రాజేశ్వరి దివాకర్ల
అత్తిమబ్బె కన్నడ సంస్కృతికి పరంపరకు, ఉదాత్తమైన వైభవాన్ని కలిగించిన శ్రేష్ఠ మహిళ. ఆమె ఆంధ్రదేశంలో పుట్టిన ఆడపడుచు కావడం ఒక విశేషం.
అత్తిమబ్బె వేంగీ మండలం, పుంగనరులో జన్మించింది. అత్తిమబ్బె పదవ శతాబ్దం, పశ్చిమ చాళుక్యుల పరిపాలనా కాలంలో జీవించింది. ఆమె ‘లక్కుండి’ని తన కార్యక్షేత్రంగా కావించుకుని కర్నాటక సాహిత్య, ధార్మిక, రాజకీయ రంగాలకు ఘనమైన సేవను కావించింది. చాళుక్యరాజు ‘తైలపుడు’ అతని కువరుడు ఇరివ బెడంగ సత్యాశ్రయుడు ఆమెను ‘రాజచక్రి’ గౌరవమిచ్చి పూజించారు.
అత్తిమబ్బె ‘దాన చింతామణి’ ‘కవివర కామధేను’వని కీర్తిని పొందింది. అత్తిమబ్బెను గర్చి ‘రన్న’ కవి ‘అజితపురాణం’లోని ఆది, అంత్యా శ్వాసాలలో సమగ్రంగా తెలిపాడు. ‘అజితపురాణం’ అత్తిమబ్బె జీవితవిశేషాలను తెలిపి కన్నడ ఇతిహాసానికి ఒక అపూర్వ మహిళా చరిత్రను కానుక చేసిందని విద్వాంసులు రన్నకవికి కృతజ్ఞతలను చెల్లిస్తారు. అజిత పురాణంతోపాటు, రన్నకవే రాసాడనుకుంటున్న ‘లక్కుండి’ శాసనం, బ్రహ్మశివుని ‘సమయపరీక్ష’ గ్రంథంలోని మూడు పద్యాలు కూడా అత్తిమబ్బెను గూర్చిన సాక్ష్యచిత్రాన్ని మన కళ్ళముందు నిలపడానికి దోహదం చేస్తాయి.
అత్తిమబ్బె పూర్వజులు కమ్మెనాడు బ్రాహ్మణులు. వారు వేంగీ పరిసరాలనుండి కార్యార్ధంగా కర్నాటకానికి వలస వచ్చారు. అత్తిమబ్బె పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా వీరులకు త్యాగధనులకు పెట్టింది పేరు. వారు చాళుక్యరాజులను ప్రాణాలొడ్డి సేవించారు. కవిపండితులకు ఆశ్రయమిచ్చి సాహిత్యపోషకులుగా ఉత్తమ అభిరుచిని చూపారు. అత్తిమబ్బె తండ్రి, పినతండ్రులు ఆదరించిన ‘పొన్న’ కవి వారి ప్రోత్సాహంతో ‘శాంతినాథపురాణం’ రచించాడు. అత్తిమబ్బె పుట్టి పెరిగిన ఆ వాతావరణం ఆమెకు సహజమైన సారస్వతాభిలాషను, ఉదారబుద్ధిని వికాసశీలతను కలిగించాయి. అత్తిమబ్బె తాత మహాదాని, జైనాగమ పరిణతుడు నాగమయ్య, తండ్రి మల్లపయ్య, పినతండ్రి పొన్నమయ్యలు దండనాయ కులుగా సైన్యాధిపత్యం వహించారు. పొన్నమయ్య మహాధైర్యశాలిగా రాజును రక్షిస్త యుద్ధంలో ప్రాణాలను కోల్పోయడు. చాళుక్య చక్రవర్తికి ముఖ్య సచివోత్తముడైన దల్లపుడు ఆమె మామగారు. ‘సుభట చడామణి’ ‘అతులిత బలశాలి’ అని ప్రసిద్ధికెక్కిన ‘నాగదేవుడు’ ఆమె భర్త. నాగదేవుడు అధికకాలం జీవించలేదు. అతడు రణరంగంలో శత్రువులను చెండాడుత ‘వీరస్వర్గం’ అలంకరించాడు.
అత్తిమబ్బె చెల్లెలు గుండమబ్బె. ఆమె అత్తిమబ్బెకు సపత్ని. భర్త నాగదేవుడు పోరాటంలో వీరమరణం పొందినప్పుడు గుండమబ్బె అక్కకు బదులుగా తాను పతితో ‘సహగమనం’ చేసింది. తమ వంశాంకుర మైన అణ్ణిగ దేవుని సంరక్షణా భారాన్ని అక్కకు ఒప్పగించింది. జైనసంప్రదాయంలో ‘సతీ’ పద్ధతికి ఆస్పదం లేదు. కాని గుండమబ్బె, ఆ ఆచరణను కావించడానికి ఆనాటి సమాజంలోని అనివార్య పరిస్థితులు కారణం అయి ఉండవచ్చు. లేదా గుండమబ్బె, వీరపత్నిగా అది తన కర్తవ్యమని తలచి ఉండవచ్చు. ఏమైనా ఆనాటి సార్వత్రిక ఆమోెదాన్ని అంగీకరిస్త నిష్ఠావంతుడైన జైనకవి ‘రన్న’ కూడా గుండమబ్బె కార్యాన్ని ‘మహాసతీసముచితాచార’మని ‘శుభచరితద మరణం’ అని పేర్కొన్నాడు. గుండమబ్బె ‘సహగమనం’ అత్తిమబ్బె మీద గాఢ ప్రభావాన్ని చపింది. ఆమె ఆ సంకట సమయంలో ఎంతో సంయమనం చూపింది. చెల్లెలు ‘దహనార్చి’లో పడి తనువును వీడితే, తాను కఠినమైన వ్రతాచరణ చేసి దేహాన్ని మనసును జ్వలింపచేసుకుంది.
అత్తిమబ్బె వైధవ్యాన్ని శాపంగా భావించని ధీరమహిళ. ఆమె తనకు సంభవించిన పతీ వియెగాన్ని, సమజగతమైన ప్రయెజనాలకు ఉపయెగించదలచింది. సన్యాసినిగా విరక్తి చెందక లౌకికమైన జీవితాన్ని అవలంబించి దానిని అర్ధపూర్ణం కావించుకుంది. పతితోపాటు సహగమనం చేసి ‘సతి’గా పేరుపొందే స్వార్ధం కంటె ఆంతరంగిక, బహిరంగ జీవితాలను సార్థకం చేసుకోవాలన్న నిశ్చయనికి వచ్చింది. కుటుంబ యెగక్షేవన్ని వహించడం ప్రధాన బాధ్యతగా భావించింది. సహజమైన ఆపేక్షతో జైన ధర్మాన్ని, సాహిత్య ప్రచారాన్ని కావించాలని నిశ్చయించింది. కుమరుడు ‘అణ్ణిగ దేవుడి’ని ‘పడువణ’ తైల ‘కర్పరవర్ష’ బిరుదాంకితునిగా తీర్చిదిద్దింది. వీరమాతగా ప్రథమ కర్తవ్యాన్ని సఫలం కావించుకుంది.
అత్తిమబ్బె ‘ఆంధ్రదేశంలో పుట్టిన కన్నడ వాఙ్మయ ప్రసార భారతి’. అత్తిమబ్బె కన్నడ సాహిత్య ప్రచారం కావించిన ప్రథమ మహిళ. ఆమె మొట్టమొదటి కావ్య సంపాదకురాలు. కావ్య ప్రకాశకురాలు. తన పూర్వీకుల కాలంలో ‘పొన్న’ కవి రాసిన ‘శాంతినాథపురాణం’ లుప్తమౌతున్నప్పుడు, ఆమె ఆ కావ్యానికి వేయి వ్రాతప్రతులను తయరు కావించింది. విస్తృతమౌతున్న కావ్యాన్ని పునరుద్ధరించాలనే మహదాశయంతో పాటు, తాళపత్రాల మీద వేయి ప్రతులను రాయించడం ఎంతో కష్టమూ శ్రమ ఖర్చులతో కూడుకున్న పని. ఆమె ఇదివరకెవ్వరు కనీసం తలపెట్టని పనికి పూనుకుని పూర్తి కావించింది. ఆ ప్రతులను ఉచితంగా పంచి ఇచ్చింది. ఆ విధంగా వాఙ్మయ ప్రసారణమే కాదు, వేయిమంది లేఖకులకు పనిని కల్పించి వారికి ఉపాధి నిచ్చింది.
అత్తిమబ్బె కన్నడ కవిత్రయం, రత్నత్రయం అని ప్రసిద్ధిని పొందిన ముగ్గురు కవులలో ఒకడు. కవి చక్రవర్తి అయిన ‘రన్న’ కవికి ఆశ్రయమిచ్చి, మహిళా మకుటాయవనమైన ఘనత వహించింది. ఆ కవికి పోషకురాలు మాత్రమే కాక ఆతని చేత ‘అజితపురాణం’ కావ్యాన్ని రాయించింది. రన్నకవి తానింతకు మునుపు రాసిన ‘గదాయుద్ధం’లో మహాభారత కథను రాశాడు. అజితపురాణంలో జైన తీర్థంకరుడు ‘అజితనాథుని’ చరిత్రను ప్రధాన విషయంగా గ్రహించాడు. ప్రధాన కథతో బాటు తనకు ఆశ్రయ దాతయైన ‘అత్తిమబ్బె’ వ్యక్తిత్వ నిరపణాన్ని అత్యంత శ్రద్ధతో కావించాడు. ఆమెను గురించి తనివితీరా శ్లాఘిస్త ఆనాటి జైన సమాజపద్ధతిని, సామాజిక నడవడిని చక్కగా నిరూపించాడు. అత్తిమబ్బెను అనేక విధాల ప్రశంసిస్త ‘భవ్య మనోరథ జన్మభమి’, ‘ఆసన్నభవ్య’, ‘జినధర్మపతాక’, ‘మహాసతి’, ‘గుణదంక కార్తి’, ‘జినశాసనదీపిక’, ‘కవివర కామధేను’ వంటి విశేషణాలనుపయెగించాడు. ఆమె కథను వింటే ‘బాలికల బలదోషాలన్నీ భగ్నమౌతాయి’ అని ఫలశ్రుతిని పలికాడు. ‘ఆమె అంగనలందరిలో శీలగుణాదులలో మిన్నయైన ‘రావంగన’. ఆమె దర్శన విశుద్ధిని కలిగించు ‘జయతాంబిక’, ‘అజితజినాంబిక’ ఇత్యాదిగా కొనియడాడు. మరొక కవి ‘బ్రహ్మశివ’ సమయపరీక్షలో ‘గుణదకణి’ ‘దానచింతామణి’, విమలచరిత్ర ‘సజ్జనైక చడామణి’ ‘జినశాసనరక్షామణి’ అని వివిధ విధాల అత్తిమబ్బెను ప్రశంసించాడు. అత్తిమబ్బె ఉజ్జ్వల శీల గుణావళిని కలిగిన వ్యక్తిగా మాత్రమే కాదు మహివన్వితురాలైన దివ్యాంగనగా జనులచే పూజితురాలయింది. అత్తిమబ్బె నిజ జీవితకాలంలోనే ‘పౌరాణిక’ వ్యక్తిగా మన్ననలందుకున్న అపురపమైన వనిత.
‘దాన చింతామణి’ అత్తిమబ్బె కావించిన దానాలు అమోఘమైనవి. ఆమె తాను దానమిచ్చే వస్తువు అత్యుత్తమై ఉండాలి. ఆ వస్తువు ఉపయుక్తమై ఉండాలి. అన్న సమర్పక భావంతో దానమిచ్చిన ఔదార్యవతి. అత్తిమబ్బె చతుర్విధ దానాలను, ఎంతో సంకల్పబలంతో, కేవలం తన ఘనతను చాటుకోవాలని కాక దానాలను ధార్మికనిష్ఠతో కావించింది. ఆమె శాంతినాధపురాణం వేయి ప్రతులను దానమిచ్చి దానాలలోకెల్ల మిన్నయైన శాస్త్రదానాన్ని చేసి ‘కావ్యసురభి’ అయింది. అంతేకాక ఆమె 1500 ”జైన మూర్తులను” విచిత్ర మణిగంటలతోన, రత్నతోరణా లతోన, దీపవలికలతోన, విరాజిల్లే మణిఖచిత పూజాసనలతో పాటు తయరు చేయించి ఎందరికో దానమిచ్చింది. లక్కుండిలో, ఆదినాధుని సుందర చైత్యాలయన్ని నిర్మాణం కావించింది. జైన వసతి ఆలయలను కట్టించింది. వాటిని తన గురువైన ”అర్హనంది” పండితునికి గౌరవపూర్వకంగా సమర్పించింది. తాను కావిస్తున్న ధార్మిక సంఘటనలతో సవజశ్రేయస్సును కూడా సంకల్పించి అనేకులు కర్మకారులకు, వాస్తుశిల్ప కారులకు, లిపికారులకు ఉద్యోగావకాశాలను కలిగించి సాటిలేని సాంఘిక అభ్యుదయన్ని సాధించింది.
అత్తిమబ్బె ధర్మాన్ననుసరించిన వారికి అనుగ్రహశక్తికాగా, ధర్మవిరోధి జనులకు ‘అసిలతగా’ పరిణమించింది. ఆమె వీరనారిగా అపారమైన దేశాభివనంతో పోరాడి శత్రుగణాన్ని గెలిచిందని ‘ఆ తైలజననిని మీసమున్నవాడెవ్వడ ఎదిరించి నిలువలేడు’ అని రన్నకవి వర్ణించాడు. తాను కూడా మీసమున్నవాడే అయినా, తాను అభిమానించిన వనితను కీర్తించడమే పుణ్యంగా భేషజాలను వదిలాడు.
అత్తిమబ్బె జీవితంలో అనేక మహిమాన్విత సంఘటనలు జరిగాయి. అందులో రన్నకవి చెప్పిన ‘అకాలవృష్టి’ వృత్తాంతం ఒకటి. ఆమె బాహుబలి దర్శనానికి కుక్కుటేశ్వర గోమఠానికి కఠిన ఉపవాసంతో కాలి నడకన వెళ్ళగా, ఆమెకు కలిగిన పథశ్రమ నివారణకు అకాలవృష్టి కురిసిందట. ఒకసారి ఆమె నిత్యం పూజించే జినబింబం నదిలో పడిపోగా, ఆ మూర్తి తిరిగి తన చేతికి దొరికేవరకూ ఎనిమిదిరోజులు కటిక ఉపవాసం చేసిందట. మరొకసారి చక్రవర్తి ఆజ్ఞననుసరించి జినమూర్తిని నెత్తిన ధరించి ఉద్ధృత గోదావరీ ప్రవాహంలో కాలినడకను ఆరంభించగా ఆ ప్రవాహం అంతా అణగి ఆమెకు దారినిచ్చిందట. ఆ వృత్తాంతాన్నే బ్రహ్మశివకవి తాను కళ్ళారా చూసినట్లుగా మరల చెప్తాడు. ఆ ప్రవాహ వృత్తాంతం లక్కుండి శాసనంలో కూడా ఉదాహరించ బడి ఉంది. ఒకప్పుడు చాళుక్యరాజు సైన్యశిబిరంలో అగ్ని వ్యాపిస్తే, ఆ చక్రవర్తి అత్తిమబ్బెకు మొరపెట్టు కున్నాడట. ఆమె జిన గంగోదకాన్ని చిముకి అగ్నిని వారించిందట. ఆమెలోని ఆ దిట్టతనానికి, కవులు ఆమెను ‘ఛలదంకకార్తి’ అని కూడా పిలిచారు.
అత్తిమబ్బె రన్ననితో కావ్యాన్ని రాయించడమే కాదు, స్వయంగా పండితురాలు. బ్రహ్మశివకవి ఆమెను ‘శౌచి ఘటాంతకి’ అని పేర్కొనడం గమనించదగినది. ఆమె బౌద్ధ విద్వాంసులను వాదంలో గెలిచి’ఘటాంతకి’ అన్న పేరును పొంది ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తారు.
అత్తిమబ్బె కథ అంటే ఒక చారిత్రక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో దీక్షతో మహత్తరమైన కార్యాలను చేసి సామాన్య మానవశక్తికి మించిన దివ్యవనితగా ఎదిగిన అమోఘ వృత్తాంతం. పూర్వ తెలుగు కావ్యాలలోన, శాసనాలలోన ఎక్కడా కనబడని స్త్రీస్తుతి ప్రశంసలు కన్నడ సాహిత్యారంభ కాలంలోనే లభించడానికి ఆమె కావించిన ఘనకార్యాచరణలే కారణం.
ఆట్టీమబ్బె జీవితము