ఆకాశంలో ఆమె ఎక్కడ….?

డా. జి. లచ్చయ్య

(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) ఆకాశంలో సగం నువ్వు, సగం నేను అన్న ముచ్చట ఒకప్పటిది. ఇప్పుడు ఆకాశంలో అంతా నేనే (మగ) అనేది నేటి సామెతగా మారిపోయింది. ఈ దేశాన్ని ఎప్పుడు ఒక సామాజిక రుగ్మత పట్టి పీడిస్తూనే వుంటుంది. ఒకప్పుడు ఇలాంటి సామాజిక రుగ్మతలకు కారణం అవిద్య, మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే వాళ్ళం. కాని విద్య, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం సామాజిక రుగ్మతల్ని రూపుమాపకపోగా మరింతగా పెంచి పోషిస్తున్నాయని నేటి గణాంకాలు తెలుపుతున్నాయి. 2011 జనాభా లెక్కల్ని చూసినప్పుడు, అందులో 0-6 వయస్సు గల ఆడ-మగ శిశువుల నిష్పత్తి చూస్తే మనం ఎంత అంధయుగంలో వున్నామో తెలుస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం 0-6 సంవత్సరాల మధ్యగల శిశు లింగ నిష్పత్తి (్పునీరిజిఖి ఐలిని ష్ట్రబిశిరిళి – ్పుఐష్ట్ర) దేశవ్యాపితంగా 2001 నాటి లెక్కలతో పోల్చినప్పుడు 13 పాయింట్లు తగ్గిపోయింది. నిజానికి (1901 జనాభా లెక్కల నుండి) ఈ వివక్షత కొనసాగుతూనే వున్నది. కాని గత దశాబ్దకాలంలో ఈ శిశు లింగ నిష్పత్తిలో ఇంత ఘోరమైన వ్యత్యాసం కనపడడం ఇదే మొదటిసారి. 2001లో దేశంలో ప్రతి 1000 మంది మగశిశువులకు 927 ఆడ శిశువులుండగా 2011 నాటికి ఇది 914కి (13 మంది ఆడపిల్లలు తగ్గారు) పడిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే 2001లో ఈ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ పిల్లలకు 961 వుండగా 2011 నాటికి 18 మంది ఆడపిల్లలు తగ్గి 943కు పడిపోయింది. జాతీయ సరాసరి కన్నా ఆంధ్రప్రదేశ్‌లో 5 పాయింట్ల తగ్గుదల అధికంగా వుండడం గమనించాలి. ఎందుకిలా జరుగుతున్నది……? ఆడ శిశువుల సంఖ్య ఇదే లెక్కన పడిపోతూ వుంటే రానున్న రెండు దశాబ్దాల కాలంలో దేశ జనాభాలో 20 శాతం మంది మగవారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే ఆడవారి కొరత (ఇప్పటికే ఏర్పడింది) ప్రకృతి అసమతుల్యతకు, సామాజిక సమస్యలకు కారణమైతుంది. దీనంతటికి కారణం బహిరంగంగా చర్చించుకునే నిరక్షరాస్యతనో, అనాగరికతనో కారణం కాదని, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, ఉన్నత వర్గాల్లో మగ పిల్లల పట్ల పెరుగుతున్న మోజు అని సర్వేలు తెలుపుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానమే సమస్యకు కారణం : ప్రపంచ దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక వికాసం కోసం వినియోగించుకుంటే, భారతదేశం సామాజిక వినాశనానికి ఉపయోగించుకుంటున్నది. చాలా దేశాల్లో మగవారికన్నా ఆడవారి జనాభా అధికంగా వుంటున్నది. ఇది ప్రకృతి సూత్రం కూడా. జంతు జాలాల్లో కూడా మగ జంతువులకన్నా ఆడ జంతువులే అధికంగా వుంటాయి. తమ తమ సంతానాన్ని తర్వాతి తరానికి అందించాలంటే ఈ సూత్రీకరణ అనివార్యం కూడా. అయితే గర్భస్థ శిశువు అభివృద్ధిని గుర్తించడానికి వచ్చిన అల్ట్రాసౌండ్‌ సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశంలో ఆడపిల్లల్ని గర్భంలోనే చంపడానికి వినియోగించుకోవడం శోచనీయం. దేశంలో దాదాపు 35,000 పైగా ఇలాంటి పరికరాలుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 4,162 వున్నట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఈ పరికారాన్ని సద్వినియోగం చేయాలని 1994లో గర్భనిర్ధారణ, గర్భస్థ శిశు పరీక్షల చట్టాన్ని (ఆజీలి-్పుళిదీబీలిచీశిరిళిదీ ఞ ఆజీలి-శ్రీబిశిబిజి ఈరిబివీదీళిరీశిరిబీ ఊలిబీనీదీరివితిలిరీ జుబీశి – ఆ్పు ఞ ఆశ్రీఈఊ జుబీశి) జనవరి 1, 1996 నుంచి అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఈ పరికరాన్ని కొనుగోలు చేసిన హాస్పిటల్‌ లేదా డాక్టర్‌ నెలవారిగా జరిపిన పరీక్షల్ని రిజిస్టర్‌లో నమోదు చేసి, ఆరోగ్య శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ఈ పరికరాన్ని గర్భస్థ శిశువు యొక్క అవయవాల అభివృద్ధిని, శిశు అభివృద్ధిని గుర్తించడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప, ఎట్టి పరిస్థితిలోను శిశువు యొక్క లింగ నిర్ధారణను తల్లికిగాని, తండ్రికి గాని, కుటుంబ సభ్యులకు గాని తెలియజేయకూడదు. అలా తెల్పడంలేదనే ప్రకటనను (ఈలిబీజిబిజీబిశిరిళిదీ) విధిగా సంబంధిత డాక్టరు నమోదు కూడా చేయాలి. కాని సామాజిక, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది డాక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి, గర్భందాల్చిన 3వ నెలలోపే ఆడ, మగ నిర్ధారణ చేయడంలో ఆడపిల్లల్ని వద్దనుకునేవారు వెంటనే గర్భస్రావానికి ఒడిగడుతున్నారు. ఈ రెండు పనులకుగాను డాక్టరుకు రెండు విధాలుగా డబ్బు అందుతున్నది. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడానికి స్థానిక ఆరోగ్య శాఖకు, అధికార యంత్రాంగానికి అధికారులున్నా, స్వయంగా వారే ఇలాంటి సంస్థల్ని కలిగి వుండడంతో చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. చట్టం ఏం చెపుతుంది…..! గత రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 10 మిలియన్ల (ఒకకోటి) ఆడ శిశువుల హత్యలు జరిగితే కేంద్ర ఆరోగ్యశాఖ వరుసగా 2007 నుంచి 2009 సంవత్సరాలలో సెక్షన్‌ 315,316 కింద 96,73,123 కేసుల్ని నమోదు చేయగా 2010 సం||లో కేవలం 107 కేసుల్ని మాత్రమే నమోదు చేసిందంటే మన చట్టాల నియంత్రణ పై ప్రభుత్వాల దక్షత ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. ఇవి వరుసగా మధ్యప్రదేశ్‌లో (35), రాజస్థాన్‌ (18), మహారాష్ట్ర, గుజరాతులలో (9చొ||) ఛత్తీస్‌గఢ్‌లో (4), హర్యానా, ఢిల్లీలలో (3 చొ||), ఆంధ్రప్రదేశ్‌, గోవాలో ఒకేఒక కేసు చొప్పున నమోదు చేయడం జరిగింది. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఈ చట్టాన్ని 2003లో మరింత కఠినతరం చేయడం జరిగింది. దీని ప్రకారం ఉల్లంఘించిన వారికి రూ|| 10 వేల జరిమానతో పాటుగా, 3 సం||ల జైలుశిక్ష వుంటుంది. తిరిగి మళ్ళీ ఉల్లంఘిస్తే 5 సం||ల జైలు శిక్షతో పాటు, రూ|| 50 వేల జరిమానతో లైసెన్సును కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఈ లెక్కన దేశవ్యాపితంగా ఒక్కరి కంటే ఒక్కరికి కూడా ఈ నాటికి శిక్షపడలేదు. అయినా దేశంలో ప్రతి సంవత్సరం 5-7 లక్షల గర్భస్థ ఆడ శిశువుల హత్యలు (ప్రతిరోజు దాదాపు 2000) ఈ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్నట్లు ఇండో కెనడియన్‌ శాస్త్రజ్ఞులు లాన్‌సెట్‌ (ఊనీలి ఉబిదీబీలిశి) అనే రిపోర్టులో తెలపడం జరిగింది. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల గూర్చి సమాచారాన్ని అందించడానికై ప్రభుత్వం 1800-11-0500 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను 2008లో ప్రారంభిస్తే, ఈ నెంబర్‌ గత మూడు సంవత్సరాలుగా మనుగడలోనే లేకుండా పోయింది. మన ప్రభుత్వాల నిబద్ధతకు ఇదో మచ్చుతునక. ఈ పాపానికి ఒడిగట్టే వారెవరు……? ఆడ శిశు భ్రూణ హత్యలకు పాల్పడుతున్నది ఏ అనాగరికులో, మారుమూల ప్రాంతాలవారో, గిరిజనులో, హరిజనులో, నిరక్షరాస్యులో లేదా అజ్ఞానులే అనుకుంటే పొరపాటే. లాన్‌సెట్‌ (ఉబిదీబీలిశి) సేకరించిన సమాచారం ప్రకారం ఈ నిర్ధారిత ఆడశిశు భ్రూణహత్యలన్నీ అత్యధికంగా ఉత్తర భారతదేశంలో జరుగగా, వ్యవసాయికంగా అభివృద్ధి చెందిన హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌లలోని వెనుకబడిన సనాతన సాంప్రదాయాలుగల చదువుకున్న సంపన్న వర్గాలు ఈ దురాగతములో ముందుస్థాయిలో వున్నాయి. చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చి, కెనడియన్‌ స్టడీస్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ రిసెర్చి మరియు ముంబాయి ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ల సంయుక్త సర్వేల ప్రకారం మరియు 1991-2011ల మధ్యకాల జనాభాల గణాంకాల వివరాల ప్రకారం 1990-2005 సంవత్సరాల మధ్యన జరిగిన 2.5 లక్షల ఆడశిశు హత్యల రికార్డులను పరిశీలించగా, అత్యధికంగా చదువుకున్న సంపన్న వర్గాలవారే ముందస్తు లింగ నిర్ధారణ పరిజ్ఞానంతో, ఆడ శిశుపిండాల (ఓలిశిరిబీరిఖిలి) హత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరి లెక్కల ప్రకారం 1980-2010 మధ్యకాలంలో దేశవ్యాపితంగా 12.1 మిలియన్ల (ఒక కోటి 20 లక్షలకు పైగా) ఆడ పిండాలుగా గుర్తించి గర్భస్రావాలు చేయించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఈ ఆడపిండాలను గుర్తించి గర్భస్రావాలు చేయించడమనేది 1980కి ముందు అసలు లేనేలేదని (అల్ట్రాసౌండ్‌ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో) 1980 వరకు ఇవి 2 మిలియన్లు జరుగగా, 2010 నాటికి ఈ సంఖ్య 6 మిలియన్లకు చేరుకుందని తెలిపాయి. బీహారు (ఔరినీబిజీ, ఖ.ఆ., ష్ట్రబిశీబిరీశినీబిదీ, ఏఆ-ఔ|ఖజుష్ట్ర) రాష్ట్రాలలో ముందుండే బీహారు కూడా వ్యవసాయికంగా అభివృద్ధి చెంది సంపన్నంగా వున్న హర్యానా, పంజాబ్‌ల కన్నా, సాంకేతికంగా, పరిశ్రమల పరంగా ముందున్న మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, చండీగఢ్‌లకన్నా ఆడ పిండాల హత్యలలో నాగరికంగా వుంది. పంజాబ్‌, హర్యానాలలో కూడా, హరిజనులలో ఈ మూఢాచారం తక్కువగా వుండగా హరిజనేతరులలో అధికంగా వున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం జాతీయ సరాసరి 927 ఆడశిశువులకుగాను హరిజనులలో 938గా, గిరిజనులలో 973గా వుండగా, హరిజన, గిరిజనేతర కుటుంబాలలో ఈ సంఖ్య ప్రతి వెయ్యి బాలురకు 919గా నమోదు అయింది. జాతీయ సరాసరి గిరిజన జనాభాకన్నా ఎక్కువ జనాభాగల 233 జిల్లాలో ఈ నిష్పత్తి 949గా వుండడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా గిరిజన జనాభా అత్యధికంగా గల మిజోరం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు కేరళకన్నా అత్యధికంగా ఆడపిల్లల్ని కలిగి వున్నాయి. అక్షరాస్యత పరంగా, అభివృద్ధి పరంగా చూసినప్పుడు కూడా ఈ వ్యత్యాసం కొట్టచ్చినట్లుగా కనపడుతున్నది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాంకేతికంగా, అక్షరాస్యత పరంగా పైనున్న 10 జిల్లాల పిల్లల లింగ నిష్పత్తి (్పునీరిజిఖి ఐలిని ష్ట్రబిశిరిళి – ్పుఐష్ట్ర) 887 వుండగా, అట్టడుగునున్న 10 జిల్లాల లింగ నిష్పత్తి 937గా వుంది. గుజరాత్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌లలో సాంప్రదాయ బద్దంగా వున్న రాజస్థాన్‌, బీహారులలో కూడా పరిస్థితి ఇదే విధంగా వుంది. మొన్నటి జనాభా లెక్కల ప్రకారమే జాతీయ సరాసరి అక్షరాస్యతకన్నా అధికంగా అక్షరాస్యత గల మహారాష్ట్ర (83%)లో లింగ నిష్పత్తి 883కాగా అక్షరాస్యత తక్కువగా గల ఛత్తీస్‌గఢ్‌ (71%-స్త్రీలది 61%) లింగ నిష్పత్తి 964గా నమోదు కావడం ఆలోచించాల్సిన అంశం. గ్రామీణ పట్టణ, ప్రాంతాల పిల్లల లింగ నిష్పత్తిని చూసినట్లైతే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు ప్రాంత రాష్ట్రాలైన, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లకన్నా బాగున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల పిల్లల లింగ నిష్పత్తిలో పెద్దగా వ్యత్యాసం లేకపోగా, 2001 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన బాగా వెనకబడిన 150 జిల్లాల పిల్లల లింగ నిష్పత్తి 947 కాగా అభివృద్ధిలో ముందున్న మిగతా జిల్లాల సరాసరి 921గా వుంది. ఈ వ్యత్యాసం ఈ కింది రాష్ట్రాలలో మరీ కొట్టచ్చినట్లుగా కనపడుతున్నది రాష్ట్రం పిల్లల లింగ నిష్పత్తి వెనుకబడిన అభివృద్ధి చెందిన ప్రాంతం ప్రాంతం గుజరాత్‌ 923 873 జమ్ము & కాశ్మీర్‌ 992 932 మధ్యప్రదేశ్‌ 948 924 రాజస్థాన్‌ 931 905 ఒరిస్సా 964 937 జాతీయ సరాసరి 947 921 పంజాబ్‌, హర్యానాలు 2001 కన్నా 2011లో కొంత అభివృద్ధిని సాధించినా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే అట్టడుగునే వున్నాయి. పంజాబ్‌ (846), హర్యానా (830) లుండగా, ఉత్తరాది ఏ రాష్ట్రం కూడా 900 పైగా పిల్లల లింగ నిష్పత్తినిదాటి లేకపోవడం గమనార్హం. నిజానికి గత దశాబ్ది కాలంలో పంజాబు 48 మంది ఆడపిల్లల్ని కాపాడుకోగా, హర్యానా 11 మంది పిల్లల్ని కాపాడగలిగింది. దీనికి భిన్నంగా జమ్ముకాశ్మీర్‌ 2001లో మెరుగ్గా వుండగా ప్రస్తుతం 859తో మూడవ స్థానంలో నిలిచింది. గత దశాబ్దికాలంలో ఈ రాష్ట్రం 82 మంది ఆడపిల్లల్ని కోల్పోయింది. అందుకే ఈ రాష్ట్రాలలో పెళ్ళికాని మగవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కూడా జమ్ముకాశ్మీరు బాటలోనే నడుస్తున్నది. గత 30 సం||ల (1981) నుంచి పరిశీలించినట్లైతే దేశం సరాసరి ప్రతి 1000 మంది బాలురకు 48 మంది ఆడపిల్లల సంఖ్య తగ్గిపోగా, జమ్ముకాశ్మీర్‌, మహారాష్ట్ర, హర్యానాలు ఈ నిష్పత్తి తగ్గిపోవడానికి మరింత కారణమైతున్నాయి. అక్షరాస్యతలో ముందుండి, ఆడ, మగ నిష్పత్తిలో కూడా అగ్రగామిగా వున్న కేరళ కూడా పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, మిజోరం, అండమాన్‌ నికోబర్‌ దీవులకన్నా 2011 జనాభా లెక్కలలో ఆడశిశువులను తక్కువగల రాష్ట్రంగా మిగిలిపోవడం శోచనీయం. ఇక దేశంలోనే ఆడ పిల్లల సంఖ్య అతి తక్కువగల జిల్లాలలో హర్యానాలోని జహజ్జర్‌ జిల్లా నిలిచింది. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు 774 ఆడపిల్లలున్నట్లు లెక్కలు తేలాయి. విచిత్రమేమిటంటే, ఈ జిల్లా ఢిల్లీకి సమీపంగా వుండడం గమనార్హం. ఢిల్లీకి దగ్గర వుండడం, లింగ నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో వుండడమే ఈ విపత్తుకు కారణమని ఆ జిల్లా యంత్రాంగం వాపోయింది. ఇక రెండవ స్థానంలో వున్న మరో జిల్లా మహేంద్రగఢ్‌ చుట్టూ రాజస్థాన్‌ వుండడమని ఇక్కడి హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి చెప్పడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ విషయంగా…….. 2001 జనాభా లెక్కలతో పోల్చినప్పుడు దేశ సరాసరి నష్టానికన్నా ఆంధ్రప్రదేశ్‌ 5 పాయింట్ల ఆధిక్యతతో వుంది. ఈ కింది పట్టికను గమనిస్తే ఆడపిల్లల లింగ నిష్పత్తి జాతీయ స్థాయి కన్నా మెరుగ్గావున్నా, లింగనిర్ధారణ హత్యలు అధికంగా వున్నట్లు దోహదపడుతుంది. ప్రతి 1000 మంది బాలురకు 2001 2011 తగ్గుదల ఆంధ్రప్రదేశ్‌ 961 943 18 జాతీయ స్థాయి 927 914 13 ఇక జాతీయ స్థాయి కన్నా తక్కువ ఆడశిశువుల్ని గల జిల్లా వరంగల్‌ నమోదు కావడం గమనార్హం. 1991లో 977తో 11వ స్థానంలో వుండగా, 2001లో 955తో 8వ స్థానానికి, 2011లో 912తో మొదటి స్థానానికి దిగజారిపోవడం జరిగింది. దీనికిగల కారణాలు అధికారికంగా వెళ్ళడి కాకపోయినా, లింగ నిర్ధారణ చట్టం అమలు సరిగా లేకపోవడం ఒక కారణమైతే, ఉన్నత వర్గాలలో వరకట్న దురాచారం మరొక కారణంగా గుర్తిస్తున్నారు. గత 2005 నుంచి 2011 మధ్యకాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో లింగ నిర్ధారణ పేరుతో జరిగిన ఆడపిల్లల భ్రూణ హత్యల్ని ఈ కింది పట్టికలో గమనించండి. జిల్లా భ్రూణ హత్యలు జిల్లా భ్రూణ హత్యలు వరంగల్‌ 7,280 ప్రకాశం 4,228 అనంతపుర్‌ 6,768 కరీంనగర్‌ 4,121 నల్లగొండ 5,579 ఆదిలాబాద్‌ 3,257 కడప 5,237 విజయనగరం 2,844 మహబూబ్‌నగర్‌ 5,192 తూర్పు గోదావరి 2,282 చిత్తూరు 5,153 నెల్లూరు 1,227 కర్నూలు 5,062 హైద్రాబాద్‌ 815 జాతీయ స్థాయి-10,78,378 ఆంధ్రప్రదేశ్‌-78,847 గత ఆరు సంవత్సరాల గణాంకాలు ఇంత దారుణంగా వుంటే గత దశాబ్దకాలంగా ఎన్ని లక్షల గర్భస్థ ఆడ శిశు పిండాలు మాయం అవుతున్నయో ఊహించవచ్చు! దీనికంతటికి కారణం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడమేనా, లేక మరేదైనా కారణం వుందా ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈ దారుణాలకు కారకులెవరు? గత మే 10న కర్నూలు పట్టణంలో నివసించే వడ్రంగి ప్రకాశ్‌ ఆచారి తన భార్య సురేఖ మూడవసారి కూడా ఆడపిల్లను కనబోతున్నదని లింగ నిర్ధారణ ద్వారా తెలుసుకొని గొంతు నులిమి హత్యచేసాడు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లల గల ఆచారి మరోసారి భార్య గర్భం దాల్చగా లింగ నిర్ధారణతో ఆడపిల్ల అని తెలుసుకొని ఒకసారి అబార్షన్‌ చేయించాడు. తిరిగి నాల్గవసారి కూడా ఆడపిల్ల అని తెలియడంతో, భార్య అబార్షనుకు ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి చంపాడు. ఇది జరిగిన ఐదు రోజులకే కడప జిల్లా గాలివీడు మండలం కొత్తవడ్డెపల్లికి చెందిన పిచ్చయ్య భార్య సుభద్రమ్మ వరుసగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే ఆరోపణతో విషం తాగించి హత్య చేసాడు. ఇందులో మొదటిది లింగ నిర్ధారణ పరీక్ష పరిజ్ఞానం కారణం కాగా, రెండవది వ్యక్తి గత పరిజ్ఞానం లేకపోవడం మూలంగా జరిగింది. ఆడ, మగ నిర్ధారణ మగవాడిపైనే వుంటుందనే పరిజ్ఞానం చదువుకున్న వారిలో కూడా కొరవడడం, ఆడవారినే బాధ్యులుగా చేయడం ఈ సమాజంలో అనాదిగా జరుగుతూనే వున్నది. ఈ అజ్ఞానంతోటే రెండో పెళ్ళిని చేసుకునే ఆచారం మొదలైంది. నిజానికిది కింది స్థాయి వర్గాల్లో కనపడేది కాదు. సంపన్న వర్గాల సంస్కృతి, ప్రస్తుత విద్యావిధానం ఈ దుర్గుణాన్ని కింది వర్గాల వారికి అంటగట్టింది. ఒకప్పుడు గిరిజనులలో, కూలినాలి చేసుకునే వర్గాల్లో ఆడపిల్లను లక్ష్మితో పోల్చుకునేవారు. వారెప్పుడు ఆడపిల్లను భారంగా భావించేవారుకారు. పెళ్ళికి ఆడపిల్ల దొరకడమే భాగ్యంగా భావించే వారు. గిరిజనులలో, ముఖ్యంగా బంజారులలో ప్రస్తుతం ఇది తిరోగమనంగా మారింది. ప్రస్తుత విద్యావిధానంతో పాటు, గిరిజనేతరుల సాంప్రదాయాలు ఈ గిరిజనులను అనాలోచితుల్ని చేస్తున్నది. గిరిజనేతరుల్లో వున్న వరకట్న దురాచారం చదువుకున్న గిరిజన యువకుల్ని కలుషితం చేయడంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళులు గిరిజనులకు భారంగా మారాయి. అందుకే ఒకప్పుడు అదృష్టంగా భావించబడిన గిరిజన ఆడపిల్ల శిశువు దశలోనే చంపబడుతున్నది. లేదా అంగట్లో సరకుల్లాగా అమ్మబడుతున్నది. ఇలాంటి సంఘటనలు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో విరివిగా కనపడుతాయి. దాదాపు ఇదే పరిస్థితి మిగతా గిరిజన తెగల్లో కనపడుతున్నది. మిగతా దళిత వర్గాల్లో కూడా ఆడపిల్ల భారంగా మారడం ఆధునిక పోకడలకు, మగ పిల్లవాడిపై మక్కువకు నిదర్శనంగా కనపడుతున్నది. దీనికి తోడు సంపన్న వర్గాలు ఉపయోగించుకునే అల్ట్రాసౌండు పరికరాలు విరివిగా అందుబాటులోకి రావడం మరోముఖ్యమైన కారణం. ఉదాహరణకు ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే వీటి సంఖ్య గత 2004-05ల మధ్యన 146 శాతంకు పెరిగాయంటే, సాధారణ ప్రజలకు కూడా ఇవి ఎంత చేరువులో వున్నాయో తెలుస్తున్నది. ఏ వర్గాలు ఈ దురాగతానికి పాల్పడుతున్నాయి….? మగాడు లేని ఇల్లు చేటు, మోదుగులు లేని అడవి చేటని, వంశోద్ధారకుడని, చస్తే కొరివి పెడతాడని ఇలా అనేక ఉపమానాలతో మగవాడి స్థాయిని మన సాంప్రదాయాలు ఉన్నతంగా కీర్తిస్తున్నాయి. దీనికి తోడు మన ఇతిహాసాలు, భాగవతాలు మగవానికి పెద్దపీట వేసాయి. స్త్రీ, పురుషుడికి బానిసగా వుండాలనే మనుసంస్కృతి ఈ ఆలోచనలకు కారణమైతే, స్త్రీ పురుషుడి పాదాల చెంత వుండాలనే విష్ణు, లక్ష్మిల చిత్రాలను హిందూ సాంప్రదాయాల్లో చూపించడం కూడా మరో కారణం. అయితే స్త్రీని తక్కువ చేసి చూపడంలో అనేది దాదాపు అన్ని దేశాల్లో వున్నా లింగ వివక్షత హిందూ సమాజంలో వున్నంతగా మరే సమాజంలో, మతంలో కనపడదు. మనదేశ జనాభాలోనే ఈ వివక్షత అత్యధికంగా హిందువులలో తర్వాత జైనులలో, సిక్కులలో వున్నట్లు జనాభా లెక్కలు చూపగా క్రిస్టియన్‌, ముస్లీం కమ్యూనిటీలలో ఈ దురాగతం లేకపోవడం గమనార్హం. హిందువులలో కూడా సంపన్న వర్గాలల్లోనే ఇది అధికంగా వున్నట్లు, అందునా రాజపుత్రులలో, జాట్‌లలో, ఠాకూర్లలో అధికంగా వున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. 