తల్లులందు… పుణ్యతల్లులు వేరయా…..!

డా|| జి. లచ్చయ్య
ప్రొఫెట్‌ మహ్మద్‌ మనుమలైన హసేన్‌, హుసేన్‌లను కర్బలా యుద్ధంలో శత్రువులు తరుముతూ ఉంటే, ఇంటికి చేరగా తల్లి బీబి ఫాతిమా ఏకాగ్రతతో దారం వడుకుతూ ఉండి తలుపు తీయలేదు. దాంతో శత్రువులు వారిద్దరిని చంపివేసారు. దీన్ని ప్రపంచమంతా గాథలుగా చెప్పుకుంటారు. జిజియాబాయి శివాజీని పెంచి ఛత్రపతిని చేసిన తీరును మరాట్వాడలో, చుట్టుపక్కల తల్లిపాత్ర గూర్చి గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి ఘటనలు చరిత్రలో అనేకం కనపడుతాయి.
మొన్నటి (13 మే) మాతృ దినోత్సవం సందర్భంగా ఫోర్బ్స్‌ మహిళా పత్రిక ప్రపంచస్థాయిలోని 100 మంది శక్తివంతమైన ఆదర్శ మాతృమూర్తుల జాబితాను ప్రకటించింది. అందులో యూపిఎ చైర్‌పర్సన్‌ సోనియాజీకి ఆరవస్థానం దక్కింది. మొదటి స్థానం అమెరికా విదేశాంగశాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు దక్కగా, బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రెసెఫ్‌కు ద్వితీయస్థానం, భారతీయ సంతతిరాలు, పెప్సికోలా సిఇవో ఇంద్రానూయికి మూడవస్థానం దక్కడం గమనార్హం. ఏడవస్థానాన్ని దక్కించుకున్న అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, ఇరవైస్థానంలో ఉన్న మయన్మార్‌ ఉద్యమకారిణి ఆంగ్‌సాన్‌ సూకీలతో పాటుగా బిల్‌గేట్‌ ఫౌండేషన్‌ సహవ్యవస్థాపకురాలు మెలిండా గేట్స్‌, ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టీన్‌ లాగార్డే, ఫేస్‌బుక్‌ ప్రధాన నిర్వాహకురాలు షెరిల్‌ శాండ్‌బెర్గ్‌లు ఈ జాబితాలో ఉన్నారు.
ఈ ఎంపిక విధానాలు, ఎంపికకు ఎంచుకున్న మార్గదర్శకాలు సాధారణ మహిళలకు దరిదాపుల్లో కూడా అందుబాటులో ఉండవు – ఉంటాయని కూడా అనుకోము. కాని ఈ జాబితా కోసం ఎంపికైన మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న రంగాలు, ముఖ్యంగా రాజకీయరంగాలు ఏ వ్యవస్థ కోసం పనిచేస్తున్నాయో ఆలోచించాలి. సూకీలాంటివారికి ఇవి వర్తించకపోవచ్చు! ప్రథమస్థానంలో నిలిచిన హిల్లరీ, భర్త అధ్యక్షులుగా ఉన్నప్పుడు వివిధ దేశాల్లో జరిగిన మారణకాండకు, నేటి ఒబామా నిర్వహణలో జరుగుతున్న హత్యాకాండకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. ఎందరో తల్లుల గర్భశోకానికి కారకురాలు అవుతూనే ఉంది. అయినా ఆమె గొప్ప తల్లుల జాబితాలో మొదటిస్థానం పొందడం ప్రపంచ తల్లులందరికి గర్వకారణమే! ఇక మూడవస్థానంలో నిలిచిన ఇంద్రానూయి ప్రపంచ యువతను మత్తెక్కిస్తున్న ‘కోలా’ అధినేత్రి. ప్రపంచ క్రీడలతో