సీతారాం
–
తస్లీమాకి క్షమాపణలు. అవమానించి నందుకు. అవవనించడాన్ని సహించినందుకు, తిలకించినందుకు.
ప్రేక్షకులమై నిలబడినందుకు. తస్లీమాకి క్షవపణలు. మత విషయలు సున్నితమైన వని భావించినందుకు మేమెవరమూ ఇంకాస్త పెద్దగా పెదవి విప్పనందుకు.
మనుషులుగా మనం అనుకుంటు న్నంత సున్నితంగా మతాలు లేవని ముందే గ్రహించనందుకు తస్లీమాకి క్షమాపణలు. జరిగిన దాడిని వారివారి అనుకూలతల మేరకు వారు త్వరగా మరచిపోయినందుకు క్షవపణలు. ఆమె రచనలు పూర్తిగా చదవనందుకు, చదవకుండానే దాడి చేసినందుకు, దాడి జరిగాక కూడా చదవకుండా ఖండిస్తున్నందుకు క్షమాపణలు. ఇక ఎప్పటికీ ఎవ్వరమూ చదవకనే మిగులుతున్నందుకు క్షవపణలు. తనను మళ్లీ వస్తే చంపేస్తాం అని గర్జించినందుకు నువ్వు మళ్లీ ఏదైనా రాస్తే చంపేస్తాం అన్నట్లు ధ్వనించినందుకు వందకోట్ల క్షవపణలు.
దేశాలమధ్య, మతాలమధ్య, మనుషులమధ్య రగులుతున్న పగలకు పడగెత్తుతున్న విద్వేషాలకు, నీటికి కొమ్ము కాస్తున్న వారి మాటలకు, మమతలకు, లోలోపల ఎవరి మతాల్లోకి వారు పునః పునః ప్రవేశించి భద్రతకు గురవుతున్నందుకు అన్నిటికీ క్షమాపణలు.
బహుశా చాలా ఏళ్లయ్యిందనుకుంటా. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీవ నస్రీన్ మీద నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ పట్టణంలో ప్రజాస్వావ్యన్ని కాపాడే మూలస్తంభాలుగా నిలిచే పాత్రికేయుల మధ్య దాడి జరిగింది. మత ఛాందసాన్ని సిగ్గుపడమని అడిగినందుకు దాడి జరిగింది. ఏ దారినపోయే దానయ్యె దాడిచేస్తే అదేదో ప్రాధాన్యం లేని సంఘటనగా తేలిగ్గానే తీసుకోవచ్చు.
నాలుకలు లేని దేశంలో ఉన్నాం మనం. నాలుకలు ఓట్లను అడగడానికి తప్ప మరి దేనికీ ఉపయెగించ చాతకాని రాజకీయ నాయకుల మధ్య, వారి నాయకత్వం మధ్య బ్రతుకుత ఉన్నాం మనం.
జాగ్రత్త సువ! ఈ పరిణావనికి ముందువెనకా ఉన్న సంకేతాలు మాట్లాడే భాషని, ధ్వనులన జాగ్రత్తగా ఆలకించాలి మనమందరం. పాత్రికేయులు వత్రమే ఇప్పుడు ఈ కాస్త ప్రజాస్వామ్యమైనా మిగిలి ఉండటానికి ఆఖరి ఆనవాళ్లుగా కనిపిస్తున్నారు. తస్లీమాని నరికేయకుండా, ఎక్కువ దెబ్బలు తగలకుండా గాయలు కాకుండా కాపాడగలిగామని ఎవరైనా సంతోషిస్తే పొరపడ్డట్లే. ఎందుకంటే మనిషిగా అవవనపడటం, అనుచిత రీతిలో అవవనాలకు గురికావడం మరణంకంటే తక్కువేమీ కాదు.
ఇప్పుడంతా ఎవరి వ్యాపారం వారు చూసుకుంటున్నారు. తమకు రావాల్సిన లాభం రానప్పుడో, రావాల్సినంత లాభం రాకపోవటం కూడా నష్టపోవడమేనన్న సంగతిని గుర్తించినప్పుడో వటలు వస్తున్నాయి. మనమంతా ఇప్పుడు ప్రాయెజిత ఉద్యవల సందర్భంలో ఉన్నాం. ఉద్యవలు ఉదాత్తమైనవే. కాని ఉద్యమ లక్ష్యాలని బట్టే వాటికి ఉదాత్తత, విశ్వసనీయత.
ఖండించడం కూడా వ్యూహమే ఇప్పుడు. ప్రతిఘటించడం కూడా ఒక ఎత్తుగడే. ఏమీ వట్లాడకపోవటం, అర్థం కాకుండా వట్లాడటం, దొరికీ దొరకకుండా సంభాషించడం. మనమంతా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కళను క్షుణ్ణంగా అభ్యసించాం. ఉప్పు తినడం తగ్గించేశాం. ఆరోగ్యరీత్యా ఉదయన్నే మొలకలు తింటున్నాం. ఏదీ మనల్నిక కలత పెట్టదు. కలవర పరచదు. అనవసర రక్తపోట్లకు గురికావడం నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నాం.
తస్లీమాపై దాడి సమర్థనీయమే ఎంచేతంటే శిల్పం లేదు. తస్లీమా మీద దాడి వాంఛనీయమే ఎందుకంటే ఆమె సంచలనాలకు కేంద్రం. తస్లీవ మీద జరిగింది కూడా ఒక దాడేనా? మన హైదరాబాద్లోనే ఉన్నారు- తస్లీవ కంటే తీవ్రమైన వాళ్లు – కావలిస్తే చిరునామాలు కూడా ఇస్తా. ప్రజాప్రతినిధులారా మీ సౌలభ్యం కోసం వాళ్లు ఏమి రాశారో తెలుగునుంచి ఇంగ్లీషులోకో, ఉర్దలోకో అనువాదం చేసి పంపుతా. ఆపై మీ ఇష్టం.
రచయితలు మరణించాలి. కవులు కనుమూయలి. మతాలు, మతనాయకుల మిగలాలి. గుర్తింపు రాజకీయల, నిర్దిష్టతల, అస్తిత్వ పోరాటాల పంజరాల్లో మనం బహుచక్కగా ఇమిడిపోయం. పంజరాలపై ప్రేమలు పెంచుకున్న పావురాలమైనందుకు చింతపడొద్దు.
ఇప్పుడు సావ్రజ్యవాదాన్ని ఎదుర్కోగల, నిలవరించగల శక్తిసామర్ధ్యాలు ఇక ఇస్లాంకు మాత్రమే ఉంది. కనుక ఇస్లాం పేరిట జరుగుతున్నదంతా సావ్రజ్యవాదం మీద దాడే. తస్లీమా సావ్రజ్యవాదం ఇస్లామ్ మీద పన్నిన ఒక కుట్ర. కనుక తస్లీమాను తన్నడమంటే సావ్రజ్యవాదాన్ని తన్నటమే. ఆహా ఏమి అన్వయము!
నిజానికి ఏ మతానికీ సామ్రజ్య వాదాన్ని కానీ, పెట్టుబడిదారీ విధానాన్ని ఏకంగా ఎదుర్కోగల శక్తి లేదని బలంగానైనా రవివరుత్ ఖమ్మం నుంచి అరుస్తున్నాడు. సావ్రజ్యవాదాన్ని ఎదుర్కోవటం అనేది ఇస్లాం ప్రప్రథమ ప్రాధాన్యం కానే కాదు. తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడు కోవటమే ముఖ్యం. మతతత్త్వమైనా, మరొకటైనా ఉగ్రరపం దాలుస్తోందని మనం మరెవరితోనైనా చెప్పాలి. సావ్రజ్య వాదాన్ని ఓడించే సత్తా సంగతేవె కాని, మనుషులుగా మనం మతాలముందు సామూహిక పరాజితు లమవుతున్నామని బాగా గుర్తుంచుకోవాలి.
ఏ మాతృదేశం గురించి మాట్లాడుతున్నావ్ నాన్నా? ఈ దేశం నీకేమిచ్చింది. నీకేమి ఇస్తున్నది. ఏమివ్వబోతున్నది నీదైన ఈ దేశం నీ కూతురు వయకు ఏ బహువనాన్ని చ్చింది. ఏ వనాన్ని తీసుకుంది. ఎందుకు అమ్మ ఏడుస్తనే ఉండాలి. నువ్వెందుకు రాత్రుళ్లు మూలుగుతనే ఉండాలి. నాకెందుకు నిద్రరావడం లేదయ్య తండ్రీ?! అని సురంజన్దత్తాను దుఃఖ ఆక్రోశస్వరంతో అడుగుతున్న తనయుడు నాకు కళ్లముందు కనిపిస్తున్నాడు. ‘లజ్జ’ లేదర్రా మీకు అని మనిషి మనిషినీ అంటనే ఉన్నాడు. సహనం, సహిష్ణుత్వం గల మనుషుల కొరత మతాలకిప్పుడు ఏర్పడింది. ఎవరైన క్షమించలేని అపరాధమే చేసి ఉంటే దానిని క్షమించగలిగిన మనుషులులేని మతాలు మన మధ్య ఉన్నాయి. అవి రాజకీయలతో పీటముడులు వేసుకొని ఉన్నాయి. ఇతరులను క్షమించగల స్వభావం లేని మనుషులు తాము క్షమించబడటానికి కూడా అనర్హులు.
ఆ జాబితాలో మొదటిపేరు సీతారాం మరి మీది ఎన్నో పేరు?