– అంజనా బక్షీ (అనువాదం : శాంతసుందరి)
చిట్టిపాపా నెమ్మదిగా మాట్లాడు
ఊరికే అటూ ఇటూ తిరగద్దు
అంట్లుతోమి, ఇల్లు శుభం చెయ్యి
త్వరగా!
ఆ తరవాత ఇల్లంతా సర్దు
చిట్టిపాప మాట్లాడలేదు
చెదిరిపోయిన తన కలలని
కూడదీసుకోవాలనుకుంది
చెరిగిపోయిన జుట్టుని
అమ్మ దువ్వి చక్కగా జడవేసింది
నువ్వింక స్కిపింగు చెయ్యొద్దు
నీకు నెలనెలా
ఇంక ముట్లు పార్రంభమౌతాయి.
నువ్విప్పుడు పెద్దదానివయావు
చిట్టీ!
నిజంగానా అమ్మా?
నేను నీ అంత పెద్దదాన్నయ్యానా?
నాకిక పెళ్ళయిపోతుందా?
నాలాగే, నాకో చిట్టిపాప…
దానికి కూడా ఒక చిట్టిపాప
ఇదేనా జీవితం?
లేదమ్మా
నేను పెద్దదాన్నవను…. పెద్దదాన్నవటం నాకిష్టం లేదు!
అంటూ ఉండగానే
చిట్టిపాప నిదల్రేచింది!
కల కరిగిపోయింది!!