ఉదయమిత్ర
భూమి గుడ్రంగా ఉందన్నందుకు
కాల్చిన పెనం మీద మాడ్చినా
నిజాన్ని నిర్భయంగా చెప్పిన
కోపర్నికస్ ధిక్కారంలోంచి మాట్లాడుతున్నా…
తన పజ్రల స్వాతంత్యం కోసం
తానే స్వయంగా మంటల్లోకి నడిచి
తన ప్రజల ఆకాంక్షల్ని
తుదిదాకా వెలిగించిన
జోన్ ఆఫ్ ఆర్క్ త్యాగనిరతిలోంచి మాట్లాడుతున్నా…
ఆడపిల్లలకు అక్షరం నేర్పినందుకు
ఆడపిల్లలకు బడిని పెట్టినందుకు
రాళ్ళదెబ్బలు తిన్నా
అవవనాలెదురైనా మడమ తిప్పని
సరస్వతీపూలే సహనంలోంచి మాట్లాడుతున్నా…
కత్తుల పహారాల మధ్య
ఎగిసిన రప్కన్వర్ చితిలోంచి మాట్లాడుతున్నా
వృద్ధాప్యంలో విడాకుల పాలయి
ముష్టిభరణానికి నోచుకోని
షాబానో నిస్సహాయతలోంచి మాట్లాడుతున్నా.
భూస్వాములకూ, నైజాములకూ ఎదురొడ్డి
భూమిపోరులో నిల్చిగెల్చిన
ఐలమ్మ అనుభవంలోంచి మాట్లాడుతున్నా.
అనేకానేక అరాచకాల కింద, అవమానాల కింద
నిత్యకృత్యమైపోతోన్న కుటుంబహింసల కింద
నవనాగరికత మాయల పొరల కింద
మతంకింద, రాజ్యంకింద, మగదురహంకారం కింద
ఛిదమ్రైపోయి, అనామకమయిపోయి
చరితచ్రడని, కవులు పాడని
అగాధపు చీకటికోణాల్లోంచి వట్లాడుతున్నా…
ఇపుడు తస్లీవలు గావాలి…
మనిషిగా కాక
స్వేచ్ఛకు పర్యాయపదమై నిల్చిన
తస్లీవలు గావాలి…
చావుకు దగ్గరగా వెళ్లి
చతికిలబడి, వెనుదిరగక
అడుగు మరింత బలపడి
కలం మరింత పదునెక్కి
మానవీయవిలువలగప్పిన
నిశ్శబ్ధపు గఫన్ చీల్చివేస్తో
నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే
తస్లీవలు గావాలి.
భయంతో రాజీపడి
అక్షరాన్ని సవధి చేస్తే
అది ఆత్మహత్యేనని
పక్రటించగల్గిన దమ్ములుండాలి.
నిరంతరం మతరాబందుల రెక్కలమధ్య
నిర్భయంగా తిరుగుత
ఇంటాబయటా
స్వేచ్ఛాగీతాలు పాడే తస్లిమాలు గావాల
……………………………………..
తన ఊపిరి ఆగినా
ఇతరుల ఊపిర్లలో జీవించగలిగే
కాలాన్ని నిరంతరం వెలిగించగలిగే
తస్లీమాలు గావాలి…
మట్టి మౌనం
పచ్చనరి అనురాధ
నేను మాట్లాడితే….
మీ పునాదులు కదులుతాయ్
ఎందుకో తెలుసా… అవి నా మౌనమనే నేలలో
పత్రిసారీ మీరు నా మీదికి విసిరిన రాళ్లని
క్షమించి, నేను పాతిపెట్టి కట్టినాను కాబట్టి.
నేను కదిలితే
మీ గోడలు బీటలు వారి కూలిపోతాయ్
ఎందుకో తెలుసా…అవి నా చేతులతో
పత్రిసారీ మీరు నా మీద చూపిన అధికార దర్పాన్ని
క్షమించి, నేను నా మంచితనపు మట్టిని గట్టిగా సారమైన మనసుతో పులిమినాను కాబట్టి
నేను మిమ్మల్ని ఒక్కొక్కర్ని చడడం మొదలుపెడితే… మీ ఇంటి కప్పులు నేలమీద పరుచుకుంటాయ్
ఎందుకో తెలుసా…అవి నా మేధస్సుతో
పత్రిసారీ మీరు చేసిన తప్పులని క్షమించి,
నేను నా ఆలోచనల సంఘర్షణతో నిర్మించినాను కాబట్టి
చివరగా నేను మిమ్ము హెచ్చరిస్తే….
మీ గుండెదడ తట్టుకోలేక మీ శరీరంలోని నవనాడులన్ని
రక్తసిక్తమై, అదే ఇంటిలో మిమ్ము
మాట్లాడుతున్న శవాల్ని చేస్తుందిగాక.
మీ కవిత బాగుంది… సరైన ఆవేదన. వీలైతే నా కవిత చదవండి. http://kesland.blogspot.com/2007/08/lajja.html