త్రిపురాన వెంకటరత్నం
ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్స వం 15.10.12 న కరీంనగర్‌జిల్లా, మండలం చామనపల్లి గ్రామంలో మహిళా ఐక్యవేదిక, హైద్రాబాద్, వనితాజ్యోతి మహిళామండలి, కరీంనగర్ ఆధ్యవర్యంలో జరిగింది. ఉదయం పదినుండి మధ్యాహ్నం 3 వరకు ఉత్సాహంగా, వేడుకగా జరిగింది. ఇందులో రెండు వేలమంది మహిళలు పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా, మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు. డా. త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ, మహిళలకు అనేక చట్టాలు ఉన్నా, అవి మొద్దుబారి వున్నాయని, అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాగం విఫలమవుతోందని, చట్టాలకు పదును కావాలని, సక్రమంగా వాటిని అమలు చేయాలని కోరారు. మహిళకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత లభిస్తేనే సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుందని చెప్పారు. మహిళలందరూ ఆడపిల్లలను కాపాడుకోవాలని, మనోబలంతో ముందుకు సాగితేనే, మనం అనుకున్న స్త్రీ సాధికారత సాధించుకుంటామన్నారు.
శ్రీమతి ఖమర్ రహమాన్, అధ్యక్షురాలు వనితా జ్యోతి మహిళా మండలి అధ్యక్షత వహించారు. గ్రామ మహిళలతో జ్యోతి వెలిగించి వేడుకను ప్రారంభించడం జరిగింది. ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవం పోస్టర్‌ను గ్రామ మహిళలే విడుదల చేశారు.
మహిళలకు సంబంధించిన పాటలను త్రిపురాన పాడడం జరిగింద. ఖమర్ రహమన్, మిగతా కళాకారులు పల్లె సుద్దులు పాటలు పాడారు. డిఆర్‌డివో, పిడి, ఆర్‌డివో, మహిళా సర్పంచ్ మొదలగువారు పాల్గొన్నారు.