చలగాటం ఆడుతూ, భూగర్భజలాన్ని కొల్లగొడుతూ, కలుషితం చేస్తూ బడుగుదేశాల్ని దోపిడి చేస్తూ, సంపన్న అమెరికా దేశానికి బాసటగా నిలుస్తున్నారు. ఈమె గూర్చి, ఈమె ఆధ్వర్యంలో తయారౌతున్న ఉత్పత్తుల గూర్చి మనదేశపు సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (్పుజూఐ) అధిపతి సునితానారాయణ బాగా చెప్పగలరు. ఇక ఆరవస్థానంలో నిలిచిన సోనియాజీ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం భారత ప్రజలపైననే చేస్తున్న దాష్టికాలకు అంతేలేదు. కాశ్మీర్‌లోని సోఫియానా కేసునుంచి మొదలుకొని దండకారణ్యంలోని సోనిసోరి ఉదంతాలదాకా ఎన్ని సంఘటనలైనా ఉదహరించవచ్చు! ఈమెగారి హయాంలోనే 2007, ఏప్రిల్‌ 20న విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల మండలంలోని వాకపల్లి గిరిజన గ్రామ మహిళలపై (11 మంది) సాయుధ పోలీసు బలగాలు అత్యాచారం జరిపితే, ఇంతవరకు ఈ కేసు అతీగతీ లేకుండా సాగుతున్నది. ప్రత్యేక ఆర్మీ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 2000 నుంచి నిరసనదీక్ష చేస్తున్న ఇరోం షర్మిలా కనీసం పెళ్లి చేసుకోని, తల్లికావాలని కూడా కోరుకోకుండా ఉద్యమాన్ని నడుపుతున్నది.
ఇలాంటి మహారాణులున్న దేశాల్లోని బడుగు, బలహీనవర్గాల తల్లులు ఫోర్బ్స్‌ పత్రిక దృష్టిలో ఎప్పటికీ పడరు. పడలేరు. ఇదో చిదంబర రహస్యం. ఆశ్చర్యకర విషయమేంటంటే, ఈ జాబితాను ప్రకటించిన నాలుగురోజులకే మిషెల్లీ, ఒబామాకి విడాకులివ్వాలని అనుకున్నట్లు ఓ వార్తాకథనం ప్రచురితమైంది. అయినా, అమెరికా అధ్యక్షుడి భార్యగా ఆమె ధన్యజీవే! ఈ విధంగా పేరుప్రఖ్యాతులున్న దేశాల మహిళామణులను వెతికి పట్టుకోవడంలో ఈ పత్రికలు ప్రయాసపడాల్సిన అవసరం అంతగా ఉండదు. ముందే ఓ జాబితాను తయారుచేసుకొని, వారికి ఉన్నవి, లేనివి ఆపాదించిపెట్టి చిలువలు, పలువలు రాసి, పెద్ద, పెద్ద ప్రకటనల్ని కొట్టేసి, సర్క్యులేషన్‌ పెంచుకోవడం వీటికి వెన్నతో పెట్టిన విద్య!
ఇలాంటి పత్రికలకు మోసపూరితంగా చంపబడిన ఆజాద్‌ తల్లో, గత 36 సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తులు వేసుకొని, కంటికి కునుకులేకుండా కాలాన్ని వెల్లదీస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్‌జీ), వేణుగోపాల్‌రావుల తల్లి మధురమ్మ కనపడకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీలేదు. అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మధురమ్మ తన కొడుకుల్ని ఈ దేశానికి యువరాజులుగానో, కాబోయే ప్రధానమంత్రుల్నిగానో చూడలేదు కాబట్టి!
బోర్డ్‌ మీటింగ్‌లో ఉన్నా, పిల్లల నుంచి పిలుపువస్తే మీటింగును కాదని పిల్లల్ని పట్టించుకునే ఇంద్రానూయితో కొడుకుల్ని కానలకు పంపిన మధురమ్మ ఎలా పోటీపడుతుంది? ఉద్యోగబాధ్యతగా అటవి ప్రాంతంలో పనిచేసిన సోనీసోరి ఎలా తులతూగుతుంది? ప్రపంచాన్నే ఆయుధ కారాగారంగా మారుస్తూ, అన్ని దేశాల్లో అస్థిరత్వాన్ని కలిగిస్తూ, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా విదేశాంగమంత్రిణితో మన కాకరపల్లి వాసులో, తెలంగాణలో బిడ్డల్ని కోల్పోతున్న తల్లులో ఎలా పోటీపడగలుగుతారు – అసలు వీరి తాహతు ఎంత?
వీరే కాదూ – ఒకే కాన్పులో అయిదుగుర్ని (క్వింటుప్లేట్‌) కన్న తిరువనంతపురం దగ్గరలోని వెంజరమూడు గ్రామనివాసి రమాదేవి, భర్త ప్రేమ్‌కుమార్‌ చనిపోవడంతో అధైర్యపడక, స్థానిక బ్యాంకులో అటెండర్‌గా చేరి ఆ అయిదుగురు పిల్లల్ని పోషిస్తూ, చదివిస్తున్నది. వీరు ఈ మార్చిలో పదవతరగతిలో మంచి మార్కులతో పాసయ్యారు. పంజాబ్‌కు చెందిన కమల్‌జీత్‌ కౌర్‌ తన ఇద్దరు కుమారులు మూకో పాలీసాకారిడోసెస్‌ (ఖతిబీళి ఆళిజిగిరీబిబీబీనీబిజీరిఖిళిరీలిరీ ఁ ఖఆ) అనే వింత వ్యాధితో బాధపడుతూ, పసిపిల్లలాగానే గత 23 సంవత్సరాలుగా ప్రవర్తిస్తుంటే వారి బాధ్యతల్ని నెత్తిన వేసుకొని సపర్యలు చేస్తున్నది. హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటకు చెందిన శశిరేఖ తన కొడుకు వెంకటేశ్‌కు, మెదక్‌ జిల్లా అనాజ్‌పూర్‌కు చెందిన రత్నమ్మ తన ఇద్దరి పిల్లలకి, నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలంలోని సీతాయిపేట నివాసి నీలవ్వ తన బిడ్డ సుమలతకు నిశ్చేష్టులైన తమ సంతానానికి అన్నీ తామై సేవలందీస్తూనే ఉన్నారు. రత్నమ్మ ఇద్దరి పిల్లలకు కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయే వింతరోగం సోకడంతో కూతురు చనిపోగా, కొడుకు రవీందర్‌రెడ్డి 70 ఏళ్ల తల్లి బాధల్ని చూడలేక తనను చంపేయాలంటూ (జూతిశినీబిదీబిరీరిబి) ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన రత్నమ్మ కొడుకుచే ఇకముందు అలా కోరవద్దని ఒట్టేయించుకుంది.
ఇలాంటి కథనాలు దేశమంతటా, ప్రపంచమంతటా కనపడుతాయి. ఫ్లోరోసిస్‌ బాధితులైనవారు నల్లగొండ జిల్లాలో విరివిగా తారసపడుతారు. ఎంత దుర్మార్గుడైనా కొడుకును భరించే శక్తి ఈ భూమిపై ఒక్క తల్లికే ఉంది. ఇది కాదనలేని సత్యం. కాని ఈ తల్లి ఆదినుంచి అనాదరణకు గురౌతూనే ఉంది. దీన్ని గుర్తించడంలో, గుర్తించినా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం జరుగుతూనే ఉంది. దీనికి అంతం ఉందో, లేదో గాని సీతమ్మతోనే ఇది మొదలైంది.
ఫోర్బ్స్‌ పత్రికలో ఈ తల్లులందరికి చోటు దొరుకుతుందని, దొరకాలని ఎవరు అనుకోవడం లేదు. కాని ఈ జాబితా రూపొందించడంలోని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. శక్తివంతమైన తల్లులని, ఆదర్శ మాతలనే బిరుదులిచ్చి, ఈ విధంగా ఎంపిక చేసిన మహిళలకు కిరీటాలు పెడితే ప్రపంచ మహిళలకు ఒరిగేది ఏమీ లేదు. ఆమె సంకెళ్లేమి తెగిపోవు. అందరు జిజియాబాయిలు, సోనియాజీలు కాలేరు. కాని అందరు సీతమ్మలాంటి మాతృమూర్తులే! సమాజం కోసం అన్నింటిని భరించాలనడం, భరించే విధంగా మనుధర్మశాస్త్రాన్ని నూరిపోయడం అనాదిగా ఈ దేశంలో జరుగుతూనే ఉంది. అందుకే స్త్రీలు కూడా సీతమ్మ కన్నా శ్రీరామున్నే కొలుస్తున్నారు. కన్యగా క్రీస్తుకు జన్మనిచ్చిన మేరీమాతకు దక్కిన గౌరవం కుంతీకి దక్కలేదు. అయిదుగురి భర్తల్ని స్వీకరించాలంటే, అయిదుగుర్నే కాదు, ఆమె ప్రమేయం లేకుండా ఆరవ భర్తని కూడా స్వీకరించేలా ద్రౌపదిని మన ఇతిహాసాలు తీర్చిదిద్దాయి. స్త్రీని ఒక ఆటవస్తువుగా, వ్యాపారవస్తువుగా చూపినంతకాలం పరిస్థితుల్లో మార్పులు రావు. ఎందుకంటే మన ఇతిహాసాల, పురాణాల ఆచారాలు ఇప్పటికి మనని వెంటాడుతూనే ఉన్నాయి. కేరళలోని ‘తోడా’ గిరిజన మహిళ అన్నదమ్ములందరికి భార్యగా వ్యవహరిస్తే, హిమాలయ గిరిజన తెగల్లో, అతిథికి భార్యను ఆతిథ్యం ఇచ్చే ఆచారాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఫోర్బ్స్‌ పత్రిక జాబితాలోకి ఎక్కిన మహిళలు ఈవైపుగా ఆలోచిస్తారని అనుకోము. వీరు కూడా పితృస్వామ్య, భూస్వామ్య, పెట్టుబడివర్గాల భావజాలంలో ఇరుక్కున్నవారే!
బహుశా పెళ్లి చేసుకుంటే మమతా దీది, మాయావతి, జయలలితలు కూడా ఈ జాబితాలో కనపడేవారే! ఇంకా నయం ఇందులో కనిమోళిని, రాజా భార్య అయిన ఎంఎ పరమేశ్వరిని, జగన్‌ తల్లి విజయమ్మను చేర్చలేదు. నిజంగా మీరు ధన్యజీవులే! లేదా వచ్చే మాతృదినోత్సవం జాబితాలో వీరికి చోటు దొరకవచ్చు! అంబానీల మాతృమూర్తి కోకిలాబెన్‌ వీరికెందుకు కనపడలేదో తెలియదు. కుటుంబ తగాదాల్ని తన నేర్పరితనంతో పరిష్కరించిన మహిళామూర్తి ఆమె!
ఇదో తంతుగా మారిందని, మదర్స్‌డే ప్రచారోద్యమానికి సారథ్యం వహించిన అన్నా జార్విన్‌ (1907, మే 12న మొదలు మదర్స్‌డే ప్రచారం మొదలైంది) 1917లో దీనికి గుర్తింపు తెచ్చింది. కాని 1920లోనే వ్యాపారమైన ఈ మదర్స్‌డేకు ఆమె, ఆమె సోదరి ఎల్‌సి నోర్‌ గుడ్‌బై చెప్పారు. కాని సొమ్ము చేసుకొనే మనస్తత్వం గల మన పత్రికలు ఊరుకోవుగా! ఇంకా నయం ఈ జాఢ్యం మన పత్రికలకు ఇంకా అంటుకోలేదు. అంటుకోవద్దని కోరుకుందాం!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.