మేధావులారా ఆలోచించండి
మేమూ మనసున్న మనుషులమే
మేమూ సమాజంలో భాగమే
మా విడుదలకు అందర సహకరించి పునఃర్జన్మను ప్రసాదించి మాకు న్యాయం చేయండి.
మహానుభావులారా! మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోండి పుణ్యాత్ములారా
అమ్మా!
మానవుడు సంఘజీవి. సంఘంలో జీవించలేనటువంటి వ్యక్తి దేవుడైనా కావాలి. లేదా పశుప్రాయుడైనా కావాలి అన్న అరిస్టాటిల్ సూక్తిని పరికిస్తే మనదేశంలో విభిన్న కుల, మత, వర్గ, విచక్షణ ప్రాంతీయ బాషా భేదాలకు తావివ్వకుండా భిన్నత్వంలో ఏకత్వం సాధించి లౌకిక రాజ్యంలో బ్రతుకుతున్నాము.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోకెల్లా మన ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయధారిత రాష్ట్రం అన్నది జగమెరిగిన సత్యం. పుట్టుకతో ఎవరూ నేరస్థులు కారు. ఎవర గొప్పవారూ కాదు. అయితే సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి అతను నివసిస్తున్న పరిసర ప్రాంతాలు, పరిస్థితుల ప్రభావం వలన అనుకోని పరిస్థితులలో నేరము చేయవలసి వస్తుంది. ముఖ్యంగా నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటువలన, పల్లెల్లో వ్యవసాయ భతగాదాలవల్ల, కుటుంబ కలహాలవల్ల క్షణికావేశంలో నేరము చేసిన వారు కొందరైతే, నేరము చేయని నిర్దోషులు సైతం ఎంతోమంది అవయకులు కేసుల్లో ఇరికింపబడి వయెవృద్ధులైన తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు దరమై వనసిక వేదనకు లోనై సవజంలోని అన్ని వర్గాలకంటే కడుదయనీయ దుర్భర పరిస్థితులలో విస్మరింపబడి వివిధ కారాగారాలలో జీవిత ఖైదీలు మగ్గుచున్నారు.
నేరము కూడా సవజం నుంచి ఉత్పన్నమయ్యేదే కాని తానంతటది శూన్యంనుండి ఊడిపడేది కాదు. అందుకే నేరస్తులను సంస్కరించడం, క్షమించడం, సవజం మీద వున్న గురుతర బాధ్యతలు. దేశదేశాల సవజాలన్నిటితో పాటు మన సవజం కూడా ఈ బాధ్యతను స్వీకరించింది. అయితే ”శిక్షతోనే కాదు క్షవభిక్షతోన నేరాన్ని అదుపు చేయవచ్చుననేది మువ్మటికి వాస్తవము” క్షమాభిక్ష నేరస్తుడిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ”శిక్ష కలిగించే భీతికంటే క్షవభిక్ష పుట్టించే పశ్చాత్తాపము సవజానికి ఎక్కువ మేలు చేస్తుంది”. మన మత గ్రంథాలు, పురాణాలు కూడా క్షమకు ప్రాధాన్యం ఇచ్చాయి. శత్రువైనా, శరణుకోరిన వారిని ఆదరించడం, క్షమించడం మన భారతదేశ సాంప్రదాయం.
సత్ప్రవర్తన కల్గిన జీవిత ఖైదీలకు క్షవభిక్ష ప్రసాదించే ఉద్దేశ్యంతో శిక్షా కాలాన్ని సమీక్షించే పద్దతి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉంది. క్షవభిక్ష అనేది ఖైదీల సత్ప్రవర్తనకు సమాజం తరపున ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకము. పశ్చాత్తాపంతో సత్ప్రవర్తన చెందిన ఖైదీలను సకాలంలో విడుదల చేసి వారి కుటుంబానికి, సవజానికి ఉపయెగపడేలా చేయడం ప్రభుత్వాల గురుతర బాధ్యత అని జాతిపిత మహాత్మాగాంధీగారు తన స్వీయ అనుభవంతో చెప్పిన సత్యవాక్కుని గుర్తు చేసుకుని, గౌరవించి పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. వరుతున్న కాలానికణుగుణంగా జైళ్ళలో అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టబడటం ఖైదీని సంస్కరించడమే దానియొక్క ప్రధానోద్దేశ్యము అయినపడు, ఆ సంస్కరింపబడిన ఖైదీ తిరిగి తన కుటుంబానికి, సవజానికి ఉపయెగపడేలా అతనిని సకాలంలో సమాజంలోకి విడుదల చేయడం ద్వారా జైళ్ళలో ప్రవేశపెట్టబడిన సంస్కరణలు సరియైనవని గుర్తింపబడటమే కాకుండా ఆ సంస్కరణలను గౌరవించేదిగా, ఆదర్శనీయమైనవిగా గుర్తింపబడుతాయి. అదేవిధంగా ఖైదీలను సంస్కరించుటకు వారిపై ఖర్చు చేస్తున్న ప్రజాధనాన్ని దుర్వినియెగపరచకుండా కాపాడినట్లు అవుతుంది. సత్ప్రవర్తన అనేది జైళ్ళ సంస్కరణలలో భాగంగానే ఖైదీలు పరివర్తన చెందుతారు. అటువంటివారు అందర సవజంలో జీవించడానికి అర్హులే. ఖైదీలను సకాలంలో విడుదల చేయకపోవడం వలన అటు ఖైదీల జీవితం – ఇటు వారి కుటుంబాలు విచ్ఛిన్నం అవడం ద్వారా అనేక సావజిక కారణాలు ఉత్పన్నమవుతాయని న్యాయకోవిధులు, మేధావులు, సమాజ సంక్షేమ నిపుణులు సూచించడం జరిగింది.
ఆంధ్ర రాష్ట్రంలోని జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలకు, ఇతర రాష్ట్రాలలోని జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలకు ఏవత్రం పోలిక లేనేలేదు. ఎందుకనగా మన ఆంధ్ర రాష్ట్రంలోని జైళ్ళలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది వ్యవసాయ భతగాదాలవల్ల, అత్యంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారేనన్న సంగతి జగమెరిగిన సత్యం. క్షణికావేశంలో పెద్ద, చిన్న నేరాలు చేసిన ఖైదీల భార్య బిడ్డలు, ముసలి తల్లిదండ్రలు, జీవనోపాధి లేక, సమాజంలో ఆదరణ లేక ఆకలితో అలమటిస్తున్నారు. అనారోగ్యంపాలై అకాల మృత్యువాత పడుతున్నారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వారి పిల్లలైతే సరియైన విద్యకు నోచుకోలేక బాల కార్మికులుగా, బాల నేరస్తులుగా వరి గత్యంతరం లేని దుస్థితికి గురి అవుతున్నారు.
ఖైదీల కుటుంబాలకు జీవనాధారమైన పెద్దదిక్కు జైళ్ళలో దీర్ఘకాలికంగా మగ్గుతున్నందువలన అసలైన ఘోరమైన శిక్షను ఖైదీల కుటుంబాలలోని వారు అనుభవిస్త నిరంతరం రోదిస్త కుమిలి పోవుచున్నారు. ఈ సంఘటన వలన నిరంతరం మేము తలుచుకుంట మానసిక వేదనతో, కృంగిపోవుచ, నిర్జీవులమై బిక్కుబిక్కుమంట ప్రతిక్షణం క్షవభిక్ష ద్వారా మమ్మల్నీ విడుదల చేయకపోతారా! ఆదుకోకపోతారా! అని కళ్ళు కాయలు కాసేలా ప్రతిక్షణం ఎదురుచస్త ఉన్నాము.
దీర్ఘకాలంలో రాష్ట్రంలోని వివిధ కారాగారాలలో మగ్గుతున్న జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలను మరియు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా హక్కుల సంఫలు, మేధావులు, రచయితలు, సంపాదకులు, పత్రికా ప్రతినిధులు, మీడియ వారు, సవజ సంక్షేమ దయర్థ హృదయులు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంవారు స్పందించి ఎట్టకేలకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సంబంధించి తేదీ : 7-8-07న జి.ఒ.యం.యస్.నెం.196, 197లు జారీ చేసి ఆగస్టు 15, 2007న ఖైదీల విడుదల విషయంలో అప్పటికే ప్రభుత్వం కఠినమై నిబంధనలు, షరతులు విధించి విడుదల చేయలని భావించినప్పటికీ, ఆ కఠినమైన నిబంధనలు, షరతుల వల్ల ఖైదీల విడుదల విషయంలో ఖైదీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నందువలన ఇటు ఖైదీలు అటు కుటుంబ సభ్యులు, బంధువులు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజాహక్కుల సంఫలు, మేధావులు అందర కలిసి ఆ కఠినమైన నిబంధనలు, షరతులు సడలించి ఖైదీలను విడుదల చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి అందర విజ్ఞప్తి చేసి కోరినందువలన, మరో పక్షం రోజుల్లో మీరు కోరినట్లుగా నిబంధనలు సడలించి అందరికీ న్యాయం జరిగేలా తప్పకుండా అందరినీ విడుదల చేస్తానని ప్రభుత్వం సమీక్ష జరిపిన తదుపరి హోంమంత్రి శ్రీ కె. జానారెడ్డిగారు తేది : 14.8.07న స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన రెండు రోజులలోనే జరిగిన కొన్ని పరిణావల ప్రభావం వలన తిరిగి ప్రభుత్వం వారు తేది : 16.8.07న న్యఢిల్లీ నుండి గౌ|| శ్రీ. ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్రెడ్డిగారు ”ఖైదీల విడుదల వ్యవహారంలో అన్ని రాజకీయ పార్టీలు ఏం చేయమంటే అదే చేస్తామని ప్రకటించారు. అదేరోజున గౌ.శ్రీ. హోంమంత్రి శ్రీ కె. జానారెడ్డిగారు కూడా అదే విషయన్ని ప్రకటించారు. 2007 ఆగస్టు 15న విడుదల అవుతామని క్షణక్షణం బిక్కుబిక్కుమంట ఎంతో ఆశగా విడుదల కొరకు ఎదురుచస్తున్న ఖైదీలు మరియు వారి కుటుంబ సభ్యులు, బంధువులందర తీవ్ర మనోవేదనకు, క్షోభకు గురియై ప్రతిక్షణం తీవ్ర వనసిక హింసను అనుభవిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో మాకు ఇంకెవరు దిక్కు? వ గతి ఇంతేనా? మా కుటుంబాలను ఆదుకునే మహానుభావులే ఈ రాష్ట్రంలో లేరా? మానవత్వంతో మా విడుదల గురించి ఆలోచించి, సహకరించే దయమయులే ఈ రాష్ట్రంలో లేరా? మేమూ మనుషులమేనని, మా బాధను, మా కుటుంబాల బాధను, దయనీయ స్థితిని, దీనగాథను వనవత్వంతో ఆలోచించి ఆదుకునే మహనీయులే ఈ రాష్ట్రంలో లేరా? పశ్చాత్తాపంతో నిరంతరం కుమిలిపోత, సత్ప్రవర్తన కల్గిన దీనులమైన మా విడుదల గురించి సహకరించే మానవత్వమున్నపుణ్యాత్ములే ఈ రాష్ట్రంలో లేరా? మహాణుబావులారా! మమ్మల్నీ, మా కుటుంబాలనీ ఆదుకోండి. కరుణ చపండి.
మేథావులారా! ప్రతి ఒక్కర ఆలోచించండి. మాకు న్యాయం చేసి ఆదుకోండి
మేమూ ఈ సవజంలో భాగమే. మేమూ మనసున్న మనుషులమే. మమ్మల్నీ ఆదుకోండి
రాజకీయ రాగద్వేషాలకతీతంగా మంచి మనసున్న పుణ్యాత్ములారా! మా విడుదల గురించి తక్షణం ప్రతిఒక్కర స్పందించి, అందర ప్రభుత్వానికి మా ధీన గాధను తెలిపి, ఇప్పటికే నాలుగుసార్లు వ విడుదల వాయిదాపడిన విషయన్ని ఆలకించి, గుర్తించి, మా బాధను మన్నించి వెంటనే ఖైదీల విడుదలలు జరుగు విధంగా అందర సహకరించి మంచి మనసున్న, వనవత్వమున్న పుణ్యాత్ములు ఈ రాష్ట్రంలో కొదవలేదని నిరపించి, నోరున్న వర్గాల మద్దతు సంపాదించలేకపోతున్న ఖైదీల సావజిక పరిస్థితిని, సకాలంలో విడుదలకు నోచుకోలేక ప్రతిక్షణం మానసిక క్షోభను అనుభవిస్తున్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యుల తీవ్ర ఆవేదనను మానవతా దృక్పథంతో దయగల ధర్మ ప్రభువులందర ఆలకించి మన్నించి ఖైదీల విడుదల కొరకు ప్రభుత్వం వారు, అన్ని రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, అన్ని ప్రజాహక్కుల సంఘాలు, మేధావులు, రచయితలు, పత్రికా ప్రతినిధులు, మీడియ వారు, జైలు అధికారులు, సమాజ సంక్షేమ దయర్థ హృదయులందర సహకరించి ఖైదీల విడుదల కొరకు వనవత్వంతో న్యాయం చేయండని కన్నీటితో నమస్కరించి, అందరి పాదపద్మములకు ప్రార్థించి వేడుకుంటున్నాము.
ఇట్లు
తమ విధేయులు
జీవిత ఖైదీలు
కేంద్ర కారాగారము
కడప