1990-2005 మధ్యకాలంలో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం 20 శాతం ఉన్నత స్థాయి కుటుంబాలలో (విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎక్కువగా వున్న) రెండవ సంతానం ఆడపిల్ల అని తేలితే చంపివేయడం జరుగుతన్నదని తేలింది. ఇదే విధంగా అట్టడుగున గల 20 శాతం కుటుంబాలలో (విద్య, ఆర్థిక, సామాజిక స్థాయి తక్కువగా గల) ఈ దురాగతం అమలు లేదని తేలింది. పెళ్ళి-తంతు – విద్యావిధానం : ఆడపిల్ల పెళ్ళి భారం ఏ దేశంలో లేనంతగా భారత దేశంలో వుంది. దాదాపు ఈ దృక్పథం యావత్‌ భారత సమాజంలో (ఒక్క గిరిజన తెగల్లో తప్ప) నాటుకొని పోయింది. వాషింగ్టన్‌ బేస్‌డు పాపులేషన్‌ రెఫరెన్స్‌ బ్యూరో 2011లో ప్రచురించిన ది వరల్డ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్‌ ్స (ఊనీలి ఇళిజీజిఖి ఇళిళీలిదీ బిదీఖి స్త్రరిజీజిరీ) రిపోర్టు ప్రకారం 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి వివాహ వయస్సును లెక్కించగా భారతదేశంలో 47 శాతం ఆడవారు 18 సంవత్సరాలకే పెళ్ళి చేసుకున్నట్లు తేలింది. సౌత్‌ సెంట్రల్‌ ఆసియాలో ఇది 45 శాతం కాగా, ఆఫ్రికా దేశాలది 38 శాతంగా, పాకిస్తాన్‌ది 24 శాతంగా వుండడం గమనించాలి. మనకన్నా బంగ్లాదేశ్‌, మాలిలలో మెరుగ్గా వున్నట్లు తేలింది. మనం గతంలో అన్నీంటికి మార్గదర్శకంగా తీసుకున్న ఇంగ్లాండుగాని, ప్రస్తుతం మార్గదర్శకంగా తీసుకుంటున్న అమెరికా గాని ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ పెళ్ళిళ్ళు అత్యధికంగా రాజస్థాన్‌, బీహార్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్రాలలో జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ విధంగా తక్కువ వయస్సులో, కనీస విద్యార్హత లేకుండా పెళ్ళిళ్ళు చేయడం భారతదేశ సాంప్రదాయంగా మారింది. దీనికి ప్రస్తుత విద్యావిధానం కూడా ప్రధాన కారణం. మధ్యలో బడి మానివేసే పిల్లల్లో ఆడపిల్లలే అధికంగా వున్నట్లు అందరికి తెలిసిందే. దీనికి గల కారణాలు 7, 8వ తరగతులలో గణితం, సైన్సు, ఆంగ్లంలలో అత్యధికంగా విద్యార్థులు ఫేలుకావడం, లేదా పాఠశాల అందుబాటులో లేకపోవడం (3 కి.మీ. ఆపైన) వుండడంతో గ్రామీణ తల్లిదండ్రులు ఆడపిల్లలను చదువు మాన్పించి, ఇంట్లో పనికి తీసుకోవడం, పెళ్ళిళ్ళు చేయాలనే ఆలోచనకు రావడం జరుగుతున్నది. ఈ విధానం ఈ మధ్యన పట్టణ ప్రాంత మధ్య తరగతుల్లో కూడా కనపడుతున్నది. కనీస పాఠశాల విద్య లేకపోవడం, ఉన్నా భార్యా భర్తలిద్దరిలో సామాజిక స్పృహ లేకపోవడం, తల్లిదండ్రుల సనాతన ఆలోచన విధానాలు ఆడపిల్ల కన్నా మగవాడు ముద్దు అనే తప్పుడు ఆలోచన, ఆడపిల్ల పట్ల వ్యతిరేక భావనను కల్గిస్తున్నది. తప్పిపోతున్న – పారిపోతున్న పిల్లలు : 2010లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం 6,500 మంది పిల్లలు తప్పిపోవడం, ఇంటి నుంచి పారిపోవడం జరుగుతున్నదని తేల్చింది. ఇందులో 2,500 కేసులు హైదరాబాద్‌కు చెందినవికాగా తప్పిపోతున్నవారిలో ఆడపిల్లల సంఖ్య సగానికి పైగా వుంటున్నది. ప్రతి సంవత్సరం పరీక్షలు, ఫలితాలు వెలువడే ఏప్రిల్‌, జూన్‌ కాలంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తేలింది. ఈ విధంగా తప్పిపోయిన ఆడపిల్లలు వ్యభిచార వృత్తిలోకి, భిక్షాటనలోకి దింపబడగా మగపిల్లలు ర్యాగ్‌ పిక్కర్స్‌గా, పిక్‌పాకెటర్స్‌గా మారుతున్నట్లు సిటీ క్రైం బ్యూరో రికార్డులు తెలుపుతున్నవి. ఇందులో తల్లిదండ్రులు ఆడపిల్లలని శిశువు దశలోనే చెత్తకుప్పల దగ్గర వదిలి వేసిన కేసులు కూడా వుంటున్నాయని ఆ నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కింది పట్టికలో పోలీసు రికార్డు ప్రకారమే తప్పిపోయిన బాలబాలికల వివరాలు చూడండి. 2009 2010 బాలురు బాలికలు బాలురు బాలికలు హైద్రాబాద్‌ 655 1004 728 1064 విశాఖ 90 111 78 122 కరీంనగర్‌ 82 129 29 123 కొరతపడిన ఆహారం – ఆరోగ్యం : ఆరు దశాబ్దాల తర్వాత కూడా రాజ్యాంగంలో నిర్దేశించుకున్న విధంగా ఆరోగ్యాన్ని, ఆహారాన్ని పొందకపోవడం భారత పౌరుల దౌర్భాగ్యం. దేశంలో కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన 150 అతి బీద జిల్లాలకు సత్వరమే ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని (ప్రజాపంపిణి వ్యవస్థ సరఫరాకు అదనంగా) మే 7న సుప్రీంకోర్టు ఆదేశించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో, అందునా ఆడవారిపై ఈ ప్రభావం ఎలావుంటుందో ఆలోచించవచ్చు. 2006లో జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 3 ప్రకారం 46 శాతం పిల్లలు (0-6) పౌష్టికాహార లోపంతో వుంటున్నట్లు గుర్తించబడింది. ప్రతి సంవత్సరం 74 శాతం (17.8 లక్షలు) 5 సం||లోపు పిల్లలు వివిధ కారణాలతో మరణిస్తుండగా, ఇందులో 8.8 లక్షలు అంటే, సగం మంది పౌష్టికాహార లోపంతోనే చనిపోతున్నారు. అనగా ప్రతి నెల 75,000 మంది, ప్రతి రోజు 2,500 మంది పౌష్టికాహార లోపంతో మరణిస్తున్నారంటే రేపటి తరంపట్ల మన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నది. అంతర్జాతీయ ఆహార విధానం మరియు పరిశోధనా సంస్థ (|ఓఆష్ట్ర|) మరియు పిల్లల సంరక్షణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పౌష్టికాహారలోపానికి, శిశు మరణాలకు దగ్గరి సంబంధం వుందని తెలిపింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం 5 సం||లలోపు పిల్లలు 1.83 మిలియన్లు చనిపోగా, ఇందులో 6 లక్షల మంది పిల్లలు పౌష్టికాహారలోపంతోనే చనిపోతున్నట్లు ఈ సర్వే తెలిపింది. మరి ఆహార ధాన్యాలు లేవా అంటే, ఒక్క పంజాబ్‌, హర్యానాలలోనే నెలకు 120 లక్షల మందికి సరిపడే 61,000 టన్నుల ఆహార ధాన్యాలు పనికి రాకుండా పోతున్నాయి. అయినా త్రాగే నీటిని కూడా అమ్ముకునే ఈ దేశంలో ఆహారం పొందడం భ్రమకాదా? మన సాంప్రదాయం ప్రకారం ముందు మగవారు, మగ పిల్లలు తిన్న తర్వాతనే ఆడపిల్లలు, చివరకు ఆడవారు తినే అలవాటుంది. ఇది కూడా తినగా మిగిలితేనే! ఇలాంటి స్థితిలో ఆడ పిల్లలు ఎలా బతికి బట్టకడతారో ఆలోచించాలి. ఇక ఆరోగ్యం గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పౌష్టికాహార లోపంతో, రక్తహీనతతో రోజు గర్భిణీ స్త్రీలు మరణిస్తున్న వార్తలు అందరికి తెలిసినవే! కిందిస్థాయి వర్గాల స్త్రీయే కాదు, మధ్య తరగతి స్త్రీలు కూడా రక్తహీనతతో (కనీసం 6-7 శాతం కూడా హిమోగ్లోబిన్‌ వుండక) బాధపడుతువుంటారు. ఇక వీరికి ఆడపిల్ల పుడితే, ఎలా వుంటుందో, ఎలా బతుకుతుందో ఊహించవచ్చు. మగపిల్లవాడు పుడితే, తల్లిని కాదని, పిల్లవాడికి ఉన్నదంతా ఖర్చుపెట్టైనా వైద్యాన్ని అందించడం ఈ సమాజంలో రివాజు. ఈ విధంగా ఆడపిల్ల, తల్లితో సహా వివక్షతకు గురైతున్న (స్త్రీని అగౌరవించే) సమాజంలో మనం బతుకుతున్నామంటే ఆశ్చర్యం కావచ్చు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 13 నుంచి 13 రోజులపాటుగా రాజస్థాన్‌ జోద్‌పూర్‌లోని ఉమెన్‌ మెడికల్‌ కాలేజి హాస్పిటల్‌లో జరిగిన సంఘటనను చూద్దాం. ఈ మెడికల్‌ కాలేజి హాస్పిటల్‌లో చేరిన 13 మంది గర్భిణీ స్త్రీలకు అక్కడి జూనియర్‌ డాక్టర్లు 4వ రకం గ్లూకోసును అందించగా, వరసగా 13 మంది, పిల్లలకు జన్మనిస్తూ చనిపోవడం దేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని బట్టి ఈ దేశంలోని ఆరోగ్య జాగ్రత్తలు, అందునా, గర్భిణి స్త్రీల పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో తెలుస్తున్నది. ఇప్పటికి ఆరోగ్య కేంద్రాలకు రాక, వచ్చినా, అక్కడి పరిస్థితులు దారుణంగా వుండడంతో అత్యధికంగా గర్భిణి స్త్రీలు ఇల్లు వద్దనే, మంత్రసానులచేతనే పురుడు పోసుకోవడం ఈ దేశంలో ఇప్పటికి జరుగుతూనే వున్నది. ఈ విధానాలన్నీ కూడా ఆడపిల్లల ఉసురు పోసుకోవడానికి దోహద పడుతూనే వున్నాయి. సామాజిక స్థితిగతులు : అనేక పోరాటాల ఫలితంగా స్త్రీలు చాలా రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఇది కొంతమేరకు స్పష్టంగా కనపడినా, ఉన్నత రాజకీయ రంగంలో (అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో) ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఇంకా స్త్రీ వెనుకవరుసలోనే వుంది. ఫోరమ్‌ఫర్‌ వుమెన్‌ ఇన్‌ లీడర్‌ షిప్‌ జరిపిన ఓ సర్వేలో దేశంలో పేరు మోసిన 100 కంపెనీలలోని 1,112 డైరక్టర్లలో 59 మంది (5.3%) మాత్రమే ఆడవారున్నట్లు తేలింది. ఇదే కెనడాలో 15%, అమెరికాలో 14.5%, ఇంగ్లాండ్‌లో 12.2%, హాంకాంగ్‌లో 8.97%, ఆస్ట్రేలియాలో 8.3% గా వుంది. అంటే, ఆకాశంలో సగమని పొగడబడే స్త్రీ అనేక రంగాలలో, ముఖ్యంగా ప్రైవేట్‌ రంగంలో మగవారితో సమానంగా ఎదగలేని స్థితి కొనసాగుతూనే వున్నది. ఈ మధ్యన కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అసలు ఆడవారిని తీసుకోవడానికి విముకత చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విధంగా ఇతర సామాజిక కారణాలు, పరిస్థితులు కూడా ప్రత్యక్షంగా ఆడవారిని తక్కువగా చేసి చూడడంతో సహజంగానే వీరి సంఖ్య దారుణంగా పడిపోవడానికి కారణమైతున్నది. ఈ విపత్తు దుష్ఫలితాలు ఎలా వుంటాయి…? 2001 జనాభా లెక్కల్లో 0-6 వయస్సు గలవారు మొత్తం జనాభాలో 16 శాతంతో 164 మిలియన్లుండగా, 2011 నాటికి ఈ సంఖ్య 159 మిలియన్లకు తగ్గి మొత్తం జనాభాలో 13 శాతానికి చేరుకున్న కఠోర సత్యాన్ని అర్థం చేసుకున్నట్లైతే, రానున్న 15 సంవత్సరాల తర్వాత వివాహ వయస్సుగల అమ్మాయిల కొరత తీవ్ర స్థాయిలో వుంటుంది. ఇప్పటికే బాలుర, బాలికల నిష్పత్తిలో 86 పాయింట్ల తేడాతో వున్న అసమానతలకు తోడు, బాలికల పట్లగల నిర్లక్ష్యం కలిసి ఈ వ్యత్యాసం మరింతగా పెరుగుతుంది. సుమారు దీన్ని 90 పాయింట్లుగా అంచనా వేసినా, దాదాపు 90 మంది యువకులకు పెళ్ళి సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉత్తరాది రాష్ట్రాలలోని పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, జమ్ముకాశ్మీర్‌లలో ఇప్పటికే వుంది. వందలాది మంది యువకులకు పెళ్ళీడు వచ్చినా అమ్మాయిలు దొరకని స్థితిలో నిరాశ నిస్పృహలకు లోనౌతున్నారు. హర్యానా లాంటి రాష్ట్రంలో బీహారు నుంచి అమ్మాయిల్ని కొనుక్కొని వచ్చి పెళ్ళి చేసుకుంటున్న వార్తలు 2006లో జాతీయ స్థాయి పత్రికలు ఉటంకించిన విషయం తెలిసిందే! మరికొన్ని ప్రాంతాల్లో ద్రౌపతి విధానం అమలౌతున్నట్లు కూడా వదంతులు వినవస్తున్నాయి. ఏ విపత్తునైనా ఎదుర్కొనే సామర్థ్యమున్న నేటి వ్యవస్థకు, ఈ విపత్తును ఎదుర్కోవడం అసాధ్యం. ఆడపిల్లల గర్భస్థ మరణాలను అరికట్టడం! దీనికి ఒక్కటే పరిష్కారం. అయినా కొన్ని తరాల యువతకు ఇది జీవన్మరణ సమస్యనే! ఈ స్థితి అనేక సాంఘిక దుష్ఫలితాలకు తావిస్తుంది. ఆడపిల్లను ఇప్పటికే ఆస్తిగా గుర్తిస్తున్న నేటి సమాజంలో, ఈ ఆస్తిని దొంగిలించాలనే అవాంచనీయ స్థితికి సమాజం నెట్టివేయబడుతుంది. లేదా వేలంపాటల ద్వారా అమ్మాయిల్ని కొనుక్కునే స్థితి ఏర్పడుతుంది. ఇది ఎదుర్కోలేని ఓ కొత్త సమస్యగా సమాజం ముందుకు వస్తుంది. కనీసం ఇప్పటి నుంచైనా దీన్ని నివారిస్తే భవిష్యత్తులో మరో తరం సుఖపడే అవకాశాలుంటాయి. దీనికి నివారణ మార్గాలేంటి……!

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.