పి.వి. సతీష్, డి.డి.యస్, డైరక్టర
ది ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ, (ఐ.ఎఫ్.ఆర్.సి.) ప్రపంచ విపత్తులపై 2011 నివేదికను ఇటీవల విడుదల చేసింది. జెనీవా నుంచి సేవలు అందించే ఈ ప్రపంచ సంస్థ నివేదిక ప్రధానంగా ప్రపంచవ్యాప్త ఆకలి, పౌష్టికాహార సమస్యలపై దృష్టి పెట్టింది. ఈ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కమ్యూనిటీలు చేసిన కృషిని ఈ నివేదికలో ప్రశంసించడం గర్వకారణం.
ఆహార స్వయంసమృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ విపత్తుల నివేదిక డి.డి.ఎస్. కమ్యూనిటీల గురించి ప్రత్యేకంగా రెండు పేజీలు ”విత్తనాల పరిరక్షణ” భావవ్యక్తీకరణ : ఆంధ్రప్రదేశ్‌లో మెదక్‌జిల్లా మహిళల గురించి రాసారు. ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌జిల్లాలో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ మహిళా సంఘాలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అంతర్జాతీయసంస్థ ప్రశంసలు అందించింది.
”ఆకలిని జయించిన సమాజాలు” అనే చిత్రాన్ని రూపొందిం చిన సి.ఎమ్.టి.ని ఐ.ఎఫ్.ఆర్.సి. గుర్తించి ప్రశంసించింది. ఈ చిత్రం చదువు రాని, వెనుకబడిన తెలంగాణ మహిళల విజయ గాధలకు సంబంధించినది. ఒకప్పటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్థ స్థానంలో డి.డి.ఎస్. కమ్యూనిటీల కృషిని గుర్తించడం గొప్ప విశేషం. ఈ చిత్రం డి.డి.ఎస్. మహిళా సంఘాల అభ్యున్నతికి, ఆ మహిళల స్వయంకృషికి, గౌరవప్రద జీవితానికి నిదర్శనం.
డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా (సి.ఎమ్.టి.)లో చదువు రాని, గ్రామీణ మహిళలు మరీ ముఖ్యంగా దళితులు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ మహిళా సంఘాలు అనేక సంస్థల నుంచి లబ్ధి పొందినా ప్రయోజనం పెద్దగా కనిపించలేదు. డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్టు ఈ రంగంలో చేసిన కృషిని అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. డి.డి.ఎస్ కమ్యూనిటీ మీడియా ట్రస్టు మహిళల కోసం వీడియో కలెక్టివ్‌ని నిర్వహిస్తోంది. దేశంలోని తొలిసారిగా సంఘం అనే కమ్యూనిటీ రేడియోని నిర్వహిస్తోంది. 1996 నుంచి ఈ మహిళా వీడియో కలెక్టివ్ పనిచేస్తోంది. ఈ సంఘం రేడియో 1998 నుంచి నారోకేస్టింగ్ చేస్తోంది. 2008 అక్టోబర్ నుంచి ఉపగ్రహం సహాయంతో ప్రసారాలు చేస్తోంది. ప్రతిరోజు 2 గంటల పాటు బ్రాడ్‌కాస్టింగ్ జరుగుతుంది. ఈ రెండు సంస్థలను పూర్తిగా గ్రామీణ మహిళలు నిర్వహిస్తున్నారు.
గత నెలలో జరిగిన ”2011 కమ్యూనికేషన్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు” అనే ప్రపంచవ్యాప్త పోటీలో డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్టుకు అవార్జు వచ్చింది. ఈ పోటీని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ యూనివర్సిటీ నిర్వహించింది. ఇందులో 22 దేశాలకు చెంది అత్యద్భుత నాణ్యత ప్రమాణాలతో పనిచేస్తున్న 60 సంస్థలు పాల్గొన్నాయి. ఈ అవార్డుల కమిటీ ”డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్టు చేస్తున్న గొప్ప సేవలను గుర్తించి ప్రశంసించింది.”
డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్టు తాజాగా నిరుపేద తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన కమ్యూనిటీలపై నిర్మించిన చిత్రానికి ప్రత్యేకమైన ప్రశంస లభించింది. ప్రతిష్ఠాత్మకమైన జెనీవాకు చెందిన అంతర్జాతీయ సంస్థ ఐ.ఎఫ్.ఆర్.సి. (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్) సెప్టెంబర్ 22, 2011లో నిర్వహించిన ప్రత్యేక ఉత్సవంలో ఐ.ఎఫ్.ఆర్.సి. ఈ చిత్రాన్ని ఢిల్లీలోని ప్రముఖ వ్యక్తులు, మేధావులు సమక్షంలో తిలకించి అభినందించారు. చిత్రాన్ని తిలకించిన వారిలో అత్యున్నత దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు ఢిల్లీకి చెందిన ప్రముఖ పౌరులు ఉన్నారు.
”ఆకలిని జయించిన సమాజాలు” అనే ఈ చిత్రం డి.డి.ఎస్. కమ్యూనిటీలకు చెందిన స్ఫూర్తిదాయకమైన విజయగాధలను వివరిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ఆహార స్వావలంబన కోసం జరిగిన సమరాన్ని వివరిస్తుంది. ఇదంతా ఇటీవల కాలంలో జరిగిన సమరమే. ఈ గ్రామీణ నిరుపేదలు ఆకలి, లేమికి వ్యతిరేకంగా పోరాడి నిలబడ్డారు. ఎంతోకాలం వారు రాత్రి, పగలు ఆకలితో జీవించారు. ఒక కంచం నిండా అన్నం తినడం వారికి ఒక కల వంటిది. ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ జిల్లాలో వేలాది మంది మహిళల అవస్థ అలా ఉండేది. డి.డి.ఎస్.కు చెందిన సంఘం (స్వచ్ఛంద సంస్థలు) ఏర్పాటు కాక ముందు దురవస్థ ఇది., ఈ స్వచ్ఛంద సేవా సంఘాలు ఏర్పాటు అయ్యాక వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
”ఆకలిని జయించిన సమాజాలు” అనే సినిమాలో ఈ గ్రామీణ తెలంగాణా నిరుపేద మహిళల దీనగాధల నుంచి విజయగాధల వరకు చిత్రీకరించబడింది. వీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి రెండు దశాబ్దాల్లో ఆకలి బాధను జయించి ఆహార సమృద్ధిని సాధించారు. గతంలో ఆహారం కోసం చేతులు చాచిన వారు, ఇతరులకు అన్నం అందించే పరిస్థితిలో ఉన్నారు. ”ఈ కమ్యూనిటీ క్వాంకర్స్ హంగర్” అనే చిత్రం గ్రామీణ మహిళల అభివృద్ధికి నిదర్శనం.
డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్టుకు చెందిన చదువులేని మహిళా వ్యవసాయదారులు నిర్మించిన ఈ చిత్రం… ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ ప్రశంసలు పొందింది. ఈ 15 నిముషాల చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ జిల్లాలో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కమ్యూనిటీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చిన చిన్న నర్సమ్మ, హ్యుమ్నాపుర్ లక్ష్మమ్మ, దండు స్వరూపమ్మ, దండు సూరెమ్మ, పుణ్యమ్మ, తమ్మలి మంజుల తదితర డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్టు సభ్యులు గ్రామీణ మహిళా సంఘాల విజయాలను వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా పేదరికంలో గడిపిన తమకు డి.డి.ఎస్. ఇచ్చిన ప్రోత్సాహాన్ని, సహాయాన్ని వివరించారు.
చిన్న నర్సమ్మ ఒక మారుమూల గ్రామంలోని చిన్న రైతు కుటుంబానికి చెందింది. ఇప్పుడు ఆమె కమ్యూనిటీ ఫిల్మ్ మేకర్ ”ఆకలిని జయించిన సమాజాలు” చిత్రాన్ని నిర్మించింది ఆమే. గ్రామీణ నిరుపేదలకు సంవత్సరానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించిన తొలి స్వచ్ఛంద సేవా సంస్థ డి.డి.ఎస్. సంఘాలు అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. ఈ ఉపాధి పథకం ద్వారా ఇంతకు ముందున్న ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కంటే మిన్నగా పనిచేసింది. డి.డి.ఎస్. కమ్యూనిటీల సహాయంతో 5,000 ఎకరాల బంజరు భూములను గత పదేళ్ళలో 30 గ్రామాల్లో సాగులోకి తెచ్చుకున్నారు. ఈ భూముల్లో ఏడాదికి 2 కోట్ల కిలోల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ సంఘాల్లో సభ్యుల్లో ఆకలి బాధను నివారించడానికి తీసుకున్న మొదటి అడుగు ఇది.
జహీరాబాద్ పుణ్యమ్మ మీడియాతో మాట్లాడుతూ డి.డి.ఎస్. మహిళా సంఘాలు ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటిగా భూములను లీజుకు ఇచ్చి సామూహిక వ్యవసాయ వర్గాలుగా ఏర్పడ్డాయి అని చెప్పింది. ఈ సామూహిక వ్యవసాయం ద్వారా అధిక ఆహార దిగుమతులను సాధిస్తున్నాం అని తెలిపింది. ఈ రెండు దశాబ్దాల్లో డి.డి.ఎస్. మహిళా సంఘం వెయ్యి ఎకరాలకు పైగా భూమినిలీజుకు తీసుకుని ఐదు లక్షల కిలోల ఆహార ధాన్యాలను పండించారు. డి.డి.ఎస్. సంఘాల కృషి వల్ల మెదక్ జిల్లాలోని 100 గ్రామాల్లో నేడు అనేక కుటుంబాలు ఆకలి బాధను అధిగమించాయి. అంతకు ముందు ఆహారం కోసం చాచిన చేతులే ఇపుడు నలుగురికి పెట్టే స్థితిలోకి వచ్చాయి. కమ్యూనిటీ ఫిల్మ్ మేకర్ అయిన దండు స్వరూపమ్మ మాట్లాడుతూ ఈ ప్రత్యామ్నాయ డి.డి.ఎస్. కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో వివరించింది. ఆమె డి.డి.ఎస్ ఆహార స్వయంసమృద్ధి సంఘంలో సభ్యురాలు. ఆహార ధాన్యాలు స్థానికంగా నిల్వచేసుకోవడం, స్థానికంగా పంపిణీ చేసుకోవడం వీటి ప్రత్యేకత. ఈ సంఘాలు 4,500 ఎకరాల బంజరు భూమిని సాగులోకి తీసుకొచ్చి ఏడాదికి 10 లక్షల కిలోల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ సంఘాలు వివిధ గ్రామాల్లోని పేదలకు రేషన్ కార్డులను అందించి వారు ప్రతి నెల 10-25 కిలోల జొన్నలను అందుకునేలా ఏర్పాటు చేశారు. వారి దారిద్య్ర స్థాయిని బట్టి పరిమాణం ఉంటుంది.
బెగారి లక్ష్మమ్మ అనే కమ్యూనిటీ ఫిల్మ్ మేకర్, కమ్యూనిటీ సీడ్ మేకర్ మాట్లాడుతూ ఈ గ్రామాలన్నీ విత్తనాల కోసం బహుళజాతి కంపెనీల మీద ఆధారపడకుండా స్వయంగా తయారుచేసుకుంటున్నారని దాదాపు 50-80 విత్తన రకాలను రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పింది. ఈ గ్రామాల్లోని వేలాది మంది మహిళలు తమ ఇళ్ళలోనే విత్తనాలను నిల్వ చేసుకుని ఉంచుకుంటున్నారని చెప్పింది. ఈ గ్రామాల్లో విత్తనాల కోసం బహుళజాతి సంస్థల మీద ఆధారపడకుండా ఉన్నారని చెప్పింది. తమ్మలి మంజుల అనే ఫిల్మ్ మేకర్, డి.డి.ఎస్. కమ్యూనిటీ ఫుడ్ సావర్నిటీ కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ అనేక వేల కుటుంబాలు ఆకలిని జయించి ఆహార సమృద్ధిని సాధించాయి అని చెప్పారు. డి.డి.ఎస్. కమ్యూనిటీ మీడియా ట్రస్ట్ నిర్మించిన ”ఆకలిని జయించిన సమాజాలు” అనే చిత్రంలోని ప్రధాన అంశం ఈ గ్రామీణ నిరుపేద మహిళల విజయగాథే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags