’16/12′ ’15/4′

-పి.ప్రసాదు

దేశ రాజధాని ఢిల్లీలో మరో అత్యంత దారుణ అత్యాచార సంఘటన వెలుగు జూసింది. దేశ ప్రజలను మరోసారి కంటతడి పెట్టించింది. ‘నిర్భయ దుర్ఘటన’ (16/12) జరిగాక సరిగ్గా నాలుగు నెలలకే ఈదుర్ఘటన (15/4) జరిగింది. ఈ రెండింటి మధ్య నాలుగు నెలల వ్యవధి వుంది. ఈ కాలంలో కూడా వరుసగా ఢిల్లీలోనూ, దేశ వ్యాప్తంగానూ స్త్రీలపై అత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే వున్నాయి. ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన తెనాలి దుర్ఘటన కూడా అత్యంత విషాదకరమైనది. ఇలాంటి అత్యాచార దుర్ఘటనలు వరసగా సంభవిస్తున్న పరిస్థితి దేశ ప్రజలని తీవ్ర నిరాశకి గురిచేస్తున్నది. నిన్న తాము 16/12 దుర్ఘటనపై సాగించిన పోరాటం పట్ల నమ్మకాన్ని సడలింప జేస్తున్నది. నిజానికి తాజా దుర్ఘటన తద్భిన్నంగా దేశ ప్రజలకి తమ నిన్నటి పోరాటాల పట్ల విశ్వాసాన్ని కలిగించేది మాత్రమే.

ఇలాంటి అత్యంత పాశవికమైన, అమానవీయ దుస్సంఘటనలు సంభవించినపుడు సమాజంలో ప్రతీకార ప్రతిస్పందన కూడా అనూహ్య స్థాయిలోనే పెల్లుబుకుతుంది. అలాంటి ప్రతిస్పందనకి ప్రభుత్వాలు కూడా తలవంచాల్సిన పరిస్థితులు వస్తాయి. ’16/12 సంఘటన’ అలాంటి పరిస్థితిని కల్పించింది. అయినా అత్యాచారాల పర్వం ఆగకపోయేసరికి ఓ అసహనం, ఓ నైరాశ్యం, ఓ నిర్లిప్తత సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ’16/12 దుర్ఘటన’ పట్ల తీవ్రంగా ప్రజాస్వామికంగా ప్రతిస్పందించిన, ప్రతిఘటించిన దేశ ప్రజలలోనే యివి చోటు చేసుకునే అవకాశం వుంది. ఇప్పుటికి అలాంటి నిట్టూర్పు వినిపిస్తున్నాయి. 16/12 నాటి తమ పోరాటానికి ఫలితం దక్కలేదని ప్రజాస్వామ్య ప్రియులు ఆవేదనకి గురవుతున్నారు. 16/12 పైనిన్నా గజ బలులుగా పోరాడిన ప్రజాస్వామ్య ప్రియులను ఈ మానసిక భావన నిరాశా జీవులుగామారుస్తుంది. తాజా ’15/4 దుర్ఘటన’పై ప్రజాతంత్ర పోరాటంలో దూకనివ్వకుండా వారికి బ్రేకులు వేస్తుంది. అలాంటి ప్రమాదం యిలాంటి సమయంలో సమాజాన్ని కారుమబ్బువలె వెంటాడుతుంది. 15/4 దుర్ఘటన విన్న క్షణంలో వారు మొదట అంతులేని క్రోదావేశులవుతారు. అంతలోనే గత స్మృతి వారిలో అంతులేని నిరాశను కూడా కలిగిస్తుంది. నిజానికి దేశ ప్రజలు తమ గత పోరాటాలు నిష్ఫలమయ్యాయని నీరసించాల్సిన అవసరం లేదు. పైగా తమ నిన్నటి త్యాగాలకి నేడు సత్ఫలితం లభించిందని గర్వపడాలి. అందుకు ’15/4 దుర్ఘటన’ ఓ ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రకృతిలోని ప్రతి వస్తువులో కంటికి కనిపించే రూప గుణాలతోపాటు, కనిపించని రూప గుణాలు కూడా దాగి వుంటాయని భౌతికశాస్త్రం బోధిస్తుంది. సామాజిక వ్యవస్థలో జరిగే ప్రతి సామాజిక పరిణామానికి కనిపించే కారణాలతోపాటు కనిపించని కారణాలు కూడా దాగివుంటాయి. ఉపరితలంలో మన కంటికి కనిపించే దృగ్గోచర పరిణామాలను చూసి ఒక తుది నిర్ధారణకి రావడం శాస్త్రీయ దృష్టి కాజాలదు. కంటి చూపుకు అందకుండా వాటివెనక దాగివున్న లోపలి దృశ్యాన్ని శాస్త్రీయ దృష్టితో విశ్లేషించాలి. అలా విశ్లేషించినపుడు ప్రజాస్వామ్య ప్రియులు గర్వపడే పరిణామంగా ’15/4 దుర్ఘటన’ చరిత్రలో నిలుస్తుంది.

ఐదేండ్ల బాలిక 15.4.2013న ఇంటి ముందు ఆడుకుంటూ ఓ దుర్మార్గుడి చేత కిడ్నాప్‌కి గురైనది. తమ కూతురు తప్పిపోయిందంటూ తల్లిదండ్రులు మొదటి ఫిర్యాదును సోమవారం రాత్రే యిచ్చారు. బాధిత బాలిక 40 గంటలపాటు దుష్టుడి చెరలో వుంది. ఈ 40 గంటల్లో కూడా పోలీసుల ద్వారా బాలిక ఆచూకీ లభించలేదు. పొరుగిళ్ల ప్రజల అప్రమత్తత వల్లనే బుధవారం బాలికకి బంధ విముక్తి లభించింది. పత్రికల కథనం ప్రకారం శుక్రవారం మాత్రమే ఈ దుర్ఘటన వెలుగుజూసింది. 17.4.2013 మధ్యాహ్నం నుంచి 19.4.2013 ఉదయం వరకూ దీన్ని దాదాపు 40 గంటలపాటు మరుగున పడిన సంఘటనగానే భావించాల్సి వుంది. ఇందులో దాగిన లోపలి కోణాలను పరిశీలించాల్సి వుంది.

సుమారు 40 గంటలు తమ బాలిక ఆచూకీ లేని ‘ఉత్కంఠ కాలం’గా తల్లిదండ్రులు గడిపారు. బాలిక లభించిన తర్వాత మరో 40 గంటలపాటు ‘దుఃఖం దిగమింగుకున్న కాలం’గా గడిపారు. తమ కూతురు దొరకనప్పుడు పోలీసులకు ఫిర్యాదు యిచ్చారు. కానీ తమ కూతురు అత్యంత హేయంగా అత్యాచారానికి గురై, నెత్తుటి ముద్దగా లభించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు యివ్వకుండా దిగమింగుకుంటున్న దుఃఖంతో గడిపారు. కానీ సామాజిక స్పృహతో స్పందించిన ఇరుగు, పొరుగు ప్రజల ప్రోత్సాహం గురువారం సాయంకాలానికే లభించసాగింది. అందుకే అది గ్రహించిన ఓ పోలీసు అధికారి స్వయంగా బాలిక తండ్రిని కలిశాడు. ‘ఇదిగో 2వేల రూ||లు తీసుకొని మీ అమ్మాయికి వైద్య చికిత్స చేయించుకో, ఇరుగుపొరుగు ప్రజల మాట విని అనవసరంగా కేసు పెట్టకు’ అంటూ ‘సముచిత సలహా’ (కాదు, బెదిరింపు) యిచ్చాడు. దీని లోపలి దృశ్యం ఓ విలువైన సామాజిక సందేశాన్ని అందిస్తుంది.

బాలిక తండ్రి మంచి వాడేననీ, ఇరుగు పొరుగు ప్రజలే అల్లరి ప్రోత్సాహకులనీ సదరు పోలీసు అధికారి ‘నిజాయితీ’తో భావించాడు. అంతే ‘నిజాయితీ’తో బాధిత తండ్రికి ‘నిర్మోహమాటంగా’ చెప్పగలిగాడు. అది తన వృత్తిధర్మంగా పోలీసు అధికారి ‘చిత్తశుద్ధి’తో భావించాడు. తనని జీతాలిచ్చి పోషిస్తున్న రాజ్యాంగానికి అప్రతిష్ట లేకుండా ప్రయత్నించాడు. ఇక్కడ పోలీసు అధికారి పోషించిన పాత్రను బట్టి ఓ నిగూఢ వాస్తవం బోధపడుతుంది. గతంలో యిలాంటి బాధితులు తమ గుండెలను చెరువులుగా చేసుకొని తమ ఇళ్ళల్లోనే ఏడ్చారు. బయటికి పొక్కితే నలుగురిలో నవ్వుల పాలవుతామని తమ దుఃఖాన్ని తమదిగానే భావించి లోలోపల కుమలిపోయారు. కానీ ’16/12 దుర్ఘటన’ తర్వాత బాధితుల దుఃఖం బాధితుల స్వంతం కాకుండా పోయింది. అది నలుగురు పంచుకునేదిగా మారిపోయింది. ఇక అది దాస్తే దాగేది కాదు. కానీ నిన్నటి ‘వ్యక్తిగత దుఃఖాన్ని’ నాలుగు గోడల మధ్య యథాతథంగా బంధించాలని రాజ్య ప్రతినిధి (పోలీసు అధికారి) సరిగ్గానే భావించాడు. 16/12 తర్వాత మారిన పరిస్థితిని ఆయన గ్రహించలేక కన్నంలో దొరికిపోయాడు. నలుగురికి చిక్కిపోయాడు. ‘గణతంత్ర, ప్రజాతంత్ర, లౌకిక రాజ్యంగం’ దేశ ప్రజల న్యాయ స్థానంలో ముద్దాయిగా నిలబడక తప్పలేదు. ఒక దిగువ స్థాయి పోలీసు అధికారి ఓపెన్‌ మైండ్‌తో ప్రదర్శించిన రాజ్యాంగ చైతన్యం దేశ ప్రజలలో రాజ్య వ్యతిరేక ప్రజాతంత్ర చైతన్యానికి పదును పెట్టింది.

బాలిక తండ్రి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘గురువారం రాత్రి ఒక పోలీసు అధికారి నా చేతిలో రెండు వేలు పెట్టి వెళ్ళిపోయాడ’ని చెప్పడం గమనార్హం. ఈ ఒక్క వాంగ్మూలంలో అనేక నిగూఢ వాస్తవాలున్నాయి. 1) అలా రెండు వేలు చేతిలో పెట్టే సమయానికి ఇరుగు, పొరుగు ప్రజలు చెప్పినట్లు వినే మనిషిగా ఆయన యింకా మారలేదు. మారే ప్రమాదం వుందని మాత్రమే తెలుసు. ఈ అంచనాతోనే రెండు వేలు యివ్వజూశాడు. 2) తనకిచ్చిన డబ్బును బాలిక తండ్రి అక్కడికక్కడే పోలీసు అధికారి మొఖం మీద విసిరి కొట్టలేదు. పైగా భయంతోగానీ, భక్తితోగానీ, ఇష్టం వున్నా లేకపోయినా తీసుకున్నాడు. 3) గురువారం డబ్బు యిస్తే, ఆ విషయాన్ని శుక్రవారం మాత్రమే బాలిక తండ్రి బహిర్గతం చేశాడు. ఈ లోపుగా ఆయనకి ఇరుగు, పొరుగు నుంచి సహకారం, చైతన్యాలు అందాయని అర్థమవుతున్నది. 4) ‘కేసు వద్దు గీసు వద్దు’ అని పోలీసు అధికారి హెచ్చరించినప్పుడు ఒంటరి జీవులుగా, నిస్సహాయులుగా బాలిక తల్లిదండ్రులు మౌనంగా అంగీకరించారు. ఆ తర్వాత కేసు పెట్టేందుకు తగిన సామాజిక అండదండలు లభించాయని బోధ పడుతున్నది. 5) బాధితులు తమకి జరిగిన దురన్యాయాన్ని బయట పెట్టకుండా దాచుకున్న గత సాంప్రదాయం కొనసాగింపు కోసం రాజ్య ప్రతినిధి రెండు వేలు ‘దాతృత్వం’తో దానం చేయజూశాడు. కానీ సమాజం స్పందించిన తర్వాత తమ రాజ్య వృత్తి ధర్మాన్ని నిజాయితీగా ఆచరించిన పోలీసు అధికార్లను రాజ్యమే స్వయంగా సస్పెండు చేయక తప్పలేదు. ఈ ఐదు లోపలి దృశ్యాలను బట్టి ‘రాజ్యం’ మీద సామాజిక చైతన్యం విజయం సాధించిందని తేలిగ్గానే అర్థమవుతున్నది.

