జంపాల చౌదరి
కొన్నాళ్ళ క్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారు ఆత్మకథను పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు తక్కువ అన్నాను. వారం తిరక్కుండానే ఇంకో ఇద్దరు మహిళల ఆత్మకథలు పుస్తకాలుగా వచ్చాయని తెలిసింది. అప్పుడే శిలాలోలితగారు తమ బ్లాగులో పొణకా కనకమ్మ స్వీయ చరిత్రను పరిచయం చేశారు. ఆ పుస్తకం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌లో దొరికింది. సంపన్న, సంప్రదాయ కుటుంబంలో ఆ కాలంలో పుట్టి పెరిగిన కనకమ్మ గారు రచయిత్రిగా, స్వాతంత్ర సమరయోధురాలిగా, మహిళా విద్యావేత్తగా తన జీవితాన్ని గడిపిన క్రమం చాలా ఆశ్చర్యకరం.
తెలుగు నాట ఆడవాళ్ళు స్వీయచరిత్ర రాసుకోవడం ఎక్కడైనా ఉండవచ్చును కానీ, అంతగా లేదు. ఆ భాగ్యం నాకు లభించినందుకు గర్వపడుచున్నాను. స్త్రీలకు సమర్థత లేక కాదు కానీ వారు బయట సంచరించటం తక్కువ.” అంటూ తన స్వీయ చరిత్రను కనకమ్మగారు 1959 జనవరి 15వ మొదలుపెట్టి 1960 సెప్టెంబరు 20న ముగించినా, ఏ కారణాల చేత కాని, 2011 వరకు అముద్రితంగానే ఉండిపోయింది. నెల్లూరులోని విశ్రాంత జీవనం గడుపుతునా. డా. కాళిదాసు పురుషోత్తంగారు పనిగట్టుకుని ఈ రాతప్రతిని సంపాదించి, సంస్కరించి, కనకమ్మగారి గురించి ఇతర విషయాలను సేకరించి శ్రద్ధగా ప్రచురించారు.
కనకమ్మగారు 1892 జూన్10 వ తేదీన నెల్లూరు జిల్లా మినగల్లులో పుట్టారు. మడమనూరులో పొట్లపూడిలో పెరిగారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి అమ్మ కామమ్మ, తాత కోడెల వ్యాపారులు. పడమటి బేరగాండు ఇల్లంతా కంబళ్ళు పరచి వాటి మీద వెండిరూపాయలు కుప్పలు కుప్పలు పోసుకొని లెక్కలేసుకునేవారట. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డి గారితో ఆమెకు తొమ్మిదవ ఏటనే వివాహమయ్యింది,పొట్లపూడిలోనే కాపురం. జిల్లాలో పెద్ద కుటుంబాలలో ఒకటి. 800 ఎకరాల పొలం, 500 ఆవులుండేవట. కోడెదూడల మీద సంవత్సరానికి పదివేల రూపాయల ఆదాయం. 20, 30 వేల రూపాయల ధాన్యం రాబడి. వారి అవ్వ మరణించినప్పుడు పది ఫుట్ల అన్నప్రదానం చేశారట. వచ్చిన వారికి త్రాగటానికి నీరు పోసే అవకాశం లేక వీధులలో కాలువలు తవ్వి నీరు పారించినారు” అన్నప్రదానం చేయుటలో సుబ్బిరామిరెడ్డిగారికి పెట్టింది పేరు.
కనకమ్మ గారు చిన్నతనంలో చదువుకోలేదు. తర్వాత స్వయం కృషివల్ల చదువుకున్నారు. క్రమంగా కావ్యాలు, సంస్కృతం, హిందీ నేర్చుకున్నారు. శశిరేఖ, హిందుసుందరి, అనసూయ పత్రికకు, పద్యాలు, వ్యాసాలు పంపేవారు. చెట్టు నీడ ముచ్చట్లు పేర ఆమె హిందూసుందరిలో రాసిన వ్యాసాలకు మంచి గుర్తింపు వచ్చింది.
పొట్లపూడిలో కనకమ్మగారి సోదరులు, మరదలు, నెల్లూరు రామానాయుడు ( తర్వాత జమీన్ రైతు పత్రిక పత్రిక సంపాదకుడుగా ప్రసిద్దుడు) మరికొందరు కలిసి 1931లో సుజనరంజనీ సమాజం స్థాపించి గ్రంధాలయం, సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చేవారు. నెమ్మదిగా సమాజంలోకి రాజకీయ భావాలు వచ్చాయి. మద్రాసు నుంచీ రివాల్వరులు తెప్పించి వాటిని పేల్చడం ప్రాక్టీసు కూడా చేశారు. వెన్నెలకంటి రాఘవయ్యగారు పూనాలో తిలక్‌నీ, మద్రాసులో చిదంబరం పిళ్ళేని కలిసివచ్చారు. స్వదేశీ వస్త్రాలు ధరించటం, హరిజనవాడల్లో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. 1917లో నెల్లూరులో ఆంధ్రమహాసభలో ఆంధ్రరాష్ట్రం తీర్మానం చేశారు.నెమ్మదిగా ఆ ప్రాంతంలో జాతీయోద్యమంలో కనకమ్మ గారి పాత్ర పెరగడం మొదలయ్యింది. పెద్ద నాయకులందరూ వారి ఇంటనే బస చేసేవారు. గాంధీజీ, బిపిన్ చంద్రపాల్, రాజేంద్రప్రసాద్, ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావువంటి జాతీయ, రా్ర
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags