
భగవంతునికి చెప్పుకున్నా కష్టాలుతీరుతాయన్న నమ్మకం లేదు కానీ, ఈ దేవాలయంలో ఎలాంటి సమస్యలున్నా ఆనంద వాతావరణం నెలకొల్పుతుంది. అదే ఆ దేవత గొప్పతనం. ఆ అమ్మకి కూడా ఒకానొక రోజున కష్టం ఎదురైంది. ఆ కష్టసమయంలో వచ్చిన ఆలోచనే ఈ  రోజున వందల మంది పిల్లల జీవితాలను బాగుచేస్తుంది.
అమ్మాయిల జీవితాలను బాగుచేయాలి. ఎలాంటి కష్టాలొచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని అందించాలనే వారిసంకల్పం. కేవలం అనాథ పిల్లలకి, సింగిల్‌ పేరెంట్‌ ఉన్న పిల్లలకి, ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగులేని పిల్లలకు చేయూత ఇవ్వాలనుకున్నారు. అనుకున్న వెంటనే 2004 సం||లో 5 మంది అమ్మాయిలతో లక్ష్యాన్ని మొదలుపెట్టారు. ఎంతోమంది ఎన్ని రకాలుగా విమర్శించినా తాను వెనుకడుగు వేయలేదు. ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు  ఎవరో ఒకరైనా ఆ పనివల్ల ప్రేరేపితం అవకుండా ఉండరు అనే ఆలోచన ఆమెను ముందుకు నడిపింది,. ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయిలకు కావల్సిన సౌకర్యాలను అందించి, వారి చదువులకు అయ్యే ఖర్చులన్ని తానే చూసుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా తన లక్ష్యసాధనను కొనసాగించారు. ఆ కొనసాగింపులో భాగంగా తనకు తోడుగా ఎన్నో చేతులు ఒక్కొక్కటిగా కలిసాయి. ఐదుగురు అమ్మాయిలతో మొదలైన ఆ ఆశ్రమం ఇప్పుడు చిన్న పిల్లలను నుండి పెద్ద అమ్మాయిల వరకు మొత్తం 79 మంది ఉన్నారు. వీరందరూ జీవితంలో ఏదో ఒకవిధంగా కష్టాలను అనుభవించిన వారే. వారికి ఆప్త బంధువైన ఆ అమ్మఒడి కష్టాలను మరిచి ప్రశాంత వాతావరణంలో ఉంచింది,. వీరిలో కాబోయే ఇంజనీర్లు, సి.ఎ.లుల నర్సులు ఇంకా అనేక రంగాల్లో చదువులు చదువుతున్నారు. ఆశ్చర్యమేమంటే వీరిలో 90% మందికి వారి వారి కళాశాలల్లో మొదటిస్థానమే. ఇప్పటికి ఆ సంస్థ నుండి 2 బ్యాచ్‌లు చదువులు పూర్తయినాయి. ప్రస్తుతం కొందరు ఉద్యోగాల్లో ఉన్నారు మరికొంతమంది పెళ్ళిళ్ళై కూడా చదువును కొనసాగిస్తున్నవారు కూడా ఉన్నారు.
విజయలక్ష్మిగారు మురికివాడలలో తిరిగే చిన్న చిన్న ఆడపిల్లలను కూడా ఆదుకుంటున్నారు. వారికి ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంకొంతమంది సహాయంతో వీరే స్వంతంగా ఓ పాఠశాలను పెట్టించారు. మురికి వాడలలో పనిచేసుకుంటూ ఉండే పిల్లలను ఆదరించి వారికి ఒక లక్ష్యంగా ఏర్పడేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఆటపాటల్లో, చదువులతో, మిగిలిన కళలతో వారిని ముందుకు నడిపిస్తున్నారు.ప్రస్తుతం 400 మంది విద్యార్థినులకు ఆ పాఠశాల ఉచితంగా విద్యను అందిస్తుంది. అందులో ఉపాధ్యా యినులుగా మొదటి అమ్మ ఒడిలో పెరిగిన వారిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. గొప్ప మానవతా మూర్తి యొక్క పొత్తిళ్ళలో పెరిగిన కూతురు ”రోహిత” ఆమె ఎమ్‌.ఎస్‌. పూర్తి చేసుకుని, వివాహమై ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలందరినీ తన సొంత చెల్లెల్ళలాగా చూసుకుంటూ, వారికి కావల్సిన సమాచారాన్ని అందిస్తూ, తెలియని విషయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వారిమనసులో నిలిచిపోయింది., తాను కూడా తనతల్లితో పాటు చాలా వరకు సహాయం అందిస్తున్నారు. అమెరికాలో వారి స్నేహితులకు, ఆత్మీయులకు, బంధువులకు ఈ సంస్థను పరిచయం చేస్తూ వారి సహాయాన్ని కూడా అందచేస్తున్నారు. ఆదివారం రోజున మొత్తం పిల్లలకి కేటాయించారు. వారి బాబుకు అందరి ఆశీర్వాదాలు కావాలని పాత విద్యార్థులను కూడా ఆహ్వానించారు. ఆ రోజు అందరిరాకతో అక్కడ శుభకార్య వాతావరణం నెలకొంది. విజయలక్ష్మిగారి ఆశయ సాధనకు తోడుంటూ వెనకాల ఉండి కృషి చేసేవారంతా ఆకార్యానికి విచ్చేసారు.
సి.ఎస్‌.ఎస్‌. పాత విద్యాసంస్థ నుండి వెళ్ళిపోయిన విద్యార్థులు మాట్లాడుతూ వారి కుటుంబాన్ని మళ్ళీ కలిసినట్లుగా ఉందని, మేము  చేసే ఉద్యోగాల్లో వచ్చే సంపాదనలో మా వంతు సహాయం ఆ సంస్థకు చేస్తామని తెలియచేసారు. ఈ సంస్థ జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలి అని మాకు తెలియచేసిందని, వారు ఆ మాతృమూర్తిని, జీవితాన్ని అందించిన ఆ సంస్థను కూడా చిరకాలం గుర్తుంటుందని వారి భావాలను వెలిబుచ్చారు. పిల్లల నృత్యాలు, ఆటలు, పాటలు వచ్చిన వాళ్ళందరినీ ఎంతో అలరించాయి.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.