– ఎం. సుచిత్ర

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని నియమాల ను ఉల్లంఘించి గిరిజన ప్రాంతాలలో బాక్సైటు నిధుల తవ్వకాలు జరుగుతున్నాయి.

డిసెంబరు 20న కేంద్ర వాతవరణ మంత్రిత్వ శాఖ వారి నిపుణుల సంఘం గిరిజన ప్రాంతాలను సందర్శించిన రోజు వారు మొత్తం జిల్లాలో బందు నిర్వహించారు. తవ్వకాలకు విరుద్ధంగా వివిధ గిరిజన సంఘాలు, ప్రస్తుతం పరిపాలనలో వున్న కాంగ్రెస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీల వారు తూర్పు కనుమలకు వెళ్లేదారు లన్నింటిని కట్టడి చేసారు. కొంత మంది విల్లు బాణాలు పట్టి తవ్వకాలు జరగబోయే కొండ శిఖరాల మీదకు ఎక్కి ఆ ప్రాంతాన్ని రక్షించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతాలలో తవ్వకాల వలన కలగబోయే ఆర్ధిక, సామాజిక, వాతావరణ ప్రభావం తెలుసుకోవడానికి వచ్చిన సంఘంవారు కొండలను రోడ్డు మార్గంలో ప్రయాణించ కుండా, హెలికాప్టెర్‌లో ఆ ప్రాంతాలని సర్వే చేసి తిరిగి వెళ్లిపోయారు. ఆ జిల్లాలోని గిరిజన ప్రాంతం అంటే ‘ఎజన్సీ’ ఐదవ షెడ్యూలు ప్రాంతానికి చెందినది. గిరిజన వర్గాల వారు, సాంఘిక సంఘాలవారు – గిరిజనులకు సాంప్రదాయక భూమి మరియు ఇతర వనరులపైన రాజ్యంగ పరముగా ప్రాప్తించిన హక్కులను పరిరక్షించకుండా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని నియమాలను ఆఖరికి సుఫ్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా ఉల్లంఘిస్తోందని తీవ్ర అభ్యంతరాలు వెల్లడిస్తున్నారు. ఇది రెండు పారిశ్రామిక సంఘాలను బుజ్జగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. మొదటిది జిందల్‌ సౌత్‌ వెస్టు హోల్డింగ్స్‌ లిమిటెడు రెండవది జుశ్రీష్ట్రజుచ ఒక సమిష్టి వ్యాపార సంస్థ. రస్‌ ఆల్‌ ఖైమహ్‌ యునైటెడు అరబ్‌ ఎమిరైట్స్‌ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్‌ పెన్నా సిమెంట్స్‌ వారు కలిసి స్పటకపు పరిశ్రమ పరిశ్రమ ప్రారంభించబోతున్నారు. దానికి ముఖ్య ముడి పదార్ధము బాక్సైటు.

”ప్రభుత్వం గ్రామ సభల అంగీకారం పొందకుండా, తీవ్రమైన అభ్యంతరాల నడుమ వాతావరణ శాఖ నుంచి క్లియరెన్సు పత్రాలు పొందాయి” అనిక్‌ సురేంద్ర, గిరిజన సంఘం, సి.పి.ఐ(ఎం) ఆదివాసి విభాగం, జిల్లా అధ్యక్షుడు తెలిపారు. సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ ఎండ్‌ సోషల్‌ స్టడీస్‌ (్పుజూఐఐ), హైదరాబాదు వారి కథనం ప్రకారం అరకులోయ, చింతపల్లి, జి.క్‌.వీధి బ్లాకులలో మొత్తం 27 కొండలు తవ్వటానికి ప్రభుత్వం యోచిస్తుంది. ఈ పథకం వలన ఏజన్సీ ప్రాంతంలో వుండే కోండ్‌, బగతా, కొండరెడ్డి, సమంత తదితర తెగలకు చెందిన షుమారు 270 గ్రామాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2010లో రద్దు చేసింది. ఆ సమయంలో ప్రజల తీవ్ర ఆందోళనల నడుమ కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ (ఖంజూఓ) ఒడిస్సా నియమగిరి కొండలలో తవ్వకాలకు వేదాంత మైనింగ్‌ ప్రాజెక్టుకు క్లియరెన్సు నిలిపివేసింది. కాని ఈ మధ్య కాలంలో (ఖంజూఓ) వారు తిరిగి సందర్శించినప్పుడు ఆ ప్రాజెక్టుని మరల ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏజన్సీ ప్రాంతానికి చేందిన కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌, (ఖంజూఓ) నుంచి క్లియరెన్సులు రద్దు చెయ్యించడానికి హామి ఇచ్చినప్పటికీ, ఆ సంఘం వారి పునర్దర్సనం వల్ల ప్రజలు వారికి నమ్మకద్రోహం జరిగినట్లు భావిస్తున్నారు.

మొదటి (ఎం ఒ యు) జిందాల్‌తో 2005లో తరువాత రస్‌ అల్‌ ఖైమహ్‌తో 2007 సంతకం చెయ్యడం జరిగింది. జిందాల్‌ వారు కేవలం ఎగుమతి చేయడానికి, ఒక సంవత్సరంలో 1.4 మిలియన్లు టన్నుల స్పటకం తయారు చేయుటకు 900 మిలియను రూపాయిలుతో పెట్టుబడి పెట్టి శుద్ధి చేసే ఖర్మగారం నెలకొల్పటానికి సన్నహాలు మొదలుపెట్టేరు. జుశ్రీష్ట్రజుచ వారు ఒక మిలియను టన్ను ఆల్యుమినియం మరియు 250,000 మిలియను టన్నుల స్పటకము తయారు చేయుటకు ృ2 బిలియన్లు పెట్టుబడి సిద్ధం చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గనుల తవ్వకాలు కొనసాగించేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది

జియాలిజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 600 మిలియన్‌ టన్నుల బాక్సైటు అనగా 21 శాతం దేశపు విలువలు వున్నట్టు అంచనా అందులో సుమారు 90 శాతం విశాఖపట్టణం, తూర్పు కనుమల వద్ద 6 ప్రాంతాలలో విక్షిప్తమైవున్నాయి. ఆ ప్రాంతాలు దట్టమైన ఆడవులలో వున్నాయి. పర్యావరణ శాస్త్రజ్ఞులు ఆ ప్రాంతాన్ని జీవవైవిధ్య స్థలముగా ప్రకటించమని ఎన్నడో ఖంజూఓ వారికి విజ్ఞప్తి చేశారు.

కాని పారిశ్రామిక వేత్తల కళ్ళు ఈ ప్రాంతాలపై పడ్డాయి. రాష్ట్రంలోని వనరులను వినియోగించుటకు 2000లో తెలుగుదేశం పార్టీ ఒక నియమావళి సిద్ధం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాదునాయుడు వ్యూహాత్మకంగా ఆదివాసి మరియు గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే ప్రభుత్వం భూచట్టంలో మరియు షెడ్యూల్‌ ప్రాంతాలని పరిరక్షించే చట్టంలో కూడా ఎన్నో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు. కాని విఫలం అయ్యారు. 2004లో ఆధికారం లోకి వచ్చిన రాజశేఖరు రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం సాధించారు.

1997 సమత కేసు విషయంలో రాష్ట్రంలోని షెడ్యూల్‌ ప్రాంతాలలో స్వంత పరిశ్రమ కోసం భూమి కొనుగోలు చేయుటకు లేక భూమిని లీసు తీసుకుని గనులు తవ్వుటను విరోధిస్తూ సుప్రీంకోర్టు తీర్పుని వెలువరించింది. కనుక ఆ తీర్పుని తప్పించుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం ఎమోలు చాలా తెలివిగా తయారు చేసింది. ఈ తీర్పు ప్రకారం ఆటవి మరియు పర్యావరణ చట్టాలను అనుసరిస్తూ ప్రభుత్వ సంస్థలు, గిరిజనులు ద్వారా నడపబడే సహకార సంస్థలు గనులు తవ్వకాలు చేపట్టుటకు ఎటువంటి నిషేదాలు విధించలేదు.

ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలొప్మె ంట్‌ కార్పరేషన్‌ (జుఆఖఈ్పు), ఒక ప్రభుత్వ సంస్థ ఇది పరిశ్రమల తరపున బాక్సైటు తవ్వకాలు చేపడుతుంది. ”మేము ముడి లోహం జిందాల్‌ వారికి అరకు బ్లాకుల నుంచి, జుశ్రీష్ట్రజుచ వారికి జేర్రెల బ్లాకు నుంచి సరఫరా చేస్తాము” అని జుఆఖఈ్పు, జెనరల్‌ మేనేజర్‌ కె. రాజశేఖరు తెలిపారు. గనుల తవ్వకాలకు జరిగే ఖర్చు అంతా పరిశ్రమలు భరిస్తాయి. జుఆఖఈ్పు కి 1.25 రెట్లు యాజమాన్య హక్కు కింద 0.5 రెట్లు పరిశ్రమల అమ్మకం మొత్తం లభిస్తుంది. జుశ్రీష్ట్రజుచ కోసం తవ్వకాలు 2013 జూన్‌కి ప్రారంభం కానున్నదని తెలిపారు. గిరిజనుల నుంచి గిరిజనేతురులకు భూమి బదిలి చేసే తరుణంలో భూమి బదిలీకి సంబంధించిన నియమ నిభందనలను తప్పించుకోవటానికి పరిశ్రమలు అన్ని షెడ్యూల్‌ ప్రాంతాలకు దూరంగా పెట్టుకున్నారు.

”ప్రభుత్వం సహజ వనరులకు ఒక ధర్మకర్తగా వ్యవహరించటం మానేసి ఒక వ్యాపార అనుబంధ సంస్థలా పనిచేస్తున్నదని” జి. శ్రీనివాస్‌ సమత వ్యవస్థాపకులు, ఇది లాభాలు ఆశించని ఒక సంస్థ. వీరు వేసిన దావా ఆధారముగా సమత తీర్పు వెల్లడైనది. ”వీళ్ళ తలపెడుతున్న గనుల తవ్వకాల ఆలోచనకి వెలువడివి తీర్పు పూర్తి భిన్నంగా వున్నది” అని ఐ ఎ ఎస్‌ శర్మ, మాజీ గిరిజన కమిషనర్‌ తెలిపారు.

ఈ పథకం పంచాయతీ యాక్టు (ఆజూఐజు) మరియు గనుల తవ్వకాల చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. జుఆఈఖ్పు వాళ్ళూ గ్రామ సభల దగ్గర నుంచి, ట్రైబల్‌ ఆడ్వైసర్స్‌ కమిటీ (ఊజ్పుు) నుంచి కూడా అంగీకారం పొందలేదు. ప్రస్తుతం బాక్సైటు తవ్వకాలని తీవ్రంగా విరోధిస్తున్న నాయుడు జుఆఈఖ్పు వారు 2000లో ఒక గనుల తవ్వకాల పథకానికి అనుమతి పొందారు కాని ఆ పథకాన్ని అమలు చెయ్యలేదు. ”పాత పథకానికి ఇచ్చిన అనుమతి కొత్తవాటికి ఎలా పనిచేస్తుందని” అని ప్రశ్నిస్తున్నారు.

ఇది కాకుండా ప్రభుత్వం గిరిజనులకు అడవులపై వారికి వున్న హక్కులను కూడా నిర్ణయించాలి. సుమారు 160,000 హెక్టారు భూమి గిరిజనులకు సంబంధించినదని ఆటవీ హక్కుల చట్టం నిర్ధారించగా, కేవలం 16,000 హెక్టారు భూమికి గాను పట్టాలు ఇవ్వటం జరిగింది. 2009లో 40,500 హెక్టారు భూముల పట్టాలు జారీ చేస్తామని ప్రభుత్వం భారీ ప్రకటన ఇచ్చింది. కాని ఇప్పటి వరకూ దానికి సంబంధించి ఒక్క పని కూడా చెయ్యలేదు. ”పట్టాల పంపకం జరగక ముందే గనుల తవ్వకాలు ప్రారంభిస్తే గిరిజనులను ఆ ఆడవుల లోంచి బైటకు తరిమేస్తారని” సి.పి.ఐ(ఎం) జిల్లా కార్యదర్శి నరసింహరావు అభిప్రాయపడ్డారు.

పెట్టుబడి ప్రయోజనం

జుఆఈఖ్పు వారు పథకం అమలు చేసిన తరువాత వచ్చే ఆదాయంలో 26 శాతం గిరిజనుల యొక్క అభివృద్ధికి కేటాయిస్తామని పట్టుబట్టేరు. గనుల తవ్వకాల వలన సుమారు 20,000 మందికి ఉపాది దొరుకుతుందని ప్రకటించారు, కాని సమత వారు పెట్టిన ష్ట్రఊ| దరఖాస్తు ద్వారా తెలిసినదేమిటంటే జుఆఈఖ్పు వారి దగ్గర ఉపాధి కల్పించగలిగే వివరాల అంచనా కూడా లేదని. కాని 215 అభ్యర్ధులని ఎంపిక చేసి వారికి తవ్వకాల గురించి శిక్షణ ఇస్తున్నారు. అందుకు గాను నెలకి 7500 జీతం కూడా ఇస్తున్నారు. శిక్షణకు జరిగే ఖర్చు మాత్రం పరిశ్రమలు పెట్టుకుంటున్నాయి.

ఏజన్సీ ప్రాంతాలలో గనుల తవ్వకాల వలన కలిగే ప్రభావాలని పరీక్షించడానికి వచ్చిన ఖంజూఓ సంఘం వారు విశాఖపట్టణంలో డిసెంబరు 23న ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గనుల తవ్వకాల వలన ఆ ప్రాంతాలకి ఎంతో మేలు జరుగుతుందని గిరిజనులను ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసారు. తవ్వకాల వలన వెనుకబడిన గిరిజన గ్రామాలకు మంచి ఆసుపత్రులు, స్కూళ్ళు, రోడ్డులు లాంటి సదుపాయాలను కల్పించలిగే అవకాశం వుంటుందని వెల్లడించారు. వున్న ఆటవీకరణ వలన కొండలన్ని మరల పచ్చగా విరాజిల్లుతాయని అన్నారు. జె.సి. కళ, మాజీ నెషనల్‌ ఎనివిరాన్మెంట్‌ ఎప్పిలేట్‌ ఆథారటీ అధ్యక్షుడు, ప్రస్తుతం సంఘం ముఖ్యాధికారి ”గిరిజనులను ఎప్పటికీ వెనుకబడిన వారి లానే వుంచుతారా?” అని ప్రశ్నించారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెష్ట్‌ ఎండ్‌ ఎడ్యుకేషన్‌ వారు గనుల తవ్వకాల వలన కలిగే ప్రభావాలని అధ్యయనం చేసి ఎన్విరాన్మెంట్‌ ఇంపాక్ట్‌ ఎస్సెస్మెంట్‌ (జూ|జు) నివేధికలు తయారు చేసారు. వారు తయారు చేసిన నివేదికలో గిరిజనుల యొక్క సాంఘిక, ఆర్ధిక పరిస్థితులను కూడా విసృతంగా పరిశీలించి పరిగణలోకి తీసుకున్నారు. కాని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఎండ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ (్పుజూఐఐ) వారు జూ|జు నివేదికలు పరిశీలించిన తరువాత, జూ|జు నివేధికలో గిరిజనుల యొక్క సాంఘిక, ఆర్ధిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదని ప్రకటించారు.

గనుల తవ్వకాలు సంకల్పించిన గ్రామాలు డౌన్‌ టూ ఎర్థ్‌ వారు సందర్శించిన తరువాత అది నిజమేనని గ్రహించారు. ఏజన్సీ గ్రామాలలో వుండే వారిలో చాలా మంది చిన్న రైతులు, వారికి వుండే ఒక హెక్టారు భూమిలో వరి, జొన్న, మినుములు, చిక్కుడు రకాలు, కాఫీ సాగు చేస్తుంటారు. చాలా మంది ఆడవుల్లో దొరికే వాటిని ఏరుకొని వాటిని అమ్మి బ్రతుకుతుంటారు.

గిరిజన వ్యవసాయదారులు 2007లో ఇండియాలోనే మొట్ట మొదటిసారిగా సేంద్రియ పద్ధతితో సాగు చేసిన కాఫీని అరకులో విడుదల చేసారు. ఈ ఎమరాల్డ్‌ బ్రాండ్‌ సేంద్రియ కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా కొనుగోలుదారులు వున్నారు. వేలమంది గిరిజన రైతులు ఈ ఏజన్సీ ప్రాంతంలో కాఫీ సాగుతో జీవనోపాధి పొందుతున్నారు. గనుల తవ్వకాల వలన 1,400 హెక్టార్ల కాఫీ సాగుకు నష్టం వాటిల్లుతుంది. ”ఒక వేళ ప్రభుత్వం వారు ఈ ఆడవిలో, ఈ కొండలలో, ఇలాంటి కాఫీ సేద్యం ఇస్తే నేను ఇక్క నుంచి కదలడానికి సిద్ధంగా వున్నానని” భీసుపురం గ్రామం, గాలికొండ కనుమలో నూక-దూర తెగకు చెందిన కొమరం భీమన్న అన్నారు. ప్రతీ రుతువుకి 20,000 ఆదాయం అంతనుకు వున్న ఆర హెక్టారు కాఫీ సాగు వల్ల సంపాదించగలుగుతున్నాడు.

”ఒక్కసారి గనుల తవ్వకం మొదలుపెడితే ఈ రైతులందరూ కూలీలుగా మారిపోతారు” జుఆఈఖ్పు వారి లెక్కల ప్రకారం అరకులోయలలో ఈ ఖనిజ నిక్షిప్తాల త్వకాలు 15 సంవత్సరాలు జరుగుతాయి. ఆ తరువాత కూలీలుగా మారిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఏమి చేస్తారు” అని ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌కస వెల్ఫెర్‌ అస్సోషియేషన్‌, కోండ్‌ యువత బి.డేవిడ్‌ ప్రశ్నించారు.

చిత్తంగోండి అనే చిన్న గ్రామంలో 21 కోండ్‌ కుటుంబాలు వున్నాయి. వారు అందరూ పట్టాలకు దరఖాస్తు పెట్టుకున్నారు. ”మాకు మా భూములు ఇవ్వటం ఇష్టమా అని ఇప్పటి వరకూ ప్రభుత్వం అడగలేదు. మేము ఇంక ఎక్కడా బ్రతకలేము. మాకు తెలిసినదల్లా అడవిలో వున్న కట్టెలు, పండ్లు ఏరుకోవటం అక్కడ సాగు చెయ్యటం. జుఆఈఖ్పు లో పనిచేస్తున్న వాళ్ళు ఈ భూములు జుఆఈఖ్పు వారికి చెందినవని అంటున్నారు”. అని ఆ గ్రామానికి చెందిన సంఘ పరిచారిక, కిలో ముతాయి తెలిపారు.

పచ్చటి దట్టమైన అడవులతో, నాగులతో, వంకలతో ఎంతో రమణీయముగా వుండే అరకులోయ ప్రస్తుతం సందర్శకులందరినీరెంతో ఆకర్షిస్తుంది. ”అరకు మన రాష్ట్ర కాష్మీర్‌” అని టూరిజం ట్రైబల్‌ కాంట్రాక్ట్‌ లెబరర్స్‌, ఊనియన్‌ ఆఫ్‌ బొర్రా కేవ్స్‌ కు చెందిన పూజారి ఘాసి అన్నారు. అతి ఆకర్షనీయమైన స్తేలకైటెస్‌, స్తేలగైటెస్‌తో కప్పబడిన ఈ లోయ దేశంలోనే అతి లోతైనది. తవ్వకాలకు నిర్దేశించిన ఆనంతగిరి కొండలు ఈ లోయకు 3 కిలోమీటర్ల దూరంలో వున్నాయి.

ఇక్కడ బాక్సైటు పలుచటి పొరలలో కొండ పైభాగంలో నిక్షిప్తమై వున్నది. కాబట్టి వాటిని తవ్వటానికి చాలా ఎక్కువ ప్రాంతంలో చెట్టు నరకాలి, 100 అడుగులు మేరకు కొండలు పేల్చాలి. దీని ప్రభావం వలన చాలా సున్నితనముగా వున్న తూర్పు కనుమల వాతావరణ సమతుల్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీని వలన అక్కడ పారుతున్న 6 నదులు ఎండిపోతాయి లేక చిన్న ధారలుగా మారుతాయి. దీనివల్ల అక్కడ జలాశ్రయాలకు నీరు చేరదు. ఫలితంగా సాగు నీటికి, త్రాగునీటికి విశాఖపట్టణం మరియు విజయనగరం ప్రజలు తీవ్ర ఇక్కట్టకు గురవుతారు.

ఏజన్సీ ప్రాంతాలలో వున్న కొండలు, ఒడిశాలోని నియమగిరి తూర్పు కనుమలలోనివి. నియమగిరి ప్రాంతంలోని గనులు తవ్వకాలు నిలిపివేసినప్పుడు ఈ ఏజన్సీ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి ఇవ్వటంలో ఖంజూఓ వారి ఆంతర్యం ఎమిటో?

నీచమైన స్పటకం

స్పటకపు పరిశ్రమ ఒక త్రాగుబోతు లాంటిది. దాన్ని నడపటానికి ఎంతో విద్యుత్తు ఖర్చువుతుంది. జిందాల్‌ ఖర్మాగారం యొక్క విద్యుత్తు ఉపయోగం సంవత్సరానికి 3,645,000 మెగా వాట్లు, అంటే ఇంచుమించు 500 ఇఖ యాంత్రగారం ఉత్పత్తి చేసే విద్యుత్తుతో సమానం. కాబట్టి చవకగా ఎక్కువ విద్యుత్తు అందించగల బొగ్గుతో విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగే యంత్రాంగం మీద ఆధారప డతారు. బొగ్గు విద్యుత్తు యంత్రాంగం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.

ఈ పరిశ్రమలకి నీటి అవసరాలు కూడా చాలా ఎక్కువే. జిందాల్‌ పరిశ్రమకు ఒక రోజుకు సుమారు ఎనిమిది మిలియన్‌ గ్లాన్ల నీరు కావలసివుంటుంది. కాబట్టి వారు వాతవరణ శాఖ వారి క్లియరెన్సు తాటిపూడి జలాలను ఉపయోగించుటకు పొందారు. తాటిపూడి జాలాశ్రయం విశాఖపట్టణం మరియు విజయనగరం యొక్క నీటి అవసరాలని తీరుస్తుంది.

బాక్సైటు నుంచి స్పటకం తయారు చేసే విధానంలో విడుదలయ్యే వ్యర్ధ పదార్ధం ఎర్రమట్టి. ఆ మట్టిలో ఎన్నో విష పదార్ధాలు గల పదార్ధాలు వుంటాయి. వాటిని శుద్ది చేయకుండా దగ్గరలో వున్న జలాలలోకి వదిలేస్తున్నారు.

 

….డౌన్‌ టు ఎర్త్‌ సౌజన్యంతో….

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.