జూపాక సుభద్ర

కర్నాటకలో ఆ మధ్య జరిగిన ‘అఖిలభారత దళిత సాహిత్య సమ్మేళనా’నికి వెళ్ళడం జరిగింది. బెల్గామ్‌ కర్నాటక మహారాష్ట్రకు బార్డర్‌ జిల్లా. కర్నాటక అంటేనే బసవేశ్వరుడు భక్తి ఉద్యమాలు యాదకొస్తయి.

రైల్లో బెల్గామ్‌ స్టేషన్‌కి చేరుకోడానికంటే ముందు కుడివైపున కొంత దూరంలో ఒక పెద్ద కోట మనల్ని మురిపిస్తూ మెరిపిస్తూంటది. అది రాణి చెన్నమ్మ కోట అనీ, ఆమె బ్రిటీష్‌ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని చెప్పిండ్రు మాతో ప్రయాణిస్తున్న బెల్గామీ వాస్తవ్యులు. ఇంకా ఆమె భర్త సోమప్ప నాయక అనీ ఆమె సేనాని సంగోలి రాయన్నల సహకారంతో బ్రిటీషు వాళ్లతో ఎడతెరపిలేని యుద్ధం చేసిందని చెప్పిండ్రు. ఆమె పేరుతో స్టేషండ్లో రైలు కూడా వుండడం విశేషమే. ఈ బెల్గామ్‌ జిల్లాకు గోవా దగ్గరట. అందికే అరేబియా గాలుల్తో చల్లగా వెచ్చగా వుంటది బెల్గామ్‌.

వీధులు, హోటల్స్‌, కట్టడాలన్నీ, భాష, సంస్కృతీ, తిండి దక్షిణాది సంస్కృతి కంటే ఉత్తరాది వాసనలే గుప్పమంటయి. ఎంత అఖిల భారత సాహిత్య సమ్మేళన సభలైనా ఎక్కువలో ఎక్కువ వేయి మంది వుంటారేమో! కాని కర్నాటక దళిత సాహిత్య సమ్మేళనంలో పదివేల మందికంటే ఎక్కువ మంది కనిపించిండ్రు. రవీంద్రభారతి కన్నా 5,6 రెట్లు ఎక్కువున్నది కుమార గంధర్వ రంగ మందిరం. లోపల కిక్కిరిసిండ్రు జనం. బైట కూడా అంతకు రెట్టింపు జనం. స్టేజి, కుర్చీలు అన్నీ నీలమమయం. సాధారణంగా రాజకీయ పార్టీల మీటింగులకు, లేదా కుల సంఘాల మీటింగులకు తోల్కొచ్చిన జనం వేల సంఖ్యలో వుంటరు. కానీ సాహిత్య సభలకు యీ రీతిన రావడం, నేచూడడం ఇదే మొదటిసారి. జనం తండోపతండాలుగ వొచ్చిండ్రు. లారీలు, ట్రాక్టర్లు బండ్లు, బస్సుల్లో వచ్చిండ్రు. దాంట్ల చదువుకున్నోల్లే కాదు, చదువుకోని వాళ్ళు కూడా వచ్చిండ్రు. మీటింగు బైట వంద దాకా బుక్‌ స్టాల్స్‌ పెట్టిండ్రు. బైట కూర్చున్న జనానికి టి.వీ.లతో ప్రోగ్రామ్స్‌ చూసే అవకాశం కల్పించిండ్రు. ఈ అఖిల భారత దళిత సాహిత్య సమ్మేళనానికి à°¡à°¾|| చెన్నన్న వాలేకర్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, గుల్బర్గా యూనివర్సిటీ అధ్యక్షత వహించిండు. బైట జనం జాతరగా కనిపించినా సమ్మేళనం జరిగే హాల్‌లో చాలా సీరియస్‌గా ఉపన్యాసాలు సాగినయి. రాజకీయాలు, సాహిత్యం, చరిత్ర కలెగల్సిన ఉపన్యాసాలు. ఒక్క ఇంగ్లీషు పదం దొర్లినట్టు వినలే. స్టేజి మీద మూడు బొమ్మలు పెట్టుకున్నరు. బుద్ధుడు, బసవేశ్వరుడు, అంబేద్కర్‌ – వీరు కర్నాటక దళితులకు ప్రధాన దార్శనికులుగా ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపించింది. మరాఠా చైతన్యాలు బాగా కనిపిస్తయి.వీధులు, హోటల్స్‌, కట్టడాలన్నీ, భాష, సంస్కృతీ, తిండి దక్షిణాది సంస్కృతి కంటే ఉత్తరాది వాసనలే గుప్పమంటయి. ఎంత అఖిల భారత సాహిత్య సమ్మేళన సభలైనా ఎక్కువలో ఎక్కువ వేయి మంది వుంటారేమో! కాని కర్నాటక దళిత సాహిత్య సమ్మేళనంలో పదివేల మందికంటే ఎక్కువ మంది కనిపించిండ్రు. రవీంద్రభారతి కన్నా 5,6 రెట్లు ఎక్కువున్నది కుమార గంధర్వ రంగ మందిరం. లోపల కిక్కిరిసిండ్రు జనం. బైట కూడా అంతకు రెట్టింపు జనం. స్టేజి, కుర్చీలు అన్నీ నీలమమయం. సాధారణంగా రాజకీయ పార్టీల మీటింగులకు, లేదా కుల సంఘాల మీటింగులకు తోల్కొచ్చిన జనం వేల సంఖ్యలో వుంటరు. కానీ సాహిత్య సభలకు యీ రీతిన రావడం, నేచూడడం ఇదే మొదటిసారి. జనం తండోపతండాలుగ వొచ్చిండ్రు. లారీలు, ట్రాక్టర్లు బండ్లు, బస్సుల్లో వచ్చిండ్రు. దాంట్ల చదువుకున్నోల్లే కాదు, చదువుకోని వాళ్ళు కూడా వచ్చిండ్రు. మీటింగు బైట వంద దాకా బుక్‌ స్టాల్స్‌ పెట్టిండ్రు. బైట కూర్చున్న జనానికి టి.వీ.లతో ప్రోగ్రామ్స్‌ చూసే అవకాశం కల్పించిండ్రు. ఈ అఖిల భారత దళిత సాహిత్య సమ్మేళనానికి à°¡à°¾|| చెన్నన్న వాలేకర్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, గుల్బర్గా యూనివర్సిటీ అధ్యక్షత వహించిండు. బైట జనం జాతరగా కనిపించినా సమ్మేళనం జరిగే హాల్‌లో చాలా సీరియస్‌గా ఉపన్యాసాలు సాగినయి. రాజకీయాలు, సాహిత్యం, చరిత్ర కలెగల్సిన ఉపన్యాసాలు. ఒక్క ఇంగ్లీషు పదం దొర్లినట్టు వినలే. స్టేజి మీద మూడు బొమ్మలు పెట్టుకున్నరు. బుద్ధుడు, బసవేశ్వరుడు, అంబేద్కర్‌ – వీరు కర్నాటక దళితులకు ప్రధాన దార్శనికులుగా ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపించింది. మరాఠా చైతన్యాలు బాగా కనిపిస్తయి.

మాట్లాడిన చాలా వక్తలు బుద్ధుడే మన సూర్యోదయం, అక్షరం బాట అనీ మన దళిత సాహిత్యమంతా మన జానపదంలోనే వుందనీ, దాంట్లోనే మన జ్ఞానం, కళలున్నాయనీ మాట్లాడిండ్రు. బహుజన కులాల కవులు రచయితలు ఈ సమ్మేళనానికి తమ పుస్తకాల్ని, లేదా బహుజన కులాల మేధావులు రాసిన పుస్తకాల్ని కానుకగా ఇవ్వడం గూడా చాలా గొప్పగా వుంది. షాహిద్‌ మెమెన్‌ అనే ముస్లిమ్‌ నాయకుడు పైగంబర్‌ మహమ్మద్‌ (కర్నాటక ప్రముఖ రచయిత) రాసిన ‘ఈశ్వర్‌-మానవత’ మీద రాసిన పుస్తకం ఈ సభకు కానుకగా ఇచ్చాడు. ముస్లిమ్‌ సాహిత్యంతో 20 దాకా బుక్‌స్టాల్స్‌ వుండడం కూడా ఆశ్చర్యమేసింది. ముస్లిం చారిత్రక సంస్కృతి వారి ఆధ్యాత్మికత, ఆధునిక జీవితము, ఇస్లాం ధర్మం, ఆదర్శ జీవనం సమాజ సేవకు అల్లా సూక్తులు ఇట్లా కన్నడ ముస్లిం సాహిత్యమే విస్తృతంగా కనిపించింది.

ఇక్కడ మరో ప్రత్యేకాంశమేంటంటే అంటబడని దళితులు, అంటుకునే దళితులున్నారు. రాజ్యాంగంలో అంటరానివాళ్ళుగా వున్న వాళ్లని ఎస్సీలు అన్నది. కానీ కర్నాటకలో అంటబడే కులాల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చడమేంటో అర్థం కాలే. బేడజంగం, లంబని, వడ్డెర, భజంత్రీ మొదలైన కులాలన్నీ అంటబడే ఎస్సీలు. ఆదిద్రావిడ హోళియ దాసరి, మాదర్‌, చమార్‌, చలువాది, ఆదిజాంబవ మొదలైన కులాలు అంటారాని ఎస్సీలు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో జానపదకళలు ప్రదర్శించింది మహిళలే. ఎల్లవ్వ బసవప్ప మాదర, గౌరవ్వ కాంబలేల గీగిపాట తమే దప్పుకొడ్తూ కథ నడిపిస్తుంటరు. పక్కన ఇద్దరు మగవాళ్ళు వంతపాడ్తుంటరు. లేక వాయిద్యాలతో, ఈ ప్రదర్శన అద్భుతంగా సాగింది. దేవనార్‌ మహదేవ్‌, సిద్దలింగప్ప వంటి గొప్ప కన్నడ రచయితలు సరస్వతి వంటి రచయిత్రులు (ఒక్క అనసూయ కాంబ్లే తప్ప) కనబడక పోవడం నిరాశ కల్గింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.