ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఇంతకు ముందు వాటిని కొనుక్కోవడానికి అందరం పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. మనకి కావలసిన పుస్తకాలను కొనుక్కునే వాళ్ళం. పుస్తకాల షాపులకెళ్ళడం, ఓ చక్కటి అనుభవం. గంటల తరబడి కాళ్ళు పీకుతున్నా ఒక్కో పుస్తకాన్ని ఎంతో ప్రేమగా తడుముతూ, పేజీలు తిరగేస్తూ పరవశించిన వాళ్ళమే అందరం. క్రమంగా చాలావరకు మనం పుస్తకాల షాపుల సందర్శనానందాన్ని కోల్పోతూ వచ్చాం. వేగవంతమైన జీవిత విధానం, భిన్నమైన పనుల్లో బిజీగా వుండడం, నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్ దీనికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.
పుస్తకాల షాపులకు వెళ్ళలేకపోతున్నామే, ఇష్టమైన పుస్తకాలు కొనుక్కోలేక పోతున్నామే అని ఇక మీదట బాధపడాల్సిన అవసరం వుండదు. భూమిక పాఠకుల కోసం, వారి మితృల కోసం. రచయిత్రుల పుస్తకాల షాపు భూమిక కార్యాలయంలో ఏర్పాటు చేసాం. జూలై పన్నెండున రచయిత్రుల నెలవారీ సమావేశానంతరం ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవిగారు ఈ పుస్తకాల షాపులను ప్రారంభించారు. క్రమంగా రచయిత్రుల పుస్తకాలన్నింటినీ ఈ షాపులో చేర్చాలనుకుంటున్నాం. ప్రస్తుతం 10శాతం తగ్గింపు రేటుతో ఈ పుస్తకాలు అందుబాటులో వున్నాయి.
ప్రస్తుతం అందుబాటులో వున్న పుస్తకాలు
శిలాలోలిత ఎంతెంత దూరం (కవిత) రూ.60
నారి సారించి (వ్యాసాలు) రూ. 75
కవయిత్రుల కవితామార్గం (వ్యాసాలు) రూ. 80
చంద్రలత ఇదం శరీరం (కథలు) రూ.125
నేనూ నాన్ననవుతా (కథలు) రూ. 80
దృశ్యాదృశ్యం (నవల) రూ.185
వర్ధిని (కథలు) రూ.100
వివర్ణం (కథలు) రూ.125
సుజాతా పట్వారి సంస్కారం (అనువాద నవల) రూ.100
పుప్పొడి (కవిత్వం) రూ.
వారణాసి నాగలక్ష్మి వానచినుకులు (కవిత్వం) రూ. 75
ఆలంబన (కథలు) రూ.100
అత్తలూరి విజయలక్ష్మి అంతర్మథనం రూ. 50
నిహారిక రూ. 60
అపూరూప రూ. 50
అపూర్వకథలు రూ. 40
పాటిబండ్ల రజని జేబు (కథలు) రూ. 40
కొండవీటి సత్యవతి ఆమెకల(కథలు) రూ. 50
కె.ఎన్.మల్లీశ్వరి పెత్తనం(కథలు) రూ. 40
పుస్తకాలు కావలసిన వారు ఈ క్రింది అడ్రసుకు రాయండి.
సర్క్యులేషన్ మేనేజర్ ‘భూమిక’
హెచ్ఐజి.2, బ్లాక్.8 ఫ్లాట్. 1, బాగులింగంపల్లి,
హైద్రాబాద్. 500 044
ఫోన్. 27660173