వన్ బిలియన్ రైసింగ్ – స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక ప్రపంచ వ్యాప్త ఉద్యమం. ప్రముఖ రంగస్థలనటి రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త ‘ఈవ్ ఎన్‌స్లర్’ 1985 ఫిబ్రవరి 14 నాడు న్యూయార్క్ నగరంలో వి.డే అనే సంస్థను స్థాపించి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ”స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసలు తప్పనిసరిగా ఆగాలి’ అనేది వి.డే లక్ష్యం. తమ సంస్థ 15 వ వార్షికోత్సవం అయిన ఫిబ్రవరి 14 నాడు వన్ బిలియన్ రైసింగ్ స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనే ప్రపంచం వ్యాప్త ఉద్యమం చేపట్టాలని ఈవ్ ఎన్‌స్లర్ తలపెట్టారు.దక్షిణాసియాలో ఈ కార్యక్రమానికి ‘సంగట్’ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అస్మిత ఈ ఉద్యమానికి మద్దతు తెల్పుతూ ఫిబ్రవరి 14నాడు వన్ బిలియన్ రైసింగ్ క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్దేశ్యం : ఈ ప్రపంచంలో నివసిస్తున్న 7 బిలియన్ల మంది ప్రజలలో సగం మంది మహిళలున్నారు. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తన జీవిత కాలంలో దెబ్బలు తినడం లేదా రేప్‌కు గురవడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో నివసిస్తున్న వందకోట్ల మందికి పైగా స్త్రీలు రోజు వారీ జీవితాలలో హింసను అనుభవిస్తున్నారు. కాట్టి ఈ హింసను అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సామాజిక, కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పోరాడాల్సి వుంది. అందుకే ప్రముఖ సామాజిక కార్యకర్త కమలాభాసిన్ మాట్లాడుతూ ”మన ఇళ్ళల్లో మన సమాజాల్లో మన మధ్యనే తిష్ట వేసుకున్న ఈ హింసను రూపుమాపడానికి ఒక సమాజిక సునామీ ఏర్పడాల్సిన అవసరమెంతేనా వుంది. కనుకనే ఓబిఆర్ ఈ హింసను తుడిచి పెట్టడానికి ఆ సామాజిక సునామీ రూపంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా రాబోతుంది’ అన్నారు. స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సామాజిక కార్యకర్తలు, సంస్థలు, ప్రతి సం. నవంబర్ 25-డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సం. నవంబర్ 25-డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో మీ మీ సంస్థలు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా చేపడ్తున్న కార్యక్రమాల్లో ఓబిఆర్ గురించి ప్రజలకు వివరించి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వారి మద్దతు కూడగట్టండి. ఓన్ బిలియన్ రైసింగ్ స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది ఒక పోరాటం. ఒక ఉద్యమం. ఈ కాంపైన్ అందరికోసం, అందరిని కలుపుకుంటూ సాగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 14, 2013 నాడు మన రోజువారీ కార్యకలాపాలు, ఆఫీసులు, ఇళ్ళు వదిలి వీధుల్లోకి వచ్చి ”స్త్రీలపై హింసకు ఇక పై చోటు లేదని’ మన గొంతులు విన్పిస్తూ మన తల్లులు, చెల్లెళ్ళు, ఆత్మీయులు అనుభవించిన హింసను తీవ్రంగా వ్యతిరేకిద్దాం.
స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా మేల్కొనండి ప్రతిఘటించండి.నర్త్తించండి.
అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్
10-3-96, ఫ్లాట్ నెం. 283, ఫోర్త్‌ఫ్లోర్, స్ట్రీట్ 6, టీచర్స్‌కాలనీ, ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్ 26 .ఫోన్ 91-40-2773251