1970-80ల వరకూ లాకప్‌ మరణాలు వేల సంఖ్యలో జరిగేవి. నేరస్తులను (నిజానికి నేరారోపితులు మాత్రమే) కొట్టి చంపే హక్కు తమకి వుందని పోలీసులు భావించిన కాలమది. ఆనాడు సమాజ చైతన్యం కూడా అట్టి పరిమితి దాటలేదు. అందుకే ఆనాడు అవి వెలుగు జూసేవి కాదు. కానీ ఒక్కసారి పౌర, మానవ హక్కుల సంఘాలు ఉద్యమ చైతన్యం కలిగించాక వెలుగు జూడ సాగాయి. సమాజ స్పందన పెరిగాక లాకప్‌ మరణాలు తగ్గుతున్నా, వెలుగు జూసే సంఘటనల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వరకట్న హత్యలూ, భ్రూణ హత్యలు కూడా అలాంటి పరిణామానికి గురైనవే. ’16/12 దుర్ఘటన’ కల్పించిన సామాజిక చైతన్యమే ’15/4 దుర్ఘటన’లో బాలిక తల్లిదండ్రులకి ధైర్యాన్నిచ్చింది. అయిష్టంగానైనా రెండు వేలు తీసుకున్న తర్వాత 24 గంటలు తిరగకముందే ఫిర్యాదు యిచ్చే చైతన్యాన్ని బాధిత తండ్రిలో కల్పించింది.

ఇందులో ’16/12′ తర్వాత కూడా యింకా ’15/4’లు ఎందుకు పునరావృతమవుతున్నాయన్న నిరాశకు చోటు వుంది. అదే సమయంలో మరో కోణం నుంచి చూస్తే మరో వాస్తవం కూడా ఇందులో దాగి వుందని తెలుస్తుంది. ’16/12 దుర్ఘటన’పై సామాజిక చైతన్యం పెంపొందక పోయివుంటే, ’15/4 దుర్ఘటన’ దేశ ప్రజల దృష్టికి వచ్చి వుండేదికాదు. అది చట్టం దృష్టిలో ‘అత్యాచారం’ కాకుండా పోయేది. చట్టం దృష్టిలో బాలిక తల్లిదండ్రులు మంచి పౌరులుగా గుర్తింపు పొందే వాళ్లు. దుఃఖాన్ని ఒంటరిగా దిగమింగుకోగలిగిన బాధితులు యిలాగే వర్ధిల్లితే, దేశం అత్యాచారాలు లేని సురక్షిత రాజ్యంగా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో పేరొందుతుంది. కానీ బాధుతుల ఇంటి చుట్టూ వున్న ప్రజలు అలాంటి జాతీయ, అంతర్జాతీయ ‘ఘనకీర్తి’ని మన ప్రభుత్వాలకి దక్కనివ్వలేదు. మరోసారి వారిని రాజకీయంగా వివస్త్రను చేశారు. ద్రౌపనిది వివస్త్రను చేసిన చోట అభినవ దుశ్సాసన పాలకులను రాజకీయంగా వివస్త్రను చేస్తున్న సంఘటన స్వాగతించదగినది. అందుకు ఢిల్లీ ప్రజలను వేనోళ్ల కీర్తించుదాం.

కంటికి కనిపించినట్లుగా 16/12తర్వాత దేశ ప్రజలలో వెల్లువెత్తిన సామాజిక ప్రజాతంత్ర చైతన్యం వ్యర్థం కాలేదు. అది నడిరోడ్డు నుంచి చిన్న గల్లీలలో, అపార్టుమెంట్లలో, చిన్న చిన్న ప్లాట్లలోకి ప్రవహిస్తున్నది. 16/12 నాటి చైతన్యం 15/4 వంటి అన్వేషణలకి రెక్కలనందిస్తున్నది. అందుకే దుఃఖంతో నాలుగు గోడల మధ్య కుమిలిపోయే బాధిత భారత జనావళిని రాజ్యాన్ని నిలదీసే ప్రజాతంత్ర పోరాటశక్తిగా మార్చిన మార్గదర్శక సంఘటనగా ’15/4’ని భావించి గర్విద్దాం. ఊహాజనితమైన నిరాశా, నిస్పృహలను మన మనస్సుల్లో నుంచి పారత్రోలుదాం. నిన్నటి మన ప్రజల పోరాటాల పట్ల ఉపరితల దృష్టితో అపనమ్మకం పెంచుకోవడం సముచితం కాదు. శాస్త్రీయ దృష్టితో విశ్వాసం పెంచుకొని మరింత పదునైన ప్రజాతంత్ర పోరాటాలకి స్ఫూర్తి పొందుదాం. అందుకు ఆలంబనగా నిలిచిన 15/4 నుంచి ప్రేరణ పొందుదాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.