-కుప్పిలి పద్మ

వాళ్లెప్పుడు మనకి విషయాలని వాళ్ల ధోరణిలోనే చెపుతుంటారు. మనం వింటుంటాం. యిందులో యేదో తేడా వుందని తెలుస్తుంటుంది.
మాటల తుది మొదలు వాళ్లే చెప్పేస్తుంటారు. మధ్యలోని మాటలని మనతో వల్లెవేయించటానికి మాత్రమే మాటాడిస్తుంటారు. యిదో కొత్త యెత్తుగడ. అక్కడో ముక్క యిక్కడో ముక్క మనకి చెపుతారు. లేదా చూపిస్తారు. అంతా హడావడి. త్వరత్వరగా నిర్దారణకి వచ్చేయ్యాలి. తీర్పులు క్షణాల్లో వెల్లడించాలి. పోని యివి యేమైనా యెవరి వికాసానికైనా తోడ్పడతాయాంటే తెలీదు. ఆలోచనలని రేకెత్తిస్తాయాంటే తెలీదు. యెందుకంటే యీ పరుగుల ప్రపంచంలో అసలేం జరుగుతందో తెలిసేలోగా యెవరి జీవితాలు యేయే సంఘర్షణల్లోకి, యేయే సందిగ్ధాల్లోకి, యేయే కట్టుకథల్లోకి, యేయే వూహాగానాల్లోకి నెట్టవేయపడుతుందో తెలీయదు.

గత కొంతకాలంగా యీ నగరంలో కొన్ని సంఘటనల నేపధ్యంలో కొన్ని ప్రశ్న లు, కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి.

ముఖ్యంగా నైతికత మీద జరుగుతున్న ఘర్షణ… వాళ్లు వేస్తున్న ప్రశ్నలు మనం వేయ్యాల్సిన ప్రశ్నలని మనకే వినపడనీయకుండాచేస్తున్నాయి. మన అరికాళ్ల కింద యెంత మంట పెట్టినా సరే, వాళ్లు, వీళ్లు కెమెరాల వెనుక దాక్కుని మన బట్టలని యెంత తీక్షణంగా పరిశీలించినా సరే స్థిరంగా నిలబడాలి. మన ప్రశ్నలని చేజారిపోకుండా చిక్కపట్టుకోవాలి. నైతికత అన్న పదం వాళ్లు వాడగానే మనం వేయ్యాల్సిన ప్రశ్నలు యివి. అసలు యెవరి నైతికత యిది. ప్రైవసీకి సరిహద్దులు యేమిటి…

పబ్లిక్‌ ప్రైవేట్‌ మధ్య వుండే హద్దులేంటి.సామాజికానికి ఆంతరంగికానికి మధ్య నుండే హద్దులేంటి.

ఆ రోజు రాత్రి నగరంలో వో ప్రముఖ కూడలి వద్ద అమ్మాయిలకి ఎదురైన అనుభవం చాలా మందికి తెలుసు. వారిని వో అబ్బాయి సెల్‌ఫోన్‌ వీడియోలో బంధిస్తుంటే గొడవ మొదలైయిందని అమ్మాయిలు చెపుతున్నారు. అయితే మర్నాడు ఉదయం చాలా ఛానల్స్‌లో వారి బట్టల మీద వారలా రాత్రి వేళ తాగటం మీద చాల కథనాలు వచ్చాయి. కానీ ఆ అమ్మాయిలు చెపుతున్న అసలు గొడవకి కారణమైన ఆ సెల్‌ఫోన్‌ కెమేరా వూసే మరుగున పడిపోయింది.

యిలా అమ్మాయి బట్టల మీదో, ప్రవర్తన మీదో కధనాలు రావటం మొదటిసారి కాదు. భర్తకి మరో స్త్రీతో సంబందం వుందని తెలిసి మరి కొందరు స్త్రీలతో వెళ్లి ఆమె చేసిన దాడిలో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన లైవ్‌ విజువల్స్‌ చూసినప్పుడు అసలు ఆ గొడవ జరుగుతుందని ముందే యెలా తెలుసని తెలిసిన వ్యక్తిని అడిగితే గొడవకి వెళుతున్నాం అని వాళ్లు ముందే చెప్పటం వలన అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అలానే ఆ మధ్య అస్సాంలో వో అమ్మాయి మీద జరిగిన దాడి, యెవరో తమ సెల్‌ఫోన్‌ కెమెరాలో స్నానం చేస్తున్న వో హీరోయిన్‌ని బంధించిన దృశ్యాలని పదే పదే ప్రదర్శించిన తీరు యిలా అనేకసార్లు స్త్రీల జీవితాలని చూపిస్తున్న పద్దతిపై మాటాడాలనిపిస్తోంది.

స్త్రీల జీవితాలలోని అన్యాయాన్ని, అత్యాచారాలని, హింసని, దుఖ్ఖాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాలలో కదలిక తీసుకొచ్చిన సందర్భాలు యెన్నో, యెన్నెన్నో.

మరి కొన్ని సందర్భాలు మనపై కుమ్మరిస్తోన్న చికాకు యెందుకు, యెక్కడ నుంచి ఆ చికాకు వస్తుంది. అమ్మాయిలు యిలాంటి బట్టలు వేసుకోవటం వలనే దేశంలో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయని చాల బలంగా చాలా మంది మాటాడేస్తుంటారు. అమ్మాయిలు తాగటం అతి పెద్ద నైతిక సమస్యగా మాటాడుతుంటారు. అమ్మాయిలు ప్రేమని తిరస్కరించటం వలనో లేదా కొన్నాళ్లు యిష్టపడి తిరిగి అతనిని వద్దనటం వలనే దాడులు జరుగుతున్నాయని కొన్ని గుసగుసలు వినిపించేస్తుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పిక్‌నిక్‌కి వెళుతుంటే రోడ్డు ప్రమాదం జరిగి వాళ్లల్లో కొందరు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకొంటే చూసారా ఆ అమ్మాయిల బట్టలు అని లైవ్‌లో నిపుణులు మాటాడుతుంటారు. ఆ అమ్మాయి వారికి ఆమొదయోగ్యం అయిన బట్టలు వేసుకొంటే ఆ ప్రాణాలు పోయేవి కావా. అప్పుడు మనం మాటాడాల్సినది రోడ్డు సేప్టీ, డ్రైవింగ్‌లో యెంత బాధ్యతగా వుండాలనే విషయం కాదా.

వొకప్పుడు అమ్మాయిల బట్టలపై యిళ్లల్లో చాలా ఆంక్షలుండేవి. మారుతోన్న ప్రపంచంతో పాటు యిళ్లల్లో అమ్మాయిలని అర్ధం చేసుకొనే పద్దతిలో చాలా మార్పులొచ్చాయి. యిప్పుడు ఆ ఆంక్షలు షిప్ట్‌ ఆయ్యాయి. బయట ప్రపంచంలో కొంతమంది ఆ కంట్రోల్‌ని తమ ఆధీనంలోకి తీసుకొంటున్నారు. పని దగ్గర సమాన హక్కులు కావాలన్నది చాలా కాలంగా పోరాడుతున్నాం. వినిమయంలో కూడా అంతే ప్రాముఖ్యత వున్న విషయం. దాని గురించి మనం అవసరం వున్నంతగా మాటాడుకోలేదేమో. కొత్తతరం యువతలో యీ ప్రశ్న బలంగా ముందుకొస్తున్నట్టుంది. అమ్మాయిలు అర్ధరాత్రి వొంటరిగానో లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలసి సినిమాలకి యెందుకు వెళ్లకూడదు… లేదా పార్టీలకి యెందుకు వెళ్లకూడదు… యిలాంటి విషయాల మీద ప్రశ్నలు ముందుకు వచ్చినప్పుడు కేవలం స్త్రీల శరీరాల మీదనే నైతికత. అనే ఆయుధంతో దాడి జరుగుతుంది. యీ దాడిని మనం ప్రశ్నించాల్సిందే. చర్చించాల్సిందే.

బయట ప్రపంచంలో స్త్రీలపై జరుగుతున్న హింసకి స్త్రీలనే బాధ్యులని చేయటం అత్యంత ప్రమాదకరమైన ఆలోచన. యీ ఆలోచనని గట్టిగా యెదుర్కోటానికి మనకి ముందుగా నైతికత మీద జరుగుతున్న చర్చని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల మీద దాడులు జరుగుతున్నప్పుడు దాడి జరగగానే స్త్రీల ప్రవర్తన మీద చర్చలు జరుగుతున్నాయి. 24 గంటల ప్రసారాలు వచ్చాక నగరంలో ప్రతి మూలని, రోజువారి జీవితంలో మనం యెటు కాలు పెడితే అటు మన అనుభవా లని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాయి. కెమేరాల్లో బంధిస్తున్నాయి.

అసలు దేన్ని కెమెరాల్లో బంధించ వచ్చు దేన్ని బంధించకూడదు అన్నదాని యింత వరకు ఓ చర్చ జరగలేదు. యెవరు బంధిస్తున్నారు, యెందుకు బంధిస్తున్నారు అన్నదానిమీదా చర్చ జరగాలి. యెందుకు అన్నదాని మీద జవాబు చాల తేలిగ్గా చెపుతారు. బహిరంగ ప్రదేశాలలో జరిగినవి వాళ్లకి అభ్యంతరమైనవో, ఆసక్తికరమైనవో అయిన విషయాలైతే కెమెరాలు వాటి చూపులని యొక్కడెక్కడైనా ప్రసరింపచేయ వచ్చంటారు. అలాగే యిప్పుడు ప్రతి వొక్కరు నడిచే కెమేరాలే కదా. యిలా చాలా మంది తమ చేతుల్లో కెమేరా వుందని తమకి ఆసక్తిగా అనిపించిన వాటిని బంధించి యెక్కడైనా ప్రసరించైగలరు కాదాని బంధించినటువంటి దృశ్యాన్ని మనం మిషనుల్లో యెలా కావాలంటే అలా మార్ఫ్‌ చేసుకోవచ్చు కదాని వాళ్లు, వీళ్లు వేట మొదలు పెడితే మన శరీరాలు మన కన్‌స్నెంట్‌ లేకుండానే నలుగురి కళ్లకి అందచేయబడతాయి రకరకాల మాధ్యమాల ద్వారా.

మూడు వారాల క్రితం హైదరాబాద్‌ లో కొంతమంది అమ్మాయిలు అలాంటి వేటకే అభ్యంతరం చెప్పారు. వేట చూపులని తిరస్కరించారు.

అయితే మనకి చర్చలో వచ్చిన విషయం ఆ తిరస్కారించటంలో వాళ్లు యెలా ప్రవర్తించారనే దాని మీదే చర్చజరుగుతుంది. చివరికి వేట చూపులులే కెమేరాల ద్వారా గెలిచాయి.

అమ్మాయిల శరీరాలని వొక నైతికతకి సంబంధించిన విషయంగా చర్చలోకి తెచ్చాయి. యీ చర్చని మనం మలుపు తిప్పాలంటే మనం కూడా కెమెరాల వెనుక నుంచి చూస్తు వేటకి దిగాలంటే సాధ్యం కాదు. మంచిది కాదు కూడా. సరైన పద్ధతి యేంటంటే ఆ అమ్మాయిల తిరస్కారాన్ని మనం సమర్ధించి గట్టిగా యెలా మాట్లాడాలో నేర్చుకోవాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో