బాలల హక్కులు – ఒక పరిశీలన

ముత్తన్న గారి రాజేందర్‌ రెడ

బాలల హక్కులు అనేవి మానవ హక్కుల్లో ఒక భాగం. మానవ హక్కులు అంటే మనిషికి గాలి, నీరు, అవాసం ఎంత అవసరమో మనిషికి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అంతే అవసరం, అందువల్లనే మానవ హక్కులకు ప్రాముఖ్యత ఆదరణ ఏర్పడింది.

”బాలల హక్కులు” – చారిత్రక నేపథ్యం :

మానవ హక్కుల భావన అనేది ఇంగ్లాండ్‌లో మాగ్నాకార్ట (1215) ”ది పిటిషన్‌ ఆఫ్‌ రైట్స్‌” 1628 అనే వాటితో వ్యాప్తిలోకి వచ్చింది. ”ఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌ అండ్‌ సిటిజన్‌ 1789” ”అమెరికన్‌ బిల్‌ రైట్స్‌” అనే వాటితో మానవ హక్కులు చట్ట బాధ్యతకు దారి తీశాయి. అనంతరం అనేక అంతర్జాతీయ ఒడంబడికల్లో మానవ హక్కుల ప్రకటన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 1948 డిసెంబర్‌ 10 న మానవ హక్కుల ప్రకటన చేసింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులకు చట్ట బద్ధత కల్పించబడింది. బాలల హక్కులు కూడా మానవ హక్కులేనని స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 1959లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ప్రకటన (డిఆర్‌సి) ను చేసింది. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రకటనలు మొత్తం 10 అంశాలు ఉన్నాయి.

బాలలందరూ సమానులు (కుల, మత, వర్ణ, అంగ బేదం, సామాజిక బేధం లేకుండా)

బాలబాలికలు పుట్టుకతో పేరు మరియు జాతీయతకు అర్హులు.

బాల బాలికలు పుట్టుకతో పేరు మరియు జాతీయత హక్కులతోపాటు ప్రత్యేక సంరక్షణను అనుభవించే హక్కు

బాలబాలికలకు సామాజిక భద్రత ప్రయోజనాలను సమకూర్చాలి.

శారీరకంగా, మానసికంగా లేదా సామాజికంగా బలహీనులైన పిల్లలకు ప్రత్యేక ఆదరణ విద్య, సంరక్షణ అందించబడతాయి.

సంపూర్ణ మరియు సమ్మేళన మూర్తితత్వం అభివృద్ధికి కృషి చేయాలి.

కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా ఉచిత నిర్భంధ విద్య పొందడానికి బాలలు అర్హులు.

ఎలాంటి పరిస్థితిలోనైనా సంరక్షణ మరియు సహాయం పొందే వారిలో పిల్లలు ప్రథమంగా ఉండాలి.

ఏ రకమైన అక్రమాలకు బాలలు గురికాకుండా దానికి అందరూ కృషి చేయాలి.

జాతి, మత మరియు ఆవశ్యకతకు దారితీసే విధానాల నుండి పిల్లలకు రక్షణ కల్పించాలి.

పై ప్రకటన తర్వాత అనేక దేశాలు సానుకూలంగా ప్రకటించిన అమలుకు నోచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1989 నవంబర్‌ బాలల హక్కులు ఒడంబడికలో 180 దేశాలు సంతకాలు చేశాయి. దానికి ప్రధాన కారణం ”ఎగ్‌లెంటన్‌ బెగ్‌” అనే ఉపాధ్యాయులు కృషి అని చెప్పవచ్చు. మనదేశం 1992 డిసెంబర్‌ 11న సంతకం చేసి, బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది.

బాలలు అంటే ఎవరు?

యునైటెడ్‌ నేషన్స్‌ చైల్డ్‌ రైట్స్‌ కమ్యూనికేషన్‌ (యుఎన్‌సిఆర్‌సి) ప్రకారం (ఆర్టికల్‌ 1) 18 సం||లోపు వారందరూ బాలలే.

బాలల హక్కులు

బాలల పుట్టుకతో సంక్రమించిన న్యాయమైన అవసరాలన్ని వారి హక్కుల్నీ అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం 18 సం||లోపు వారంతా 40 రకాల హక్కుల్ని కలిగి ఉంటారు. ఆ హక్కుల్ని బాలల హక్కులు, వాటిని స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు.

యుఎన్‌సిఆర్‌సి ప్రకారం

1. జీవించే హక్కు

2. రక్షణ పొందే హక్కు

3. అభివృద్ధి చెందే హక్కు

4. భాగస్వామ్య హక్కు

ఈ నాల్గు హక్కులలో బాలల అవసరాలను వివిధ హక్కులుగా పరిగణించవచ్చు.

1. జీవించే హక్కు

జీవించే హక్కు ప్రకారం విద్యను పొందడం, ఆరోగ్యంగా జీవించడం, రక్షిత మంచినీరు పొందడం, ఆరోగ్యకరమైన జీవితమును జీవించడం, తల్లిదండ్రులతో కలిసి ఉండటం, గౌరవంగా జీవించడం, విశ్రాంతిగా జీవించటం బాలలు హక్కులు కలిగి ఉంటారు.

2. బాలల హక్కుల ఒప్పందం :

ప్రతి బాలుడు / బాలిక జీవించే హక్కును కలిగి ఉన్నారు.

3. రక్షణ పొందే హక్కు :

లింగ వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, ప్రాంత వివక్ష, వర్ణ వివక్ష, దోపిడి దౌర్జన్యం లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు.

ఆర్టికల్‌ 16 ప్రకారం బాలల యొక్క ఏకాంత, కుటుంబ, గృహ సంబంధ విషయాలలో చట్టం వివిధ చొరబాటు నుండి రక్షణ వైఫల్యం గల వారికి ప్రత్యేక రక్షణ.

అత్యున్నత ఆరోగ్యాన్ని పొందడం.

బాలలు ఆర్థిక దోపిడికి గురికాకుండా ఉండే హక్కు మరియు పిల్లల విద్య, శారీరక, మానసిక, నైతిక, సామాజిక వికాసానికి భంగం కలిగించే ఏదైన ప్రమాదకరమైన పనుల నుండి రక్షణ పొందే హక్కు.

4. పాల్గొనే హక్కు / భాగస్వామ్యపు హక్కు :

ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంఘాలు ఏర్పాటు వంటి ఆటల్లో భాగస్వామ్యము పొందే హక్కు బాలల కొరకు భావ వ్యక్తపరిచే స్వేచ్ఛ, స్నేహపూర్విక జీవనం, ఇతరుల్ని అభిప్రాయాల్ని గౌరవించుట కూడా ఈ కోవకే చెందుతాయి.

విద్యా హక్కు :

కనీసం ప్రాథమిక స్థాయి వ్యక్తిని ఉచిత నిర్భంద విద్య పొందడానికి బాలలు అర్హులు. సాధారణ సంస్కృతి పెంచేలా వారి సామర్థ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చే విద్యను అందించాలి.

బాలల హక్కులు – భారత రాజ్యాంగం :

బాలల హక్కుల గురించి మన భారత రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపర్చబడినవి. ఇందులో ముఖ్యమైనవి.

6 సం|| నుండి 14 సం||ల బాలలందరికీ ఉచిత నిర్భంధ ప్రాథమిక ప్రాథమిక విద్య హక్కు – ఆర్టికల్‌ 21 ఎ.

14 సం||ల వయస్సు వరకు ఎలాంటి ప్రమాదకరమైన పనులు చేయించరాదు – ఆర్టికల్‌ 24, (సిసిడిఆర్‌ఏ) 1986.

ఆరోగ్యకరమైన స్వేచ్ఛ, సమానత్వం అభివృద్ధి పొందేందుకు సమాన రకాలు కల్గి ఉంటాయి.

సమానత్వపు హక్కు – ఆర్టికల్‌ 14

మత, జాతి, కుల, లింగ వివక్షతకు గురికాకుండా ఉండే హక్కు – ఆర్టికల్‌ 15

అక్రమ రవాణా, కట్టు బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు – ఆర్టికల్‌ 23

15 (3) ప్రకారం మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.

బాలల హక్కులు ఉల్లంఘనలు – పర్యవసానాలు – పరిశీలన :

ఈనాడు బాలల హక్కులు ఉన్నాయనే సంగతి మరచిపోయాము. మన సామాజిక వ్యవస్థలు ప్రధాన సామాజిక దశలు అయిన పాఠశాల, కుటుంబము, పౌర సమాజం, విశ్వ విద్యాలయం బాలల హక్కుల గురించి పట్టించుకోకపోవడం వల్ల వారు ఈనాడు మన సంఘంలో నేర ప్రవృత్తి గలవారు, దోపిడి దొంగలుగా తయారు కావడం జరుగుతుంది. ఉదయం లేచినది మొదలు రాత్రి పండుకొనేవరకు ఒకటే చదువు. చదువు యంత్రానికన్నా మధ్యలో విరామం ఇస్తాము కాని నేడు బాలలకు ఆ పరిస్థితి లేదు.

సమాజీకరణ దశలు పాఠశాలల పాత్ర :

బాలల హక్కులుంటాయనే విషయాన్ని మనం ఇంట్లో పాఠశాలలు, తరగతి గదులు మరిచిపోతున్నాము. ఇంటి విషయానికి వస్తే ఉదయం లేవటంతోనే పిల్లలకు ట్యూషన్‌లని తర్వాత పాఠశాల అటు తర్వాత ప్రత్యేక తరగతి ఇలా ఒక మర యంత్రంలాగా పిల్లవాని జీవితంతో తల్లిదండ్రులు వారిని ఆడుకుంటున్నారు. కానీ పిల్లవాని ప్రతిస్పందన ఏమిటి? వాడు ఏమి కోరుకుంటున్నాడు..? అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. మరి ముఖ్యంగా పట్టణ, నగరాల్లోని బాల, బాలికల జీవితం ఈ రోజు దుర్భరంగా ఉందని చెప్పాలి. ఉదాహరణకు మనం తీసుకుంటున్న ”అన్నం” ఏ చెట్టునుండి వస్తుందో పిల్లవాడికి తెలుపకపోవడం అనేది మన దౌర్భాగ్యం అని చెప్పాలి.

పాఠశాలలు :

సామాజిక దశలలో పాఠశాలల పాత్ర ముఖ్యమైనది. కానీ నేడు అనేక శాతం పాఠశాలలు సామాజిక స్పృహలేక నడుస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే పిల్లవాన్ని సమాజానికి అనుసంథానం చేయవలసిన పాఠశాలలు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యాపార ధోరణుల ఒడంబడిక విలువల నిర్వహణలో కల్గి ఉన్నాయి. దీని వలన రేపటి బాల-బాలికలు దేశ భవిష్యత్తుకే పునఃరంకితం ఉండవలసిందిపోయి వ్యాపారంగా వారి జీవితాన్ని మలచడం దేశ భవితకు మంచిది కాదని చెప్పాలి.

తరగతి గదులలో దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని కొఠారి కమిటీ సూచించింది. కాని నేడు తరగతి గదులలో కేవలం పాఠ్యపుస్తకాలతో ముగించి, పిల్లవానికి చదువు పూర్తి చేశామనే భావనతో నేడు ఉపాధ్యాయులు ఉన్నారు. కేవలం వారి దృష్టిలో గణితం, సైన్స్‌ సబ్జెక్టులు పుస్తకములుగా మిగిలినవి అనాసక్తి పాఠ్యాంశాలుగా భావించుచుండిరి. సామాజిక సాహిత్య రంగాలు సమాజానికి రెండు కళ్ళు అనే సత్యం మరిచిపోయి, ఇలా బాల-బాలికల యొక్క హక్కులు హరించి వేస్తూ (ఇంట, బయట) తమ చెట్టు కొమ్మను తామే నరుక్కొంటామన్న సంగతి సామాజీకరణ దశలు అయిన కుటుంబం, పాఠశాల, పౌర సమాజం మరిచిపోవడం జరుగుతుంది. ఇలాగే ఇక ముందు కొనసాగితే సామాజిక సంక్షోభం సమాజంలో తలెత్తుతుంది.

బాల బాలిక వికాసం తీసుకోవలసిన చర్యలు

దానికి తీసుకోవలసిన చర్యలు :

తల్లిదండ్రులు బాలల హక్కుల గురించి తెలుసుకొని వారి హక్కులు కాపాడాలి.

తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇష్టం అని తెలుసుకొని దానికి అనుగుణంగా మెలగటం నేర్చుకోవాలి.

సామాజీకరణ రెండు దశలైన పాఠశాలలో ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఇతర సిబ్బంది పిల్లల హక్కుల పట్ల సామాజిక అవగాహన కల్గి ఉండాలి. వారి ఇష్టాల గురించి అవగాహనతో మెలగటం అవసరం.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయురాలు పిల్లలను సామాజికంగా సమాచారం పొందే విధంగా బోధన జరగాలి. ముఖ్యంగా సమాజానికి ఒక మంచి పౌరుడిని అందించేటట్లు చేయాలి.

సమాజంలో అనేక వ్యక్తులు వారి నైపుణ్యాలకు తగ్గట్టు పొందేటట్లు కృషి చేయాలి.

పౌర సమాజంలోని మేధావి వర్గం బాల-బాలికల హక్కులు గుర్తించి వారికున్న హక్కులు పొందేటట్లు కృషి చేయాలి.

చదువులో వెనుకబడిన విద్యార్థులకు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిలో ఆత్మ విశ్వాసం కల్గి ఉండేలా చర్యలు చేపట్టాలి.

తమ పిల్లల్ని చదివించటం వల్ల వారికి జీవనోపాధితోపాటు బాధ్యతాయుతమైన పౌరులుగా మారతారు. తల్లిదండ్రులు గుర్తించాలి.

ఆడపిల్లల్ని మగ పిల్లలతో సమానంగా చూడాలి.

పిల్లలను వారి పేరు పెట్టి ఆప్యాయతగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిలవాలి.

11. పిల్లలకు తెలిసిన విషయాల నుండి నూతన విషయమును తెలుసుకొనే దిశగా జ్ఞాన నిర్మాణం జరగాలి.

12. పిల్లలు పాఠశాలలకు తప్పక వెళ్ళి చదువుకోవాల్సి ఉందని తల్లిదండ్రులు గ్రహించాలి.

పిల్లలు మాట్లాడడానికి త్వరగా ఏదైనా నేర్చుకొంటారు.

బాలల హక్కులను చట్టబద్ధంగా రక్షణ కల్పించటం ప్రభుత్వాల బాధ్యత, అంతేగాకుండా బాలికలు జవాబుదారిగా ఉండటం. పిల్లలు స్వంతంగా ఆలోచించడానికి అనేక సౌకర్యాలు కల్పించాలి.

తరగతి గదిలో ప్రజాస్వామిక పద్ధతులు ఉపాధ్యాయులు విద్యార్థులతో సంబంధాలు కల్గి ఉండాలి.

పిల్లలను స్వంత పనులకు వినియోగించకపోవడం

ముగింపు :

మానవ హక్కులు అంటే ఏమిటంటే మానవులందరూ సమానంగా అనుభవించే హక్కులను మానవ హక్కులు అంటారు. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరం. అదే సమయంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అంతే అవసరం. అనాదిగా మానవుడు వీటి గురించి పోరాడుతున్నాడు. అందులో భాగమే బాల బాలికల హక్కులు. బాలల హక్కులు 18 సం||లోపు ఉన్నవారందరిని బాలలు అని పిలవడం జరుగుతుందని యు.ఎన్‌.ఓ. పేర్కొంది. మనదేశంలో బాల బాలికల గురించి మన భారతదేశం అనేక రకాలైన హక్కులు అనుభవించడానికి ఆదేశాలు కల్పించడం జరిగింది. అందుకు సామాజిక వ్యవస్థలో ముఖ్య దశలైన కుటుంబం, పాఠశాల, పౌర సమాజం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందువలన అందరు బాలబాలికలను మంచి విద్యావంతులుగా చెయ్యవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జె.ఎస్‌. మిల్‌ భావించినట్లు ప్రతి ఒక వ్యక్తి కుటుంబాన్ని మంచి విద్యాసంస్థగా భావించినప్పుడు మంచి రాజ్యం నిర్మించడం సాధ్యం అవుతుంది. ఈనాటి బాలుడు/బాలికలు రేపటి పౌరుడుగా తయారుకావడానికి అవకాశం ఉంది.

రచయితల పేర్లు :

1. ముత్తన్నగారి రాజేందర్‌ రెడ్డి, రాజనీతి శాస్త్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌..9908240568

2. సోను సోతు రమేశ్‌, తెలుగు విభాగం, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.