మల్లీశ్వరి
”మహాసాధ్వి సీత అన్నింటినీ పరిత్యజించి భర్త అయిన రాముడి వెంట అడవులకు వెళ్ళి పధ్నాలుగేళ్ళు అన్యోన్య దాంపత్యం కొనసాగించింది. భార్యంటే యిలా వుండాలి.”
కుటుంబ ధర్మాలనూ, పాతివ్రత్య నీతులనూ స్త్రీలకి మాత్రమే బోధించే ఏ సంప్రదాయవాదో చేసిన వ్యాఖ్య కాదిది. ఆధునికతలోని సానుకూల అంశాలనూ, పెడధోరణులనూ త్వరగా వొడిసిపట్టగలిగే ముంబయి మహానగరపు హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య యిది.
ఓ విడాకుల కేసులో భార్య తన నివాసప్రాంతాన్ని వదిలి భర్తకి బదిలీ అయిన చోటుకి వెళ్ళడానికి నిరాకరించి విడాకులు కోరిన సందర్భంలో న్యాయమూర్తి కేసు వాయిదా వేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
నిజానికి యిది చాలా సంక్లిష్టమయిన అంశాలను యిముడ్చుకున్న కేసు. కుటుంబం ఒక యూనిట్. కలిసి జీవించడం దాని ప్రాతిపదిక. భార్యాభర్తలు ఉద్యోగనిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో సుదీర్ఘకాలం జీవించాల్సి వచ్చినపుడు కుటుంబం ఒడిదుడుకులకు లోనవుతుంది. దానిని నివారించి అన్యోన్యంగా కలిసి జీవించడం కోసం ఎవరు రాజీపడాలి అన్నది సమస్య.
ఈ అంశంలో భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ దుర్మార్గకరమయిన రీతిలో అణచివేతకి పాల్పడటం ఉండదు. యిద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత, ఆర్థిక సర్దుబాట్లకి సంబంధించిన యిలాంటి సందర్భాల్లో భర్తది ‘మెయిన్ బ్రెడ్ విన్నర్’గా గుర్తించి అనేకమార్లు స్త్రీలే రాజీపడటం జరుగుతోంది.
ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈ కేసులో భార్య తను నివసించాల్సినచోటు మీద తను నిర్ణయాధికారం కలిగివుండి, ఆ నిర్ణయాధికారాన్ని భర్త గౌరవించని కారణంగా విడాకులు కోరింది. ఆ నిర్ణయాధికారం న్యాయస్థానాన్ని ఎందుకు అసహనానికి గురిచేసింది? రక్తం కారేలా కొట్టాడనో, కిరసనాయిల్ పోసి తగలబెట్టబోయాడనో వినడానికి ఒళ్ళు గగుర్పొడిచే హింసని అనుభవించిన స్త్రీ స్వరం దీనంగా, బేలగా సమాజానికి యింపుగా ఉంటుంది. ఆ స్త్రీకి సానుభూతీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ స్త్రీల చైతన్యం రెండవదశలోకి ప్రవేశించింది. ఆ హృదయ విదారక స్వరాలతోపాటు తమ హక్కుల్ని ఎస్సర్ట్ చేసుకోవడానికి అడ్డుపడుతున్న వివక్షల్ని ప్రశ్నించే స్త్రీల స్వరం యిపుడు ఖంగుమంటోంది.
కానీ ఆ స్వరం సమాజానికి యింకా అలవాటు కాలేదు. సమాజంలో భాగమయిన న్యాయవ్యవస్థని నడిపించే వ్యక్తులకీ అలవాటు కాలేదని పై వ్యాఖ్య నిరూపిస్తుంది.
మిగతా వ్యవస్థలకి భిన్నంగా న్యాయవ్యవస్థ నుంచి సమాజం ఎక్కువ ఆశిస్తుంది. జాతి, మత, కుల, లింగ, వర్గ, వర్ణ, ప్రాంతీయ వివక్షలకి గురయ్యేవారిపట్ల న్యాయస్థానాలు సానుకూల వైఖరిని కలిగి ఉండాలని అనుకోవడం అత్యంత సహజమయిన విషయం.
సమాజం కొత్తదశలోకి మారుతున్నపుడల్లా వాటికి సంబంధించిన అవగాహన, చైతన్యం, ఉదార దృక్పథాల పరిచయం, శిక్షణ న్యాయవ్యవస్థకీ అవసరమే.
సమాజం నుంచి వచ్చే అనేక రకాల ఒత్తిళ్ళను ఎదుర్కొని స్త్రీలే తమ హక్కులపట్ల చైతన్యంతో మెలుగుతున్నప్పుడు, మధ్యయుగాల నాటి నీతులను స్త్రీలపై రుద్దాలని న్యాయవ్యవస్థలే ప్రయత్నించడం మంచి సూచిక కాదు. యిందులో మరీ ప్రమాదకరమయిన విషయం, పురాణాల నుంచి యిచ్చే ఉదాహరణల ద్వారా వాటిని దైవసత్యాలుగా భ్రమింపజేసి, అనుల్లంఘనీయం చేసి స్త్రీల మీద మరింత ఒత్తిడి పెంచడం.
స్త్రీల హక్కులు కాలరాయబడటంలోని అమానుషత్వాన్నీ, అణిచివేతనీ ప్రశ్నిస్తూనే, స్త్రీలు తమ హక్కులు స్వేచ్ఛగా పొందడం మీద ఎదురవుతున్న అసహనం, నియంత్రణలని చర్చించడం మీద కూడా దృష్టి సారించాలని ఈ కేసు స్పష్టం చేసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Pingback: గీతలు దాటుతున్న సీతలు | జాజిమల్లి
*సమాజం నుంచి వచ్చే అనేక రకాల ఒత్తిళ్ళను ఎదుర్కొని స్త్రీలే తమ హక్కులపట్ల చైతన్యంతో ….మంచి సూచిక కాదు.*
స్రీల కి తెలివి,సామర్ధ్యం కన్నా సహజంగా మాటకారితనం ఉంట్టుందని అందరికి తెలిసిన విషయమే. వాళ్ల గొంతు(వాయిస్) వినటానికి బాగుంట్టుంది. గుక్క తిప్పుకోకుండా చెత్త విషయం పైన కూడా అరగంట సునాయాసంగా, తడుముకోకుండా మాట్లాడ గలరు. ఇది ఏ మగవాడికి సాధ్యమయ్యే పని కాదు. ఈ లక్షణాలు సాఫ్ట్ స్కిల్స్ లొ వారిని నంబర్1 గా నిలబేడుతాయి. అది వారి సహజ గుణం. ఈ అంశాలు నేటి కాలంలో వారికి చాలా కలసి వచ్చాయి. పని చేసే చోట మనం పని చేయకుండా, మంచి మాటలతో ఇతరుల చేత పని చేయించు కోవటమే తెలివిగా చలామణి అవుతున్నాది. ఈ తెలివి తేటలు దానికి కావలసిన సామర్థం వారిలో పుష్కలంగా ఉన్నాయి అని గుర్తించాను. సూర్యుడి వెలుగును, స్రీల సాఫ్ట్ స్కిల్స్ మరుగున పడేయటం సాధ్యమా. అమేరికన్ కంపేనీలకి/వ్యాపారానికి సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం. ఆ కంపెనీలు వర్ధిల్లినంత కాలం ఉద్యోగంలో స్రీల అవకాశాలాకి లోటు ఉండదు,మరుగున పడేసమస్యే లేదు.
_________________________________
*కుటుంబ ధర్మాలనూ, పాతివ్రత్య నీతులనూ స్త్రీలకి మాత్రమే బోధించే ….హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య యిది.*
వాడేవడొ తెలివిలేని వాడై ఉంటాడు. అందువలన దురుసుగా రాశాడు. మీరు రాసింది చదివితే, మగవారికి సాఫ్ట్ స్కిల్స్ లో ఎంత పూర్ గా ఉన్నారో తెలుస్తున్నాది. అమాయకులు,తెలివిలేని వారు దురుసుగా ప్రవర్తించి అభాసుపాలౌతున్నారు. వాడిలాంటివారు తన్ హాయి నవల చదివితే, కొంచెం జ్ణానోదయమైనా అవుతుంది. ఆనవలలో నాయికలా భర్తతో కాపురం చేస్తూ, ఎఫైర్ నడిపినా ఎక్కడ చెడ్డపేరు తెచ్చుకోకుండా, ఎంతో మెలకువతో, నైపుణ్యం తో, జస్టిఫికేషన్, రీజనింగ్ ల తో ఈ కాలంలో ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. మగవారికి సాఫ్ట్ స్కిల్స్ లో ట్రైనింగ్ అవసరం చాలా ఉందనిపిస్తుంది. వారి దగ్గర ఎత్తుగడలు లేవు/తెలియవు ఉంటే అలా దురుసుగా ప్రవర్తించరు. మీలాంటివారు తప్పక రాయలి. అప్పుడె మాకు చాలా విషయాలు తెలుస్తాయి.