గిరిజనులకి మన ”నాగరికత అచ్చిరాలేద”ట

కొండేపూడి నిర్మల

పాముల్ని పట్టడానికి కప్పల్ని ఎరవేస్తారని మనకు తెలుసు. దాని శరీరంలో మేకుల్ని దించి గోడకో బల్లకో బంధించినంత మాత్రాన కప్ప మన శత్రువా ఏమిటి?

మన గురి పాము మీద . పాముని పట్టడానికి కప్ప ప్రేరకమయింది. పాము మాత్రం ఎందుకు శత్రువయింది? బుస కొట్టే స్వభావంవల్ల. కాబట్టి ముందు జాగ్రత్త చర్య కింద చంపి పారేస్తాం. అది రాజనీతి దండ కారణ్యనీతి కూడా కావచ్చు.

గుడిసె కింద చమురు వున్నందుకో, ఖనిజం వున్నందుకో, రంగురాళ్ళు వున్నందుకో, వివనం దిగడానికి జాగా బావున్నందుకో బెదర గొట్టే పనిలో పనిగా అత్యాచారాలు జరుగుతున్నాయిట..కారణాల అన్వేషణ జరుగుతున్న కొద్ది నేరం మీద ప్రజాగ్రహం కాస్సేపు మరుగున పడుతుంది. మొన్న వాకపల్లి గిరిజన స్త్రీల తొడల మీద బటు కాళ్ళతొక్కిడి నిజంకాదు. నిన్న నందిగ్రామం స్త్రీలలో ఒక బాలింత జననాంగంలో కర్ర పెట్టి హింసించడం నిజం కాదు. మతం కొలిమిలో గుజరాత్ మహిళని ముక్కలు చెయ్యడం నిజం కాదు. బోస్నియలో సెర్బులు స్త్రీలను గర్భవతుల్ని చేసి, వాటిని కరిగించుకోనియకుండా కుక్క కాపలా కాయడం నిజం కాదు. మృత శరీరాలకు సైతం కొన్ని మర్యాదలు పాటించాలని అన్ని మతాల చెబుతాయి కద! ఇప్పుడు ఇక్కడ… స్త్రీలంటే శరీరం వత్రమేనా అని విచారిస్తున్న సమయంలో శరీరం కూడా కాదని తెలిసిపోయింది. మనం కేవలం పదార్ధాలం, ప్రేరకాలం.
మురికి మీద పడగానే నీళ్లతో కడిగి పారెయ్యడం ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. కాగా అత్యాచారం మొదలు నేరస్తుడ్ని పట్టుకునే దాకా జరిగిన నాటకీయ సన్నివేశాలన్నీ పూర్తయ్యేదాకా సాక్ష్యం చూపించడం కోసం బాధితురాలు స్నానమే చెయ్యకూడదనడం ఒక అవనుస వాస్తవం. మన సాంకేతిక ప్రతిభ ఇంతకంటే ఎప్పటికీ పెరిగి చావదా? అదే ముఖ్యమంత్రి మీదో, ఎమ్మెల్యే మీదో దాడి జరిగితే ఇరవై నాలుగ్గంటలలోగా ఊహా చిత్రాలు పూర్తవుతాయి. పోలికలున్న వాళ్ళందర్నీ పోలీసు ట్టాణాకు లాక్కొస్తారు.
ఎందుకు జొరబడ్డారో, ఎందుకు తిడుతున్నారో, కొడుతున్నారో, హింస పెడుతున్నారో కారణమైనా తెలీకుండా, తమ కళ్ళతో తామే చసుకోవడానికి సిగ్గుపడే శరీరాల్ని భర్తల ముందు, అమ్మనాన్నల ముందు, పిల్లల ముందు, అన్నదమ్ముల ముందు చీల్చి చెండాడుతుంటే ఆ ఇళ్ళు ఎంతగా తల్లడిల్లి పోయయె, ససివాళ్ళ మనసులో అది ఎలాంటి ముద్ర వేస్తుందో, ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతాయె, ఎందరి గర్బాలు రక్తస్రావాలవుతాయె, ఎందరి కడుపులో ఆ కిరాతక ప్రతిబింబాలు నాటుకుంటాయె, హాటాత్తుగా వారి చుట్టు వున్న వనవ సంబంధాలు ఎంతగా దగా పడతాయె, ”చెడిపోయింది” అనే ముద్రతో రోడ్డు మీద నడవడానికి ఎంత సహనం కావాలో ఎవరు ఊహించగలుగుతారు?
కుప్ప తొట్టెలో ఒక శిశువు దొరగ్గానే అది కన్నది ”కసాయి ఆడద”ని తేల్చినంత తేలిక కాదు కదా? ఆనవాలు లేకుండా నేల కూలిన ఇళ్ళని, దోచుకు పోయిన ఆస్థుల్ని, ప్రాణాల్ని, పరువుల్ని, జీవితాలని కూడదీసుకోవడం అంటే, దొంగ పరిహారాలు పరిహారాలు ప్రకటించినంత బలుపూ కాదు కదా.

కొండేపూడి నిర్మల
వాకపల్లి గిరిజన ఇల్లాళ్ళను శుద్ది పూజ చేసి ఇంటికి తెచ్చుకున్నార్ట! బహుశ అదే సమయంలో మన చట్టాన్నీ, వైద్యాన్నీ, న్యాయన్ని, వనవ హక్కుల్నీ నాగరికతనీ నమ్మినందుకు కూడా ఒకేసారి తమని తాము శుద్ది చేసుకుని వుంటారు. మనకి శుద్ది పూజలు లేవు. నాగరికులం కదా. ఇవే అశుద్ధ (సారీ, సుద్ధి కాబడని అని నా అర్ధం) మొహలతో మళ్ళీ ఓట్ల కోసం వెడతారు. ఈస్తటిక్కు పేరుతో రవికల్లేని వాళ్ళ చిత్ర పటాల్ని కార్యాలయల్లో తగిలించుకుంటారు.

వాళ్ళ తేనెలు చప్పరించి, నడుం పట్టుకుని నాలుగు స్టెప్పులేసి గ్రావలు ముంచెత్తే ప్రాజక్టులు కట్టడానికి, వాగుల్లో విషం కలపడానికి అనుమతి ఇమ్మని అడగడానికి వెడతారు.
గిరిజనులకి మన ”నాగరికత అచ్చిరాలేద”ట. మన చట్టం చెయ్యలేని పని రేపు వాళ్ళ బరిసెలు, ఈటెలు చేస్తాయి. ఈ సారి అత్యాచారం పని మీద ఎవరొచ్చినా సరే వేట జంతువును వొలిచినట్టు తోలు వొలిచి కర్రకు కట్టి దోరగా కాలుస్త వెన్నెల నాట్యం చేస్తారు. నిజమే కదా. ఎక్కడ జరిగిన నేరానికి అక్కడే పరిష్కారం జరగాలి.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.