– డి. గాయత్రి
ఆర్తనాదం
ఆర్తనాదం
ఎవరిదీ గొంతు
ఎక్కడిదీ అరుపు
కర్ణ కఠోరంగా…
గుండెలు పిండేసేలా…
కడుపులో పేగ్రులన్నీ…
అబ్బ
ఎవరిదీ ఆవేదన
మళ్ళీ… మళ్ళీ… మళ్ళీ…
ఆర్తనాదం
ఆర్తనాదం
ఎక్కడెక్కడి నుంచో…
ఎవరెవరివో కేకలు
పప్రంచమంతా పశ్రాంతవదనంతో
నిదిస్త్రుంటే…
నాకేమిటి ఇలా…
కలా…?!
నిజం కాదుగా…!?
ఓహ్
ఏమిటి విచికిత్స
అయ్యో
ఎవరిదీ ఆకోశ్రం
మసక చీకటిలో
మానవత్వమనే మంటల్లో
కాలిపోతూ…న్న
ఓ నిర్భాగ్యురాలి
నరకయాతనా…?
స్వార్ధపు పప్రంచంలో
‘సగం’ కడతేరిన జీవితాన్ని
‘పూర్తి’ చేసుకుంటూ…న్న
ఓ అభాగ్యురాలి వెతనా…?
మోసపు జగతి మహిమ వల్ల
బయటపడ్డ కల్లాకపటమెరుగని
ఓ పసిబిడ్డ వేదనా…?
ఇలా…
ఇంకెంతమందో?
జీవితపు చరమదశలో…
భిన్న సందర్భాల్లో…
విభిన్న సంఘటనల్లో…
ఎవరెవరనీ…
ఎక్కడెక్కడనీ…
మళ్ళీ… మళ్ళీ… మళ్ళీ…
ఆర్తనాదం… ఆర్తనాదం
వద్దు… వద్దు…
వినలేకపోతున్నా…
ఒక్కో ఆర్తనాదంలో
ఒక్కో గాథ
ఒక్కో ఆక్రందనలో
ఒక్కో వ్యథ
ఊపిరాడటం లేదు
మనుషులు మనుషుల్లా లేని,
మానవత్వమే మృగ్యమైన,
అనుబంధాలే కరువైన
ఈ ‘అంధకార’ యుగంలో…
ధరణిపై వర్ధిల్లాలంటే…
సున్నిత భావాలొద్దు
కఠిన పాషాణ హృదయాన్నివ్వు
ఏ…దైనా
వినీ విననట్టుగా…
చూసీ చూడనట్టుగా…
బత్రికే శక్తిని పస్రాదించు
‘కరుణించని’ దేవుడా
కనికరించు
‘మనసు’న్న మనుషుల్ని కాదు
‘మ(ని)’నుషుల్లాంటి యంతాల్న్రి(ల్నే) సృష్టించు