కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తిగారు తేది 29-8-1863 నాడు ప్రస్తుతం ఒరిస్సాలో పర్లాకిమిడిలో జన్మించారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మనిషి.
పంతులుగారు ఈ శతాబ్ది ప్రథమపాదంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి నిర్విరామంగా కృషి చేసిన సంగతి మనందరకు విదితమే. వారు గొప్ప పండితులు, పరిశోధకులు, అంతకు మించిన వనవతామూర్తి. సవరలు అనే గిరిజనుల అభివృద్ధికి వారు చేసిన సేవ నిరుపవనం.
సమకాలీనంగా తెలుగు రచనలలో గ్రాంధిక భాషవలన ప్రయెజనం లేదని సప్రవణంగా నిరపించి, పండితులను ఒప్పించి వాడుక భాషా వ్యాప్తికై జీవితాంతం పాటుబడ్డారు. వ్యావహారిక భాషను సాహిత్య రచనలలోను, విద్యారంగంలోను వాడటం ద్వారా దిగువ తరగతుల వారికి విద్య వ్యాపిస్తుందని, దాని వలన ఎన్నో సావజిక ప్రయెజనాలు నెరవేరుతాయని ప్రచారం చేశారు. వారు ఆంధ్రదేశం అంతా పర్యటిస్త ఒక ఉద్యమాన్ని నడిపి విజయం సాధించటం వలన ఈనాడు అన్ని రంగాలలోను వ్యావహారిక భాష వాడుకలోకి వచ్చింది. సవరజాతి జీవన విధానం, సంస్కృతి, భాష మొదలైన పలు విషయలలో పరిశోధన చేసి నాటి ప్రభుత్వం చేత అభివృద్ధి కార్యక్రవలు అమలు పరచేలా చేశారు. సవరభాషలో వాచకాలు, నిఘంటువులు రాయడంతో పాటు సొంత డబ్బు వెచ్చించి పాఠశాలలు పెట్టి సవరలలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. వీరి స్వస్థలం అయిన పర్లాకిమిడి, బరంపురం ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో చేర్చడానికి ఎంతో కృషిచేశారు. రాజకీయంగా ఉద్యవన్ని నడిపి, గిడుగు సీతాపతిగారిని లండన్కు పంపి నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. చివరకు ఆప్రయత్నం విఫలం చెందడంతో తమ ఆస్థిని వదలుకొని రాజమహేంద్రవరం వచ్చి స్థిరపడిన ఆంధ్రాభివని వీరు. వీరి రచనలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వజూపినప్పుడు దానికి బదులుగా సవరలకు పాఠశాలలు పెట్టమని కోరిన వనవతావాది వారు. భాషాశాస్త్రవేత్త డేనియల్ జోన్సుతో తెలుగు ధ్వని పరిణామం గురించి చర్చించిన ఆధునిక భాషా శాస్త్రవేత్త వారు. ప్రస్తుతం తెలుగు భాష అన్నిరంగాలలోను వ్యాపించడానికి కారకులు వీరు.
1906 సం||లో స్కూళ్ళ ఇన్స్పెక్టరు విశాఖపట్నం వచ్చిన జె.ఎ.యేట్స్ దొరగారు తెలుగు నేర్చుకోవాలన్న ధ్యేయంతో ఒక తెలుగు పండితుణ్ణి నియమించుకొన్నారు. ఆయన తనకు నేర్పుతున్న భాషకు, ప్రజలు వట్లాడుకొనే భాషకు వ్యత్యాసమున్నట్లు గమనించి సందేహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు నేర్పుతున్నది వ్యాకరణబద్ధమైన తెలుగుభాష. వాడుక భాష వ్యాకరణ బద్ధమైనది కాదు అని చెప్పారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందక ప్రిన్సిపాల్ పి.టి. శ్రీనివాస అయ్యంగారితోను, గురజాడ అప్పారావుగారితోను సంప్రదించారు. వారు సరైన సమాధానం చెప్పలేక గిడుగు రామమూర్తిగారిని వివరణ కోరవలసిందిగా సచించారు. రామమూర్తిగారు సమస్యను విని, తనకు ప్రస్తుతం గ్రాంధిక భాషా పాండిత్యము లేదని, కాని ఈ సమస్యను పరిశీలించడానికి కొంత సమయం కోరినారు. నన్నయ కాలం నుండి చిన్నయ కాలం వరకూ గల తెలుగు కావ్యాలలోని భాష ఒకే విధంగా లేదని, అనేక వర్పులు చెందినదని గ్రహించారు. చిన్నయకు పూర్వం గద్య రచనకన్నా పద్యరచనే ఎక్కువగా వున్నదని, ఆ కొద్దిపాటి వచన రచనలు కూడ వాడుక భాషలోనే వున్నాయని, జీవద్భాషకు వర్పు సమాజమన్న విషయన్ని రామమూర్తిగారు యేట్స్ దొరగారికి తెలియజేశారు. 1909 సంవత్సరపు వేసవి ఉపాధ్యాయుల సదస్సులో తెలుగు కావ్య భాషలో వచ్చిన వర్పులను గురించి తెలుగు భాష తత్త్వములను గురించి చేసిన ప్రసంగానికి అందర అభినందనలు తెలిపారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని వ్యావహారిక భాషలో రచించడం మంచిదని సచించినారు.
20వ శతాబ్దం ప్రారంభానికి ఆంధ్ర దేశంలో అక్షరాస్యత 9 శాతం కూడ లేదు. కారణం విద్యాబోధన గ్రాంధిక భాషలో వుండడమే. కాని ఆనాటికే వంగదేశంలో ‘చలిత్ భాష’ (వ్యావహారిక భాష) లో అనేక రచనలు ప్రచురింపబడ్డాయి. అందుకనే వివిధ రంగాలలో ఆనాడు బెంగాలు రాష్ట్రం ముందుండేది. గిడుగు వారి అభిప్రాయలతో గురజాడవారు ఏకీభవించారు. సరళ గ్రాంధిక భాషలో సెట్టి లక్ష్మీనరశింహంగారు వ్రాసిన ‘గ్రీకు పురాణ కథలు’ అనే పుస్తకాన్ని ఎస్.ఎస్.ఎల్.సి కి ఉపవాచకంగా ఏట్స్ దొరగారు పెట్టించారు. వ్యావహారిక భాష బోధనా భాష కావడం ఇష్టంలేని సాంప్రదాయ వాదులు రామమూర్తిగారి ఉద్యవన్ని ప్రతిఘటించసాగారు. వీరిలో ముఖ్యులు జయంతి రామయ్యగారు, వావిలాల సుబ్బారావుగారు, వేదం వెంకటరాయశాస్త్రిగారు,కాశిబోట్ల సుబ్బరాయశాస్త్రిగారు శతఘంట వేంకటరంగశాస్త్రిగారు, వీరంతా పిఠాపురం మహారాజావారి పోషణలో ఆంధ్ర సాహిత్య పరిషత్తును కాకినాడలో స్థాపించారు.
వివిధ విజ్ఞాన శాస్త్ర విషయలు విద్యార్థులకు బోధించడానికి వ్యావహారిక భాష ఉచితమైనదని, విషయము కన్నా భాష కఠినంగా ఉంటే విద్యార్థులకు ప్రయెజనం కలుగదని, ఒకనాటి వాడుక భాషే నేడు గ్రాంధిక భాషయినదని, ఎంతటి పండితులయినా గ్రాంధిక భాష తప్పులు లేకుండా రాయలేరని అటువంటి భాషను విద్యార్థులను నేర్చుకోమనడం సబబు కాదని రామమూర్తిగారు వివరించారు. ఆ తర్వాత కొడుకు సీతాపతిగారు, శిష్యులు చిలుకూరి నారాయణరావుగారు, బుర్రా శేషగిరిరావుగారు మొదలైన వారు రామమూర్తిగారి వ్యావహారిక భాషా ఉద్యమానికి అండగా నిలిచి నెగ్గించారు. ఆ తర్వాత రామమూర్తిగారి సంపాదకత్వంలో వెలువడిన ”వెలుగు” పత్రికలోని వ్యాసాలు, ముట్నరి కృష్ణారావుగారి కృష్ణా పత్రికలో సంపాదకీయలు వ్యావహారిక భాషలోనే వ్రాయడం మొదలు పెట్టారు. కాశీనాథుని నాగేశ్వరరావుగారి ”భారతి” సాహిత్య మాస పత్రికలో వ్యావహారిక భాషా రచనలకు స్థానం కల్పించారు. ఆనాటి యువక రచయితలు తల్లావఝల శివశంకర శాస్త్రి, నోరి నరశింహశాస్త్రి, ఈయుణ్ణి రాఘవాచార్యులు, త్రిపురాభట్ల వీరరాఘవస్వామి, చింతా దీక్షితులు, వఝ బాబరావు, మొక్కపాటి నరశింహశాస్త్రి, వేదుల సత్యనారాయణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలగు వారితో కలిసి 1919 సంవత్సరంలో ”సాహితీసమితి”ని తెనాలిలో నెలకొల్పినారు. ‘సాహితి’ అనే వస పత్రికను ప్రారంభించారు. అందులో రచనలన్నీ వ్యవహారిక భాషలోనే నడిచేవి. ఆ తర్వాత నండరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీనివాస శిరోమణి, రాయప్రోలు సుబ్బారావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, అడవి బాపిరాజు మొదలైన వారెందరో సాహితీ సమితిలో చేరారు.
గుంటూరు నుండి వెలువడిన ‘గుంటూరు’ పత్రిక, రాజమహేంద్రవరము నుండి వెలువడిన ‘స్వతంత్ర’ పత్రిక, కౌతావారి ”శారద” పత్రికలన్నీ వ్యావహారిక భాషా రచనలనే ప్రోత్సహించాయి. ఆ రోజుల్లోనే ”వలపల్లి” అనే సాంఘిక నవలను ఉన్నవ లక్ష్మీనారాయణగారు వాడుక భాషలో రచించారు. రామమూర్తిగారికి 70 సం|| నిండిన సందర్భంగా రాజమండ్రిలో గొప్ప సన్మాన సభ జరిపించారు. ఆరోజే ఆయన రచించిన 1. వ్యాసావళి 2. పండిత భిషక్కుల భాషా భేషజం 3. బాలకవి శరణ్యం 4. గద్య చింతామణి అను నాలుగు గ్రంథములు ఆవిష్కరించబడ్డాయి. ఆయనకు ‘మహా మహోపాధ్యాయ’ అను బిరుదు ప్రదానం జరిగింది. 1936 ఏప్రిల్ 1వ తేదీ ఉదయం గం. 10-00 లకు నతన ఒరిస్సా రాష్ట్ర ప్రారంభోత్సవం కటకంలో జరగనుండగా ఆనాటి ఉదయం గం.7-00లకే రామమూర్తిగారు నిరసనతో రాజమహేంద్రవరానికి వెళ్ళిపోయరు.
1938 సంవత్సరంలో రామమూర్తిగారికి, 1963 సంవత్సరంలో సీతాపతిగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ”కళాప్రపూర్ణ” బిరుదునిచ్చి వ్యావహారిక భాషను గౌరవించారు.
1940 జనవరి 15వ తేదీన మద్రాసులోని ”ప్రజామిత్ర” కార్యాలయంలో గడవల్లి రామబ్రహ్మంగారు పత్రికా గోష్ఠి నిర్వహించినారు. ఆనాటి గోష్ఠిలో ఆంధ్రప్రభ సంపాదకులు న్యాయపతి నారాయణమూర్తి, ప్రజావాణి సంపాదకులు తాపీ ధర్మారావుగారు, ఆంధ్ర పత్రిక సంపాదకులు శివలెంక శంభప్రసాద్గారు, ఇంకా వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. అప్పుడు రామమూర్తిగారు ప్రసంగిస్త ఈ వ్యవహారిక భాషా ఉద్యవన్ని కొనసాగించాల్సిన బాధ్యత పత్రికా సంపాదకులదేనన్నారు. ఆ తర్వాత వారం రోజులకు 1940 జనవరి 22వ తారీఖున రామమూర్తిగారు దివంగతులైనారు. విశ్వవిద్యాలయ పాఠ్యగ్రంథాలలో వ్యావహారిక భాష అనుసరణీయమని భద్రిరాజు కృష్ణమూర్తిగారు నొక్కి వక్కాణించారు. ఫలితంగా 1969వ సంవత్సరంలో ”తెలుగు అకాడమీ” ఆవిర్భవించింది. ఇంటర్మీడియట్, డిగ్రీ తరగతులకు వివిధ సాంకేతిక గ్రంథాలను వ్యవహారిక భాషలోనే తెలుగు అకాడమీ వారు ప్రచురిస్తున్నారు. పరిశోధకులు తమ పరిశోధనా వ్యాసాలను పిహెచ్.డి కొరకు వ్యావహారిక భాషా ఉద్యమం 1973 నాటికి సంపూర్ణంగా ఫలించినది.
వాడుక భాషలో విద్యాబోధన కొరకు ఉద్యమించి విజ్ఞానాన్ని ప్రజల చెంతకు చేర్చిన కళాప్రపూర్ణ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారికి ఆంధ్రులంతా ఎంతో ఋణపడి వున్నారు. ఆంధ్రులందరికీ ఆయన చిరస్మరణీయుడు. అందుకే ఆయన జన్మదినం మనకు ”తెలుగు భాషా దినోత్సవం”.
జై తెలుగు. జన విజ్ఞాన వేదిక, తెలుగు భాషా చైతన్య సమితి., ఫోన్ : 0861 – 2307075
గిడుగు రామమూర్తి పంతులు గారు