డా. రోష్ని
వారం వారం వచ్చిన ‘యాది’ వ్యాసాలు చదివిన తర్వాతే తెలంగాణ భాషలోని సౌందర్యం తెలిసోచ్చింది. అది చదివాక మిగితా తెలంగాణా రచయిత్రుల రచనలు చదివే ప్రేరణ కలిగింది.
అంత సొబగుగా తెలంగాణా యాసలో రాసే మాస్టారు అదిలాబాద్‌లో ఉంటారని తెలిసింది. నా ఉద్యోగం అదిలాబాదు జిల్లాలోనే. మాస్టార్ని చూసేందుకు వెళ్దామని 2007లోనే స్నేహితురాలు శివలక్ష్మి చాలా హడావుడి చేసింది. చలసాని ప్రసాద్‌గారు, కృష్ణక్క, ఇంకొందరం అందరం కలిసి అదిలాబాదు టౌనుకు పోదామని చెప్పింది శివ. కాని అది జరగలేదు, నా బ్యాడ్‌లక్.
సంవత్సరం క్రితం ‘వందేళ్ళ తెలుగు కథ’ ఉత్సవాల సందర్భంగా అదిలాబాద్ రేడియోస్టేషన్‌లో కథా పఠనం పెట్టారు. అప్పుడు చాలామంది రచయితలు రాష్ట్రం నలుమూలల్నుంచి వచ్చారు. వారందరితో కలిసి మాస్టార్ని కలవడానికి వెళ్లాం. గడపలోనే సంగీతస్వరాల మధురిమలు వినిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్‌లో చక్కటి సితార్ వాద్యం పలుకుతోంది. హాలు మధ్యలో మాస్టారు కూర్చుని ఉన్నారు. పెద్ద పర్సనాలిటీ, నున్నటి గుండు. చూడగానే నమస్కరించాలనే పెద్ద వయసు మనిషి. సంగీతం గురించి ఆయన చెప్పే విషయాలు (నాకు పెద్ద సంగీత జ్ఞానం లేకపోయినా) మంత్ర ముగ్ధుల్లా విన్నాం. మధ్యలో ఏదో ఒక రాగం పేరు (వయసు కారణంగా) మర్చిపోతే ఆయన చిన్నకొడుకు రాజవర్ధన్ టక్కున అందించేవారు. మాస్టారుతో పాటు జూపాక సుభద్ర, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి మొదలైన వారితో కలిసి తీసిన ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం జరిగింది. ఆ ఫోటోలొక తీపి గుర్తుగా మిగిలాయి.
ఈ సంవత్సరం మార్చిలో కాత్యాయనీ విద్మహే, అల్లం రాజయ్య దంపతులతో కలిసి మళ్లీ ఆయన దగ్గరకు వెళ్ళాం. వెళ్లిన ప్రతిసారీ ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడేవారు. మంత్ర ముగ్దులై వినేవాళ్లం.
మళ్లీ మే నెలలో మందరపు హైమవతితో కలిసి ఆయన్ని కలవడం జరిగింది. మేం వెళ్ళింది పన్నెండో తారీఖున. మాస్టారు మా మీద అలిగారు. చాలాసేపు మాట్లాడలేదు. కారణం పదకొండో తారీఖున ఆయన పుట్టిన రోజు, చాలామంది వచ్చారు. రాత్రి 12 గం. వరకూ సరదాగా గడిచింది. మేం ఎందుకు రాలేదని అలిగారాయన. నిజానికి 11, మే ఆయన పుట్టిన రోజని మాకు తెలియదు. ”మరీ అప్పుడే పుట్టిన పిల్లాడ్ని చూడ్డం ఎందుకు ఒన్‌డే బాయ్ ని చూద్దామని వచ్చాం ” అన్నానేను. పసిపిల్లాడిలా చక్కటి బోసినవ్వు నవ్వారాయన. హమ్మయ్య! అలక తీరింది. అంతేకాదు ఆయన రాసిన వ్యాసాలు, ఆయన గురించి ప్రముఖులనేకులు రాసిన వ్యాసాలు కలిపి వచ్చిన ‘జయంతి’ ప్రత్యేక సంచిక రెండు కాపీలు తెప్పించి హైమవతికి, నాకు (అతికష్టం మీద సంతకం చేసి) బహుకరించారు. అదే చివరిసారి ఆయన్ని కలిసింది.
అడవులు, జలపాతాలజిల్లా అదిలాబాద్‌లోని మారుమూల దహెగాం మండలంలో పుట్టి ఉపాధ్యాయవృత్తిలో స్థిరపడిన మాస్టారు, వృత్తికే పరిమితం లేదు. హిందుస్తానీ సంగీతం గురించి ఆయన రాసిన వ్యాసాలు సంగీతం తెలిసిన వారే కాకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా ఉంటాయి. వాటికే (స్వరలయలు) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (చాలా లేటుగా) వచ్చింది.
మాస్టారు సామల సదాశివ గారి గురించి చాలామంది చాలా రాసారు. బహుభాషాకోవిదుడు, తెలుగు-ఉర్దూ సాహిత్యంలో నిష్ణ్నాతుడు కవి, రచయిత, చిత్రకారుడు మొత్తంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, పక్కా తెలంగాణావాది మనకిక లేరు. ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయనతో నాకున్న పరిచయాన్ని మీతో పంచుకోవాలని ..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags