అరసవిల్లి కృష్ణ
ఆకాశంపై రక్తమరకలు
అక్షరంలో తుడిచేద్దామనుకున్నాను
ఆకాశం నవ్వింది
నా హృదయదీపం రెపరెపలాడింది.
వొకే పయ్రణంలో
ఇద్దరిదీ చెరోదిక్కు
ఒకే చెట్టుకు పూచిన
రెండుపూల మధ్య
రెండుదేశాల మధ్య ఉన్న దూరం
గంగానది అన్నా,
జీవనదిని గుండెలపై వెస్తున్న సీ్తలన్నా
ఆమెకు, కన్నీటి పవ్రాహమంత ఇష్టం
ఆమె
మనుషులు గురించే మాట్లాడుతుంది
మనిషికంటే సౌందర్యమేముంది?
రెండువటల మధ్య
నీటిజలం కోసం వెదుకుతుంది
ఆమె! వంతెన కడుతుంది
ఆకాశంలో వర్షమబ్బు అంటే ఇష్టం
అచ్చం మా అమ్మలానే వర్షిస్తుంది.
సర్యుడు ఖాళీ చేసిన ఆకాశంపై రక్తమరకలు
అక్షరం చేతులమధ్య నుండి
కాగితంపైకి పవ్రహిస్తుంది
చంపేయండి!
చంపేయడం చాలా తేలిక
సీ్తలను చంపడం మరీ తేలిక
దేశం అక్షరం వైపు ఉంది
వరణాయుధం హింస దగ్గర వుంది.
\
భమి గుండంగా ఉందన్నందుకు
కాల్చిన పెనం మీద వడ్చినా
నిజాన్ని నిర్భయంగా చెప్పిన
కోపర్నికస్ ధిక్కారంలోంచి మాట్లాడుతున్నా…
తన పజ్రల స్వాతంత్యం కోసం
తానే స్వయంగా మంటల్లోకి నడిచి
తన పజ్రల ఆకాంక్షల్ని
తుదిదాకా వెలిగించిన
జోన్ ఆఫ్ ఆర్క్ త్యాగనిరతిలోంచి మాట్లాడుతున్నా…
ఆడపిల్లలకు అక్షరం నేర్పినందుకు
ఆడపిల్లలకు బడిని పెట్టినందుకు
రాళ్ళదెబ్బలు తిన్నా
అవవనాలెదురైనా మడమ తిప్పని
సరస్వతీపూలే సహనంలోంచి మాట్లాడుతున్నా…
కత్తుల పహారాల మధ్య
ఎగిసిన రప్కన్వర్ చితిలోంచి మాట్లాడుతున్నా
వృద్ధాప్యంలో విడాకుల పాలయి
ముష్టిభరణానికి నోచుకోని
షాబానో నిస్సహాయతలోంచి మాట్లాడుతున్నా.
భస్వాములకూ, నైజాములకూ ఎదురొడ్డి
భమిపోరులో నిల్చిగెల్చిన
ఐలమ్మ అనుభవంలోంచి వట్లాడుతున్నా.
అనేకానేక అరాచకాల కింద, అవవనాల కింద
నిత్యకృత్యమైపోతోన్న కుటుంబహింసల కింద
నవనాగరికత వయల పొరల కింద
మతంకింద, రాజ్యంకింద, మగదురహంకారం కింద
ఛిదమ్రైపోయి, అనామకమయిపోయి
చరితచ్రడని, కవులు పాడని
అగాధపు చీకటికోణాల్లోంచి వట్లాడుతున్నా…
ఇపుడు తస్లీవలు గావాలి…
మనిషిగా కాక
స్వేచ్ఛకు పర్యాయపదమై నిల్చిన
తస్లీవలు గావాలి…
చావుకు దగ్గరగా వెళ్లి
చతికిలబడి, వెనుదిరగక
అడుగు మరింత బలపడి
కలం మరింత పదునెక్కి
వనవీయవిలువలగప్పిన
నిశ్శబ్ధపు గఫన్ చీల్చివేస్తో
నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే
తస్లీవలు గావాలి.
భయంతో రాజీపడి
అక్షరాన్ని సమాధి చేస్తే
అది ఆత్మహత్యేనని
పక్రటించగల్గిన దమ్ములుండాలి.
నిరంతరం మతరాబందుల రెక్కలమధ్య
నిర్భయంగా తిరుగుత
ఇంటాబయటా
స్వేచ్ఛాగీతాలు పాడే తస్లివలు గావాల
……………………………………..
తన ఊపిరి ఆగినా
ఇతరుల ఊపిర్లలో జీవించగలిగే
కాలాన్ని నిరంతరం వెలిగించగలిగే
తస్లీవలు గావాలి…
మట్టి మౌనం
పచ్చనరి అనురాధ
నేను మాట్లాడితే….
మీ పునాదులు కదులుతాయ్
ఎందుకో తెలుసా… అవి నా మౌనమనే నేలలో
పత్రిసారీ మీరు నా మీదికి విసిరిన రాళ్లని
క్షమించి, నేను పాతిపెట్టి కట్టినాను కాబట్టి.
నేను కదిలితే
మీ గోడలు బీటలు వారి కూలిపోతాయ్
ఎందుకో తెలుసా…అవి నా చేతులతో
పత్రిసారీ మీరు నా మీద చూపిన అధికార దర్పాన్ని
క్షమించి, నేను నా మంచితనపు మట్టిని గట్టిగా సారమైన మనసుతో పులిమినాను కాబట్టి
నేను మిమ్మల్ని ఒక్కొక్కర్ని చడడం మొదలుపెడితే… మీ ఇంటి కప్పులు నేలమీద పరుచుకుంటాయ్
ఎందుకో తెలుసా…అవి నా మేధస్సుతో
పత్రిసారీ మీరు చేసిన తప్పులని క్షమించి,
నేను నా ఆలోచనల సంఘర్షణతో నిర్మించినాను కాబట్టి
చివరగా నేను మిమ్ము హెచ్చరిస్తే….
మీ గుండెదడ తట్టుకోలేక మీ శరీరంలోని నవనాడులన్ని
రక్తసిక్తమై, అదే ఇంటిలో మిమ్ము
మాట్లాడుతున్న శవాల్ని చేస్తుందిగాక.