– నాంపల్లి సుజాత
అయ్యో!
అగ్గిపుల్ల అంటితేనే విలవిల్లాడుతామే |
వృద్ధ దంపతుల సజీవదహనం
ఎంత దారుణం
కాళ్ళూచేతులు కట్టి
బరబరా ఈడ్చుకుంటూ
పేర్చిన చితిలో పాణ్రాలతో తోసేయడం
ఎంత అమానుషం
మతి తప్పి బాణామతంటూ
వెరివ్రేషాలతో తిరోగమిస్తున్నా
ఊరంతా పచ్చకామెర్లేనా
తిమిరాన్ని తరిమే కిరణం ఒక్కటీ కరువేనా?
ఎక్కడరా?
బాణామతి చేతబడి
అదంతా నీ బుద్దిల పుట్టిన నాటకం
పాత కక్షలకు పులిమిన కొత్తరంగు
ఓరే పీనుగా!
ఆకలికి జంతువులను కాల్చుకుతిన్న
ఆదిమానవులు నీకన్నా మేలు కదరా!
అనాగరికులే… ఓ అర్ధముంది.
మనిషికి
మానవాతీత శక్తులుంటాయా!
ఆసుపతుల్రు విద్యాలయాలు
కష్టపడటాలు కనుగొనటాలు ఎందుకు?
అబక్రదబ అంటే పోయేదిగా
కార్యాలవెంటే కారణాలూ ఉంటాయ్
జబ్బులకు జాఢ్యాలకు, రోగాలకు రొస్టులకు
సైకియాటిస్ట్రులు సవాలక్ష టీట్రుమెంట్లు
మంతాల్రు తంతాల్రు
తాయెత్తులు పూనకాలు
క్షుదశ్రక్తులు అర్ధరాతిప్రూజలు
పొట్ట నింపుకోటానికి
పుట్టించిన మెట్ట వేదాంతాలు
అయ్యో నా దేశమా!
కర్మభూమని గర్వంగా చెప్పుకుంటామే
మూఢనమ్మకాల ముసుగులో
మానవత్వం అడుగంటి
రాక్షసత్వం రాజ్యమేలుతోంది
శ్రీ కనక లింగేశ్వర శర్మ గారు దాదాపు 1000 దేవాలయ ప్రతిష్టలు చేసిన మహా పండితులు, సిధ్ధాంతి. అటువంటి
మనీషికి అటువంటి మరణం అనూహ్యం, అసమంజసం. చిత్రగుప్తుల వారి పనితనం మీదనే నాకు సందేహం
కలుగుతున్నది. వారి కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి.
గుంటూరులో ‘అగ్ని యాగం’ చేయబట్టే (అదీనూ మే మాసం లో) ఆసియా లో కెల్లా పెద్ద డయిన MARKET YARD మాడి మసి అయిందని, అలాగే కేసముద్రం దగ్గిర ఇటువంటి యాగం చేయబట్టే ‘గౌతమీ’ కాలిందని చెప్పుకుంటున్నారు.
అచ్చంపేట మండలం వలపట్ల గ్రామంలో చేతబడి చేస్తున్నారని గ్రామంలో సంభవిస్తున్న చావులకు వీరే కారణంగా ఆరోపిస్తూ లక్ష్మమ్మ, నారమ్మలను రాళ్ళతో చావబా దారు.నోట్లో పాదరసాన్ని పోశారు. దాదాపుగా 3గంటల పాటు ఇద్దరు మహిళలను చావబాదు తున్నా గ్రామంలోని వారు ప్రేక్షకులుగా చూశారుకానీ మహిళలను రక్షించే యత్నం చేయలేదు. లక్ష్మమ్మపై దాడి జరుగు తున్న సమయంలో అడ్డు తగిలిన ఆమె పిల్లలను సైతం గ్రామస్తులు చావ గొట్టారు. మహిళల ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా చేసి చితకబాదారు.[సాక్షి ,సూర్య 3.2.2009.]
జన విజ్ఞాన వేదిక వారు ‘రక్ష’ సినిమా దర్శక నిర్మాతలకి ఓ సవాలు విసిరారు. ఆ సినిమాలో చూపినట్లుగా చేతబడి ఉందని ప్రూవ్ చేస్తే పది లక్షలు ఇస్తామని వారు అంటున్నారు. సినిమాలనేవి సమాజాన్ని జ్ఞానవంతులని చేయాలి. కానీ వర్మ తన సినిమా ద్వారా చేతబడి అనే మూఢ నమ్మకాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు. సెన్సార్ వారు పట్టించుకుని ఈ సినిమాపై బ్యాన్ పెట్టాలని వారు డిమాండ్ చేసారు. వర్మ కేవలం డబ్బు సంపాదనకే ఈ రకమైన సినిమాలు తీస్తున్నాడని, జనాల నమ్మకాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. చేతబడి మూడనమ్మకాలను ప్రోత్సహించే విధంగా సినీ నిర్మాత దర్శకుడు రాం గోపాల్ వర్మ నిర్మించిన రక్ష సినిమాను, చేతబడిని వ్యతిరేకిస్తూ ఓ బాలిక తనపై చేతబడి చేయాలని అందుకు తన వెంట్రుకలు, గోళ్లు, తాను తొక్కిన మట్టి పంపుతున్నానని సవాల్ విసిరింది. రక్ష సినిమాకు సంబంధించి జన విజ్ఞాన్ వేదికకు రాం గోపాల్ వర్మ విసిరిన సవాల్‌పై ప్రతిగా టి.శ్రీయ అనే ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తల వెంట్రుకలు , గోళ్లు, ఆమె తొక్కిన మట్టిని వర్మకు పోస్టు ద్వారా పంపారు. ఆయనకు నిజంగా దమ్ముంటే ఆ పాపకు చేతబడి చేయాలని, తనకెంత సమయం కావాలో అంత సమయం తీసుకొమ్మని వారు సూచించారు. సమాజాన్ని, ప్రజలను చేతబడి మూఢనమ్మకాల వైపు మళ్లించే విధంగా సినిమాలు తీయడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు. తనకు చేతబడి మీద విస్వాసం లేదని చెబుతున్న వర్మ మరోవైపు చేతబడిని నమ్మించే విధంగా సినిమాలు తీస్తున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి సినిమాల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చేతబడి, బాణామతి నెపంతో దళితులు, బలహీన వర్గాల వారిపై అఘాయిత్యాలు, వేదింపులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనేవున్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది. ఇంకేముంది? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.
ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.