శిలాలోలిత
వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘మరీచిక’ నవలపై కె.బి. స్నేహప్రభ ‘వాసిరెడ్డి సీతాదేవి మరీచిక సావజిక మనోవిశ్లేషణ’ పేరిట యం.ఫిల్ కోసం ఉస్మానియ యూనివర్సిటీలో పరిశోధన చేశారు.
ఇటీవల పుస్తకరపంలో ప్రచురించారు. సీతాదేవి 40కిపైగా రచించిన నవలల్లో అత్యున్నతమైనదిగా ‘మరీచిక’కు స్థానం లభించింది. ఇప్పటికి 6 ముద్రణలు పొంది, 7వ ముద్రణగా ఈ పుస్తకావిష్కరణ సభలో విశాలాంధ్రవారు పునర్ముద్రించారు. ఒక సంచలనాన్ని, ఒక ఆలోచనను, ఒక ఆదర్శాన్నీ ప్రతిపాదించిన, ఇటువంటి నవలను ఎన్నుకోవడంలోనే స్నేహప్రభ విలక్షణత తెలుస్తోంది.
జనంలో, సాహిత్యలోకంలో ఒక ప్రోగ్రెసివ్ ఔట్లుక్ను, చైతన్యాన్నీ, ఆలోచననీ రేకెత్తించే సాహిత్యమంటే ప్రభుత్వాలకెప్పుడ భయమే. అందుకే ఈ నవల ‘నిషేధానికి’ గురైంది. తర్వాత కొంత ప్రయత్నమూ, ఘర్షణ, పోరాటమూ తర్వాత నిషేధం ఎత్తివేశారు. ఐతే, ప్రభుత్వ నిషేధం వల్ల ఎంతో మేలు ఇన్డైరెక్ట్గా జరిగింది. ఎందుకు బ్యాన్ చేశారు. ఏముందందులో అనే ఉత్సుకత చాలామంది చేత రహస్యంగా, బాహాటంగా ఈ నవల చదివించింది. అలా, ఒక ఉద్వేగకెరటంలా జనప్రచారాన్ని పొందింది.
ఈ పరిశోధకురాలు తెలుగునవలా సాహిత్యంలో ‘మరీచిక’ స్థానాన్ని వివరిస్త, నాలుగు ప్రధాన అధ్యాయలుగా విభజించారు. మొదటి అధ్యాయంలో ‘వాసిరెడ్డి సీతాదేవి జీవితం-రచనలు’, రెండవ అధ్యాయంలో ‘మరీచిక-కథావస్తువు’, మూడవ అధ్యాయంలో ‘నవలాశిల్పం’ గురించి విశ్లేషించారు. పది ప్రవణాలను తీసుకుని విపులంగా చర్చించారు. నాలుగవ అధ్యాయంలో ‘పాత్రచిత్రణ-సావజిక మనోవిశ్లేషణ’ పేరిట, ఈ నవలలోని పన్నెండు పాత్రలను మనసత్త్వశాస్త్రంతో విశ్లేషించారు. ‘ఆడ్లర్’, యూంగ్, ఫ్రాయిడ్ థియరీలతో ఈ పాత్రలను పోల్చుత వివరణాత్మకంగా విశ్లేషించారు. చివరగా అనుబంధంలో – ‘మరీచిక నిషేధంపై ఒక సమీక్ష’ వాసిరెడ్డి సీతాదేవి రచనలు – జీవితవిశేషాలను గురించిన అదనపు సమాచారాన్ని ఇచ్చారు. ఒక రాజకీయ చారిత్రక, సావజిక అవసరంగా సీతాదేవిగారు ‘మరీచిక’ నవలను రాశారు. హిప్పీయిజం, నక్సలిజాల ప్రభావం యువతరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయె, చాలా లోతుగా అధ్యయనం చేసి, వాస్తవిక చిత్రణతో ఈ నవలను రాశారు. శబరి (హిప్పీయిజం) జ్యోతి (నక్సలిజం) పాత్రల ద్వారా, చర్చోపచర్చల ద్వారా, పతనమౌతున్న నైతిక విలువల గురించి, ఉద్యమస్వరప స్వభావాలను, లోటుపాట్లను ఈ నవల చిత్రించింది. సీతాదేవిగారి ‘మరీచిక’ నవలా ప్రయణానికి దిక్సూచిలా, కరదీపికలా ఈ సిద్ధాంత గ్రంథం తోడ్పడుతుంది.
న ఫొనె న..09921444305 మి ఫొనె న వవ్హొంది ………