రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం ‘వాడిపోని మాటలు’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబరు 1 వ తేదీన ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సభకు ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షత వహించారు. పుస్తకం గురించి విశ్లేషణాత్మకంగా మాట్లాడానికి అన్వేషి సభ్యులు కె. లలిత, ప్రముఖ కథారచయిత, విమర్శకులు కేతు విశ్వనాథరెడ్డి, భూమిక సంపాదక సభ్యులు ఎ. ఉమామహేశ్వరిగార్లు విచ్చేసారు. భూమిక సభ్యురాలు గీత అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు. ”వాడిపోని మాటలు” పుస్తకాన్ని తీసుకురావడం వెనుక తమ శ్రమని, కృషిని గురించి వివరిస్తూ కొండవీటి సత్యవతి ”ఇరవై సంవత్సరాల స్త్రీల ఉద్యమానికి దర్పణం పడుతున్న సంపాదకీయాలను పుస్తక రూపంలో తీసుకు రావాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నామని, ఆర్థిక వెసులుబాటు లేక ఇంతకాలం తేలేక పోయామని, అబ్బూరి ఛాయాదేవిగారు ఆర్థికంగా సహకరించడంవల్ల ఇప్పటికైనా తేగలిగామని చెప్పారు. అలాగే పుస్తకానికి ‘వాడిపోని మాటలు’ గా పేరు పెట్టింది, సంపాదకీయాలను పుస్తకంగా తీసుకురమ్మని నా వెంట పడి స్ఫూర్తి నిచ్చింది డా. శిలాలోలిత అని చెప్పారు. ఆ తర్వాత సభకు అధ్యక్షత వహించిన ముదిగంటి సుజాతారెడ్డిగారు మాట్లాడుతూ రెండు దశాబ్దాల స్త్రీవాద ఉద్యమ నేపథ్యంతో వెలువడిన సంపాదకీయాల పుస్తకం చాలా విలువైందని, ఎంతో నిబద్ధతతో భూమికను నడుపుతున్న సత్యవతి సంపాదకీయాల పుస్తకం తేవడం అభినందనీయమని అన్నారు. అన్వేషి సభ్యులు కె. లలిత మాట్లాడుతూ ఈ పుస్తకంలో స్త్రీల అంశాలు, సామాజిక అంశాలు చాలా వరకు చోటు చేసుకున్నప్పటికీ గుజరాత్ మతకల్లోలాలకు సంబంధించిన సంపాదకీయం లేకపోవడం ఒక లోపమని చెప్పారు. ఈ రోజు ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న అనేకానేక ఉద్యమాల గురించి భూమికలో రావాలని, నేను కూడా బిజీగా వుండడంవల్ల రాయలేకపోతున్నాను. కాని అందరం అన్ని సామాజిక అంశాల మీద భూమికలో రాయాల్సిన అవసరం వుంది. స్త్రీల ఉద్యమం 70 వ దశకంలోనే మొదలైందని, అందరూ అనుకుంటున్నట్లు 80లలో కాదని చెప్పారు.
ఆ తర్వాత కేతు విశ్వనాథరెడ్డిగారు పుస్తకంలోని వివిధ సంపాదకీయాల గురించి విశ్లేషణాత్కంగా మాట్లాడుతూ మరిన్ని బలమైన స్త్రీవాద ఉద్యమాలు రావాల్సి వుందని, అన్ని రకాల హింసల నుండి స్త్రీలు విముక్తమైనప్పుడే స్త్రీజాతి పురోగమిస్తుందని, సంపాదకీయాలను గుదిగుచ్చి పుస్తకంగా తీసుకురావడం చాలా మంచి ప్రయత్నమని చెప్పారు. ఎ. ఉమామహేశ్వరి పుస్తకం గురించి, భూమిక ఆవిర్భావం గురించి క్లుప్తంగా మాట్లాడారు. ఈ సభలో రచయితలు/ రచయిత్రులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు చాలామంది పాల్గొన్నారు.
డా. సమతారోష్ని వందన సమర్పణతో ఉత్సాహంగా మొదలైన సభ ముగింపుకొచ్చింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags