నిర్భయ వెలిగించిన జ్యోతి ఆరిపోకూడదు

ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌, బాధితురాలి మరణం కలిగించిన గాయం నుండి దేశ మహిళలు ఇపుడిపుడే కోలుకొంటున్నారు. ఆ దారుణ సంఘటన కలిగించిన షాక్‌లోనే ఇంకా చాలామందిమి వున్నాం. అయితే ఆ షాక్‌ నుండి తేరుకోవడానికి ప్రభుత్వం చేసిన చర్యల కన్నా యువత స్పందించిన తీరు ఎక్కువ దోహదం చేసిందనేది వాస్తవం.

రోజుల తరబడి, గజ గజ వొణికించే చలిలో సైతం రోడ్లమీద నిలబడి నీళ్ళ ముంపునకు, లాఠీ దెబ్బలకు గురయ్యారు. ఎంతో సాహసం, తెగువ చూపించారు. వారి త్యాగం వృధా పోకూడదని నా ఆకాంక్ష. ఎంతో నిరాశా నిస్పృహలకు లోనైన మహిళా లోకానికి యువత స్పందించిన తీరు ఎంతో నమ్మకాన్ని, రేపటి మీద ఆశని కల్పించింది. అయితే ఎక్కడైతే ఈ నిరసన వ్యక్తమైందో అదే ఢిల్లీ నగరం సంఘటన జరిగిన రాత్రి ప్రవర్తించిన తీరు, బాధితురాలిని ఆదుకోలేక పోయిన తీరు తీవ్ర మనస్థాపం కలిగిస్తుంది. ఈ నిర్లక్ష్యానికి, ఈ ధోరణికి ముఖ్యమైన కారణం సమాజంలో వ్యాపించివున్న జండర్‌ ఇన్‌సెన్సిటివిటి, పితృస్వామ్య భావజాలం. ప్రజలకు రక్షణ కల్పించడానికే ఏర్పాటైన పోలీసు వ్యవస్థలో వున్న ఇన్‌సెన్సిటివిటి గురించి మనకు తెలుసు. జ్యూరిస్టిక్షన్స్‌ ముఖ్యమైపోవడంవల్ల ఆమె గంటల తరబడి రక్తమోడుతూ రోడ్డు మీద వివస్త్రగా పడి వుండిపోయింది. ఎస్‌… మనం ఈ రోజు చట్టాలలో మార్పులు చేర్పులు చెయ్యడానికి సమాయత్తమవుతున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘోర సంఘటనలు జరిగినపుడు- మధురరేప్‌ కేస్‌, రమేజాబీ కేసు, భన్వారీదేవి గ్యాంగ్‌ రేప్‌ జరిగినపుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. రేప్‌ చట్టాలలో మార్పులొచ్చాయి. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు తయారైంది. సుప్రీం కోర్టు ఎంతో విప్లవాత్మకంగా లైంగిక వేధింపుల్ని నిర్వచించింది.

నిజానికి స్త్రీల రక్షణకోసం ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. సమస్యల్లా ఆ చట్టం అమలు చేయడంలో వ్యక్తమయ్యే నిర్లక్ష్య ధోరణ.ి ఈ నిర్లక్ష్యం, చిత్తశుద్ధిలేని ధోరణికి కారణం ఏం రంగంలోనూ కనబడని జండర్‌ స్పృహ. స్త్రీల అంశాలపట్ల లోపించిన ఈ జండర్‌ స్పృహ వల్లనే స్త్రీలు ఈ రోజు ఇన్ని రకాల హింసల నెదుర్కొంటున్నారు.

గత రెండు దశాబ్దాలలో మన సమాజంలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రపంచీకరణ ప్రభావంతో సమాజంలో వచ్చిన అనేకానేక మార్పుల నేపథ్యంలో ఈ రోజు స్త్రీలు, ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో బయటకొస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకి రాత్రి షిఫ్టుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఎంతోమంది యువతులు వొంటరిగాను, వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్‌లోను వుంటున్నారు. ఎన్నో సమస్యలనెదుర్కొంటున్నారు. సమాజంలో సంభవించిన ఈ మార్పులకనుగుణంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వుంది. స్త్రీలు సంచరించే బహిరంగ స్థలాలను సురక్షితంగా వుంచాల్సి బాధ్యత మొత్తంగా ప్రభుత్వానిదే. అవి బస్సులా, రైళ్ళా, ఆటోలా, క్యాబ్‌లా వీటన్నింటి గురించి సమగ్ర అధ్యయనాలు, ఆచరణాత్మక ప్రక్రియలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ విభాగాలదే. అది పోలీస్‌శాఖ కావచ్చు, స్త్రీ శిశు అభివృద్ధి శాఖ కావొచ్చు. న్యాయవ్యవస్థ కావొచ్చు. అంటే స్త్రీల పరంగా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా- వాటిని ఎదుర్కొనడానికి సంసిద్ధులు కావడం…

ఇది లోపించడం వల్లనే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. హింసలు పెరిగిపోతున్నాయి. ప్రివెన్షన్‌ అండ్‌ రెమిడీకి సంబంధించిన అంశమిది.

ు మహిళలపై హింస లైంగిక నేరాలు జరగకుండా ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో వున్నాయి.

ు ఇరవైనాలుగ్గుంటాలు పనిచేసే హెల్ప్‌లైన్‌ వుండాలి. ఏదైనా తీవ్ర సంఘటన జరిగినపుడు హడావుడిగా తీసుకునే చర్యలవల్ల ఎలాంటి లాభమూ వుండదని 1091 హెల్ప్‌లైన్‌ రుజువు చేసింది.

ు నిజాయితీ, నిబద్ధత, సెన్సిటివిటీ- ఈ మూడింటికీ తోడు వనరులు, ఇన్‌ఫ్రాస్టక్చర్‌, శిక్షణ ఇవన్నీ వుండాలి.

మొన్నటివరకు 108 అన్నారు. నిన్న 100 అన్నారు. ఈ రోజు 181 అంటున్నారు. ఇవి ఆచరణ సాధ్యం కాదు. మనకు వుమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌ వుంది. అక్కడ మేము నడుపుతున్న సపోర్ట్‌ సెంటర్‌ వుంది. అలాంటి సపోర్ట్‌ సెంటర్‌ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడి నుండే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చెయ్యాలి. ప్రతీ జిల్లాకు అనుసంధానం చేసి, దానికి కావలిన వనరులు, వాహనాలు, కౌన్సిలర్లు ఏర్పాటు చెయ్యాలి! ఇది ఆచరణ సాధ్యమైన ఆలోచన. నిజానికి హెల్ప్‌లైన్‌ నడపాల్సిన బాధ్యత వుమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌దే కావాలి. ఈ సెల్‌ని బలోపేతం చేయాలి. డిస్ట్రస్‌ కాల్‌ రాగానే క్షణాల్లో ఆ ప్రదేశానికి చేరుకునేలా సిబ్బంది సిద్ధంగా వుండాలి.

దీనికిగాను రక్షక్‌ పోలీసుల్ని ఎక్కువ సంఖ్యలో అప్పాయంట్‌ చెయ్యొచ్చు. వల్నరబుల్‌ ప్రదేశాల్లో రక్షక పోలీసుల సంచారాన్ని ఎక్కువ చెయ్యాలి.

– వీటి గురించి విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. మీడియాద్వారా ఈ ప్రచారం జరగాలి. ఒక పల్స్‌ పోలియో ప్రచారం ఎలా జరిగిందో, ఒక హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ ప్రచారం ఎలా జరిగిందో అంత పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరగాలి. అలాగే స్త్రీల మీద హింస నేరం ఈ నేరం శిక్షార్హమైంది అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చెయ్యాలి. ముఖ్యంగా మీడియాలో.

సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించడం ప్రమాదంకరం అంటూ ప్రచారం చేస్తున్నాం కదా ఆయా సన్నివేశాలలో. మరి.. స్త్రీలను కొట్టడం, చెంపలు పగలకొట్టడం శిక్షార్హమైన నేరం అని ఎందుకు చూపించరు? అంటే మనం రూపొందించుకున్న చట్టాల మీద మనకి అవగాహన లేదు. నమ్మకం లేదు. భయం అసలే లేదు.

ఆఖరికి అగ్గిపెట్టెల మీద పొగ తాగితే ఊపిరితిత్తులు పాడయిపోతాయని బొమ్మలేసి మరీ ప్రచారం చేస్తున్నామే! పాలప్యాకెట్‌ల మీద రక్షాణాధికారి ఫోన్‌ నెంబరు ముద్రించి మీరు గృహహింస బాధితులైతే ఈ నెంబరుకు కాల్‌ చెయ్యమని ఎందుకు ప్రచారం చెయ్యం? ఇవన్నీ హింస జరగకుండా తీసుకునే నివారణా చర్యలు, ప్రివెన్షన్‌కి సంబంధించినవి.

ఒక్కమాటలో చెప్పాలంటే

హింస జరిగిన తర్వాత ఖర్చు చేసే బడ్జెట్‌లో నాలుగోవంతు హింసలు జరగక్కుండా నివారించడానికి ఉపయోగిస్తే చాలా ప్రయోజనం వుంటుందని నేను భావిస్తున్నాను. అలాగే

ు హింసల నివారణా చర్యలు

ు ఆ చర్యల గురించి చైతన్యం, ప్రచారం

ు బాధితులకు అండగా వుండానికి సపోర్ట్‌ సిస్టమ్స్‌ డెవలప్‌ చెయ్యడం (లీగల్‌, సైకియాట్రిక్‌, మానిటరింగ్‌ సిస్టమ్స్‌) ఎఫ్‌ఐఆర్‌ చెయ్యడం, కేసుల నమోదు.

ు సత్వర న్యాయం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు.

ు స్త్రీల అంశాలు, చట్టాలు పాఠ్యపుస్తకాల్లో పాఠాలు చెయ్యడం, విద్యాసంస్థల్లో సపోర్ట్‌ సెంటర్‌లు, పోలీస్‌ స్టేషన్‌లో జండర్‌ డెస్క్‌లు పెట్టడం.

ు విస్తృత ప్రచారంద్వారా సమాజంలోని అన్ని రంగాలలోను జండర్‌ సెన్సిటివిటీ, జండర్‌ స్పృహను కలిగించడం.

ు దృక్పథంల్లో మార్పు కోసం తీవ్రమైన కృషి జరగాలి. చట్టాలను సక్రమంగా సమర్థవంతంగా అమలు చెయ్యాలి కానీ మరణశిక్షలు, కెమికల్‌ కాస్టేషన్‌ పరిష్కారం కానేకాదు.

ఈ రోజు మారాల్సింది మాట, పాట, భాష, ఆలోచనాతీరు. సమాజంలో వస్తున్న మార్పుల నెదుర్కొనే సంసిద్ధత – ఇది వ్యక్తుల్లోను, వ్యవస్థల్లోను, ప్రభుత్వాలలోను జరగాలి. నిరంతంర జరగాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో…

జండర్‌ స్పృహ పెరిగినపుడు, సెన్సిటివిటీ పెరిగినపుడు- చట్టాల అమలు తీరు మారుతుంది. దృక్పథాలు మారతాయి.

చివరగా ..

మార్పు నోటి మాటద్వారా కాకుండా మనసు లోతుల్లోంచి రావాలని నేను ఆశిస్తున్నాం.

మైండ్‌సెట్‌ మాత్రమే కాదు హార్ట్‌సెట్‌ అంటే అంతరంగాల్లోంచి మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. మనం ఒక సామాజిక అత్యవసర పరిస్థితిలో / సోషల్‌ ఎమర్జెన్సీలో వున్నాం . దీనిని అందరం ఎదుర్కోవాలి.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.