అదొక చతుర్శాల భవంతి – రోదన కూడ వ్యక్తీకరించలేని స్త్రీ

వై. విజయలక్ష్మి

మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా ముగించుకొని ఒక పొడవైన కంచుగ్లాసులో దానిలో 3 వంతులు ఉండేట్లుగా చిక్కని టీ చేసి మావగారికి మంచం దగ్గరికీ తీసుకొని వెళ్ళి అందించాలి ఆ ఇంటి కోడలు. “కోడలు అంటే దానికొక భాష్యం (వివరణ) ఉంది. అందరికంటే ముందులేచి కళాపి చల్లి అందరు నిద్ర లేచేసరికే తలస్నానం పూజాపునస్కారాలు ముగించుకొని ఇతర పనులకు సిద్ధం కావాలి. ఎవరేమన్నా పట్టించుకోరాదు. అభిమానం చంపుకోవాలి. అందరూ తిన్నాకే తినాలి. అత్తగారికి అన్ని సమకూర్చి, వంట చేయాలి. మగవారు, ఇంటిపెద్దలు అందరి భోజనం ముగిశాకే ఇంటికోడలు చివరికి తినాలి.”

ఉదయం లేచి ఇంట్లో పనులన్ని పూర్తిచేసి పిల్లలకు ‘అత్తెసరు పెట్టి వారిని బడికి పంపించి మామగారికి, అత్తగారికి నీళ్ళు తోడి వేడినీళ్ళు చల్లని నీళ్ళు సమంగా చేసి బావి దగ్గర మామగారికి, బాత్రూంలో అత్తగారికి పెట్టి రావాలి. ఆ తరువాత పిల్లల మొహాలు కడిగించడం, స్నానాలు చేయించి బట్టలు తొడిగించి (ఉమ్మడి కుటుంబాలు కనుక ఇంట్లో ఉన్న పిల్లలందరికి) ఆ తరువాత అన్నాలు పెట్టే కార్యక్రమము. అందరి మూతులు, చేతులు కడిగించి బడికి పంపాలి. తరువాత అంట్లన్ని సర్దుకొని మళ్ళి ఒకసారి టీపెట్టి అందిరికి ఇచ్చి ‘పురోహితాని’కి వెళ్తున్న మామగారికి సంచి ఇచ్చి రావాలి. భర్త ఆఫీసు పనికి వెళ్ళగానే, అత్తగారు మడికట్టుకొని వంట ఇంట్లో దూరేవారు. దహగోళితోనే (అదొక మడికి పనికివచ్చే నారవస్త్రం) ఉండేది కోడలు. అత్తగారు పూజసామాగ్రి వెలుచుకొని (కడుక్కొని) అన్ని సర్ది పూజ మొదలుపెట్టుకునేవారు. అలా… ఆ పూజా కార్యక్రమము 3, 4 గంటలు సాగేది జపాలు, తపాలు, అష్టకాలు అన్నీ ముగించుకునేవారు. మండని కట్టెలతో కోడలు వంట కార్యక్రమం మొదలయ్యేది. అంట్లు అంట్లు, అంటూ అటు తాకకు, ఇటు ముట్టుకోకు అంటూ అత్తగారు జపం చేస్తూనే ఉండేది. కూరగాయల మీద ఓ చెంబుడు నీళ్ళు గుమ్మరించేది. గిన్నెలన్నింటిని ఒక చుక్క నీళ్ళు లేకుండా తుడిపించేది. మళ్ళీ ఆ గిన్నెలు వంట ఇంట్లో బోర్లించుకోవడం ఒక పెద్ద పని. ఈ మధ్యలో చంటిపిల్లవాడు పాలకేడిస్తే దహగోళితో ముట్టుకోవడానికి వీలుగా ఎవరౖెెనా ఒక గోనేసంచిపై పిల్లాన్ని పడుకోబెడితే తీసుకొని పాలిచ్చి మళ్ళీ గోనేసంచిపై (అది నారమడికి పనికి వచ్చేది) పడుకోబెడితే ఎవరైనా తీసుకొని ఊయలలో పడుకోబెట్టేవారు. నా ఎరుకలో కూడా ఈ ఆచారం మా కుటుంబాల్లో మొన్నమొన్నటి వరకు కొనసాగింది.

మళ్ళీ వంట మొదలు కూరలు కడుక్కొని తరువాత కుంపట్లో బొగ్గులపై పప్పువేసి కట్టెలపై అన్నం, కూరా, చారు వంటలూ వండేవారు. రోటి పచ్చడి నూరాలని మిరపకాయలు మినపప్పు జీలకర్ర అన్ని వేయించి సర్దుకోగానే అత్తగారికేక ‘ఒసే శశికళా!’ ఆ రోటిలో నూరుతుంటే మీద పచ్చడి చిల్లుతుంది దహగోళి అంట్లు అవుతూంది అది విడిచి పచ్చడి నూరవే! అనేది. ఉన్న దహగోళి (అది కూడా వండినంతసేపు గుచ్చుకొనిపోయి వళ్ళంత కంపరంగా ఉండేది) కూడ విడిచి ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా దొంతి కూర్చొని పచ్చడి నూరుతుంటే పడగూడని చోట్ల పచ్చడి పడి మంటపుడితే ఏడ్వలేక, నవ్వలేక చస్తూ బ్రతికేది ఆ కోడలు. ఇంతటి చాదస్తంతో చచ్చేవాళ్ళు కోడళ్లు. వంట కాగానే మామగారు రానిదే ఇంటి పెద్ద మగవాళ్ళు తిననిదే ఎవరూ తినకూడదు. అత్తగారు పూజ కాగానే కొంగుపరచుకొని పడుకునేది, వెనుకటి లోకాభిరామాయణం చెబుతూ. కోడలు వండిన వంటను చూస్తూ ఆకలి అవుతున్నా నోటికి తాళం వేసుకొని ఉండవలసినదే! పాలిచ్చే పిల్ల కండ్లు తిరిగేవి ఆకలికి ఏం చేయాలో తోచని పరిస్థితి.

ఈ లోపల వీధిలో సెకిల్గంట. మామగారు వచ్చారని తెలుసుకొని సంతోషించేది కోడలు. కాని ఇంకా గంట కార్యక్రమం. తెచ్చిన సంచులు అత్తగారి ముందు విడిచి, అవి సర్దమనడం. ఆ తరువాత మామగారు కాళ్ళు కడుక్కొని లేకపోతే మళ్ళి స్నానం చేసి అన్ని కార్యక్రమాలు మామగారి పూజ అది అయ్యేసరకి 3-30 గం|| మధ్యాహ్నం. మామగారు, మరుదులు తిన్నాక చివరకు అత్తగారు కోడలుకు వడ్డిస్తూ తినేది. వంట ఎవరుచేసినా పెద్దరికం ‘కోడలు’ అత్తగారు పెడితేనే తినాలి. మగవాళ్ళు తినగా మిగిలిన వంటలు సర్దుకొని ఆడవాళ్ళు తినేవారు. ఈలోగా గొడ్లు ఇంటికి వచ్చేవి. బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేవారు, ఒక్కోరోజు.

ఒకరోజు కాకి అన్నం గడ్డ ఎత్తుకొని పోతూంటే మూలకున్న కట్టెల మీద పడిందని కట్టెలన్నింటిని అంట్లు అయినాయని బావి మీద పెట్టి ఒక్క పది బొక్కెనల నీళ్ళు చేది పోయించింది, అత్తగారు కోడలితో. రేపు ఆ తడిసిన కట్టెలతో ఎలా వండాలని ఏడుపొచ్చేది కోడలుకు.

రాత్రి భోజనాల అనంతరం, ఇంటెడు రాజులు పడుకున్న తరువాత కోడలు అన్ని సర్ది వంటయిల్లు కడుక్కొని గిన్నెలు బావి మీద వేసి మామగారికి అత్తగారికి మంచాల దగ్గర నీళ్ళుపెట్టి, అప్పుడు పడక గదిలోకి అదీ ఎవరు చూడకుండా వెళ్ళాలట. అసలు పగలు భర్త భార్య మొహాలు చూసుకునేవారు కాదట. ఇద్దరు పిల్లలు పుట్టేవరకు కన్నెత్తి పగలు అందరిలో భర్తతో మాట్లాడడం కాని, మొహం చూడడం కాని తెలియదు.

నెలకొకసారి 3 రోజుల కార్యక్రమం దానికి ప్రత్యేకంగా ఒక మూలగది. అదీ చీకటిగా. దానిలోనే తినడం, పడుకోవడం, మామగారు సంధ్యావందనం చేసుకునేప్పుడు గాని ఎవరు పూజా కార్యక్రమాలు చేస్తున్నా ‘ముట్టువాళ్ళు’ మాట్లాడకూడదు. అన్నీ ఆంక్షలే. నాలుగవరోజు 3 రోజులు తిన్న కంచంపై నిప్పు వేయడం. పసుపునీళ్ళు చల్లడం మొదలగు కార్యక్రమాలు చేసేవారు. వారికి వడ్డించేటప్పుడు కూడా మారువేస్తే తగులుతామని ఒకేసారి పెట్టేవారట. నెయ్యి వేస్తే నేతిధారతో మైలపడతామని నెయ్యి ఒక చిన్న గిన్నెలో వేసి ఇచ్చేవారట. లేకపోతే వేసేవారే కాదట. ఇల్లంతా పసుపునీళ్ళు చల్లి మారునీళ్ళు 5వ రోజు పోస్తే కాని కోడలు ఇంట్లోకి రావడానికి వీలులేదు.

ఒకరోజు ‘బాబు’కు బాగా సుస్తీ చేసింది. ఊళ్ళోనే ఉన్న ఆయుర్వేద డాక్టరు దగ్గరకు వెళ్ళారు. ఆయన కొన్ని మందులు ఇచ్చారు. జ్వరం బాగా ఉంది ఒళ్ళు మసిలిపోతూంది. మందు వేయకూడదట. ‘మందు’ వేయడానికి ‘వర్జ్యం’ చూస్తున్నారు అత్తగారు. ఈ సమయంలో మందు వేయకూడదు కాసేపాగవే అమ్మాయి. వర్జ్యం వెళ్ళాక “వేద్దాం” అని అత్తయ్య అంటూంటే ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిందని చెప్తే నా హృదయం ద్రవించింది. “మూసిన కన్ను మళ్ళీ తెరవనేలేదు బాబు.” ఇంతటి అగ్నిహోత్రుల అవధానుల ఇంట్లో పడ్డందుకు నవ్వాలో చాదస్తానికి ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితులు, ఆ కాలంనాటి ఆడవారి జీవితాలు నోరువిప్పి మాట్లాడలేని పరిస్థితులు.

ఒకరోజు తల్లిగారి ఊరినుండి అన్నయ్య వచ్చాడని తెలవగానే శశిరేఖ (కాపురానికి వచ్చిన కొత్తలో) వీధిలోకి పరుగెత్తి వసారాలో బెంచిపై కూర్చొని అన్నయ్యతో మాట్లాడితే అత్తగారు ముక్కున వేలేసుకొని “మాకాలంలో ఆడవాళ్ళు ఇంతా బరితెగించినారా? వీధి వసారాలో మగవారితో సమానంగా కూర్చోని మాట్లాడడమే అని దీర్ఘాలు తీసింది వడ్లు కొలిచేవారితో. అంతే అప్పటినుండి ఆ కోడలు ఎవరు వచ్చినా బయటకు వెళ్ళనేలేదు.

ఆడది అంటే అభిమానం చంపుకోవాలి. పెళ్ళి కాగానే తన అలవాట్లు మార్చుకోవాలి. అత్తవారి ఇంట స్మరణే చేయాలి. ‘పురోహితం’ పనిమీద ఎవరైనా వచ్చినా లోపలినుంచే సమాధానం చెప్పాలికాని ఎదురుగా వెళ్ళి తల ఎత్తి మాట్లాడకూడదు. అంతటి ఆంక్షలు కట్టుబాట్లతో 20 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. ఏ మార్పు రాలేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు.

శశిరేఖ రెండవ కూతురును సిటికాలేజీలో జాయిన్ చేయాలని నిశ్చయించుకున్నారు. పెద్దకూతురు నీరజ బొటాబొటిగా ఊర్లో ఉన్న చదువు 10వ తరగతితోనే ఆపివేసినది. నీరజను గంతకు తగ్గ బొంతలాగా మామూలు సీదాసాదా కుటుంబంలో క్లర్క్ పని చేస్తున్న ప్రభాకరానికిచ్చి పెళ్ళి చేసి పంపారు. పెండ్లి అయి ఆరు ఏండ్లు కావస్తున్నా 3 సార్లు మటుకే తల్లి దగ్గరకు వచ్చినది. ఆ వచ్చినప్పుడైనా పిల్లలను ఫ్రీగా ఉండనిచ్చేదికాదు అత్తగారు. అది ముట్టుకోకు, అక్కడికి వెళ్ళకు, ఆడవాళ్ళు అలా తిరగొచ్చా అని చిన్ననాటి స్నేహితుల ఇంటికి కూడా వెళ్ళనిచ్చేది కాదు.

దాని జీవితమే అలా అయ్యింది అంటే, రెండవదానికి ‘శైలజ’కు కూడా అలాగే చేస్తారేమోనని వణికిపోయేది శశిరేఖ. తన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడానికి కూడా తనకే స్వతంత్రం ఉండేది కాదు.

తనకు చదువు అంటే ఎంతో ఇష్టం. తను తీర్చుకోలేని కోరిక తన బ్డిలలోనైనా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నది. చివరకు ఒక నెల రోజుల చర్చ తరువాత సిటిలో శైలజను శశిరేఖమ్మ గారి పిన్ని ఇంట్లో ఉంచి చదివించడానికి నిర్ణయించారు. చదువు పూర్తి కాగానే పెళ్ళిచేద్దామని వీళ్ళు అనుకునేలోపే ‘శైలజనే’ తన ఇష్టమైనవాణ్ణి చేసుకొని వెళ్ళిపోయింది. మన కులంకాదని అత్తగారు మామగారు తిట్లు శాపనార్ధాలు చివరికి అది చనిపోయిందని ఎవరు దాని మాట ఎత్తవద్దని పిండాలు కూడా పెట్టారు. శశిరేఖ కూతురుని చూడాలని ఏడ్వని రోజులేదు. తన భర్త శంకరానికే స్వతంత్రం లేదు. తనకెక్కడిదని ఊరుకుంది. పది సంవత్సరాలు అలా గడిచిపోయాయి.
శైలజకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. శశిరేఖమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊళ్లో ఉత్సవాల్లో గుడిలో కనబడింది శైలజ. అంతమంది జనంలో ‘కొడుకును బిడ్డను’ దూరం నుండి చూపించినదట తల్లి శశిరేఖమ్మకు. కళ్ళనీళ్ళతో దూరంనుండే చూసి ఆశీస్సులిచ్చినదా తల్లి.

ఈ రేఖ ఎప్పుడు శైలజ గురించే ఆలోచించేది. అది ఈ ఇంటివ్యక్తి కాదా! దానిని ఎందుకు రానివ్వరు? దానిని చూసే అవకాశమే లేదా! అనే ఆలోచనలతోనే మంచం పట్టింది. అమ్మ ఆరోగ్యం బాగా లేదని నీరజే వచ్చి నెలరోజులు అమ్మకు సేవలు చేసింది. ఈ రేఖ కొడుకు రాఘవా సిటీలోనే చదువు వెలగబెడుతున్నాడు. చివరకు నీరజే ఎలా అయితేనేమి శైలజ అడ్రస్ తెలుసుకొని చిన్నక్కను ఎలాగైనా వెళ్ళి చెప్పి తీసుకొని రమ్మని ‘రాఘవా’కు చెప్పి పంపింది. రాఘవా చెప్పగానే శైలజ ఏడుస్తూ ఇద్దరి పిల్లలతో పరిగెత్తుకొచ్చింది. అమ్మను చూస్తూ ఏడుస్తూ అలాగే కూర్చుంది. తాతయ్య చనిపోయి 2 ఏండ్లు అయ్యిందని తెలుసుకొని ఏడ్చింది. ఇంట్లా అందరిని చూసుకొని మురిసింది. కాని లోనికి రానివ్వలేదు. అరుగు కొసకు కూర్చోబెట్టినారు. శశిరేఖమ్మ మాట పడిపోయింది. కళ్ళవెంట నీళ్ళు తప్ప ఏమి లేవు. “నాబిడ్డ చేసిన పొరపాటు ఏమిటి? దాని ఇష్టమైనవాణ్ణి చేసుకొన్నందుకు ఇంత శిక్షా! వచ్చినా ఇంత అవమానమా! అత్తగారు ఒకటే సొద ఇల్లు మైలపడిందని. తల్లిని చూసిందిగా ఇంకా ఇక్కడ ఏమి పని ఉందని వెళ్ళమని ఎన్నో మాటలంది.

నాల్గవరోజు తల్లి సైగచేస్తే దగ్గరకు వెళ్ళుతుంటే పనివాళ్ళతో తలుపులు పెట్టించింది అత్తగారు. విధిలేక ఏడుస్తూనే వెళ్ళిపోయింది శైలజ. వెళ్ళిన 2వ రోజే జీవంలేని కట్టెలాగా అయిపోయింది శశిరేఖ. సాయంత్రం వరకు ఉన్న శ్వాస కూడా అనమరో ఐదేళ్ళు గడిచిపోయాయి. రాఘవ ఎక్కడో నిర్మల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చనిపోయాక అక్కయ్యలిద్దరు కలిసిపోయారు. తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూతుళ్ళు నీరజ శైలజ పరిగెత్తుకొని వచ్చారు. మొదటిసారిగా ఇద్దరు బిడ్డలను దగ్గరకు తీసుకొని ఏడ్చాడు తండ్రి. ఊరు ఊరంతా ఏడ్చారు. 20 ఏండ్లు బాధను దిగమ్రింగుకున్నాడు శంకరం తల్లి తండ్రికి ఎదురుచెప్పలేక, తండ్రి బిడ్డలు తల్లిని తలచుకొని ఏడుస్తూంటే అందరి హృదయాలు ద్రవించాయి.

శైలజకు ఇంకా అమ్మ ఆ ఇంట్లో ఒదిగి ఒక మూల ఎక్కడో మడితో కూర్చునట్లే అనిపిస్తుంది.

అందరికి భయపడి ఎవరికి ఎదురుచెప్పలేక కన్నప్రేమ దూరం చేసుకోలేక మనోవ్యధతో పోయిన అమ్మను తలచుకొని శైలజ అలాగే ఉండిపోయింది. ఒక వారం రోజులకు నాన్న కూడా పోయాడని తెలిసింది. పెద్దవాళ్ళ చాంధస భావాలకు, ఆచారాలకు నిలయమైన ఆ ఇంటికి, ఆ పరిసరాలకు కాని, అమ్మానాన్నలేని ఆ ఇంటి గడప త్రొక్కన ేలేదాకూతుళ్ళు మళ్ళీ.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.