డా|| సి. భవానీ దేవి
వర్తమాన కవితా రంగంలోకి పలువురు ప్రవర్థమాన కవులు వేళ్ళూనుకుంటున్న తరుణంలో ఈ యువకవి సమాజ విధ్వంసక ముఖచిత్రాన్ని ఆర్తిగా ఆవేదనగా బాధ్యతగా కలం కుంచెతో చిత్రిస్తున్నాడు.
ఆదికవి నుంచి ఆధునిక కవుల వరకు సాహితీ వారసత్వాన్ని స్మరిస్త ఆత్మానందంతో కవితా ఓనవలు దిద్దుకుంటున్నట్లు చెప్పుకున్నా… నరసింహరాజు కవిత్వం వేడిగా వాడిగా యువరక్తంతో ఉరకలు వేస్తోంది.
”కన్నీరు ఉప్పదనంతో/ సముద్రానికి మనిషి రపాంతరమైనప్పుడు/ హృదయం ముత్యమై ఎందుకు మెరవదు? అంట ప్రశ్నించటంలో నిజాయితీ ధ్వనిస్తుంది. నరసింహరాజు కవిత్వంలో ఆవేదన ఉంది. ఆక్రోశం ఎగిసిపడుతుంది. కవితా ధనుస్సుతో ఎన్నో ప్రశ్నలు బాణాలుగా సంధించి వదిలాడు ఈ కవి. అవి సమాజంలో ప్రతి పాఠకుని హృదయంలోకి జొరబడి కలవరపెడతాయి. ఆలోచింపజేస్తాయి.
సంసార బందిఖానాలో జీవిత ఖైదీ, ”అమ్మ! క్షమించు” అంట అమ్మ దయనీయ స్థితిని అద్భుతంగా ఆవిష్కరించారు. పాతబస్తీ ఫతుకాల్ని మైనారిటీ తత్త్వంతో ఆవష్కరించారు. ”తనువొకపుండై… ఇతరులకు పండై… తాను శవమై… ఇతరుల వశమై”అని ఒక ప్రముఖ కవి వేశ్యల దీనగాధను బహిర్గతం చేసినంత బలంగా… బహిరంగ సత్యంగా… ”రాక్షసరతిలో” కవితలో వేశ్యల దయనీయ దుస్థితిని కరుణరసాత్మకంగా కవిత్వీకరించిన తీరు అద్భుతం! హృదయల్ని కదిలించే కవితా వస్తువుల్ని ఎంచుకుని… మూలాన్ని స్పృశిస్త… కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇటువంటి స్త్రీవాద కవితల్ని చదివితే నరసింహ రాజుకు స్త్రీల జీవితం పట్ల ఉన్న అవగాహన స్నేహభావన అర్థమై ఆర్థ్రతై కవి పట్ల గౌరవం పెరుగుతుంది. కాలుష్యం గురించీ, బాల్యం గురించీ, జెండా… బిచ్చగత్తె కవిత్వానికి ఎన్నుకున్న ప్రతి వస్తువూ సమాజంలో అందర్భాగమే! ‘స్మైల్ ప్లీజ్’ కవిత మన పెదాలపై చిరునవ్వును ముద్రించకుండా ఉండదు. ఉస్తాద్ను ‘షెహనాయ్ నెలవంకపై వెలసిన నక్షత్రం’ అనటం అద్భుతమైన ప్రతీక. దుఃఖగోళంగా భమిని వర్ణించిన కవిత హృదయన్ని కదిలిస్తుంది. ‘భారతీయం’ కోసం కవి ఆర్తి కంటిని చమరింప జేస్తుంది. నరసింహరాజుది తీవ్ర స్వరమే అయినా మానవీయ భావనలతో తడిసి మట్టి పరిమళాన్ని చిలికిస్తుంది. రేపటి కాలానికి ఈ యువకవి ఓ సరికొత్త వాగ్దానం కాగలడని ఆశిస్త అభినందిస్తున్నాను.